వడదెబ్బతో 61 మంది మృతి | 61 die of heatstroke in Telangana | Sakshi
Sakshi News home page

వడదెబ్బతో 61 మంది మృతి

May 25 2026 6:16 AM | Updated on May 25 2026 6:16 AM

61 die of heatstroke in Telangana

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోనే 26 మంది..

సాక్షి, నెట్‌వర్క్‌ : అత్యధిక ఉష్ణోగ్రతలకు తోడు వడగాలులతో జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో ఆదివారం వడదెబ్బతో 61 మంది మృతి చెందారు. ఒక్క ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోనే 26 మంది ఉన్నారు.  

మహబూబాబాద్‌ జిల్లా పాతపోచారంలో లింగాల రాజయ్య(75), బడితండాలో అజ్మీరా లచ్యా (80), నెల్లికుదురులో వీరగాని వీరమ్మ (84), కొత్త రామయ్య (86), తొర్రూరులో పైండ్ల నర్సయ్య(45), అమ్మాపురంలో అత్తిలి రాము(60), నాంచారిమడూరులో సోమ నారాయణ (65), గూడూరులో పాపని ఎల్లమ్మ (68) వడదెబ్బతో మృతి చెందారు. ములుగు జిల్లా రామన్నగూడెంలో దొడ్డ వెంకటయ్య(85), కన్నెపల్లిలో పాయం సుశీంద్ర (65), జనగామ నాగిరెడ్డిపల్లిలో తేలు మల్లమ్మ (70), జఫర్‌గఢ్‌లో తాటికాయల బాబు (49), రంగరాయగూడెంలో తల్లీకూతుళ్లు మంద చంద్రమ్మ(80), కవిత (35), జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా గుంటూరుపల్లిలో ఎర్రబోయిన జయలక్ష్మి (65), వరంగల్‌ కరీమాబాద్‌లో బేతి అశోక్‌ (55), కరీమాబాద్‌లో మైదం శ్రీను (55), వెంకటాపురంలో గోర్కటి లింగమ్మ (70), గొర్రెకుంటలో గడ్డం పద్మ (55), వర్ధన్నపేటలో చందు ఐలయ్య (88), ఇల్లందలో వనం వజ్రమ్మ (70), రొడ్డ సుశీల (65) వడదెబ్బతో మృతిచెందారు. హనుమకొండ జిల్లా గాంధీనగర్‌లో తూముల రాజయ్య (68), కొత్తూరు మార్కెట్‌ ప్రాంతంలో నివసించే ఎండీ.బియాబానీ (65), కొండపర్తిలో నీరటి అనసూర్య(58), వెల్లంపల్లిలో నూక సాంబయ్య (65) వడదెబ్బతో మృతి చెందారు.  

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో.. పెద్దపల్లి జిల్లా నాగారానికి చెందిన మల్యాల సత్తమ్మ (78), రొంపికుంటకు చెందిన కొండి లక్ష్మి (75), చిప్ప శ్రీనివాస్‌ (35), ధూళికట్టకు చెందిన గండ్ర సత్తెమ్మ (65), కొత్తపల్లికి చెందిన పిన్‌రెడ్డి అశ్విని (33), రాయికల్‌కు చెందిన గద్దె భూమక్క (75), పోచమ్మవాడకు చెందిన ఎద్దండి రాజవ్వ (85), కాల్వశ్రీరాంపూర్‌కు చెందిన కనుకయ్య(60), రామగుండం యైటింక్లయిన్‌కాలనీలో ఆటో డ్రైవర్‌ ముత్యం అశోక్‌ (39), గోదావరిఖనిలో కూరెళ్ల సంపత్‌(50), అశోక్‌నగర్‌లో బొజ్జ శంకరయ్య(70) వడదెబ్బతో చనిపోయారు.  

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో... ఇల్లూరులో కొరివి అచ్చయ్య (90), పైనంపల్లిలో బీమాల వెంకటేశ్వర్లు (43), ఖమ్మం పాత బస్టాండ్‌లో గురుజాల కొండలు (50), బూర్గంపాడులో నోముల వంశీకృష్ణ (33), సారపాక ప్రధానకూడలి సమీపాన గుర్తు తెలియని వ్యక్తి, పాల్వంచలో కాగితాలు ఏరుకొని జీవించే గుర్తు తెలియని వ్యక్తి (50), అశ్వారావుపేటలో ఎస్‌.కే.షాహిదా (65), మామిడిగుండాలలో ముక్తి పూర్ణ (35), రుద్రంపూర్‌లో ఎన్‌.రజినీకాంత్‌(36) వడదెబ్బతో కన్నుమూశారు. 

సిద్దిపేట జిల్లా చౌటపల్లిలో చల్లగొండ లక్ష్మణ్‌రావు (59), హుస్నాబాద్‌లో పోశవేని సహదేవ్‌(64), – నిజామాబాద్‌ జిల్లా చౌడ్‌తండాలో ధరావత్‌ బుజ్జి (42), యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో వెంకటేశ్‌ అలియాస్‌ చిన్న (47),వానరాశి రత్నమ్మ(52), ధర్మోజిగూడెంలో కృష్ణవేణి(60) , సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఏర్పుల శివ(40), ఇస్తాళపురంలో ఐలయ్య (66) వడదెబ్బతో మృతి చెందారు, 

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా.. బాదంపల్లిలో దాది నరేశ్‌ (39), జెండావెంకటాపూర్‌లో లాటుకూరి కిరణ్‌(30), కుమురంభీం జిల్లా పారిగాంలో ఎల్కరి అశోక్, జక్కాపూర్‌లో పిప్రె సాయినాథ్‌(45), మంచిర్యాల జిల్లా ముత్యంపల్లిలో మందరాజు (49), నిర్మల్‌ జిల్లా కడెంలో గుర్తుతెలియని వ్యక్తి, జన్నారం మండలంలో గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement