హైదరాబాద్: జీవితం మీద విరక్తి చెంది ఓ యువకుడు ‘ఇదే నా చివరి రాత్రి’ అంటూ సెల్ ఫోన్‌లో తన స్నేహితులకు మెసేజ్ చేసి ఆత్మహత్య చేసుకున్నాడు. బంజారాహిల్స్ పోలీసుల కథనం ప్రకారం... బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 5లో దేవరకొండ బస్తీలో నివసించే సమీర్ (20) ప్రైవేటు ఉద్యోగి. కొంతకాలంగా సమీర్ మానసిక ఆందోళనకు గురవుతున్నాడు. ఈ నేపథ్యంలోనే శనివారం స్నేహితులకు ‘ఇదే నా చివరి రాత్రి. నువ్వు సుఖంగా ఉండు’ అంటూ చాటింగ్ చేసి ఆదివారం తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి మృతిపై తమకు ఎలాంటి అనుమానాలు లేవని, ఎలాంటి కారణాలు కూడా లేవని సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి మొబైల్ ఫోన్ చాటింగ్‌లను పోలీసులు పరిశీలించారు.


