మొయిజుద్దీన్‌ హత్య కేసును ఛేదించిన పోలీసులు! | Hyderabad CP Sajjanar On Lawyer Moizuddin Case | Sakshi
Sakshi News home page

మొయిజుద్దీన్‌ హత్య కేసును ఛేదించిన పోలీసులు!

May 29 2026 8:29 PM | Updated on May 29 2026 8:37 PM

Hyderabad CP Sajjanar On Lawyer Moizuddin Case

హైదరాబాద్‌:  లాయర్‌ మొయిజుద్దీన్‌ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ మేరకు హత్య కేసుకు సంబంధించి ఏడుగుర్ని అరెస్ట్‌ చేసినట్లు సీపీ సజ్జనార్‌ వెల్లడించారు. నిందితులను మీడియా ముందు ప్రవేశ పెట్టిన సీపీ సజ్జనార్‌ మాట్లాడుతూ.. వక్ఫ్‌ భూముల వివాదాలే లాయర్‌ హత్యకు కారణమన్నారు. లం ఖాన్ కుటుంబానికి  మొయిజుద్దిన్ పలు విషయాలలో అడ్డు వస్తున్నాడానే కారణంతో హత్య చేయించినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు.

‘మొయిజుద్దీన్‌ స్విమ్మింగ్‌కు వెళ్తుండగా హత్య చేశారు. మొయిజుద్దీన్‌ను హతమార్చాలని ఆలంఖాన్‌ నిర్ణయించుకున్నాడు. మే 23 న శాంతి నగర్ లో అడ్వకేట్ ఖాజా మొయిజుద్దిన్‌ను ఉద్దేశపూర్వకంగా కారుతో ఢీ కోట్టారు. వక్ఫ్‌ భూముల వివాదాలే లాయర్‌ హత్యకు కారణం. జనవరి నుంచి లాయర్‌ హత్యకు రెక్కీ నిర్వహించారు. 23వ తేదీన మొయిజుద్దీన్‌ స్విమ్మింగ్‌ వెళ్తుండగా హత్య చేశారు. లాయర్‌ను చంపేందుకు రూ. 15 లక్షలు సుపారీ ఇచ్చారు. నిందితుల నుంచి రూ. 10. 10 లక్షలు స్వాధీనం చేసుకున్నాం. 

 ఆలం ఖాన్ కుటుంబానికి  మొయిజుద్దిన్ పలు విషయాలలో అడ్డు వస్తున్నాడానే కారణంతో హత్య చేయించినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. లక్డి కాపుల్, మలక్ పేట్ ప్రాంతాలకు చెందిన వక్ఫ్ బోర్డు ప్రాపర్టీకి సంబంధించి కేసులలో ఖాజా మొయిజుద్దిన్, ఆలం ఖాన్ కుటుంబానికి వివాదాలు ఉన్నాయి. హత్య చేసేందుకు గత ఆరు నెలల నుండి పలు మార్లు ప్రయత్నం చేసి చివరకు మొయిజుద్దిన్ ను హత్య చేశారు’ అని తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement