మాసబ్‌ట్యాంక్‌లో దారుణం.. ప్రముఖ న్యాయవాది మృతి | Car Attack on Advocate Khaja Mohinuddin in Masab Tank | Sakshi
Sakshi News home page

మాసబ్‌ట్యాంక్‌లో దారుణం.. ప్రముఖ న్యాయవాది మృతి

May 23 2026 12:40 PM | Updated on May 24 2026 4:10 PM

Car Attack on Advocate Khaja Mohinuddin in Masab Tank

హైదరాబాద్‌: మాసబ్‌ట్యాంక్‌ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ న్యాయవాది కాజా మొయినుద్దీన్‌ను గుర్తుతెలియని దుండగులు కారుతో ఢీకొట్టి హత్య చేసిన ఘటన సంచలనం రేపుతోంది. శనివారం ఉదయం ఆయన తన నివాసం నుంచి కారులో బయల్దేరుతున్న సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన ధుండగులు కారుతో ఢీ కొట్టి అటాక్‌ చేశారు. 

ఈ ప్రమాదంలో మొయినుద్దీన్‌కు తీవ్రగాయాలు కావడంతో స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఘటన తర్వాత నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. దాడికి సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement