breaking news
Chittoor District Latest News
-
కుటుంబ కలహాలకు తండ్రి, కొడుకు బలి!
యాదమరి: ఆ పచ్చని సంసారంలో కుటుంబ కలహాలు చిచ్చు రగిల్చాయి. క్షణికావేశంలో ఆ తండ్రి కఠిన నిర్ణయం తీసుకున్నారు. కన్న ప్రేమను మరిచి పదేళ్ల కుమారునికి విషమిచ్చి ప్రాణాలు తీశాడు. తర్వాత తానూ ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడాడు. ఈ హృదయ విచారకర ఘటన యాదమరి మండలంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. మండల పరిధిలోని భూమిరెడ్డిపల్లి పంచాయతీ వెంకటాపురం దళితవాడకు చెందిన దొరస్వామి కుమారుడు బాబు(35) అమరరాజ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఉద్యోగరీత్యా అతను తన భార్యతో కలిసి చిత్తూరులో నివాసం ఉంటున్నాడు. రెండు రోజుల క్రితం స్వగ్రామమైన వెంకటాపురంలో బంధువుల ఇంట్లో జరిగిన ఓ ఫంక్షన్‌కు హాజరయ్యేందుకు బాబు తన కుమారుడితో వచ్చాడు. ఎప్పుడు స్వగ్రామానికి వచ్చినా పనులు ముగించుకుని వెంటనే వెళ్లే బాబు రెండు రోజులుగా ఇక్కడే ఉంటున్నాడు. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో తాము తరచూ ఘర్షణ పడుతున్నామని బాబు తన స్నేహితుల వద్ద వాపోయేవాడు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో తీవ్ర మనస్తాపానికి గురైన బాబు, ముందుగా తన కుమారుడు లోహిత్(10)కు విషం తాగించాడు. చిన్నారి ప్రాణాలు విడవడం చూసిన తర్వాత అతను కూడా అదే గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంతసేపటికీ గది నుంచి ఎవరూ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు లోపలికి వెళ్లి చూడగా ఇద్దరూ మృతి చెంది ఉండడాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. స్థానిక ఎస్ఐ ఈశ్వర్ విచారణ చేపట్టారు. మృతుని భార్య ఓ ప్రైవేటు పాఠశాలలో తాత్కాలిక ఉద్యోగిగా పనిచేస్తున్నారని, వారి మధ్య తలెత్తిన వివాదాలే ఈ దారుణానికి ప్రధాన కారణమని మృతుని సన్నిహితులు అభిప్రాయపడుతున్నారు. ఈ సమాచారం బాబు భార్యకు తెలిసినా ఆమె రాకపోవడంపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఇక మిగిలింది రిజర్వేషన్లే!
ఎవరికెన్ని వార్డులంటే.. అధికారులు ప్రచురించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల జాబితా ప్రకారం ఆయా వర్గాలకు ఎన్ని వార్డులు కేటాయించాలన్న దానిపై నిబంధలన మేరకు స్పష్టత ఉంది. మునిసిపాలిటీల్లో ఉన్న మొత్తం వార్డుల సంఖ్యలో ఎస్టీ 1 శాతం, ఎస్సీ 16 శాతం, బీసీ 34 శాతం (అంచనా) వార్డులను రిజర్వు చేయాలి. అంటే చిత్తూరు కార్పొరేషన్లో 60 డివిజన్లు ఉంటే ఎస్టీలకు ఒక డివిజన్, ఎస్సీలకు 10, బీసీలకు 20 డివిజన్లు రిజర్వు చేస్తారు. మిగిలినవి అన్–రిజర్వు (ఓపెన్ కేటగిరీ) కిందకు వస్తాయి. 60 డివిజన్లలో 30 డివిజన్లను తప్పనిసరిగా మహిళలకు రిజర్వు చేస్తారు. ఇక ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్), బీసీ రిజర్వేషన్లపై ఇప్పటికే తుది వాదనలు విన్న హైకోర్టు మూడు రోజుల క్రితం తీర్పును రిజర్వు చేసిన విషయం తెలిసిందే. కోర్టు వెలువరించే తీర్పు, ఎన్నికల నిర్వహణను ముందుకు తీసుకెళ్లాలా..? ‘సర్’ పూర్తయ్యాక ఎన్నికలు నిర్వహించాలా..? అనే దానిపై ఆధారపడుతుంది. అప్పటి వరకు ఉత్కంఠత తప్పేలా లేదు. మునిసిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఒక్కో అంశాన్ని అధికారులు పూర్తి చేస్తున్నారు. మునిసిపల్ కమిషనర్లు ఇప్పటికే వార్డుల పునర్విభజన, వార్డుల వారి ఓటర్ల జాబితా ప్రచురించారు. తాజాగా జిల్లాలోని మునిసిపాలిటీల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల జాబితాను వార్డుల వారిగా ఆదివారం విడుదల చేశారు. సాక్షి, చిత్తూరు: జిల్లాలో చిత్తూరు కార్పొరేషన్‌తో పాటు పలమనేరు, నగరి మునిసిపాలిటీల్లో ఎన్నికల ఏర్పాట్ల కోసం ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా చిత్తూరు కార్పొరేషన్‌లోని 60 డివిజన్లు, పలమనేరు మునిసిపాలిటీలోని 36 వార్డులు, నగరిలోని 40 వార్డుల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల జాబితాను వార్డుల వారిగా ప్రచురించారు. ఈ ప్రతులను స్థానిక మునిసిపల్ కార్యాలయతో పాటు తహసీల్దార్, ఆర్డీవో కార్యాలయాల్లో అందుబాటులో ఉంచారు. అలాగే రాజకీయ పార్టీలకు సైతం జాబితా పంపించారు. మొత్తం 136 వార్డుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల వివరాలు ప్రాథమికంగా లెక్క కట్టారు. ఈ జాబితాపై సోమవారం సాయంత్రం 5 గంటల్లోపు అభ్యంతరాలను ఆయా మునిసిపల్ కమిషనర్లకు తెలియజేయాల్సి ఉంటుంది. రేపటి నుంచి విచారణ కులాల వారిగా ప్రచురించిన జాబితాలో ఏవైనా అభ్యంతరాలు, సవరణలు చేయాలంటే ఈ నెల 29, 30వ తేదీల్లో ఇంటింటా వెళ్లి విచారణ చేపడతారు. వచ్చిన అభ్యంతరాలపై విచారణ పూర్తి చేసి, సహేతుకంగా ఉన్న వాటిని ఆమోదిస్తారు. అక్టోబర్ 1వ తేదీన తుది ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల వార్డుల వారి జాబితాను ప్రచురిస్తారు. ఆపై దీన్ని రాష్ట్ర మునిసిపల్ సంచాలకులకు (డీఎంఏ) అందజేస్తారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే చిత్తూరు కలెక్టర్ గెజిట్ విడుదల చేస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజికవర్గాలకు జిల్లాలోని ఏయే మునిసిపాలిటీల్లో ఏయే వార్డులు రిజర్వు చేసారనే వివరాలను గెజిట్ నోటిఫికేషన్ పేర్కొంటారు. తుదిగా మేయర్, చైర్పర్సన్ రిజర్వేషన్లను విడుదల కావడం, ఎన్నికల సంఘం నుంచి షెడ్యూల్ విడుదల కావడమే తరువాయి. -
సైన్స్‌తోనే ప్రజా సమస్యలకు పరిష్కారం
– మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం చిత్తూరు కలెక్టరేట్ : సమాజంలో ఎదురయ్యే పలు సమస్యలకు సైన్స్‌తో శాశ్వత పరిష్కారం లభిస్తుందని మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యం స్పష్టం చేశారు. స్థానిక విజయం ఇంజినీరింగ్ కాలేజీలో ఆదివారం జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జిల్లా స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో నార్మన్ బోర్లాంగ్ పొట్టి రకాల వరి వంగడాలను రూపకల్పన చేయడంతో కోట్లాది మంది ఆకలి తీరిందన్నారు. భారతదేశం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడానికి సైన్స్ ఎంతో దోహదపడిందని గుర్తుచేశారు. రసవత్తరంగా సైన్స్ పోటీలు సైన్స్ పోటీల్లో జిల్లాలోని 28 మండలాలకు చెందిన 40 టీమ్‌లు పాల్గొన్నాయి. ఉదయం స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి, అందులో ప్రతిభ చూపిన విద్యార్థులకు క్విజ్ ప్రోగ్రామ్ చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలల విభాగంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (పులిచెర్ల), ప్రైవేట్ పాఠశాలల విభాగంలో రెయిన్బో ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ (చిత్తూరు) ప్రథమ స్థానాల్లో నిలిచాయి. ఈ జట్లు నవంబర్ 1, 2, 3 తేదీల్లో భీమవరంలో జరగబోయే రాష్ట్ర స్థాయి చెకుముకి సైన్స్ సంబరాల్లో జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహిస్తాయని నిర్వాహకులు తెలిపారు. పుస్తకావిష్కరణ, బహుమతుల ప్రదానం జనవిజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు అరుణ్ శివప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి యుగంధర్ బాబు రచించిన ప్రయోగాలతో శాసీ్త్రయ దృక్పథం పుస్తకాన్ని విఠపు బాలసుబ్రమణ్యం ఆవిష్కరించారు. పోటీల్లో పాల్గొన్న విద్యార్థులందరికీ అందజేశారు. అనంతరం ఎం.వి.కేశవరెడ్డి మెమోరియల్ ఫౌండేషన్ ప్రతినిధి శ్రీధర్ రెడ్డి విజేత పాఠశాలలకు మెమెంటోలు ప్రదానం చేశారు. విజయం విద్యాసంస్థల అధినేత శైలజ విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో నిర్వాహకులు ఫిలింఫేర్ ఖాన్, పిల్లారప్ప, వేణుగోపాల్, విజయ్ కుమార్, జయంతి, సుధాకర్, గిరిధర్ మూర్తి, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్ర స్థాయి పోటీలకు సిద్ధార్థ విద్యార్థులు
నారాయణవనం: చిత్తూరు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ నిర్వహింవిన పోటీలలో ప్రతిభ కనబరచిన సిద్ధార్థ కళాశాల విద్యార్థులు వెంకటమానస, దివాకర్‌రెడ్డి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన ట్లు కళాశాల పీడీ సుబ్రహ్మణ్యం తెలిపారు. వెంకటమా నస (బీటెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్‌న్స్ తృతీయ సంవత్సరం) డిస్కస్‌త్రో, ట్రిపుల్ జంప్ విభాగాల్లో ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకాలు సాధించింది. దివాకర్‌రెడ్డి (బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం) 400 మీటర్లు, 800 మీటర్ల పరుగు పందెం విభాగాలలో ద్వితీయ స్థానంలో నిలిచి రజత పతకాలను సాధించాడు. కళాశాల చైర్మన్ అశోకరాజు మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడల్లోనూ చురుగ్గా రాణించాలన్నారు. ప్రిన్సిపాల్ జనార్దన్‌రాజు, పీడీ సుబ్రహ్మణ్యం విద్యార్థులను అభినందించారు. -
నిలబడదాం.. కలబడదాం
తిరుపతి రూరల్: రాష్ట్రంలో జరిగే స్థానిక ఎన్నికల సమరానికి వైఎస్సార్సీపీ సిద్ధమవుతోందని, గ్రామ స్థాయి నుంచి పార్టీ శ్రేణులను సన్నద్ధం చేసి.. బలమైన అభ్యర్థులను బరిలోకి దించి గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతామని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. 27 నెలల కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో ఉన్న అసంతృప్తి స్థానిక ఎన్నికల్లో ఆ పార్టీలకు పాడెకడతాయన్నారు. తిరుపతిలోని తన నివాసం వద్ద ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా, న్యాయబద్ధంగా జరగాలని, అధికార యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకుని ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేయాలని చూస్తే వైఎస్సార్సీపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలపై అధికారుల ఒత్తిళ్లు, పోలీసుల దౌర్జన్యాలు చోటుచేసుకుంటే చట్టపరంగా ఎదుర్కొంటామని హెచ్చరించారు. కుప్పం నుంచే కుట్రలకు శ్రీకారం చంద్రబాబు తన రాజకీయ కుతంత్రాలకు కుప్పం నుంచే శ్రీకారం చుట్టారని పెద్దిరెడ్డి ఆరోపించారు. ప్రజలు చంద్రబాబు ప్రభుత్వ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయన్నారు. వర్షాలు లేక, సాగునీరు లేక, పెరిగిన ధరలతో తినడానికి తిండిలేక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, ఈ పరిస్థితుల్లో ఎన్నికలకు వెళుతున్నారన్నారు. నిన్నటి వరకు మున్సిపల్ కార్పొరేషన్, మండల స్థాయి ఎన్నికలు విడివిడిగా నిర్వహిస్తామని చెప్పి, ఇప్పుడు రెండింటినీ ఒకేసారి నిర్వహిస్తామని చెప్పడానికి కారణం కూడా అదేనన్నారు. ఎక్కడా ఏకగ్రీవాలకు అవకాశం లేకుండా అన్ని చోట్లా పోటీ పెడతామన్నా రు. డీఎస్సీ నియామకాల విషయంలోనూ అవకతవక లు జరిగాయన్నారు. దీనిపై ఆందోళన చేస్తున్న వారిపై పోలీసులే టీడీపీ గుండాలను వెనుకేసుకొచ్చి దాడులు చేయించి, తిరిగి వారిపైనే కేసులు పెట్టారన్నారు. స్థానిక పోరుకు వైఎస్సార్సీపీ రె‘ఢీ’ సచివాలయ ఉద్యోగుల పోరాటానికి మద్దతు గత ప్రభుత్వంలో ఉద్యోగంలో చేరిన సచివాలయ ఉద్యోగులపై చంద్రబాబు ప్రభుత్వం కక్షసాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని పెద్దిరెడ్డి ఆరోపించారు. బదిలీలు, అధిక పనిభారం పేరుతో వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ఆందోళనకు వెళుతున్న సచివాలయ ఉద్యోగులను అరెస్టు చేస్తున్నారని, వారిపట్ల పోలీసులు అమానుషంగా వ్యవహరించారని ఆరోపించారు. సచివాలయ ఉద్యోగుల సమస్యలపై చేస్తున్న పోరాటానికి వైఎస్సార్సీపీ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. పార్టీ అధికారంలోకి వస్తే సచివాలయ ఉద్యోగులకు జరిగిన అన్యాయా లను సరిదిద్ది, ప్రయోజనాలను కాపాడతామని హామీ ఇచ్చారు. చివరగా పుంగనూరులో భారీ పరిశ్రమ ఏర్పాటును ప్రస్తుత ప్రభుత్వం అడ్డుకుంటోందని పెద్దిరెడ్డి ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలోనే పరిశ్రమ కోసం సుమారు 800 ఎకరాల భూమిని కేటాయించామని, వైఎస్సార్సీపీ ప్రభు త్వం తిరిగి అధికారం లోకి రాగానే పుంగనూరులో చంద్రబాబు ప్రభుత్వం అడ్డుకున్న భారీ పరిశ్రమ ను తిరిగి తీసుకువస్తామని తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, ఎమ్మెల్సీ భరత్, మాజీ ఎంపీ రెడ్డెప్ప, మాజీ ఎమ్మెల్యేలు బియ్యపు మధుసూదన్‌రెడ్డి, వెంకటేగౌడ, సునీల్‌కుమార్, సమన్వయకర్తలు విజయానందరెడ్డి, చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, నూకతోటి రాజేష్‌తో పాటు వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి పాల్గొన్నారు. -
కదం తొక్కిన సచివాలయ ఉద్యోగులు
తిరుపతి తుడా: తిరుపతిలో సచివాలయ ఉద్యోగులు కదంతొక్కారు. భారీ ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. సచివాలయ ఉద్యోగులపై ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ ఆదివారం తిరుపతి పాత మున్సిపల్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగ సంఘాల నేతలు మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగులపై ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందన్నారు. న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించమని గళమెత్తితే పోలీసులను ఉసిగొల్పి లాఠీలతో కొట్టడం దారుణమన్నారు. చలో విజయవాడ కార్యక్రమానికి హాజరుకాకుండా పలు ప్రాంతాల్లో, బస్స్టేషన్లు, రైల్వేస్టేషన్లలో పోలీసులను మోహరించి అడ్డుకున్నారని మండిపడ్డారు. గత రెండేళ్ల నుంచి ఉద్యోగులు సమస్యలతో సతమతమవుతున్నారని, ప్రభుత్వం చొరవ తీసుకుని పరిష్కరించాలని సూచించారు. ఉద్యమం ఉధృతం సచివాలయ ఉద్యోగుల సమస్యలపై గత రెండేళ్లుగా ప్రభుత్వానికి విన్నవించినా పట్టించుకోలేదని పలువురు మండిపడ్డారు. తక్షణం జీవో నం.11ను రద్దు చేసి, పీఆర్సీ కమిషన్‌ను నియమించాలని, సెలవు రోజుల్లో పనిభారం తగ్గించాలని, డిప్యూటేషన్లను పూర్తిగా రద్దు చేయాలని, సచివాలయ ఉద్యోగులకు జూనియర్ అసిస్టెంట్ కేడర్‌గా గుర్తించాలని డిమాండ్ చేశారు. ప్రమోషన్ చానల్ ఇచ్చే క్రమంలో బేసిక్ పే రూ.30 వేలకు తగ్గకుండా చూడాలని కోరారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సచివాలయ ఉద్యోగ సంఘాల నేతలు పుండరీ కాంక్ష, జయపాల్ నాయక్, రజనీకుమారి, మస్తానప్ప, కరుణాకర్, అమరావతి, పలువురు సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. -
ఈఎస్ఆర్ వేధింపులు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా 72 ప్రభుత్వ శాఖలు ఉన్నాయి. ఇందులో 31,622 మంది వరకు అన్ని కేడర్లలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు విధు లు నిర్వహిస్తున్నారు. అధిక శాతం ఉపాధ్యాయులు 14,250 మంది వరకు ఉన్నారు. అధికారంలోకి వస్తే ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలను చిటికెలో పరిష్కరిస్తామని హామీలిచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు సరికొత్తగా ఈఎస్ఆర్ నిబంధనల పేరుతో నిలువునా కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. గతంలో ఇచ్చిన ఈఎస్ఆర్ డేటా ఏమైందో చెప్పకుండా మళ్లీ కొత్తగా వివరాలు నమోదు చేయాలంటూ ఉత్తర్వులు జారీచేసింది. జిల్లాలోని ఒక్కో ఉద్యోగి ఈఎస్ఆర్ డేటా నమోదుకు రెండు రోజుల సమయం పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాల కిందటి సర్వీస్ రికార్డులు దొరక్క ఉద్యోగ విరమణ అంచున ఉన్న సీనియర్లు అష్టకష్టాలు పడుతున్నారు. నెట్ సెంటర్లు చుట్టూ తిరుగుతూ రూ.వెయ్యి నుంచి రూ.2 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. పాత డేటాను అనుసంధానించే అవకాశం ఉన్నప్పటికీ ఉద్యోగులను వేధించడానికే సర్కారు ఈ పంతానికి పోతోందని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు పెదవి విరుస్తున్నారు. పదవీ విరమణ వేళ అష్టకష్టాలు కొత్త ఈఎస్‌ఆర్‌లో పెట్టిన అత్యంత క్లిష్టమైన, సంక్లిష్టమైన నిబంధనల వల్ల ఒక్కో ఉద్యోగి సమాచారం అప్లోడ్ చేయడానికి కనీసం రెండు రోజులు పడు తోంది. దశాబ్దాల కిందటి సర్వీసు పుస్తకాలు, అర్హత పత్రాలు, ప్రమోషన్లు, జీతాల స్కేలు వివరాలు వెతికి పట్టుకోవడం గగనంగా మారింది. ముఖ్యంగా పదవీ విరమణ అంచున ఉన్న సీనియర్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఈ సాంకేతిక మెలికల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతూ ఒత్తిడికి లోనవుతున్నారు. నెట్ సెంటర్ల దోపిడీ ఒకవైపు సర్వర్ల మొరాయింపు, సాంకేతిక లోపాలు చుట్టుముట్ట గా, మరోవైపు ఈ పరిస్థితిని ఆస రాగా చేసుకుని నెట్ సెంటర్లు దోచుకుంటున్నారు. రూ.1,000 నుంచి రూ.2,000 వరకు డిమాండ్ చేస్తున్నాయి. బోధన ను పక్కనబెట్టి రోజంతా ఇంటర్నెట్ సెంటర్ల చుట్టూ తిర గాల్సి వస్తోందని ఉపాధ్యాయులు, ఉద్యోగులు పెదవి విరుస్తున్నారు. ఉద్యోగులను అష్టకష్టాల పాలు చేయడానికే సర్కారు ఇలాంటి తుగ్లక్ నిర్ణయాలు అమలు చేస్తోందని, తక్షణమే ఈ వేధింపులను ఆపి, గడువు పెంపుతో పాటు పాత డేటాను పునరుద్ధరించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఈఎస్ఆర్ నమోదుపై పంపిన మెసేజ్లుకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉద్యోగులు, ఉపాధ్యాయులను ఏదో ఒకసాకుతో వేధింపులకు గురిచేస్తూనే ఉంది. తాజాగా ఈ సర్వీస్ రిజిస్టర్ (ఈఎస్ఆర్) పేరుతో ఇబ్బందులు పెడుతోంది. గతంలోనే రూ.వేలు వెచ్చించి, రాత్రింబవళ్లు శ్రమించి పూర్తి చేసిన ఈఎస్ఆర్ డేటాను బుట్టదాఖలు చేసి మళ్లీ ఇప్పుడు మొదటి నుంచి కొత్తగా వివరాలు నమోదు చేయాలంటూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ వ్యవహారం ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ఉద్యోగ, ఉపాధ్యాయులకు తీవ్ర ఒత్తిడికి లోను చేస్తోంది. ఈ నెలాఖరులోపు ప్రక్రియను ముగించాలంటూ సెల్ఫోన్లకు మెసేజ్‌లు పంపుతోంది. దీంతో ఉద్యోగ, ఉపాధ్యాయులు మానసిక ఆందోళనకు గురవుతున్నారు. జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల సమాచారం ఉపాధ్యాయులు 14,250 రెవెన్యూ, ఇతర శాఖల ఉద్యోగులు 8498పోలీసులు 1400 నాల్గవ తరగతి ఉద్యోగులు 3297సచివాలయ ఉద్యోగులు 4177 మొత్తం ఉద్యోగులు 31,622మెసేజ్‌లతో మానసిక వేధింపులు ఈ నెలాఖరుకు నూతన ఈఎస్ఆర్ ప్రక్రియను వంద శాతం పూర్తి చేయాలంటూ ఉన్నతాధికారులు నయానా భయానా హెచ్చరిస్తున్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఫోన్లకు రోజూ హెచ్చరిక మెసేజ్‌లు పంపుతూ తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నారు. గతంలో అప్లోడ్ చేసిన సర్వీసు వివరాలు, రికార్డులను గాల్లో కలిపేసి, ఇప్పుడు మళ్లీ మొదటి నుంచి ప్రక్రియ చేపట్టమనడం వెనుక ప్రభుత్వం పగబట్టినట్లు వ్యవహరిస్తోందని సంఘాలు ధ్వజమెత్తుతున్నాయి. -
అర్ధగిరిలో చిత్తూరు ఎకై ్సజ్ కోర్టు జడ్జి
తవణంపల్లె: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అర్ధగిరి శ్రీ వీరాంజనేయస్వామిని ఆదివారం చిత్తూరు ఎకై ్సజ్ కోర్టు న్యాయమూర్తి జి.కృష్ణ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. వారికి ఆలయ ట్రస్టు బోర్డు చైర్మన్ రఘుపతి ఆధ్వర్యంలో అర్చకులు స్వాగతం పలికారు. న్యాయమూర్తి స్వామికి అభిషేకం, అర్చనలు, పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం జడ్జిని స్వామి వారి ఆస్థాన మండపంలో ఆలయ ట్రస్టు బోర్డు చైర్మన్ రఘుపతి, అర్చకులు శేషవస్త్రాలతో సత్కరించారు. తీర్థప్రసాదాలు, సంజీవరాయ పుష్కరిని తీర్థం అందజేసి ఆశీర్వదించారు. రేపటి నుంచి ఉమ్మడి చిత్తూరు జిల్లా జట్ల ఎంపిక తిరుపతి ఎడ్యుకేషన్ : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) ఆధ్వర్యంలో వివిధ క్రీడల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లా జట్ల ఎంపిక పోటీలను మంగళవారం నుంచి నిర్వహించనున్నారు. ఆ మేరకు డీఈఓ కేవీఎన్.కుమార్, ఎస్జీఎఫ్ తిరుపతి జిల్లా కార్యదర్శులు ఎస్.సాంబశివరావు, అమ్ములు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఇందులో భాగంగా ఈ నెల 29న తిరుపతిలోని శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో అండర్–17, 19 విభాగాల్లో చెస్ పోటీలు, వడమాలపేట జెడ్పీ హైస్కూల్లో అండర్–17, 19 విభాగాల్లో వెయిట్ లిఫ్టింగ్, 30వ తేదీన అవిలాలలోని బాక్సింగ్ అకాడమీలో అండర్–14, 17, 19 విభాగాల్లో బాక్సింగ్, తిరుపతి ముత్యాలరెడ్డిపల్లి జెడ్పీ హైస్కూల్లో అండర్–14, 17, 19 విభాగాల్లో తైక్వాండో, అకార్డ్ పాఠశాలలో అండర్–14, 17 విభాగాల్లో టెన్నిస్, అక్టోబరు 1వ తేదీన శ్రీకాళహస్తిలోని జెడ్పీ హైస్కూల్లో అండర్–14, 17, 19 విభాగాల్లో టేబుల్ టెన్నిస్, 3వ తేదీన తిరుపతి మంగళం ట్రెండ్స్ జెడ్పీ హైస్కూల్లో అండర్–14, 19 విభాగాల్లో జూడో, బుచ్చినాయుడుకండ్రిగ జెడ్పీ హైస్కూల్లో అండర్–17 విభాగంలో రగ్బీ జిల్లా జట్లు ఎంపిక పోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు ఆయా తేదీల్లో నిర్వహించే ఎంపిక పోటీలకు స్టడీ సర్టిఫికెట్, ఆధార్ కార్డుతో హాజరుకావాలని తెలిపారు. పూర్తి వివరాలకు 63001 12569, 99893 20511 నంబర్లలో సంప్రదించాలని వారు కోరారు. నేడు చంద్రప్రభ వాహనం కాణిపాకం: ప్రత్యేక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని కాణిపాకంలోని వరసిద్ధి వినాయకస్వామి సోమవారం చంద్ర ప్రభ వాహనంపై విహరిస్తూ భక్తులను కటాక్షిస్తారని ఈవో పెంచల కిషోర్ తెలిపారు. ఉదయం అభిషేకం, రాత్రికి చంద్రప్రభ వాహన సేవ ఉంటుందన్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేసినట్టు పేర్కొన్నారు. -
కాపర్ వైర్ల దొంగల అరెస్టు
– మూడు బైక్‌లు, 280 కిలోల రాగి వైరు స్వాధీనం కుప్పం: గుడుపల్లె మండలం పొగరుపల్లి ఇండస్ట్రియల్ ఏబీఐఎస్ కంపెణీలో కాపర్ వైర్లను చోరీ చేసిన దొంగలను అరెస్టు చేసినట్టు కుప్పం ఏఎస్పీ హేమంత్ బోడ్డు తెలిపారు. ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ ఇండస్ట్రియల్ ప్రాంతంలో నూతనంగా నిర్మిస్తు న్నా ఫ్యాక్టరీల్లో కాపర్ వైర్లు చోరీకి గురైనట్టు ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. సీసీ పుటేజీలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితులకు పట్టుకున్నట్లు పేర్కొన్నారు. వారి నుంచి 280 కేజీల రాగి వైర్లు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపా రు. నిందితులు కర్ణాటక రాష్ట్రం బట్లహళ్లి గ్రామానికి చెందిన మధు, సంతోష్, మురుగన్, విజయ్‌గా గుర్తించామని తెలిపారు. కార్యక్రమంలో రూరల్ సీఐ మల్లేష్‌యాదవ్, గుడుపల్లె ఎస్ఐ శ్రీనివాసులు పాల్గొన్నారు. 1న ఎస్వీ పాలిటెక్నిక్ కళాశాలలో జాబ్‌మేళా తిరుపతి సిటీ: తిరుపతి ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో అక్టోబర్ ఒకటో తేదీన మెగా జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాసులు తెలిపారు. కళాశాలలో 2023 నుంచి 2026 లోపు డిప్లొమాలో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ జాబ్‌మేళాలో పాల్గొనవచ్చని తెలిపారు. జాబ్‌మేళాకు శ్రీసిటీ సహా 6 ఎంఎన్సీ కంపెనీల ప్రతినిధులు హాజరై సుమారు 300 రకాల ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. మరిన్ని వివరాలకు 6303578886లో సంప్రదించాలని సూచించారు. నేటి నుంచి మూడు రోజులు బ్యాంకుల బంద్ కాణిపాకం : వారానికి ఐదు రోజుల పనిదినాలు ప్రకటించాలనే ప్రధాన డిమాండ్‌తో పాటు సమస్యల పరిష్కారం కోసం బ్యాంకు ఉద్యోగులు, అధికారులు సమర శంఖం పూరించారు. సోమ, మంగళ, బుధవారాల్లో సమ్మె చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో బ్యాంకింగ్ సేవలు స్తంభించిపోయే ప్రమాదం ఏర్పడింది. వారం రోజుల పనిదినాలను 5 రోజులకు కుదించి, శనివారాన్ని కూడా సెలవు దినంగా ప్రకటించాలని బ్యాంకర్లు గత 10 నుంచి 12 ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు. పెరుగుతున్న పని ఒత్తిడిని తగ్గించాలని, పీఎల్ఐ తదితర బకాయిలు చెల్లించాలని కోరుతూ సమ్మెకు యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్ పిలుపునిచ్చింది. జిల్లా వ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు సమ్మె ప్రభావంతో జిల్లా పరిధిలో ఉన్న వివిధ బ్యాంకులకు చెందిన దాదాపు 250 శాఖలు మూతపడనున్నాయి. బ్యాంకు ఆఫీసర్లు, క్లర్కులు, ఇతర సిబ్బంది కలిపి సుమారు 400 నుంచి 500 మంది విధులకు దూరంగా ఉండి నిరసనలో పాల్గొంటున్నారు. మూడు రోజులు బ్యాంకు లావాదేవీలు నిలిచిపోనుండడంతో జిల్లాలోని వ్యాపారులు, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం, యాజమాన్యాలు నెరవేర్చే వరకు పోరాటం ఆపేది లేదని ఉద్యోగ సంఘాల నాయకులు తేల్చిచెప్పారు. ఈ–బస్ డిపో పరిశీలన తిరుపతి అన్నమయ్య సర్కిల్: తిరుపతి మంగళం ఆర్టీసీ డిపోను ఆదివారం జోన్–4 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్.ఆర్.కె.కిషోర్ సందర్శించారు. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పనుల పురోగతిని పరిశీలించారు. పనులు నిర్ణీత గడువులోగా పూర్తి చేయా లని అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. కార్యక్రమంలో డిప్యూటీ సీటీఎం విశ్వనాథ్, డిప్యూటీ సీఎంఈ బాలాజీ, డిప్యూటీ చీఫ్ డిపో మేనేజర్ బి.నిర్మల, ఏఈ (సివిల్) ప్రతాప్, ఏఈ (ఎలక్ట్రికల్) హరి పాల్గొన్నారు. ఇంట్లో అగ్నిప్రమాదం : వ్యక్తి మృతి తిరుపతి క్రైం : కొర్లగుంట అశోక్‌నగర్‌లోని ఓ ఇంట్లో శనివారం తెల్లవారు జామున అగ్నిప్రమాదం చోటుచేసుకుని ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల వివరాల మేరకు.. శ్రీకాళహస్తి పట్టణం, కొండమిట్టకు చెందిన మర్రి హరికృష్ణ (54) తిరుపతిలో ఉంటూ శ్రీచక్ర ఆస్పత్రిలో పనిచేస్తున్నాడు. ఆదివారం తెల్లవారుజామున హరికృష్ణ ఉంటున్న ఇంటి నుంచి పొగలు రావడాన్ని స్థానికులు గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అనంతరం ఇంట్లో పరిశీలించగా హరికృష్ణ మృతి చెంది కనిపించాడు. -
సివిల్ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి
చిత్తూరు రూరల్ (కాణిపాకం): సివిల్ కేసుల సత్వర పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణసారిక స్పష్టం చేశారు. శనివారం న్యాయమూర్తులకు జిల్లా కోర్టు భవన సముదాయంలో వర్క్‌షాప్ నిర్వహించారు. వారు మాట్లాడుతూ సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాల ప్రకారం కేసుల విచారణ చేపట్టాలన్నారు. సివిల్ కేసులు, డిక్రీలు, ఎగ్జిక్యూషన్ పిటిషన్లు తదితర అంశాలను హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తులు జస్టిస్ జి.వి. సీతాపతి, జస్టిస్ ఎం.సీతారామమూర్తి వివరించారు.మొదటి, అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి కె.శ్రీనివాసరావు, నాలుగో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి అర్చన, ఆరో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి టి.హరిత, రెండో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి సూర్యనారాయణమూర్తి, మూడో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి గురునాథ్, ఏడో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి శ్రీలత, తొమ్మిదో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి ఎన్.శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
కనులపండువగా విమానోత్సవం
కాణిపాకం: కాణిపాక శ్రీవరసిద్ధి వినాయకస్వామివారి ప్రత్యేక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. శనివారం అందులో భాగంగా సిద్ధి, బుద్ధి సమేత వినాయకస్వామివారి విమాన వాహన సేవను కనులపండువగా జరిపించారు. ఈ సందర్భంగా వేకువజామునే మూలవిరాట్‌కు ప్రత్యేక అభిషేకం, అలంకరణ చేశారు. భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. రాత్రి అలంకార మండపంలో ఉత్సవమూర్తికి క్షీరాభిషేకం చేపట్టారు. ప్రత్యేక పూజల అనంతరం పట్టుపీతాంబరాలు, పుష్పమాలికలు, ఆభరణాలతో అలంకరించారు. ఈ క్రమంలోనే ఊరేగింపుగా విమాన వాహనంపై కొలువుదీర్చారు. మంగళవాయిద్యాలు, మేళతాళలు, కోలాటాలు, భజనబృందాల ప్రదర్శనలతో విమాన వాహన సేవ నిర్వహించారు. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నేడు సూర్యప్రభ వాహన సేవ ప్రత్యేక బ్రహ్మోత్సవాల్లో భాగంగా కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామికి ఆదివారం సూర్యప్రభ వాహన సేవ నిర్వహించనున్నట్లు ఆలయ యో పెంచల కిషోర్ తెలిపారు. ఉదయం విశేష అభిషేకం, రాత్రి సూర్యప్రభ వాహనసేవ ఉంటుందని వివరించారు. -
జాతీయ స్థాయి పోటీలకు జిల్లా క్రీడాకారులు
చిత్తూరు కలెక్టరేట్: విజయవాడ వేదికగా త్వరలో నిర్వహించనున్న 51వ జాతీయ మినీ బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్‌కు రాష్ట్ర జట్టు తరఫున చిత్తూరు జిల్లాకు చెందిన ఐదుగురు క్రీడాకారులు ఎంపికయ్యారు. శనివారం ఈ మేరకు జిల్లా బాస్కెట్‌బాల్ సంఘం అధ్యక్షుడు టి. చెంగల్రాయ నాయుడు, కార్యదర్శి జి. సురేష్ బాబు, ఎన్పీ జయప్రకాష్ ఎంపికై న క్రీడాకారులను అభినందించారు. వారు మాట్లాడుతూ బాలికల విభాగంలో హర్షిత, మనస్విని, సోనాల్, బాలుర విభాగంలో నాగసూర్య జాతీయ పోటీలకు ఎంపికై నట్లు తెలిపారు. ఇటీవల నిర్వహించిన రాష్ట్ర స్థాయి శిక్షణ శిబిరంలో చూపిన అత్యుత్తమ ప్రతిభ ఆధారంగా వీరు జాతీయ జట్టుకు ఎంపికయ్యారని చెప్పారు. గతంలోనూ చిత్తూరు జిల్లా జట్లు రాష్ట్ర స్థాయిలో విజేతలుగా నిలిచి సత్తా చాటాయన్నారు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై న క్రీడాకారులను కోచ్‌లు ఉదయభాస్కర్, బాబు, భాను, సంగీత, నటరాజ్ ప్రత్యేకంగా అభినందించారు. జాతీయ పోటీల్లోనూ రాణించి రాష్ట్రానికి, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఎంపికై న క్రీడాకారులు -
మార్ఫింగ్ వీడియోపై మండిపాటు
నగరి : మాజీ మంత్రి ఆర్కే రోజాకు సంబంధించిన వీడియోను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్న వారిపై వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 24న తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లిన రోజా ఆలయం వెలుపలికి వస్తున్న సమయంలో మీడియా చిత్రీకరించిన వీడియోలను కొందరు వ్యక్తులు ఏఐ సాంకేతికతతో మార్పులు చేసి, ఆమె గుండు కొట్టించుకున్నట్లు కనిపించే విధంగా తప్పుడు వీడియోలను రూపొందించి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. శనివారం నగరికి చెందిన నేతలు ఈ మేరకు సీఐ మల్లికార్జునరావు, నిండ్ర మండల నేతలు ఎస్ఐ మల్లికార్జునకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్, ట్విట్టర్, యూట్యూబ్, వాట్సాప్ తదితర సామాజిక మాధ్యమాల్లో మార్ఫింగ్ వీడియోలు పోస్టులు, రీల్స్, షేర్లు, ఫార్వర్డ్ రూపంలో ప్రచారం అవుతున్నాయని పేర్కొన్నారు. దీనిపై సాంకేతిక ఆధారాలతో సమగ్ర దర్యాప్తు జరిపి, వీడియోను రూపొందించిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మార్ఫింగ్ వీడియోలను ఎవరు మొదట రూపొందించారు, ఏ ఖాతా నుంచి తొలిసారిగా సోషల్ మీడియాలోకి తీసుకువచ్చారు, అనంతరం ఎవరెవరు షేర్, రీపోస్ట్, ఫార్వర్డ్ చేశారనే అంశాలను సాంకేతికంగా గుర్తించాలని పోలీసులను కోరారు. వీడియోలను తయారు చేయడం, ప్రచారం చేయడం లేదా ఉద్దేశపూర్వకంగా వైరల్ చేయడంలో ఎవరెవరి ప్రమేయం ఉందో తేల్చాలని కోరారు. అత్యంత అభ్యంతరకరం ఫిర్యాదు చేసిన అనంతరం పార్టీ నేతలు మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి రోజాను వాస్తవానికి భిన్నంగా చిత్రీకరించి ప్రజల్లో తప్పుడు భావన కలిగించేలా వీడియోలను ప్రచారం చేయడం అత్యంత అభ్యంతరకరమని స్పష్టం చేశారు. సాధారణ రాజకీయ విమర్శలకు, వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేలా డిజిటల్ మార్పులతో తప్పుడు వీడియోలు సృష్టించి ప్రచారం చేయడానికి తేడా ఉందని తెలిపారు. రాజకీయ విభేదాలతో ఒక మహిళా నాయకురాలి వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించేలా తప్పుడు కంటెంట్‌ను సృష్టించడం సమర్థనీయం కాదన్నారు. వీడియోల వెనుక టీడీపీకి అనుబంధంగా పనిచేస్తున్న కొంతమంది సోషల్ మీడియా కార్యకర్తలు, వ్యక్తుల పాత్రపై కూడా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్దేశపూర్వకంగా వైరల్ చేసినా ఆధారాల మేరకు ఇన్ఫర్మేమేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000తో పాటు దర్యాప్తులో వర్తించే ఇతర చట్టాల కింద కేసు నమోదు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నగరి పట్టణ, రూరల్ అధ్యక్షులు రమేష్‌రెడ్డి, తిరుమల రెడ్డి, నేతలు కన్నాయిరం, గోపాల్‌రెడ్డి, ఇంద్రారెడ్డి, మునివేలు, మురుగ, కృష్ణమూర్తి, ఆనందకుమార్, సలీం, యాకోబు, కన్నియప్ప, నాగభూషణం, వెంకటేశ్, రాజముత్తు, హరి, అముద, సంధ్యారాణి, శశికళ, పాండియన్, మేషాక్, భాస్కర్, రమేష్, పార్టీ నిండ్ర మండల కన్వీనర్ వేణురాజు, మాజీ ఎంపీపీ దీప, నేతలు అనిల్, విజేష్, మేరీ, రామచంద్రారెడ్డి, నవీన్, చెంచమ్మ పాల్గొన్నారు.వడమాలపేటలో.. తప్పుడు పోస్టులపై ఫిర్యాదుపుత్తూరు: మాజీ మంత్రి ఆర్కే రోజాపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టిన టీడీపీ అనుబంధ సంస్థలకు చెందిన వ్యక్తులను అరెస్ట్ చేయాలని కోరుతూ వైఎస్సార్సీపీ పుత్తూరు నేతలు ఎస్ఐ వెంకటలక్ష్మీకి ఫిర్యాదు చేశారు. మార్ఫింగ్ వీడియోలను ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్, ఎక్స్, యూట్యూబ్, వాట్సాప్ తదితర సోషల్ మీడియాల్లో పోస్టులు పెట్టి మాజీ మంత్రి వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారని ఆరోపించారు. దీనిపై సాంకేతిక ఆధారాలతో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. మున్సిపల్ మాజీ చైర్మన్ హరి, మాజీ వైస్ చైర్మన్లు శంకర్, జయప్రకాష్, పార్టీ పుత్తూరు పట్టణ, రూరల్ అధ్యక్షులు ఏకాంబరం, భాస్కర్‌యాదవ్, నేతలు దిలీప్‌కుమార్, గోవిందస్వామిరెడ్డి, చక్రపాణి, బాలసుబ్రమణ్యం, ప్రతాప్, శివ, రాంబత్తయ్య, బాబు, దాసు, రవి తదితరులు పాల్గొన్నారు. వడమాలపేటలో.. మాజీ మంత్రి ఆర్కే రోజాపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శనివారం వడమాలపేట ఎస్ఐ హరీష్‌కు వైఎస్సార్సీపీ స్థానిక నేతలు ఫిర్యాదు చేశారు. సుబ్రమణ్యంరెడ్డి, సురేష్‌రాజు, మధన్‌మోహన్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి, గాంధీ, చంద్రరెడ్డి, ప్రతిమ, మంజులారెడ్డి, ఉమాపతి, భరత్, చంద్ర, పవన్, రాజేంద్రయ్య, కమలమ్మ, బత్తయ్య, బుచ్చిరెడ్డి, ధర్మయ్య పాల్గొన్నారు. -
వైభవంగా పౌర్ణమి గరుడసేవ
తిరుమల: తిరుమలలో శనివారం రాత్రి పౌర్ణమి గరుడసేవ అత్యంత వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. వాహన సేవలో తిరుమల పెద్ద జీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్యచౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నిర్బంధం తిరుపతి అర్బన్ : సచివాలయ ఉద్యోగులు చలో విజయవాడకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పలువురు ఉద్యోగులు శనివారం సాయంత్రం బయల్దేరి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ప్రభుత్వ ఆదేశాలతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఆరో వార్డు సంక్షేమ కార్యదర్శి అమరావతి, 25వ వార్డు సంక్షేమ కార్యదర్శి రజినీకుమారిని అక్రమంగా అరెస్ట్ చేసి ఈస్ట్‌పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. దీనిపై ఉద్యోగ సంఘాలు మండిపడ్డాయి. శ్రీవారి దర్శనానికి 20 గంటలు తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ శిలాతోరణం వద్దకు చేరుకుంది. శుక్రవారం అర్ధరాత్రి వరకు 66,014 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 31,092 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుక ల రూపంలో హుండీలో రూ.4.44 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కె ట్లులేని వారు స్వామిని దర్శించుకోవడానికి 20 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్ర మే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలో కి అనుమతించరని స్పష్టంచేసింది. పవిత్రం.. పరిసమాప్తం చంద్రగిరి:తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మ వారి ఆలయంలో మూడు రోజులుగా నిర్వహించిన పవిత్రోత్సవాలు శనివారం మహాపూర్ణాహుతి తో వైభవంగా ముగిశాయి. చివరి రోజైన శనివా రం ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఆగమోక్తంగా నిర్వహించారు. ఉదయం 10.40 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మహాపూర్ణాహుతి, శాంతి హోమం, కుంభప్రోక్షణ, నివేదన తదితర కార్యక్రమాలు నిర్వహించారు. మ ధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు శ్రీకృష్ణ స్వామి ముఖ మండపంలో శ్రీపద్మావతి అమ్మవారితో పాటు శ్రీకృష్ణస్వామివారు, శ్రీసుందరరాజ స్వామి వారు, శ్రీసుదర్శన చక్రత్తాళ్వార్‌కు స్నపనతిరుమంజనం నిర్వహించారు. అనంతరం శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్‌ను పల్లకీపై మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా పద్మపుష్కరిణి వద్దకు తీసుకెళ్లి చక్రస్నానం నిర్వహించారు. వైభవోత్సవం సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు శ్రీకృష్ణస్వామివారు, శ్రీసుందరరాజస్వామివారు, పద్మా వతి అమ్మవారు మాడ వీధుల్లో విహరించారు. టీటీడీ ఈఓ రవిచంద్ర, జేఈఓ శరత్, సీవీఎస్వో మురళీకృష్ణ, ఎస్పీ సుబ్బరాయుడు, డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్ పాల్గొన్నారు. -
లక్షల ఓట్లు.. ఔట్!
జిల్లాలో 1.36 లక్షల ఓటర్ల వివరాలు తొలగింపు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఇప్పుడు మళ్లీ చర్చనీయాంశంగా మారింది. కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌పై ఆరోపణల నేపథ్యంలో సర్ ప్రక్రియలో పారదర్శకతపై అందరిలో అనుమానం వ్యక్తమవుతోంది. జిల్లాలో ఇప్పటికే ప్రచురించిన జాబితాలో ఏకంగా 1.36 లక్షల ఓట్లు తొలగించడంలో ఆంత్యమేంటనే ప్రశ్న తలెత్తుతోంది. సాక్షి, చిత్తూరు: సర్ ప్రక్రియలో భాగంగా తొలి జాబితా ప్రచురణ సమయంలో జిల్లా నుంచి 1,36,059 ఓట్లను అధికారులు తొలగించారు. ఈ సంఖ్య అసాధారణంగా కనిపిస్తోంది. దీనికి అధికారులు చెబుతున్న కారణాలు చనిపోయిన ఓటర్లు 42,337, ట్రేస్ కాని ఓటర్లు 18,622, వసల వెళ్లిపోయిన వాళ్లు 55,773, డబుల్ ఎంట్రీ 19,301, ఇతర కారణాలు 26 మంది ఓటర్లుగా చూపించారు. ఇందులో చనిపోయిన ఓటర్ల సంఖ్య తప్ప మిగిలినవన్నీ ‘సర్’ పేరిట అక్రమంగా తొలగించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక మ్యాపింగ్ కాకపోవడం, పేర్లలో వ్యత్యాసం, అక్షర దోషాలు ఉన్నాయనే కారణాలతో జిల్లాలో ఏకంగా 1,34,307 మందికి నోటీసులు ఇవ్వడం కూడా సంచలనమే. అయితే ఇందులో ఇప్పటి వరకు 1,31,472 మంది క్లైయిమ్స్ను అధికారులు అంగీకరించారు. వీరందరికీ ఓటు హక్కును పునరుద్దరించారు. దాదాపు 2500 మంది ఓటర్లు అనర్హులుగా తేల్చడంతో.. తొలగింపు ఓట్లు 1.40 లక్షలకు చేరుకోనుంది. తప్పటడుగు అక్కడే.. 2002 ఓటర్ల జాబితాలో ఉన్న వివరాలను ఇప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని చెప్పిన సీఈసీ తొలి తప్పటడుగు అక్కడే వేసింది. జిల్లాలో చాలా మంది ఓట్లు అసలు 2002 జాబితాలో మ్యాపింగ్ కాలేదు. 24 ఏళ్ల తర్వాత ఇపుడు మ్యాపింగ్‌కు వెళితే చాలా మంది ఓటర్ల వివరాలు 2002లో అసలు కనిపించలేదు. పైగా కుటుంబ సభ్యుల మ్యాపింగ్ ఏమాత్రం కుదరలేదు.‘సర్’ ప్రక్రియలో ఏకంగా తమ అభ్యంతరాలనే సీఈసీ 14 సార్లు పట్టించుకోలేదని తోటి కమిషనర్లు సీఈసీపై ఆరోపణలు చేశారు.. జిల్లాలో ప్రతిపక్ష నేతలు ఇచ్చిన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా అసలు సర్ ప్రక్రియ సజావుగా సాగిందా..? లేదా..? అనే అనుమానం సామాన్యుల్లో సైతం వ్యక్తమవుతోంది. అసలు 2002లో సరైన ఓటర్ల జాబితా ఎందుకు రూపొందించలేదని ఓటర్లు బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. తుది జాబితాపై కసరత్తు షెడ్యుల్ ప్రకారం మ్యాపింగ్ కాని, సవరణ చేయాల్సిన ఓటర్ల తుది జాబితాను అక్టోబర్ 9వ తేదీన ప్రచురించాల్సి ఉంది. ఇందుకోసం అధికార యంత్రాంగం ఇప్పటికే కసరత్తు చేస్తోంది. సీఈసీ ఎదుర్కొంటున్న ఆరోపణలు ఓవైపు, నిజమైన ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయారనే విమర్శల నడుమ అధికారులు తుది జాబితా ప్రచురణకు సిద్ధమవుతున్నారు. ఇదే సమయంలో ఓటర్ల జాబితాలో పేర్లు లేని ఓటర్ల నుంచి కొత్తగా దరఖాస్తు తీసుకుని, జాబితాలో పేరును చేరుస్తామని చెప్పడం ఎంత వరకు కార్యరూపం దాలుస్తుందో వేచి చూడాల్సి ఉంది. జిల్లాలో నియోజకవర్గ వారీగా తొలగించిన ఓట్ల సంఖ్య పలమనేరు 29,381 చిత్తూరు 26,436 కుప్పం 24,418 నగరి 20,879 పూతలపట్టు 20,321 జీడీ నెల్లూరు 14,624 మొత్తం 1,36,059నమ్మశక్యంగా లేదు సార్వత్రిక ఎన్నికల సమయంలో చీకటి పడిన తర్వాత భారీగా ఓట్లు పోలవడంపై మేము అడిగిన ప్రశ్నలకు ఎన్నికల సంఘం ఎలాంటి సమాధనం చెప్పలేదు. ఇప్పుడు ‘సర్’ ప్రక్రియలో తోటి కేంద్ర ఎన్నికల కమిషనర్లు చెప్పిన అభ్యంతరాలనే సీఈసీ పట్టించుకోలేదనే ఆరోపణలు వెల్లువెత్తుతుండడం మా అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది. జిల్లాలో ఏకంగా 1.36 లక్షలకు పైగా ఓట్లు తొలగించడం అంటే నమ్మశక్యంగా లేదు. దీనిపై ఎన్నికల సంఘం, జిల్లా యంత్రాంగం సమాధానం చెప్పి తీరాల్సిందే. – భూమన కరుణాకరరెడ్డి, వైఎస్సార్సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు -
ఫార్మసిస్టుల పాత్ర కీలకం
చిత్తూరు రూరల్ (కాణిపాకం): వైద్యరంగంలో ఫార్మసిస్టుల పాత్ర అత్యంత కీలకమని డీఎంహెచ్ఓ నాగశశి భూషణ్ రెడ్డి తెలిపారు. ప్రపంచ ఫార్మసీ దినోత్సవం సందర్భంగా శనివారం చిత్తూరు గనరం నగరంలోని ఎన్జీఓ హోమ్‌లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. డీఎంహెచ్ఓ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రోగులకు మందులను ఏ మోతాదులో, ఎలా వాడాలనే దానిపై కౌన్సెలింగ్ ఇస్తూ ఫార్మసిస్టులు గొప్ప సామాజిక సేవ అందిస్తున్నారన్నారు. అనంతరం జిల్లాలో విశిష్ట సేవలు అందించిన ఉత్తమ ఫార్మసిస్టులను ఘనంగా సన్మానించారు. ఈ క్రమంలోనే ఏపీ ఫార్మసిస్ట్ అసోసియేషన్ జిల్లా శాఖ కొత్త ఎగ్జిక్యూటివ్ కమిటీకి ఏడుగురు సభ్యులను నూతనంగా ఎన్నుకున్నారు. జాతీయ స్థాయి పోటీలకు వెదురుకుప్పం విద్యార్థి వెదురుకుప్పం : జాతీయ స్థాయి సబ్ జూనియర్ సాఫ్ట్ బాల్ పోటీలకు వెదురుకుప్పం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థి చిన్మయ సాయి ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయడు శివశంకరయ్య తెలిపారు. శనివారం పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో హెచ్ఎం మాట్లాడుతూ మహారాష్ట్రలోని సి. శంభాజీనగర్‌లో ఆదివారం నుంచి 30 వరకు నిర్వహించనున్న జాతీయ స్థాయి సబ్ జూనియర్ పోటీల్లో పాల్గొనే రాష్ట్ర జట్టుకి చిన్మయ సాయి ఎంపికై నట్లు వెల్లడించారు. అనంతరం పుత్తూరు డీవైఈఓ మహేశ్వరరావు మాట్లాడుతూ జాతీయ స్థాయి క్రీడల్లో చిన్మయ సాయి అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించి పాఠశాలకు కీర్తిప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. జాతీయ స్థాయిలో ఎంపికయ్యేలా శిక్షణ ఇచ్చిన వ్యాయామ ఉపాధ్యాయుడు రమేష్‌ను అభినందించారు. అనంతరం విద్యార్థి చిన్మయ సాయి, ఉపాధ్యాయుడు రమేష్‌ను ఘనంగా సత్కరించారు. -
దివ్యాంగుల హక్కుల రక్షణకు కృషి
చిత్తూరు కలెక్టరేట్ : దివ్యాంగుల హక్కుల పరిరక్షణకు కృషి చేస్తానని నూతనంగా ఎన్నికై న పర్సన్ విత్ డిజేబుల్డ్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు లోకనాథం తెలిపారు. శనివారం నగరంలోని తపోవనం పాఠశాలలో సంఘం నూతన కమిటీ ఎన్నికలు నిర్వహించారు.సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండమరి సుబ్రమణ్యం అధ్యక్షతన ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా పి.లోకనాథం జిల్లా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా సుబ్రమణ్యం, ఉపాధ్యక్షుడిగా వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శిగా పెరుమాళ్, జాయింట్ సెక్రటరీగా రవి, కోశాధికారిగా వేలు, అధికార ప్రతినిధిగా శేఖర్ నాయుడు, కార్యవర్గ సభ్యుడిగా చంద్రమోహన్న్ ఎన్నికయ్యారు. అలాగే జిల్లాలోని వివిధ నియోజకవర్గాల బాధ్యులను ప్రకటించారు. పుంగనూరు బాధ్యుడిగా వెంకటరమణ, నగరికి మాతయ్య, పలమనేరుకు చంద్రమౌళి, కుప్పానికి నారాయణప్ప, పూతలపట్టుకి బాలయ్య, చిత్తూరు నియోజకవర్గ బాధ్యుడిగా సురేష్ నాయుడును ఎన్నుకున్నారు. సదరం వెరిఫికేషన్‌లో పారదర్శకత అవసరం సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండమరి సుబ్రమణ్యం మాట్లాడుతూ సదరం సర్టిఫికెట్ల వైకల్య శాతం పునఃపరిశీలన (వెరిఫికేషన్) ప్రక్రియపై ప్రభుత్వం పారదర్శకత పాటించాలని డిమాండ్ చేశారు. అర్హులైన దివ్యాంగులు ఇబ్బంది పడకుండా చర్యలు చేపట్టాలని కోరారు. దివ్యాంగులకు ఉచిత విద్య, వైద్యంతో పాటు నివాస గృహాలు మంజూరు చేయాలని సూచించారు. దివ్యాంగుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని స్పష్టం చేశారు.కార్యక్రమంలో సంఘం రాష్ట్ర సలహాదారు సుబ్రమణ్యం, కార్యవర్గ సభ్యులు ఫక్రుద్దీన్, సుగుణమ్మ పాల్గొన్నారు. -
వరసిద్ధునికి వెండి పుష్పమాల సమర్పణ
కాణిపాకం: కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామివారికి శనివారం పలువురు భక్తులు భారీ విరాళాలు సమర్పించారు. బాపట్ల జిల్లా కారంచేడుకు చెందిన మల్లయ్య, రాజ్యలక్ష్మి దంపతులు రూ.2.50 లక్షల విలువైన, సుమారు 1 కిలో బరు వు కలిగిన వెండి పుష్పమాలను బహూకరించారు. అలాగే నిత్య అన్నదాన ట్రస్టుకు రూ. ఒక లక్ష విరాళంగా అందజేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన సోమసత్య శ్రీనివాసరావు తమ కుటుంబ సభ్యులతో కలసి స్వామివారి నిత్య అన్నదాన పథకానికి రూ. ఒక లక్ష విరాళాన్ని ఆల య అధికారులకు అందించారు. దాతలకు ఆల య అధికారులు ప్రత్యేకంగా స్వామివారి దర్శనం కల్పించారు. తీర్థప్రసాదాలు అందజేశారు. సర్ సిబ్బందికి జీతాలు మంజూరు చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో సర్ కార్యక్రమంలో విధులు నిర్వహించిన సిబ్బందికి వార్షిక జీతాలు మంజూరు చేశారు. శనివారం ఈ మేరకు ఎన్నికల సంఘం సీఈఓ వివేక్ యాదవ్ ఉత్తర్వులు జారీచేశారు. ఈఆర్ఓలకు రూ.30 వేలు, అదనపు ఈఆర్ఓలకు రూ.25 వేలు మంజూరు చేశారు. జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి ఒక ఈఆర్ఓ, 80 మంది ఏఈఆర్ఓలు, 1,708 మంది బీఎల్ఓలు, 176 మంది సూపర్ వైజర్లు ఉన్నారు. బీఎల్ఓ, సూపర్వైజర్లకు రూ.6 వేల చొప్పున మంజూరు చేశారు. నేడు బధిరుల దినోత్సవం చిత్తూరు కలెక్టరేట్: అంతర్జాతీయ బధిరుల దినోత్సవాన్ని ఆదివారం నిర్వహించనున్నట్లు విభిన్న ప్రతిభావంతులశాఖ ఏడీ పుల్లారెడ్డి తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ ఉదయం 10 గంటలకు జెడ్పీ సమావేశ మందిరంలో కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. జిల్లాలోని బధిరుల సంఘాల ప్రతినిధులు, బధిర ప్రభుత్వ ఉద్యోగులు హాజరుకావాలని కోరారు. -
ప్రజాసేవే పరమావధిగా విధులు
చిత్తూరు రూరల్ (కాణిపాకం): పోలీసులు ప్రజాసేవే పరమావధిగా విధులు నిర్వర్తించాలని, పోలీసు యూనిఫామ్ కేవలం ఒక గుర్తింపు మాత్రమే కాదని, మహత్తర బాధ్యతకు ప్రతీకని రవాణా, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. శనివారం చిత్తూరు నగరంలోని జిల్లా పోలీసు శిక్షణ కేంద్రం మైదానంలో 9 నెలల ప్రాథమిక శిక్షణ పూర్తి చేసుకున్న 142 మంది ట్రైనీ కానిస్టేబుళ్ల దీక్షాంత్ పరేడ్ నిర్వహించారు. మంత్రి రాంప్రసాద్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. మంత్రి మాట్లాడుతూ పోలీసు స్టేషన్‌కు వచ్చే బాధితులను గౌరవిస్తూ, మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. పెరుగుతున్న సైబర్ నేరాలు, డ్రగ్స్ రవాణాను అరికట్టేందుకు కృషి చేయాలన్నారు. కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ తుషార్ డూడీ మాట్లాడుతూ క్రమశిక్షణతో పనిచేస్తూ, ప్రజలకు ఆపద వచ్చినప్పుడు భరోసానిచ్చేలా పోలీసు శాఖ ప్రతిష్టను పెంచాలని పిలుపునిచ్చారు. అనంతరం శిక్షణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన చీకటి మూర్తి (బెస్ట్ ఆల్‌రౌండర్– అవుట్డోర్), వెంకటేష్ (ఇండోర్), వినయ్ (ఫైరింగ్), 5వ స్క్వాడ్ (బెస్ట్ స్క్వాడ్)కు మంత్రి, అధికారులు మెమెంటోలు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గురజాల జగన్ మోహన్, మురళీమోహన్ పాల్గొన్నారు. -
వంద శాతం ఉత్తీర్ణతే లక్ష్యం
చిత్తూరు కలెక్టరేట్ : పాఠశాలల్లో విద్యార్థులకు పాఠాలు సరిగ్గా చెప్పకుండా అలసత్వం వహిస్తే చర్యలు కఠినంగా ఉంటాయని డీఈఓ లక్ష్మీనారాయణ హెచ్చరించారు. శనివారం ఆయన సాక్షి నిర్వహించిన ఇంటర్వ్యూలో పలు అంశాలు వెల్లడించారు. ఇటీవల చిత్తూరులోని గిరింపేట, సంతపేట నగరపాలక హైస్కూళ్లలో ఆకస్మికంగా తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. 2027 మార్చిలో నిర్వహించనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నట్లు డీఈఓ వివరించారు. సాక్షి: ఇటీవల మీ ఆకస్మిక తనిఖీల్లో గమనించిన ప్రధాన అంశాలేమిటి? ఉపాధ్యాయుల పనితీరుపై మీ అభిప్రాయం? డీఈఓ:కొన్ని పాఠశాలల్లో తరగతి గదిలో విద్యార్థులు ఉన్నప్పటికీ నాన్ లాంగ్వేజ్ టీచర్లు పాఠాలు చెప్ప కుండా స్టాఫ్ రూమ్‌లో ఖాళీగా కూర్చోవడం గమనించాం. ఇది అత్యంత బాధాకరం. ఇలాంటి వారిని ఉపేక్షించేది లేదు, శాఖాపరమైన చర్యలు తప్పవు. సాక్షి: పదో తరగతి పబ్లిక్ పరీక్షలు దగ్గరపడుతున్నాయి, ఉత్తీర్ణత శాతం పెంచేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? డీఈఓ: 2027 మార్చి పబ్లిక్ పరీక్షలను దృష్టిలో పెట్టుకుని ’మిషన్ మార్చ్ 2027’ పేరుతో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాం. జిల్లాలోని 341 ప్రభుత్వ యాజమాన్య ఉన్నత పాఠశాలల్లో మొత్తం 13,989 మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. వీరి అభ్యసన సామర్థ్యాల ఆధారంగా గ్రేడ్లుగా విభజించి, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి శిక్షణ ఇస్తున్నాం. సాక్షి: రాబోయే రోజుల్లో పాఠశాలల పర్యవేక్షణ, సమీక్షలు ఏ విధంగా ఉండబోతున్నాయి? డీఈఓ: త్వరలోనే కలెక్టర్ అధ్యక్షతన హెచ్ఎంలతో జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తాం. నియోజకవర్గ, మండల, పాఠశాల స్థాయిల్లో సబ్జెక్టుల వారీగా విద్యార్థుల మార్కులను విశ్లేషిస్తాం. ముఖ్యంగా గత పరీక్షల్లో తక్కువ ఉత్తీర్ణత సాధించిన 75 పాఠశాలలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాం. సాక్షి: విద్యాబోధన నాణ్యతను పెంచేందుకు ఉపాధ్యాయులకు మీరు ఇచ్చే సూచనలు ఏంటి? డీఈఓ: ఏదో పాఠం చెప్పామా, వెళ్లామా అన్నట్టు కాకుండా, ప్రతి ఉపాధ్యాయుడు తప్పనిసరిగా లెసన్ ప్లాన్ సిద్ధం చేసుకునే బోధించాలి. పరీక్షల్లో విద్యార్థులు ఎందుకు తక్కువ మార్కులు సాధిస్తున్నారో బాధ్యత తీసుకుని వివరణ ఇవ్వాలి. నిరంతరం క్షేత్రస్థాయి తనిఖీలు చేపడతాం, బోధనలో వెనుకబడినా, అలసత్వం వహిస్తే ఉపాధ్యాయులు డీఈఓ కార్యాలయానికి వచ్చి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఉపాధ్యాయులు బాధ్యతాయుతంగా పనిచేసి జిల్లాను రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలపాలని కోరుతున్నాం. -
కృత్రిమ మేధస్సుతో వ్యవసాయం
నారాయణవనం: సాంకేతికతను అందిపుచ్చుకుని, కృత్రిమ మేధస్సుతో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పరచడంలో యువ ఇంజినీర్లు శ్రద్ధ చూపాలని తిరుపతి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సీఈవో విజయవంత్ మాథుర్ సూచించారు. సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో ‘వ్యవసాయం, ఆహార వ్యవస్థల్లో కృత్రిమ మేధస్సు ప్రాథమిక అంశాలు, అనువర్తనాలు, భవిష్యత్ అవకాశాలు’ అంశంపై మూడు రోజుల వర్క్‌షాప్ శనివారం ముగిసింది. స్మార్ట్ ఫార్మింగ్, డిజిటల్ వ్యవసాయం, జనరేటివ్ ఏఐ, మొక్కల వ్యాధుల గుర్తింపులో డీప్ లెర్నింగ్, డ్రోన్లు–రోబోటిక్స్, పంట దిగుబడి అంచనా, వాతావరణ అనుకూల సాగు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఆహార నాణ్యత అంచనా, భద్రత, ఏఐ ఆధారిత తనిఖీ పద్ధతులు, నేల–నీటి వనరుల నిర్వహణపై సెషన్లు నిర్వహించారు. శనివారం జరిగిన సెమీనార్‌లో ముఖ్యఅతిథి విజయవంత్ మాధుర్ మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో ఏఐ ఆధారిత స్టార్టప్‌లు, ఆవిష్కరణలు, భవిష్యత్ అవకాశాలపై దృష్టి సారించాలన్నారు. విద్యా సంస్థలు, పరిశ్రమలు, స్టార్టప్‌ల సమన్వయంతో వ్యవసాయరంగంలో సాంకేతిక పరిష్కారాలను అందుబాటులోకి తీసురావాలని సూచించారు.. ప్రాంతీయ భాషలో సాంకేతిక విద్యను మరింత చేరువ చేయడ, వ్యవసాయ–ఆహార రంగాల్లో ఏఐ ఆధారిత పరిశోధనలు, ఆవిష్కరణలను ప్రోత్సహించడంపై కళాశాలలు శ్రద్ధ చూపాల ని చెప్పారు. కళాశాల ప్రిన్సిపాళ్లు రమేష్‌కుమార్, జనార్ధనరాజు, వైస్ ప్రిన్సిపల్ మధు, ప్రోగ్రాం కన్వీనర్ మల్లిక, కో–ఆర్డినేటర్ నాగరాజు పాల్గొన్నారు. -
శ్రీకాళహస్తిలో ముగిసిన పవిత్రోత్సవాలు
శ్రీకాళహస్తి:శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఐదు రోజులుగా నిర్వహిస్తున్న పవిత్రోత్సవాలు శనివారంతో ముగిశాయి. మూలవిరాట్లకు పవిత్ర మాలాధరణతో విశేష పూజలు ముగిశాయి. ఆలయప్రధాన అర్చకులు స్వామినాథన్ గురుకుల్ ఆధ్వర్యంలో విశేష పూజాధి కార్యక్రమాలను వేదోక్తంగా నిర్వహించారు. అనంతరం యాగశాల నుంచి పవిత్ర మాలలు విశేష పూజాద్రవ్యాలను ఆలయ ఈవో బీకే వెంకటేశులు, పాలకమండలి సభ్యులు, ఆలయ అధికారుల ఆధ్వర్యంలో ఊరేగింపుగా తీసుకెళ్లి తొలుత రంగుల గోపురం వద్ద ఉన్న వినాయకునికి పవిత్రమాల సమర్పించారు. అదేవిధంగా ఆలయంలో ఉన్న పరివార దేవతలకు కూడా పవిత్రమాలలు సమర్పించారు. అనంతరం వినాయకుడు, జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామికి పవిత్రమాలలు సమర్పించారు. -
వైఎస్సార్సీపీ నేతపై అక్రమ కేసు
– 41 నోటీసు ఇచ్చి పంపి.. మళ్లీ పోలీస్ స్టేషన్‌కు పిలిపించి.. సాక్షి టాస్క్‌ఫోర్స్ : వైఎస్సార్సీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని టీడీపీ నాయకులు కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారు. ఇటీవల చిత్తూరు మండలంలోని నాయనిచెరువు, నగరంలోని దొడ్డిపల్లె ప్రాంతాల్లో సాగుతున్న అక్రమ మైనింగ్ గుట్టును వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి రట్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు టీడీపీ నేతలు చేసిన ఆరోపణలను బీసీ నాయకులు సమర్థవంతంగా తిప్పికొట్టారు. ఈ క్రమంలోనే వైఎస్సార్సీపీ మండల నేత త్యాగరాజులు సైతం తనదైన శైలిలో గట్టిగా ప్రశ్నించారు. దీంతో ఆయనపై కక్ష పెంచుకున్న టీడీపీ నేతలు కుట్రపూరితంగా కేసు నమోదు చేయించేందుకు తెగబడ్డారు. పాత వీడియోలను తెరపైకి తెచ్చి, అక్రమంగా మద్యం పెట్టించి కేసు నమోదు చేయించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మళ్లీ పోలీస్ స్టేషన్‌కు.. పోలీసులు వైఎస్సార్సీపీ మండల నేత త్యాగరాజులకు మధ్యాహ్నం. 3.30 గంటలకు 41 నోటీసులు ఇచ్చి ఇంటికి పంరారు. మళ్లీ రాత్రి 8 గంటల ఫోన్‌చేసి పోలీస్ స్టేషన్‌కు రమ్మన్నారు. 24 గంటల స్టేషన్లోనే ఉండాలని ఆదేశించారు. టీడీపీ నేతల ఒత్తిడికి తలొగ్గే పోలీసులు మళ్లీ పిలిపించి స్టేషన్లో ఉంచారని వైఎస్సార్సీపీ శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నాయి. బంగారు కుటుంబానికి అవార్డు కుప్పం : కుప్పం నియోజకవర్గంలో ప్రభుత్వం అమలు చేస్తున్న పీ4 బంగారు కుటుంబం కార్యక్రమానికి జాతీయ స్థాయిలోని గుర్తింపు లభించింది. కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (కడా)ను స్కోచ్ అవార్డుకు ఎంపిక చేశారు. శనివారం ఢిల్లీలో జరిగిన 109వ స్కోచ్ సమ్మిట్ లో కడా పీడీ వికాస్ మర్మత్, పీకేఎం యుడా చైర్మన్ సురేష్ అవార్డులను అందుకున్నారు. -
చైన్ స్నాచింగ్ దొంగల అరెస్ట్
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : జిల్లాలో వరుస చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం చిత్తూరు నగరంలోని పోలీసు అతిథిగృహంలో డీఎస్పీ వెంకటనారాయణ కేసు వివరాలను వెల్లడించారు. తమిళనాడుకు చెందిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.9 లక్షల విలువైన 64 గ్రాముల బంగారు ఆభరణాలు, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాకు చెందిన ఎం.మురుగన్ అలియాస్ రాము (52), కె.బాబు (43) గ్రామీణ ప్రాంతాలు, నిర్మానుష్య రహదారుల్లో ఒంటరిగా వెళ్లే మహిళలను లక్ష్యంగా చేసుకుని గొలుసు దొంగతనాలకు పాల్పడేవారన్నారు. జూలై 11వ తేదీన పెనుమూరు మండలం మొరవకండ్రిగ, జూలై 30న చిన్నరాజుపల్లె, మే 12న జీడీ నెల్లూరు మండలం బొమ్మవారిపల్లె సమీపంలో మహిళల మెడల్లోంచి బంగారు గొలుసులు తెంపుకెళ్లారని వెల్లడించారు. ఈ క్రమంలో ఎస్పీ తుషార్ డూడీ ఆదేశాల మేరకు.. సీఐలు రామచంద్ర, సయ్యద్ హషం, ఎస్ఐలు పి.శ్రీకాంత్, మణికంఠేశ్వర రెడ్డి, వెంకట సుబ్బయ్య, ఏఎస్ఐ దేవరాజులు రెడ్డి, క్రైమ్ సిబ్బంది సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలతో నిందితుల గుర్తించారన్నారు. విశ్వసనీయ సమాచారంతో పెనుమూరు మండల కొత్త రోడ్డు సమీపంలో వీరిని అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. ఏ–1 నిందితుడు మురుగన్్ పై ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్లలో 16 ఆస్తి సంబంధిత కేసులు ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. కేసులను వేగంగా ఛేదించి, రికవరీ సాధించిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ తుషార్ డూడి ప్రత్యేకంగా అభినందించారని డీఎస్పీ వెల్లడించారు. -
28, 29న బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ పర్యటన
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో ఈ నెల 28, 29 తేదీల్లో బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ పర్య టిస్తుందని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ వెల్లడించారు. శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ సూర్య నారాయణరాజు, సభ్యు లు పద్మలత జిల్లాలో పర్యటిస్తారన్నారు. 28న మధ్యా హ్నం కమిటీ సభ్యులు స్వచ్ఛంధ సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తారని తెలిపారు. జిల్లాలోని గిరిజన సంక్షేమ వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాలు, కేజీబీవీలు, బాలల సంరక్షణ సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేస్తారని వివరించారు. మౌలి క వసతులు, బాలల రక్షణ చర్యలను పరిశీలిస్తారన్నారు. 29న ఉదయం కలెక్టరేట్లో జిల్లా స్థాయి అధికారులతో శాఖల వారీగా సమీక్ష నిర్వహిస్తారని వెల్లడించారు. కమిటీ పర్యటనను దృష్టిలో ఉంచుకుని సంబంధిత శాఖల అధికారులు ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. ఇదేం వైద్యం గురువా! పలమనేరు: ప్రభుత్వ పాఠశాలల్లో గురువులు పాఠాలు చెప్పాలి కానీ, కొందరు అతిగా వ్యవహరించి అభాసుపాలవుతున్నారు. ఇలాంటి ఘటనే పలమనేరు నియోజకవర్గంలోని బైరెడ్డిపల్లె మండలం కంచనపల్లెలో రెండు రోజుల క్రితం జరిగింది. పాఠశాలలోని ఓ టీచర్ ఆయుర్వేదంపై మక్కువతో కొన్నేళ్లుగా భోజ నం చేయకుండా కేవలం కొన్ని ద్రావణాలు తాగుతానని చెబుతున్నారు. అలాగే ఆయన ప్రభుత్వ బడిలో ఓ ఆలయం నిర్మించాడు. అక్కడే నిత్యం పూజల్లో ఉంటారు. అక్కడితో ఆగకుండా తాను పాటిస్తున్నవిధానాలను పిల్లలపై రుద్దాడు. కొన్నాళ్లుగా విద్యార్థులకు కొన్ని ఆకులు, సుంగధ ద్రవ్యాలు తినిపిస్తున్నారు. గురువారం ఈ క్రమంలోనే పిల్లలు మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత ఆశా వర్కర్ ఇచ్చిన ఐరన్ మాత్రలు వేసుకుని అస్వస్థతకు గురయ్యారు. సదరు టీచర్ తినిపించిన నాటు మందుల కారణంగానే పిల్లలు అనారోగ్యానికి గురయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎంఈఓల పర్యవేక్షల లేకపోవడంతోనే టీచర్లు ఇస్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రూ.30 వేల అపహరణ పలమనేరు : పట్టణంలోని ఆర్టీసీ బస్టాండులో శుక్రవారం కుప్పం బస్సు ఎక్కిన ఓ ప్రయాణికుడి జేబులోని రూ.30 వేలు అపహరణకు గురైంది. వివరాలు.. బైరెడ్డిపల్లెకు చెందిన టమాటా వ్యాపారి అశోక్ పలమనేరుకు సొంత పనికోసం వచ్చాడు. స్వగ్రామం వెళ్లేందుకు బస్టాండుకు వచ్చి బస్సు ఎక్కుతుండగా నగదు చోరీకి గురైంది. బాధితుడు ఈ మేరకు పలమనేరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఈ మేరకు సీసీ పుటేజీల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. -
లంచం.. లాంఛనం!
కాణిపాకం : రెవెన్యూ కార్యాలయాలు ఉండేది ప్రజా సమస్యలు తీర్చేందుకా లేక, కాసులు పిండుకునేందుకా అని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భూ సమస్యలు, మ్యుటేషన్లు, సర్వేల కోసం సామాన్యులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ప్రజలు ఇచ్చే వినతిపత్రాలు నేరుగా చెత్తబుట్టల్లోకే చేరుతున్నాయి. క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాల్సిన వీఆర్ఓలు, సర్వేయర్లు పలు చోట్ల వ్యక్తిగత పనుల్లో నిమగ్నమవుతూ కంటికి కనిపించకుండా దాగుడుమూతలు ఆడుతున్నారు. పర్యవేక్షించే అధికారులు స్పందించకపోవడంతో రెవెన్యూ సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మధ్యవర్తులతో దందా! పూతలపట్టు నియోజకవర్గంలో ఐదు తహసీల్దార్ కార్యాలయాలున్నాయి. ఈ ఆఫీస్‌లకు రోజూ వివిధ పనుల నిమిత్తం వందలాది మంది వస్తుంటారు. ప్రధానంగా బంగారుపాళ్యం, ఐరాల, యాదమరి, తవణంపల్లి తహసీల్దార్ కార్యాలయాలకు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఈ కార్యాలయాల్లో కొన్ని అక్రమాలకు అడ్డాగా మారిపోయాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. ముడుపులు ఇవ్వందే ఫైళ్లు కదలండంలేదని ఆవేదన చెందుతున్నారు. చాలామంది రెవెన్యూ సిబ్బందికి కంప్యూటర్ పరిజ్ఞానం లేకపోవడంతో మధ్యవర్తులను పెట్టుకునిగా వసూళ్ల దందా నడుపుతున్నారని మండిపడుతున్నారు. అంగట్లో సర్కారు లాగిన్లు అక్రమాలు ఏ స్థాయిలో సాగుతున్నాయంటే.. యాదమరి తహసీల్దార్ కార్యాలయం సమీపంలోనే కొందరు రెవెన్యూ అధికారుల ప్రభుత్వ లాగిన్ ఐడీలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి చేరిపోయాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారిక లాగిన్లను దళారులకు అప్పగించి బహిరంగంగానే కాసులు గుంజుతున్నారని వెల్లడిస్తున్నారు. ఐరాల మండలంలో వన్ బీ, భూ మార్పులు, భాగ పరిష్కారాలు, సర్వే దరఖాస్తుల విషయంలో భూ యజమానులకు నరకం చూపిస్తున్నారని వాపోతున్నారు. బంగారుపాళ్యంలో అయితే కొందరు వీఆర్ఓలు పనులు చేయకపోగా.. తిప్పించుకుంటున్నారని, ఇదేమని అడిగితే దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నేతల కన్నుసన్నల్లోనే..? టీడీపీ నేతల కన్నుసన్నల్లో, వారి సిఫార్సులతోనే తహసీల్ధార్ కార్యాలయాల్లో పనులు జరుగుతున్నాయని స్థానికులు తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. ఈ దోపిడీపై సామాన్య ప్రజలతో పాటు అధికార పార్టీలోని కొంత మంది నాయకులు కూడా మండిపడుతున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడటమే ఈ అడ్డగోలు అవినీతికి కారణమని ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే జోక్యం చేసుకుని రెవెన్యూ శాఖలోని అవినీతి తిమింగలాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, పారదర్శకంగా సేవలు అందించాలని డిమాండ్ చేస్తున్నారు. వసూలు పర్వం ఇలా.. భూ విలువను మేరకు రూ.5వేల నుంచి ఏకంగా రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. 22ఏ జాబితా నుంచి భూములను తొలగించి ఆన్‌న్‌లైన్ చేసేందుకు రూ. లక్షల్లో రేట్లు కుదుర్చుకుంటున్నారని వెల్లడిస్తున్నారు. జనన, మరణ ధ్రువీకరణ పత్రాల మంజూరుకు సైతం రూ.30వేల వరకు డిమాండ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధితులు ఆన్‌న్‌లైన్‌న్‌లో చలానా కట్టి దరఖాస్తు చేసుకున్నా అస్సలు పట్టించుకోవడం లేదని స్పష్టం చేస్తున్నారు. గొలుసు పట్టాలంటే రూ.10వేల నుంచి రూ.30వేల సబ్‌డివిజన్ ప్రక్రియ పూర్తి చేయాలంటే భూమి విస్తీర్ణం, విలువను బట్టి ఏకంగా రూ.3లక్షల వరకు గుంజుతున్నారని వివరిస్తున్నారు.పూతలపట్టు నియోజకవర్గంలోని రెవెన్యూ కార్యాలయాలను కొందరు అధికారులు అవినీతికి అడ్డాగా మార్చేశారు. ప్రతి పనికీ లంచం ఇవ్వడమనేది లాంఛనంగా తయారు చేసేశారు. సమస్య పరిష్కారం కావాలంటే అడిగినంత చెల్లించాల్సిన దుస్థితిని కల్పించేశారు. మాట వినకుంటే కాళ్లరిగేలా ప్రదక్షిణలు చేసినా పట్టించుకోని పరిస్థితి తీసుకువచ్చారు. ఉన్నతాధికారులు పర్యవేక్షణ లేకపోవడంతో ఇష్టారాజ్యంగా నగదు వసూళ్లకు పాల్పడుతున్నారు. -
కళ్లజోళ్ల టెండర్లో గోల్మాల్!
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : పాఠశాల విద్యార్థులకు కళ్ల జోళ్లు పంపిణీ చేసేందుకు నిర్వహించిన టెండర్ ప్రక్రియ వివాదాస్పదంగా మారింది. జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ టెండర్లలో గోల్మాల్ జరిగిందని, అర్హులైన టెండర్‌దారులను కావాలనే పక్కన పెట్టారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో ఈ ఏడాది 11,739 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు చేయగా 1,023 మందికి, అలాగే 2025–26 సంవత్సరానికి సంబంధించి 51,047 మంది పిల్లలకు పరీక్షలు చేయగా 2,910 మందికి కంటి లోపాలున్నట్లు గుర్తించారు. అయితే వీరికి కళ్లజోళ్లు పంపిణీ చేయడంలో ఆలస్యం జరుగుతోందని సాక్షి దినపత్రికలో ఆగస్ట్ 29వ తేదీన ‘‘ఆరిపోయిన వెలుగు’’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన అధికారులు 6 నుంచి 18 ఏళ్ల పిల్లలకు కళ్ల జోళ్లు అందించేందుకు బుధవారం టెండర్ల ప్రక్రియ నిర్వహించారు. రూపాయి తేడాతో కోట్ ఒక్కో కంటి జోడుకు గరిష్ట ధరగా రూ.280 నిర్దేశించగా, మొత్తం ఆరుగురు టెండర్‌దారులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే, నలుగురు ముందస్తు ప్రణా ళికతో సిండికేట్‌గా మారి కేవలం ఒక్క రూపాయి తేడాతో (రూ.278, రూ.279, రూ.279.50) కోట్ చేశారని మిగిలిన ఇద్దరు టెండర్‌దారులు ఆరోపిస్తున్నారు. కుట్రపూరితంగా తమను పక్కన పెట్టా రని బాధితులు స్పష్టం చేస్తున్నారు. ఓ టెండర్‌దారుడు మాట్లాడుతూ తాను తమిళనాడుకు చెందిన వ్యక్తినని, అక్కడి జీఎస్టీ ఇక్కడ చెల్లదనే సాకుతో తన దరఖాస్తును రద్దు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో రెండుసార్లు తనకు టెండర్ ఇచ్చిన అధికారులు, ఇప్పుడే కొత్త నిబంధనలు తెచ్చారని వాపోతున్నారు. మరో టెండర్‌దారుడు మాట్లాడుతూ డీడీ పత్రంపై సాంకేతిక సాకులు చూపి టెండర్ ప్రకియకు రాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. కొందరు అధికారుల తోడ్పాటుతోనే ఈ సిండికేట్ వ్యవహారం నడిచిందని బాధితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదంపై డీఎంహెచ్ఓ నాగశశిభూషణ్రెడ్డిని వివరణ కోరగా.. టెండర్ల ప్రక్రియపై వచ్చిన ఆరోపణలపై పూర్తిస్థాయిలో విచారణ చేపడతామని తెలిపారు. సంబంధిత అధికారులతో మాట్లాడి వాస్తవాలు తెలుసుకుంటానని వెల్లడించారు. -
నులి నిర్మూలనతో ఆరోగ్యం
చిత్తూరు కలెక్టరేట్ : నులిపురుగుల నిర్మూలనతో పిల్లలకు ఆరోగ్యం, ఏకాగ్రత లభిస్తుందని డీఈఓ లక్ష్మీనారాయణ, డీఎంహెచ్ఓ శశిభూషణ్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం డీఈఓ కార్యాలయం పక్కనున్న ప్రభుత్వ పాఠశాలలో జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం నిర్వహించారు. విద్యార్థులకు ఆల్బెండజోల్–400 మాత్రలను మింగించి అవగాహన కల్పించారు. వారు మాట్లాడుతూ 1 నుంచి 19 ఏళ్ల బాల బాలికలందరికీ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉచితంగా అల్బెండజోల్ 400 ఎంజీ మాత్రలను అందజేస్తున్నామన్నారు. అన్ని పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అనంతరం మాత్రలను పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 3,10,910 మంది బాలబాలికలకు మాత్రలను వేయించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని 2102 అంగన్వాడీ కేంద్రాల్లో 1 నుంచి 2 ఏళ్ల పిల్లలు (63,963 మంది)కి అర మాత్ర, 2 నుంచి 5 ఏళ్ల పిల్లలకు ఒక పూర్తి మాత్ర అందజేస్తున్నట్లు వెల్లడించారు. జిల్లాలోని 2,248 పాఠశాలలు, కళాశాలల్లో 6 నుంచి 19 ఏళ్ల విద్యార్థులు (2,09,245 మంది) విద్యార్థులకు ఒక మాత్ర అందజేస్తున్నట్లు చెప్పారు. కడుపులో నులిపురుగులు ఉంటే పిల్లల్లో రక్తహీనత, పోషకాహార లోపం, ఆకలి మందగించడం, నీరసం, చదువుపై ఏకాగ్రత తగ్గడం వంటి సమస్యలు వస్తాయని తెలిపారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి అల్బెండజోల్ మాత్ర వేసుకోవడం వల్ల పోషకాల గ్రహణశక్తి, నేర్చుకునే సామర్థ్యం పెరుగుతాయని వివరించారు. విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. గోళ్లను ఎప్పటికప్పుడు శుభ్రంగా, చిన్నవిగా ఉంచుకోవాలని సూచించారు. ఆహారం తినే ముందు, మల విసర్జన తర్వాత చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలని తెలిపారు. కల్తీ లేని, శుభ్రమైన తాగునీటినే వినియోగించాలని కోరారు. కార్యక్రమంలో డీవైఈవో ఇందిర, ఆర్బీఎస్కే రాష్ట్ర అబ్జర్వర్ వినోద్, జిల్లా ఆర్బీఎస్కే కో–ఆర్డినేటర్ గిరి, నగరపాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ అనిల్‌కుమార్, ఎంఈఓలు సెల్వరాజ్, మోహన్, హసన్‌బాషా పాల్గొన్నారు. -
● తమలపాకుపై వాయుపుత్రుడు
స్పోర్ట్స్ కోటా బాధితులపై దాడి దారుణం చిత్తూరు రూరల్ (కాణిపాకం): డీఎస్సీ స్పోర్ట్స్ కోటా బాధితులు, వారికి మద్దతుగా నిలిచిన వైఎస్సార్సీపీ శ్రేణులపై ప్రభుత్వమే దాడులు చేయించడం దారుణమని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు సూర్యప్రతాప్‌రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ విజయవాడలోని శాప్ కార్యాలయం వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై రౌడీలతో దాడి చేయించడం ప్రభుత్వ ప్లానన్డ్ టెరర్రిజంలో భాగమేనని ఆరోపించారు. బాధితులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్లిన బెజవాడ బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది, వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరి గౌతమ్ రెడ్డిపై పోలీసుల లాఠీచార్జి చేయడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే సీనియర్ న్యాయవాది, లీగల్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఒగ్గు గవాస్కర్‌పై తప్పుడు కేసులు పెట్టి రౌడీషీట్ ఓపెన్ చేయడం సరికాదన్నారు. ప్రభుత్వం ఈ అనైతిక చర్యలను వెంటనే ఉపసంహరించుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదులు, లీగల్ సెల్ ఆధ్వర్యంలో భారీస్థాయిలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. విద్యార్థి ఆత్మహత్య పలమనేరు : మండలంలోని ఎగువ కల్లాడు గ్రామానికి చెందిన ఉపేంద్ర(14) అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శుక్రవారం వెలుగుచూసింది. వివరాలు.. ఉపేంద్ర కొలమాసనపల్లె ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. గతంలో వీరి కుటుంబం బైరెడ్డిపల్లె మండలంలో ఉండేది. ఆర్థిక ఇబ్బందులతో విద్యార్థి తల్లిదండ్రులు ఇటీవల బెంగళూరుకు వలస వెళ్లారు. దీంతో ఉపేంద్రను ఎగువ కల్లాడులోని అవ్వ వద్ద ఉంచారు. గురువారం రాత్రి ఏం జరిగిందో కానీ, ఆ బాలుడు గ్రామ సమీపంలోని ఓ చెట్టుకు ఉరేసుకున్నాడు. ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. దీనిపై పోలీసులకు సమాచారం లేదని తెలిసింది. బిడ్డకు పాలిస్తుండగా దూసుకొచ్చిన కారు – భార్యాభర్తలకు తీవ్రమైన గాయాలు పెద్దపంజాణి: పుంగనూరు మండలం దిగువ కొండమీద పల్లెకు చెందిన మురళి(31) పెద్దపంజాణి మండలంలోని ముత్తుకూరుకు చెందిన మాధురి(27)ని వివాహం చేసుకున్నాడు. వ్యవసాయ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి రెడ్డి మీనాక్షి, రెడ్డి లావణ్య అనే ఇద్దరు కుమార్తెలు. ఈ నేపథ్యంలో బిడ్డలకు గ్రహ సంబంధం సోకిందని నాటు వైద్యం చేయించుకోవడానికి శుక్రవారం ఉదయం ద్విచక్ర వాహనంలో ముత్తుకూరులోని అత్తగారి ఇంటికి వచ్చారు. వైద్య చేయించుకున్న అనంతరం స్వగ్రామానికి తిరిగి వెళుతూ మార్గం మధ్యలోని పుంగనూరు– పలమనేరు హైవేపై పెద్దారికుంట బస్టాప్ వద్ద బైక్‌ను రోడ్డు పక్కన ఆపి బిడ్డకు మాధురి పాలిస్తున్నారు. అంతలోనే పుంగనూరు వైపు నుంచి వేగంగా వచ్చిన కారు వీరిని ఢీకొని ఆగకుండా వెళ్లి పోయింది. దీంతో తీవ్రంగా గాయపడిన మురళి, లావణ్యను స్థానికులు చికిత్స నిమిత్తం పుంగనూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యుల రెఫర్ మేరకు మెరుగైన చికిత్స నిమిత్తం తిరుపతికి తరలించారు. -
ట్రైనీ కానిస్టేబుళ్ల పరేడ్ రిహార్సల్
చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు నగరంలోని జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్ పరేడ్ మైదానంలో 2025 బ్యాచ్‌కు చెందిన 142 మంది ట్రైనీ కానిస్టేబుళ్ల పాసింగ్ ఔట్ పరేడ్ రిహార్సల్స్‌ను శుక్ర వారం నిర్వహించారు. శనివారం జరగనున్న ప్రధాన పాసింగ్ ఔట్ పరేడ్ కోసం ట్రైనీలు కవాతు, మార్చ్‌పాస్ట్ చేపట్టగా.. ఎస్పీ తుషార్ డూడీ పర్యవేక్షించి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రధాన పరేడ్ నిర్వహణ, విధుల్లో పాటించాల్సిన క్రమశిక్షణ, సమన్వయంపై ట్రైనీలకు, అధికారులకు పలు సూచనలు చేశారు. శనివారం నిర్వహించే ప్రధాన పాసింగ్ ఔట్ పరేడ్‌కు రాష్ట్ర రవాణా, యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, కలెక్టర్ సుమిత్ కుమార్ అతిథులుగా హాజరుకానున్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ మహబూబ్‌బాషా, ఏఆర్ అడిషనల్ ఎస్పీ దేవదాస్, డీటీసీ డీఎస్పీ జె.రాంబాబు, ఏఆర్ డీఎస్పీ రామకృష్ణ్ణ తదితరులు పాల్గొన్నారు. -
● అక్రమంగా నగదు వసూలు చేస్తున్న టీడీపీ నేతలు ● వితంతువుల నుంచి డప్పు కళాకారుల వరకు తప్పని వేధింపులు ● ఒక్కొక్కరి వద్ద రూ.10 వేల వరకు డిమాండ్ ● దరఖాస్తుల పరిశీలనలో అధికారులపై ఒత్తిడి తెస్తున్న ఎమ్మెల్యేలు ● జిల్లాలో పింఛన్ల కోసం 43 వేలకు పైగా అప్లికేషన్ల
సాక్షి, చిత్తూరు : జిల్లాలో కొత్త పింఛన్ల కోసం 43 వేల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో డప్పు కళాకారుల పేరిట 2,970 దరఖాస్తులు అందాయి. కానీ, జిల్లాలో ఇంత మంది లేరని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. టీడీపీకి చెందిన కార్యకర్తలకు డప్పు కళాకారుల వేషం వేసి, తప్పుడు సర్టిఫికెట్లతో ఆ కేటగిరీ నుంచి కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేయించారు. ఇక ఆధార్ కార్డులో మార్పులు చేసి వృద్ధాప్య పింఛన్ కోసం 2 వేలకు పైగా టీడీపీ కార్యకర్తల డేటా ఆన్లైన్లో నమోదైనట్లు తెలుస్తోంది. ఓవైపు కార్యకర్తలకు నెలవారీ ఆదాయం ఇప్పించడం కోసం ఆయా కేటగిరీ వేషాలు వేయిస్తున్న టీడీపీ నేతలు.. ఇదే సమయంలో అర్హుల నుంచి డబ్బులు దండుకుంటున్నారు. కొత్త పింఛన్ల కోసం ఎవరెవరు దరఖాస్తు చేసుకున్నారనే డేటాను తెప్పించుకున్న కొందరు నాయకులు, వారి ఇళ్ల వద్దకే వెళ్లి మరీ బేరసారాలు సాగిస్తున్నారు. ఒక్కో పింఛన్ మంజూరుకు కనిష్టంగా రూ.10 వేల నుంచి గరిష్టంగా రూ.30 వేల వరకు డిమాండ్ చేస్తున్నారు. అధికారులపై పెరుగుతున్న ఒత్తిడి ఇక పింఛన్ల మంజూరు కోసం అధికారుల గొంతుపై ప్రజా ప్రతినిధులు కత్తిపెడుతున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 13 వేల దరఖాస్తులను ఆమోదించిన యంత్రాంగం, 30 వేల వరకు పెండింగ్‌లో ఉంచింది. తాము ఆమోదించిన పేర్లను వెంటనే అర్హుల జాబితాలోకి ఎక్కించాలని నేతలు పట్టుపడుతున్నారు. దీంతో ఎవరు అర్హులు..? ఎవరు అనర్హులు..? అనేది తేల్చుకోలేక అధికారులు సతమతమవుతున్నారు. -
