సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో భారీ నగదు పట్టివేత | ₹1.22 Crore Hawala Cash Seized During Train Check Near Secunderabad Station, Check More Details Inside | Sakshi
Sakshi News home page

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో భారీ నగదు పట్టివేత

May 28 2026 8:29 AM | Updated on May 28 2026 9:53 AM

Huge Cash Seized at Secunderabad Railway Station

సికింద్రాబాద్‌: ముంబై నుండి సికింద్రాబాద్‌కు హవాలా సొమ్ము తరలిస్తున్న ఒక వ్యక్తిని జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి రూ.1.22 కోట్ల డబ్బును స్వా«దీనం చేసుకున్నారు. రైలు ప్రయాణంలో పట్టుబడిన హవాలా డబ్బు వివరాలను బుధవారం జీఆర్‌పీ డీఎస్‌పీ ఎస్‌ఎన్‌ జావెద్‌ వెల్లడించారు. 

జీఆర్‌పీ ఇన్‌స్పెక్టర్‌ సాయీశ్వర్‌గౌడ్, ఆర్‌పీఎఫ్‌ ఇన్‌స్పెక్టర్లు నరసింహారావు, సంజీవరావుల నేతృత్వంలో బొల్లారం–మల్కాజిగిరి స్టేషన్ల మధ్య తనిఖీలు నిర్వహిస్తుండగా దేవగిరి ఎక్స్‌ప్రెస్‌ రైలులో అనుమానాస్పదంగా లగేజ్‌ బ్యాగ్‌తో ఉన్న వ్యక్తి పట్టుబడ్డాడు. మహారాష్ట్ర అమరావతి జిల్లాకు చెందిన విజయ్‌ అంబదాస్‌ గుప్తా (40) గా గుర్తించిన అతని నుంచి పెద్దమొత్తంలో నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

ముంబైలోని కాంతా జ్యువెలరీ యజమాని సంతోష్‌ సేథ్‌ నుంచి రూ.1.22 కోట్ల డబ్బు తీసుకొని సికింద్రాబాద్‌కు వస్తున్నట్టు అంబదాస్‌ పోలీసుల విచారణలో వెల్లడించాడు. మోండా మార్కెట్‌లోని బంటీ అనే వ్యాపారికి ఈ డబ్బు బ్యాగును  అప్పగించేందుకు వస్తున్నట్టు పేర్కొన్నాడు. ఇందుకు ప్రతిఫలంగా తనకు రూ. 5,000 కమీషన్‌  ఇచ్చినట్టు చెప్పాడు. పట్టుబడిన డబ్బు హవాలాకు చెందినదిగా గుర్తించిన రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని తదుపరి విచారణ నిమిత్తం ఇన్‌కంటాక్స్‌ అధికారులకు బదిలీ చేశారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement