దోసెలు ఎక్కువగా తింటున్నావని తల్లి మందలింపు | Mother reprimand drives Son to suicide: Telangana | Sakshi
Sakshi News home page

దోసెలు ఎక్కువగా తింటున్నావని తల్లి మందలింపు

May 24 2026 1:37 AM | Updated on May 24 2026 1:37 AM

Mother reprimand drives Son to suicide: Telangana

బాలుడి ఆత్మహత్య  

ఫిలింనగర్‌: దోసెలు ఎక్కువగా తింటున్నావని, దీని వల్ల అన్నం సరిగ్గా తినడం లేదని తల్లి మందలించినందుకు ఓ బాలుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఫిలింనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఫిలింనగర్‌లోని జ్ఞానీజైల్‌సింగ్‌ నగర్‌ బస్తీలో నివసించే కార్తీక్‌ (15) స్థానికంగా పదో తరగతి చదువుతున్నాడు. 

చిన్న చిన్న విషయాలకే ఎక్కువగా ఆలోచిస్తూ అతిగా స్పందించడం కార్తీక్‌ నైజంగా మారింది. ఈ నేపథ్యంలోనే దోసెలు ఎక్కువగా తింటున్నావంటూ అన్నం తినడం లేదని తల్లి చెప్పింది. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న కార్తీక్‌.. తండ్రి చెన్నప్ప మేస్త్రీ పనికి, తల్లి ఇళ్లలో పనికి వెళ్లిన సమయంలో తన గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Advertisement
 
Advertisement
Advertisement