సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దంపతులను గాయపర్చిన ముగ్గురు వ్యక్తులు
బంజారాహిల్స్: మద్యం మత్తులో ఉన్న ముగ్గురు యువకులు అర్ధరాత్రి దారి కాసి అకారణంగా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దంపతులపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. జూబ్లీహిల్స్ పోలీసుల కథనం ప్రకారం... సనత్‌నగర్ జెక్ కాలనీలో నివసించే ముజఫర్ ఎండీ ఖాన్ యష్ టెక్నాలజీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. శనివారం అర్ధరాత్రి తన భార్యతో కలిసి కారులో అన్నపూర్ణ స్టూడియో రోడ్డులో వెళ్తున్నారు. ఓ కారులో వచ్చిన ముగ్గురు యువకులు తప్పతాగి అకస్మాత్తుగా రోడ్డును బ్లాక్ చేసి వీరిని అడ్డగించారు. ఇదేమిటని ప్రశి్నంచిన ముజఫర్‌పై దాడికి పాల్పడటంతో ముఖం, చేతులపై తీవ్ర గాయాలయ్యాయి. అడ్డుకున్న ఆయన భార్యపై కూడా దాడి చేయడంతో ఆమెకు గాయాలయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.


