రాజస్థాన్‌లోని కోటా తరహాలో ట్రాఫిక్‌ ఫ్రీ వ్యూహం | Hyderabad signal-free city project | Sakshi
Sakshi News home page

రాజస్థాన్‌లోని కోటా తరహాలో ట్రాఫిక్‌ ఫ్రీ వ్యూహం

May 21 2026 1:40 PM | Updated on May 21 2026 1:50 PM

Hyderabad signal-free city project

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ను ట్రాఫిక్‌ సిగ్నల్‌ రహత నగరంగా మార్చుతామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్పష్టం చేసిన నేపథ్యంలో..ఈ దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. రాజస్థాన్‌లోని కోటా నగరంలో ప్రస్తుతం సిగ్నల్‌ ఫ్రీ రహదారులు ఉన్నాయి. ఆ తరహాలోనే మన నగరంలోనూ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.  

‘కేబీఆర్‌’తో మొదలు.. 
800 కిలో మీటర్ల రహదారి నెట్‌వర్క్‌ ఉన్న గ్రేటర్‌లో తొలుత జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ నుంచి ఫిల్మ్‌నగర్‌ వరకు పూర్తిగా సిగ్నల్‌ రహిత కారిడార్‌ను నిర్మించనున్నారు. రోడ్‌ నంబరు– 45, ఫిల్మ్‌నగర్, క్యాన్సర్‌ హాస్పిటల్, ముగ్ధ జంక్షన్‌తో సహా కీలక కూడళ్ల వద్ద గ్రేడ్‌ సెపరేటర్లను ప్రతిపాదించారు. రెండు వేర్వేరు ప్యాకేజీల కింద జీహెచ్‌ఎంసీ కేబీఆర్‌ పార్క్‌ జంక్షన్, బంజారాహిల్స్‌ చుట్టూ రూ.1,000 కోట్లకు పైగా వ్యయంతో ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లను నిర్మిస్తోంది. కేబీఆర్‌ పార్క్‌ భూమిని ఆక్రమించకుండా ప్రతిపాదిత ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లన్నింటినీ ఇప్పటికే ఉన్న రోడ్డు మధ్యభాగాల్లోనే నిర్మించనున్నారు. అలాగే కాంక్రీట్‌ నిర్మాణాల కంటే స్టీల్‌ ఫ్లై ఓవర్లకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఈ ప్రాజెక్ట్‌ పూర్తయితే.. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌ ప్రాంతాలలో 13.6 లక్షల టన్నుల కార్బన్‌ డయాక్సైడ్‌ ఉద్గారాల విడుదల నివారణతో వాయు కాలుష్య స్థాయిలను 72 శాతం తగ్గించొచ్చు. ఏటా 40 కోట్ల లీటర్లకు పైగా ఇంధనం ఆదా అవుతుందని అంచనా. 

సాధ్యమేనా? 
రాజస్థాన్‌లోని కోటా నగరం తరహాలో గ్రేటర్‌లో ఈ విధానాన్ని అమలు చేయడం అంత సులువు కాదని, ఈ ప్రతిపాదన ఆచరణలో అనేక సవాళ్లున్నాయని రోడ్డు భద్రతా నిపుణులు అభిప్రాపడుతున్నారు. 2014లో నగరంలో 42.2 లక్షల వాహనాలు ఉండగా.. తాజాగా వీటి సంఖ్య 94.16 లక్షలు దాటింది. నగరంలో సగటున ప్రతిరోజూ 1,500 కొత్త వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయి. ఈమేరకు మౌలిక సదుపాయాలు, రహదారుల విస్తరణ లేకపోవడంతో  ట్రాఫిక్‌ చిక్కులు తీవ్రమవుతూనే ఉన్నాయి. 

ఇలా చేస్తే బెటర్‌.. 
నగరం మొత్తాన్ని సిగ్నల్‌ రహితంగా మార్చడం కాకుండా కీలక కూడళ్ల వద్ద దీర్ఘకాలంగా ఉన్న ట్రాఫిక్‌ రద్దీని తొలగించడంపైనే ప్రభుత్వం దృష్టి సారిస్తే ఫలితం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. కెమెరాలు, సెన్సార్లను ఉపయోగించి 
ఆరి్టఫీషియల్‌ ఇంటలిజెన్స్‌ (ఏఐ) ఆధారిత అడాప్టివ్‌ ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ వినియోగిస్తే కూడళ్లలో ట్రాఫిక్‌ రద్దీని బట్టి వాహనాల వెయిటింగ్‌ సమయం ఆటోమేటిక్‌గా మారుతుంది.

లాభమేంటంటే? 
సిగ్నల్‌ ఫ్రీలతో ప్రధాన కూడళ్ల వద్ద నాలుగు వైపుల నుంచి వచ్చే వాహనాలు ఎక్కడా నిలిచిపోకుండా నిరాటంకంగా ప్రయాణించేందుకు వీలుగా ప్రతీ లైన్‌కూ ప్రత్యేకంగా రహదారి ఉంటుంది. దీంతో జంక్షన్‌లో ఎలాంటి ట్రాఫిక్‌ సిగ్నల్‌ గానీ, ట్రాఫిక్‌ పోలీసులు గానీ అవసరం ఉండదు. దీంతో ప్రధాన నగరంలో రహదారి భద్రత మెరుగవడంతో పాటు ట్రాఫిక్‌ సజావుగా సాగుతుంది. దీంతో ప్రయాణ సమయం, ఇంధన వినియోగం ఆదా అవుతుంది. ధ్వని, వాయు కాలుష్యం గణనీయంగా తగ్గుతుంది.  

‘కోటా’ కథ ఇదీ..
15 లక్షల జనాభా ఉన్న కోటా నగరం 2022లో దేశంలోనే తొలి సిగ్నల్‌ రహిత నగరంగా అవతరించింది. సుమారు రూ.2 వేల కోట్ల వ్యయంతో వందకు పైగా ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, రౌండ్‌ అ»ౌట్‌లు, రోటరీలు, రింగ్‌రోడ్‌లను పున
రి్నరి్మంచారు. కోటాలోని సుమారు 12 ప్రధాన కూడళ్లలో రోజుకు 7 లక్షల వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి.  

Advertisement
 
Advertisement
Advertisement