విజేత దివ్యారెడ్డి | Hyderabad City Slam 10K Summer Run Winner Divya Reddy Bollareddy | Sakshi
Sakshi News home page

విజేత దివ్యారెడ్డి

May 27 2026 1:57 PM | Updated on May 27 2026 2:20 PM

Hyderabad City Slam 10K Summer Run Winner Divya Reddy Bollareddy

సీనియర్‌ అథ్లెట్‌ దివ్యారెడ్డి బొల్లారెడ్డి తన ఖాతాలో మరో విజయం నమోదు చేసుకున్నారు. నెక్లెస్‌ రోడ్‌లో నిర్వహించిన హైదారాబాద్‌ సిటీ స్లామ్‌ 10కె సమ్మర్‌ రన్‌-2026లో 40-49 మహిళల విభాగంలో దివ్యారెడ్డి విజేతగా నిలిచారు. ఇతర వయో విభాగాల్లో సునిమా, వెంకట్‌, విపిన్‌ గెలుపొందారు.


 పతకాల పంట పండిస్తున్న దివ్యారెడ్డి
ఇటీవల ఆసియా మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్స్‌-2025లో దివ్యారెడ్డి నాలుగు పతకాలు సాధించారు. నలభై ఐదేళ్లకు పైబడిన వయో విభాగంలో 800 మీటర్ల పరుగు పందెంలో స్వర్ణం, 1500 మీటర్ల పరుగులో రజతం, 400 మీటర్ల రేసులో కాంస్యం గెలిచిన దివ్యారెడ్డి.. 4*400 రిలేలో స్వర్ణం గెలిచిన భారత జట్టులో సభ్యురాలిగా ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement