మహిళతో అసభ్యంగా ప్రవర్తించి..సీసీ కెమెరాల్లో చిక్కి | Woman Harassed on Road in Hyderabad Accused Arrested by Narsingi Police | Sakshi
Sakshi News home page

మహిళతో అసభ్యంగా ప్రవర్తించి..సీసీ కెమెరాల్లో చిక్కి

May 24 2026 2:45 AM | Updated on May 24 2026 2:45 AM

Woman Harassed on Road in Hyderabad Accused Arrested by Narsingi Police

హైదరాబాద్‌: రోడ్డుపై వెళుతున్న మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన నిందితుడిని నార్సింగి పోలీసులు గుర్తించి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈనెల 14న అలకాపూర్‌ టౌన్‌షిప్‌లో ఓ వ్యక్తి  ప్రవర్తించిన తీరు సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతోపాటు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. దీంతో నార్సింగి పోలీసులు.. తీవ్రంగా పరిగణించి బాధితురాలి నుంచి 19న ఫిర్యాదు తీసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. శనివారం పుప్పాలగూడలో ఉంటున్న నిందితుడు నాగరాజు(26)ను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన నిందితుడు పుప్పాలగూడలో స్థిరపడ్డాడని ఇన్‌స్పెక్టర్‌ హరికృష్ణారెడ్డి తెలిపారు.  

Advertisement
 
Advertisement
Advertisement