సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలతో ప్రజలు అల్లాడిపోతోంది. రోజురోజుకీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఉదయం నుంచే తీవ్రమైన ఎండ కారణంగా మిట్ట మధ్యాహ్నం అయితే వాతావరణం నిప్పుల కొలిమిలా మారుతోంది. మధ్యాహ్నం వేళ బయటకు రావాలంటేనే జనం వణికిపోతున్నారు. ఈ క్రమంలో తెలంగాణలో వాతావరణ శాఖ ఈరోజు హీట్‌వేవ్ హెచ్చరికలు జారీ చేసింది.

తెలంగాణలోని ఖమ్మం, భద్రాద్రి - కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట, నల్గొండ, ములుగు, వరంగల్, హన్మకొండ, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, మంచిర్యాలు, జగిత్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, సిద్దిపేట, సిరిసిల్ల, భద్రాద్రిలో తీవ్రమైన వేడిగాలులు 44-47°C లతో మధ్యాహ్నం సమయంలో LOO గాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఉదయం 11 నుండి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చరించింది.
ఉరుములతో కూడిన వర్షసూచన..
మరోవైపు.. నాగర్‌కర్నూల్, వనపర్తి, మహబూబ్‌నగర్, తదితర ప్రాంతాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. గద్వాల్, నారాయణపేట, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, ఇతర జిల్లాల్లో, అక్కడక్కడా మాత్రమే వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక, హైదరాబాద్ సిటీలో సాయంత్రం నుంచి రాత్రి వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షం/ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది.
Today's FORECAST - May 25, 2026
HEATWAVE WARNING ⚠️🔥
SERIOUS HEATWAVE conditions ahead in Khammam, Bhadradri - Kothagudem, Mahabubabad, Suryapet, Nalgonda, Mulugu, Warangal, Hanmakonda, Karimnagar, Peddapalli, Bhupalapally, Mancherial, Jagitial, Asifabad, Adilabad, Nirmal,…— Telangana Weatherman (@balaji25_t) May 25, 2026


