వేసవి సంధ్య.. సల్లాపాల సరాగాలకు చిరునామాగా మారింది. హైదరాబాదీలు సరికొత్త రుచుల ఆస్వాదనకు ఆలవాలమైంది. రాత్రి పొద్దుపోయేదాకా ఆనంద విహారంలో మునిగితేలుతున్నారు. నగరంలో సమ్మర్ అంటే పగలు ఓ పరీక్ష. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 5 వరకు.. వేడి, ఉబ్బరం, ట్రాఫిక్... అన్నీ కలిసి నగరవాసులను ఇండోర్‌లోనే ఉండేలా చేస్తున్నాయి. ఆఫీసులు, వర్క్‌ఫ్రం హోమ్, షాపులు, చిన్న వ్యాపారాలు.. ఇలా ప్రతి ఒక్కరూ.. సూరీడు పడమటికి వాలగానే ఆనందాలను ఆస్వాదిస్తున్నారు. చల్లనిగాలి, మైండ్ ఫ్రెష్– పిల్లల ఆహ్లాదం.. సెలీ్ఫలు, వాక్స్, స్ట్రీట్ ఫుడ్ అన్నీ కలిసి సాయంత్రపు షిఫ్ట్‌ను సమ్మర్ ఫీస్ట్‌లా ఫీలవుతున్నారు
ప్రస్తుత వేసవిలో సాయంత్రం 6 గంటల నుంచి నగరం రంగులు మార్చుకోగానే.. సిటీజనులు బయటికి వస్తున్నారు. ఈ సీజన్‌లో హైదరాబాద్ ఈట్ స్ట్రీట్ వ్యాపారం గణనీయంగా పెరిగిందనేది వ్యాపారుల మాట. ముఖ్యంగా ట్యాంట్‌బండ్ పరిసరాలు, మాదాపూర్–హైటెక్ సిటీ జోన్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు స్ట్రీట్ ఫుడ్‌స్టాళ్లు ఫుల్ బిజీ. వ్యాపార వర్గాల అంచనాల ప్రకారం, సమ్మర్ నెలల్లో ఈవెనింగ్–నైట్ టైమ్ ఫుడ్ సేల్స్ సగటున 25–30 శాతం పెరుగుదల చూపిస్తున్నాయి. పగలు తగ్గిన కస్టమర్ ఫుడ్‌ఫాల్‌ను రాత్రి పూర్తిగా కవర్ చేస్తోంది. సామాన్య జనాలకు ట్యాంక్ బండ్, దుర్గం చెరువు, శిల్పారామం వంటి ప్రాంతాలు బెస్ట్ స్పాట్స్‌గా నిలుస్తున్నాయి. సిటీలో సమ్మర్ అంటే పగలు నిశ్శబ్దం, సాయంత్రం సంబరాలు. ఇది ఉపశమనం మాత్రమే కాదు, నగర ఆర్థిక వ్యవస్థకూ ఊపిరి పోస్తోంది.
ఆల్‌ఇన్ వన్..@: ఎగ్జిబిషన్స్
పిల్లలకు వేసవి సెలవులు కావడంతో.. సికింద్రాబాద్, పీపుల్స్ ప్లాజా, కూకట్‌పల్లి, ఓల్డ్ సిటీ వంటి ప్రాంతాల్లో సమ్మర్ ఎగ్జిబిషన్లు ప్రధాన ఆకర్షణగా మారాయి. గేమ్స్, షాపింగ్ స్టాల్స్, ఫుడ్ కోర్ట్స్ ఆల్ ఇన్ వన్ కాన్సెప్‌్టతో ఆకట్టుకుంటున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది సందర్శకులు 20 శాతం వరకు పెరిగారు. దీనివల్ల ట్రాఫిక్ ‘‘ఈవెనింగ్ హెవీ’’గా మారింది. ఇంకో వైపు పెరుగుతున్న వర్కింగ్ కం కేఫ్ కల్చర్లో భాగంగా నైట్ షిఫ్ట్ ఐటీ ఉద్యోగులు ల్యాప్‌టాప్‌లతో కేఫ్‌ల్లో పని చేస్తూ కనిపిస్తున్నారు. ఫ్రీ వైఫై, చిల్ ఎని్వరాన్‌మెంట్‌తో.. కేఫ్ బిజినెస్‌కు ప్లస్ అవుతున్నాయి. సమ్మర్‌లో రాత్రి 7 తర్వాత కేఫ్ ఫుట్‌ఫాల్ 15–18 శాతం పెరుగుదల నమోదు చేస్తోంది. ఫుడ్, షాపింగ్, ఎగ్జిబిషన్స్, కేఫ్ వర్క్ అన్నీ కలిసి హైదరాబాద్‌ను ‘‘రాత్రిలోనూ బతికే నగరం’’గా మరోసారి నిరూపిస్తున్నాయి!


