నేపాలీ ఇదేం పని.. వీధిలో చేయిపట్టుకొని అసభ్య ప్రవర్తన.. దేహశుద్ధి | Nepali Man Arrested In Hyderabad After Misconduct Incident Near Basheerbagh, Police Act Promptly | Sakshi
Sakshi News home page

నేపాలీ ఇదేం పని.. వీధిలో చేయిపట్టుకొని అసభ్య ప్రవర్తన.. దేహశుద్ధి

May 29 2026 12:14 PM | Updated on May 29 2026 1:21 PM

Nepali Men for Harassing a Woman

హైదరాబాద్‌: రాత్రివేళ ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న యువతితో  అసభ్యంగా ప్రవర్తించిన నేపాలీ యువకులను గురువారం అబిడ్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన మేరకు.. బుధవారం రాత్రి బషీర్‌బాగ్‌ సీసీఎస్‌ కార్యాలయం ఎదురుగా ఓ యువతి ఒంటరిగా వెళుతోంది. దీంతో నేపాల్‌ యువకులు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు. యువతి గట్టిగా అరవడంతో స్థానికులు బంధించి బంధించి దేహశుద్ధి చేశారు. అనంతరం వారిని అబిడ్స్‌ పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు. స్థానికంగా ఓ ఫాస్ట్‌ఫుడ్‌ కేంద్రంలో పనిచేస్తున్న సునీల్, ఉమేష్‌, లక్ష్మణ్, పురుషోత్తం, రామ్‌ నేవులుగా గుర్తించారు.   

Advertisement
 
Advertisement
Advertisement