ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ఉప్పల్ వేదికగా 67వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తలపడుతున్నాయి.
ఆర్సీబీ మూడో వికెట్ డౌన్
దేవ్‌దత్త్ పడిక్కల్ రూపంలో ఆర్సీబీ మూడో వికెట్ కోల్పోయింది. 21 పరుగులు చేసిన పడిక్కల్.. మలింగ బౌలింగ్‌లో ఔటయ్యాడు
8 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 91/2
8 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ రెండు వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది. క్రీజులో దేవ్‌దత్త్ పడిక్కల్(20), పాటిదార్(10) ఉన్నారు.
తొలి వికెట్ కోల్పోయిన ఆర్సీబీ
ఎస్ఆర్‌హెచ్ విధించిన 256 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ ధాటిగా ఆరంభించింది. 4 ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ వికెట్ నష్టపోకుండా 57 పరుగులు చేసింది. అయితే మరుసటి ఓవర్‌లోనే వెంకటేశ్ అయ్యర్ (44) ఔట్ కావడంతో ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది.
ఆర్సీబీ టార్గెట్ 256 పరుగులు
హైదరాబాద్ వేదికగా ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో ఎస్ఆర్ భారీ స్కోరు చేసింది. అభిషేక్, ఇషాన్, క్లాసెన్ అర్థశతకాలతో విధ్వంసం సృష్టించడంతో ఎస్ఆర్‌హెచ్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇషాన్ (79), అభిషేక్ (56), క్లాసెన్ (51) ఫిఫ్టీలతో మెరిశారు. ఆఖర్లో నితీశ్‌కుమార్ (12 బంతుల్లో 29 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో ఎస్ఆర్‌హెచ్ 250 పరుగుల మార్క్‌ను దాటింది. ఆర్సీబీ బౌలర్లలో రసిక్ సలామ్ 2 వికెట్లు తీయగా, సుయాశ్, కృనాల్ చెరొక వికెట్ తీశారు.
16 ఓవర్లు ముగిసేసరికి ఎస్ఆర్హెచ్ 2 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. క్లాసెన్ 23 బంతుల్లో 50 పరుగుల మార్క్ సాధించాడు. కిషన్ 65 పరుగులతో ఆడుతున్నాడు.
దంచుతున్న ఎస్ఆర్‌హెచ్.. 15 ఓవర్లలో 189-2
ఆర్సీబీతో మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ దంచికొడుతుంది. 15 ఓవర్లు ముగిసేసరికి ఎస్ఆర్హెచ్ 2 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (50), క్లాసెన్ (47) క్రీజులో ఉన్నారు. అంతకముందు 56 పరుగులు చేసిన అభిషేక్ శర్మ సుయాశ్ శర్మ బౌలింగ్‌లో జోర్డాన్ కాక్స్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
6 ఓవర్లలో ఎస్‌ఆర్‌హెచ్ 63-1
6 ఓవర్లు ముగిసేసరికి ఎస్‌ఆర్‌హెచ్ వికెట్ నష్టానికి 63 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (26), ఇషాన్ కిషన్ (8) పరుగులతో ఆడుతున్నారు.
హెడ్ (26) ఔట్.. తొలి వికెట్ డౌన్
ఆర్సీబీతో మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ తొలి వికెట్ కోల్పోయింది. 26 పరుగులు చేసిన ట్రావిస్ హెడ్ రసిక్‌సలామ్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. 4 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోయి 45 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (17) క్రీజులో ఉన్నాడు.
టాస్ గెలిచిన ఎస్ఆర్‌హెచ్
టాస్ గెలిచిన ఎస్ఆర్‌హెచ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఆర్సీబీపై భారీ విజయాన్ని సాధించి టేబుల్‌లో రెండో స్థానంలో నిలవాలని ఎస్ఆర్‌హెచ్ ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు ఇప్పటికే టాప్‌లో ఉన్న ఆర్సీబీ విజయంతో లీగ్ దశను ముగించాలని భావిస్తోంది. మరి భారీ స్కోర్లకు పెట్టింది పేరైన ఉప్పల్ స్టేడియంలో ఎవరిది పైచేయి కానుందో కొన్ని గంటల్లో తేలిపోనుంది.
ఈ సీజన్ ఆరంభ మ్యాచ్‌లో ఆర్సీబీ తమ సొంత మైదానంలో ఎస్ఆర్‌హెచ్‌తో తలపడింది. ఆ మ్యాచ్‌లో విజయం సాధించిన ఆర్సీబీ.. యాదృశ్చికంగా లీగ్ దశలో తమ చివరి మ్యాచ్‌ను మళ్లీ ఎస్ఆర్‌హెచ్‌తోనే ఆడుతోంది. అయితే ఎస్ఆర్‌హెచ్ మాత్రం ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమైంది.
ముఖాముఖి పోరులో ఇరుజట్లు 26 సార్లు తలపడితే ఎస్ఆర్‌హెచ్ 14 సార్లు, ఆర్సీబీ 12 సార్లు విజయాలు సాధించాయి. ఇక సొంత మైదానంలో ఆర్సీబీపై ఎస్ఆర్‌హెచ్‌దే పైచేయిగా ఉంది. ఇక్కడ ఆడిన 9 మ్యాచ్‌ల్లో ఎస్ఆర్‌హెచ్ ఆరింటిలో గెలవగా.. ఆర్సీబీ మూడింట నెగ్గింది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లి, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్(కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, జితేష్ శర్మ(వికెట్‌కీపర్), కృనాల్ పాండ్యా, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, సుయాష్ శర్మ, రసిఖ్ సలాం దార్.
సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(వికెట్‌కీపర్), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా, స్మరణ్ రవిచంద్రన్, నితీష్ కుమార్ రెడ్డి, పాట్ కమిన్స్(కెప్టెన్), శివంగ్ కుమార్, ఈషాన్ మలింగ, సాకిబ్ హుస్సేన్.
🚨Toss update from Hyderabad 🚨@SunRisers won the toss and elected to bat first against @RCBTweets
Rajat Patidar returns to lead #RCB
Updates ▶️ https://t.co/ZcxjefgalG#TATAIPL | #KhelBindaas | #SRHvRCB pic.twitter.com/izekAMXKnx— IndianPremierLeague (@IPL) May 22, 2026


