Hyd: టీజీఐఐసీ భూముల వేలానికి రికార్డు ధర | TGIIC Land Auction Fetches Record Price | Sakshi
Sakshi News home page

Hyd: టీజీఐఐసీ భూముల వేలానికి రికార్డు ధర

May 28 2026 6:11 PM | Updated on May 28 2026 6:35 PM

TGIIC Land Auction Fetches Record Price

హైదరాబాద్‌:  టీజీఐఐసీ(Telangana Industrial Infrastructure Corporation) తాజాగా నిర్వహించిన భూముల వేలంలో రికార్డు ధర పలికింది. రంగారెడ్డి శేరిలింగపల్లి మండలంలోని రాయదుర్గంలో టీజీఐఐసీ భూముల వేలం నిర్వహించగా, వాటికి రికార్డు ధర పలికింది. 

సర్వే నంబర్  83/1 లోని 6 ఎకరాల 29 గుంటల భూమికి ఈ-వేల నిర్వహించింది టీజీఐఐసీ. ఈ-వేలంలో ఎకరం భూమి ధర రూ. 237 కోట్లు పలికింది. గతేడాది ఇక్కడ ఎకరం భూమి ధర రూ.177 కోట్లు పలకగా, ఈ ఏడాది మరింత పెరిగి ఎకరం రూ. 237 కోట్లు పలకడం విశేషం.  

మొత్తం 6 ఎకరాల 9 గుంటలు రూ. 1490.73 కోట్లు పలికింది. దీన్ని గౌర వెంచర్స్‌ దక్కించుకుంది.గతేడాది  ఎకరం రూ. 177 కోట్లకు ఎంఎస్‌ఎన్‌ రియాల్టీ దక్కించుకోగా, ఈసారి గౌర వెంచర్స్‌  ఎకరం భూమిని రూ. 237 కోట్లకు దక్కించుకుంది. జూన్‌ 1వ తేదీన మరో 5.09 ఎకరాలకు టీజీఐఐసీ వేలం వేయనుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement