లొంగిపోయిన మావోయిస్టు నేత నరహరికి రూ.25 లక్షలు అందజేత | DGP Rewards Narahari and Wife Presented to Media | Sakshi
Sakshi News home page

లొంగిపోయిన మావోయిస్టు నేత నరహరికి రూ.25 లక్షలు అందజేత

May 26 2026 3:57 PM | Updated on May 26 2026 4:13 PM

DGP Rewards Narahari and Wife Presented to Media

హైదరాబాద్‌: మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు నరహరి, అతని భార్య ధనమ్మ మే 12న పోలీసుల ముందు లొంగిపోయిన విషయం తెలిసిందే. వారిని ఇవాళ (మంగళవారం) మీడియా ముందు ప్రవేశపెట్టారు. నరహరికి రూ.25 లక్షలు, ధనమ్మకు రూ.20 లక్షల చెక్‌ అందజేశారు డీజీపీ సీవీ ఆనంద్. 

ఇక సెంట్రల్ కమిటీలో మిగిలింది ఇద్దరేనని సీవీ ఆనంద్‌ తెలిపారు. ప్రస్తుతం దేశంలో 45 మంది మావోయిస్టులు మాత్రమే అండర్‌గ్రౌండ్‌లో ఉన్నారు. అజ్ఞాతంలో ఉన్న వారు కూడా లొంగిపోవాలని నరహరి పిలుపునిచ్చారు. దాదాపు 45 ఏళ్లుగా ఆయన అజ్ఞాతంలో ఉంటూ కీలక పాత్ర పోషించారు.

మావోయిస్టు సెంట్రల్ కమిటీ మొత్తంగా తుడిచిపెట్టుకుపోయినట్లే. ఇప్పటికే పలువురు నేతలు ఎన్‌కౌంటర్‌లో మృత్యువాత పడగా మెజారిటీ నాయకులు లొంగిపోయారు. నరహరి లొంగుబాటుతో ఇక యాక్టివ్‌గా ఉన్న మావోయిస్టు సెంట్రల్ కమిటీ నేత వార్త శేఖర్‌ను మాత్రమే కీలకంగా భావించవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement