తెలంగాణ పాలిసెట్‌ ఫలితాలు విడుదల | Telangana POLYCET 2026 results released | Sakshi
Sakshi News home page

తెలంగాణ పాలిసెట్‌ ఫలితాలు విడుదల

May 23 2026 11:59 AM | Updated on May 23 2026 2:02 PM

Telangana POLYCET 2026 results released

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూసిన పాలిసెట్‌-2026 ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ శనివారం అధికారికంగా ఫలితాలను ప్రకటించారు. 82.94 శాతం ఫలితం సాధించినట్లు వెల్లడించారు. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు.. హాల్‌టికెట్‌ నంబర్‌ నమోదు చేసి విద్యార్థులు తమ ర్యాంక్‌కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. 

ఫలితాలను సాక్షి ఎడ్యుకేషన్‌.కామ్‌ ఒక్క క్లిక్‌తోనే అందిస్తోంది. ఫలితాలను చెక్‌చేసుకోవడానికి 👉 క్లిక్‌ చేయండి

ఈ ఏడాది మే 13న నిర్వహించిన తెలంగాణ పాలీసెట్‌ పరీక్ష ప్రశాంతంగా జరిగిన విషయం తెలిసిందే. పదో తరగతి అనంతరం ఇంజినీరింగ్‌, నాన్‌-ఇంజినీరింగ్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్ష రాశారు. ఈ నెల 27 నుంచి కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉందని సాంకేతిక విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. 

సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌, వెబ్‌ఆప్షన్లు, సీట్ల కేటాయింపు తదితర ప్రక్రియలను దశలవారీగా నిర్వహించనున్నారు. జూన్‌ మొదటి వారంలో సీట్ల కేటాయింపు పూర్తి చేసేలా అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఈసారి కూడా ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో సీట్ల కోసం గట్టి పోటీ ఉండే అవకాశముందని విద్యా నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కంప్యూటర్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, ఎలక్ట్రానిక్స్‌, సివిల్‌ వంటి కోర్సులకు డిమాండ్‌ ఎక్కువగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement