మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌కు రేవంత్‌ లేఖ | CM Revanth letter to Maharashtra CM Fadnavis | Sakshi
Sakshi News home page

మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌కు రేవంత్‌ లేఖ

May 27 2026 7:31 PM | Updated on May 27 2026 8:58 PM

CM Revanth letter to Maharashtra CM Fadnavis

సాక్షి, హైదరాబాద్‌: తుమ్మిడిహెట్టి బ్యారేజ్‌పై మహారాష్ట్ర సీఎంకు రేవంత్‌ రెడ్డి లేఖ రాశారు. బ్యారేజీ ఎత్తు, నిర్మాణంపై చర్చించేందుకు సమయం ఇవ్వాలని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. సమావేశానికి అనుకూలమైన తేదీని త్వరగా ఖరారు చేయాలని ఫడ్నవీస్‌కు విజ్ఞప్తి చేశారు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును పూర్తి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేసింది.’’ అని రేవంత్‌ లేఖలో పేర్కొన్నారు.

‘‘మొదటి ప్రతిపాదనలో 152 మీటర్ల ఎత్తున తుమ్మిడిహెట్టి బ్యారేజ్‌ నిర్మాణం. 2016లో 148 మీటర్ల ఎత్తుకు మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. 148 మీటర్ల ఎత్తు ఉత్తర తెలంగాణ నీటి అవసరాలకు సరిపోదని నిపుణులు తెలిపారు. ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, మెదక్‌ జిల్లాల సాగు, తాగునీటి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాం. బ్యారేజీ ఎఫ్‌ఆర్‌ఎల్‌ (FRL) పెంచినా మహారాష్ట్రలో ముంపు ప్రభావం చాలా తక్కువ. ఎత్తు పెంచితే గ్రావిటీ ద్వారా తెలంగాణకు నీటిని తెచ్చుకునే వీలుంది’’ అని లేఖలో సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement