గాంధీ భవన్‌లో రగడ.. గల్లాలు పట్టుకుని కాంగ్రెస్‌ నేతలు ఫైటింగ్‌ | heated confrontation between Congress leaders | Sakshi
Sakshi News home page

గాంధీ భవన్‌లో రగడ.. గల్లాలు పట్టుకుని కాంగ్రెస్‌ నేతలు ఫైటింగ్‌

May 27 2026 5:12 PM | Updated on May 27 2026 6:52 PM

 heated confrontation between Congress leaders

హైదరాబాద్‌: గాంధీ భవన్‌లో జరిగిన కాంగ్రెస్‌ సమావేశంలో కలకలం చెలరేగింది. నాంపల్లి కాంగ్రెస్‌ నేత ఫిరోజ్‌ ఖాన్‌ను కార్వాన్‌ ఇన్‌చార్జ్‌ ఉస్మాన్‌ ఆల్‌ హాజ్రీ ఉస్మాన్‌ తోసేశారు. ప్రొటోకాల్‌ విషయంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వివాదం చెలరేగడంతో ఈ గొడవ చెలరేగింది. ఫిరోజ్‌ఖాన్‌, ఉస్మాన్‌ గల్లాలు పట్టుకున్నారు.

మంత్రులు పొన్నం ప్రభాకర్‌, అజారుద్దీన్‌ సమక్షంలోనే గొడవ జరిగింది. మంత్రి అజారుద్దీన్‌ పక్క కూర్చునే విషయంలో గొడవ మొదలైంది. గొడవ పడుతుంటే కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు అడ్డుకునే ప్రయత్నం చేశారు. వీహెచ్‌ను తోసేసేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. గొడవ ఆపాలని పొన్నం ప్రభాకర్‌ చెప్పినా ఫిరోజ్‌ ఖాన్‌, ఉస్మాన్‌ ఖాన్‌ వినలేదు. గొడవ పడుతున్న వారికి అక్కడి నేతలు అడ్డుకున్నారు. గొడవ మొదలుకావడంతో సమావేశం ముగిసినట్లు ప్రకటించారు. 

క్షమాపణలు చెప్పాను: ఉస్మాన్  
గొడవపై కార్వాన్ ఇన్‌చార్జి ఉస్మాన్ స్పందిస్తూ... ‘‘ఫిరోజ్ ఖాన్‌కు క్షమాపణలు చెప్పాను. ఇది ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరిగిన చిన్న గొడవ. మాది కాంగ్రెస్ ఫ్యామిలీ. ఫ్యామిలీలో గొడవకు జరుగుతూ ఉంటాయి. నేను తోసేసింది చూశారు. అంతకు ముందు జరిగింది కూడా తెలుసుకోండి’’ అని అన్నారు.

అందుకే గొడవ: ఫిరోజ్ ఖాన్ 
గొడవపై ఫిరోజ్ ఖాన్ మాట్లాడుతూ.. ‘‘కుర్చీలో కూర్చోవడం విషయంలో ఇబ్బంది జరిగింది. చిన్న మిస్ అండర్ స్టాండింగ్ వల్ల గొడవ అయింది. మంత్రి పక్కన కూర్చోవాలని అందరూ అనుకున్నారు. ఉస్మాన్ నాకు పెద్దన్న లాంటి వాడు. ఉస్మాన్ నన్ను స్టేజీపైకి రమ్మంటే నేను వెళ్లలేదు. ఉస్మాన్ అన్న నాకు ముద్దు పెట్టాడు’’ అని చెప్పారు. 


 

Advertisement
 
Advertisement
Advertisement