సాక్షి, హైదరాబాద్: మసబ్ ట్యాంక్ పరిధిలో దారుణహత్యకు గురైన అడ్వకేట్ మెుయిజుద్దీన్ హత్య కేసులో పోలీసులు కీలక ఆదారాలు సేకరించారు. అడ్వకేట్ హత్యలో ఆరుగురు నిందితులు పాల్గొన్నట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఆ హత్యకు వాడింది స్కార్పియో వాహనంగా గుర్తించి ఆ యజమానిని ప్రశ్నించారు. అయితే ఆ వాహనాన్ని ఆరునెలల క్రితమే తాను వేరే వ్యక్తులకు అమ్మానని కానీ కొనుగోలు చేసిన వ్యక్తి ఎవరో తనకు తెలియదని యజమాని చెప్పినట్లు పోలీసులు పేర్కొన్నారు.
దీంతో ఈ వాహనం ఎవరు కొనుగోలు చేసిన వ్యక్తి ఏవరా అనే విషయం పోలీసులు విచారణ చేస్తున్నారు.కాగా నిన్న( శనివారం) మాసబ్‌ట్యాంక్ పరిధిలో ప్రముఖ న్యాయవాది కాజా మొయినుద్దీన్‌ను గుర్తుతెలియని దుండగులు కారుతో ఢీకొట్టి హత్య చేశారు. ఆయన తన నివాసం నుంచి కారులో బయల్దేరుతున్న సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన ధుండగులు కారుతో ఢీ కొట్టి అటాక్ చేశారు. ఈ ప్రమాదంలో మొయినుద్దీన్‌కు తీవ్రగాయాలు కావడంతో స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు.
అయితే చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. ఘటన తర్వాత నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. దాడికి సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. కాగా ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