వైఎస్సార్సీపీ పాలనలో స్వర్ణయుగం
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పల్లె వైద్యానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్న్మోహన్రెడ్డి విప్లవాత్మకంగా తీసుకొచ్చిన ఫ్యామిలీ ఫిజిషియన్ విధానానికి జిల్లాను పైలెట్‌గా ఎంపిక చేసి విజయవంతంగా అమలు చేశారు. విలేజ్ హెల్త్ క్లినిక్‌లే కేంద్రంగా వలంటీర్లు, ఆశా కార్యకర్తలు ముందుగానే సమాచారం అందించి 104 వాహనాలను గ్రామాలకు రప్పించేవారు. నడవలేని వృద్ధులు, దివ్యాంగులు ఉంటే డాక్టర్లే నేరుగా వారి ఇంటికి వెళ్లి ఉచితంగా పరీక్షించి, రూపాయి ఖర్చు లేకుండా పూర్తి స్థాయిలో మందులు అందించేవారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్ చేసుకున్న వారిని సైతం ఇంటికెళ్లి పరామర్శించి వైద్యం చేసేవారు. కానీ, చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే ఈ వైద్య వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసింది. ఉచిత వైద్యం అందక పల్లె ప్రజలు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి వేలాది రూపాయలు అప్పులు చేసి వైద్యం చేయించుకోవాల్సిన దుస్థితి దాపురించింది. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి 104 వాహనాలకు మరమ్మతులు చేయించి, తగినన్ని మందులు అందుబాటులోకి తీసుకువచ్చి గ్రామీణులకు నాణ్యమైన వైద్యసేవలు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాణిపాకం: జిల్లా వ్యాప్తంగా పల్లె ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాల్సిన 39 సంచార వైద్య వాహనాల్లో ప్రస్తుతం కేవలం 29 మాత్రమే అరకొరగా తిరుగుతున్నాయి. మిగిలిన వాహనాలు వేర్వేరు మండలాల్లో అసలు కనిపించడమే మానేశాయి. గుడిపాల, బంగారుపాళ్యం, జీడీనెల్లూరు, కార్వేటినగరం, నగరి, గంగవరం, పులిచెర్ల, వి.కోట, బైరెడ్డిపల్లె, పెద్దపంజాణి మండలాలకు చెందిన 10 వాహనాలు సేవలకు దూరమయ్యాయి. అవి మరమ్మతులకు గురవడంతో విజయవాడకు పంపించామని అధికారులు చెబుతున్నప్పటికీ, దాదా పు నెల నుంచి పల్లె సేవలను పూర్తిగా నిలిపివేయ డం గమనార్హం. ముఖ్యంగా గుడిపాల మండలంలో 104 వాహనం కేవలం షెడ్డుకే పరిమితమైంది. బొమ్మసముద్రం, గుడిపాల ప్రాంతాల్లో అసలు వాహనం రాకపోయినా, సేవలందించినట్లు కాగితాల్లో చూపిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై ఇటీవల సాక్షి దినపత్రికలో కథనం రావడంతో హడావుడిగా రిపేర్ పేరుతో అధికారులు ఆ వాహనాన్ని విజయవాడకు పంపించి చేతులు దులుపుకున్నారు. బోగస్ ఓపీలు సంచార వైద్యం తూతూమంత్రంగా మారడంతో ఉన్నతాధికారులు, ప్రభుత్వానికి అంతా బాగుందని చూపించుకోవడానికి క్షేత్రస్థాయి సిబ్బంది బోగస్ ఓపీలను నమోదు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలు రోగులను పరీక్షించకుండానే వందలాది పేర్లను రికార్డుల్లో ఎక్కించి సేవలు అందించినట్లు కథలు అల్లుతున్నారని పలువురు చెబుతున్నారు. ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తే ఈ బోగస్ డ్రామాలు వెలుగులోకి వస్తాయని స్పష్టం చేస్తున్నారు. ఉండాల్సినవి ఇవీ.. 104 వాహనంలో విధిగా ఉండాల్సిన జ్వరం మాత్రలు (పారాసిటమాల్ 500 ఎంజీ), గ్యాస్ ప్రాబ్లమ్ మాత్రలు (పాంటోప్ 40 ఎంజీ), ఒళ్లు నొప్పుల బిళ్లలు (డిక్లోఫెనాక్), బీపీ మాత్రలు (అటెనలాల్ 50 ఎంజీ, అమ్లోడిపిన్), యాంటీబయోటిక్స్ (అమాక్సిలిన్ 500 ఎంజీ, సెఫిక్సిమ్)తో పాటు చిన్నపిల్లలకు ఇచ్చే జ్వరం, దగ్గు, విరేచనాల టానిక్‌లు అసలు సరఫరా కావడం లేదు. దీంతో పాటు మరికొన్ని మాత్రలు, మందులు కూడా లేవని పలువురు సిబ్బంది చెబుతున్నారు. మందులు లేవని స్థానిక సిబ్బంది అధికారులకు నివేదికలు పంపినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని పలువురు విమర్శిస్తున్నారు. నామమాత్రంగానే.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పీహెచ్సీలో పనిచేసే ఇద్దరు వైద్యుల్లో ఒకరు తప్పనిసరిగా 104 వాహ నంతో పాటు పల్లెలకు వెళ్లాల్సి ఉంటుంది. కానీ, ప్రస్తుతం జిల్లాలో పలు చోట్ల డాక్టర్లు పల్లెలకు వెళ్ల డం లేదు. కేవలం ఏఎన్‌న్‌ఎంలు, ఆశా కార్యకర్తలు మాత్రమే నామమాత్రంగా పల్లెలకు వెళ్లి ఏదో మొక్కుబడిగా హడావుడి చేసి వస్తున్నారు. వాహనంలో ఏయే మందులు ఉన్నాయో, ఏ రోగానికి ఏ మాత్ర ఇవ్వాలో కూడా తెలియకుండానే చికిత్స పేరిట రోగులకు మందులు ఇచ్చి పంపించేస్తున్నారు. సాధారణ జ్వరం, బీపీ, షుగర్, ఒళ్లు నొప్పులకు ఇచ్చే ప్రాథమిక మందులు కూడా కరువయ్యాయి. -
జెడ్పీ ఉద్యోగుల పునర్విభజన పూర్తి
శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాలు శ్రీకాళహస్తీశ్వరాలయంలో పవిత్రోత్సవాలను మూడో రోజు గురువారం శాస్త్రోక్తంగా నిర్వహించారు.చిత్తూరు కలెక్టరేట్ : గత కొద్ది రోజులుగా నిర్వహిస్తున్న జెడ్పీ పునర్విభజన కసరత్తు ఈనెల 24 వ తేదీతో పూర్తయింది. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిషత్ ఉద్యోగుల విభజన ప్రక్రియను పూర్తిచేశారు. నూతనంగా ఏర్పడిన చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల పరిధిలోని జిల్లా పరిషత్‌లకు మొత్తం 88 మంది ఉద్యోగులను కేటాయించారు. ఉద్యోగుల విభజనలో భాగంగా పోస్టుల వారీగా సిబ్బందిని మూడు జెడ్పీలకు కేటాయిస్తూ జెడ్పీ సీఈవో రవికుమార్ నాయుడు వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎటువంటి సిఫార్సులకు తావులేకుండా పారదర్శకంగా ఉద్యోగుల విభజన చేయడం జరిగిందని తెలిపారు. చిత్తూరు జెడ్పీకి 38 మంది కేటాయింపుల్లో చిత్తూరు జెడ్పీకి అత్యధికంగా 38 మంది, తిరుపతి జెడ్పీకి 27 మంది, అన్నమయ్య జెడ్పీకి 23 మంది ఉద్యోగులు కేటాయించారు. పరిపాలనా అధికారుల విభాగంలో చిత్తూరుకు 4, అన్నమయ్యకు 3, తిరుపతికి 9 మంది చొప్పున మొత్తం 16 మందిని కేటాయించారు. డ్రైవర్లు మూడు జెడ్పీలకు ఒక్కొక్కరు చొప్పున ముగ్గురిని కేటాయించారు. జూనియర్ అసిస్టెంట్ పోస్టుల్లో చిత్తూరుకు 13, అన్నమయ్యకు 8, తిరుపతికి 9 మంది చొప్పున మొత్తం 30 మందిని కేటాయించారు. ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల్లో చిత్తూరుకు 6, అన్నమయ్యకు 3, తిరుపతికి నలుగురు చొప్పున మొత్తం 13 మందికి కేటాయించారు. రికార్డు అసిస్టెంట్ పోస్టుల్లో చిత్తూరుకు ఇద్దరు, అన్నమయ్యకు ఒకరు, తిరుపతికి ఒకరు చొప్పున నలుగురిని కేటాయించారు. సీనియర్ అసిస్టెంట్ పోస్టుల్లో చిత్తూరుకు 8, అన్నమయ్యకు 5, తిరుపతికి 6 మంది చొప్పున మొత్తం 19 మందిని కేటాయించారు. టైపిస్టు పోస్టుల్లో చిత్తూరుకు 4, అన్నమయ్యకు 2, తిరుపతికి ముగ్గురు చొప్పున 9 మందిని కేటాయించారు. దీంతో జిల్లాల పునర్విభజన అనంతరం మూడు జిల్లా పరిషత్‌లకు అవసరమైన సిబ్బంది కేటాయింపు ప్రక్రియలో కీలక ఘట్టం పూర్తయిందని అధికారులు వెల్లడించారు. -
కిక్కు ఐడియా ఫలించినట్టే !
సాక్షి, చిత్తూరు: మద్యం దుకాణాల లైసెన్సులను తీసుకోవడంలో ఇప్పటికే ఆరితేరిన కొందరు వ్యక్తుల ఐడియా ఫలించినట్టే. మద్యం దుకాణాల గడువు పూర్తవుతున్న నేపథ్యంలో టెండర్లు పిలవకుండా.. రెన్యూవల్ పేరిట తమ కార్యకర్తలకు ఉపాధి చూపించాలనుకున్న చంద్రబాబు ప్రభుత్వం రెన్యూవల్ ప్రతిపాదనకు తెరతీసింది. అయితే తామేమీ తక్కువ కాదన్నట్లు జిల్లాలోని 18 దుకాణాల నిర్వాహకులు రెన్యూవల్‌కు వెళ్లకుండా.. వేసిన ప్రణాళిక అమల్లోకి వచ్చేసింది. రీ–నోటిఫికేషన్ జిల్లాలోని 113 మద్యం దుకాణాల్లో, 95 దుకాణాలు రెన్యూవల్స్ తీసుకున్నారు. మిగిలిన 18 మంది లైసెన్సీలు రెన్యూవల్ చేసుకోలేదు. ఫలితంగా చిత్తూరు కార్పొరేషన్లో 9, యాదమరి 1, పూతలపట్టు 2, నిండ్ర 1, వి.కోట 3, బైరెడ్డిపల్లె 1, శాంతిపురంలో ఒక దుకాణం చొప్పున.. మొత్తం 18 దుకాణాలకు జిల్లా ప్రొబేషన్ అధికారి శ్రీనివాస్ గురువారం నోటిఫికేషన్ జారీచేశారు. అలాగే పెద్ద పంజాణి మండలంలో కల్లుగీత సామాజిక వర్గంలోని గౌండ్లలకు ఓ మద్యం దుకాణ నిర్వాహణకు నోటిఫికేషన్ ఇచ్చారు. గురువారం నుంచే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని, అక్టోబర్ 1వ తేదీన అర్ధరాత్రి 12 గంటల వరకు గడువు ఉందన్నారు. వచ్చిన దరఖాస్తులను 3వ తేదీ వరకు పరిశీలించి, 5వ తేదీన చిత్తూరు కలెక్టరేట్ కార్యాలయంలోని డీఆర్డీఏ కార్యాలయంలో ఉదయం 8 గంటలకు లక్కీడిప్ ద్వారా లైసెన్సులు కేటాయిస్తామన్నారు. రూ.3 లక్షల నాన్–రీఫండబుల్ దరఖాస్తు రుసుం, అలాగే ప్రతి దుకాణానికి నాలుగు దరఖాస్తులు తప్పనిసరిగా దాఖలు కావాలనే నిబంధన ఉంచారు. లక్కీడిప్‌లో లైసెన్సులు పొందిన వాళ్లు ఏడాది పాటు దుకాణాలను నిర్వహించుకోవచ్చు. జిల్లాలో 19 మద్యం దుకాణాలకు రీ–నోటిఫికేషన్ అనుకున్నదే.. మద్యం దుకాణాలను రెన్యూవల్ చేసుకుంటే సగటున ఒక్కో దుకాణానికి రూ.25 లక్షలు చెల్లించాలి. అదే లక్కీడిప్‌కు వెళితే నాలుగు దరఖాస్తులు దాఖలు చేసినా, రూ.12 లక్షల వ్యయం మాత్రమే అవుతుంది. ఒకరు దరఖాస్తు చేసిన దుకాణానికి మరొకరు దరఖాస్తు చేయకుండా అధికార పార్టీకి చెందిన కార్యకర్తలు రూపొందించిన ప్రణాళికపై మూడు రోజుల క్రితమే ‘సాక్షి’ దినపత్రికలో కథనం ప్రచురితమయ్యింది. ప్రభుత్వం కనీసం పది దరఖాస్తులు వస్తేనే లక్కీడిప్ తీస్తామనే నిబంధన ఉంచినట్లయితే.. ఖాజాను గండిపడేదికాదు. కానీ ఇపుడు ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టి.. పచ్చ కార్యకర్తల జేబులు నింపేలా తయారయ్యింది. -
కుర్చీ ఇస్తారా? ఎంతైనా ఖర్చు పెడతాం
సాక్షి ప్రతినిధి, తిరుపతి : తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో త్రిముఖ పోరు తప్పేలా లేదు. టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు ఎవరికి వారు పోటీ చేసేందుకు పావులు కదుపుతున్నారు. మేయర్, మున్సిపల్ చైర్మన్ కుర్చీల కోసం పైరవీలు, బేరసారాలు మొదలు పెట్టేశారు. కుర్చీ కోసం ఎన్ని కోట్లయినా పెట్టుకుంటామని చెబుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా బరిలోకి దిగారు. అధికారం చేజిక్కించుకున్నాక పాలనా వ్యవహారాలు, పదవులు, పనుల పంపకాల్లో నువ్వా నేనా అంటూ పోటీపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో మూడు పార్టీల మధ్య భేదాభిప్రాయాలు తలెత్తడంతో ‘మేము లేకపోతే మీరు గెలిచే వారు కాదు, పదవులు అనుభవించేవారు కాదు’ అంటూ మూడు పార్టీ శ్రేణులు నువ్వెంత అంటే.. నువ్వెంత అని మాట్లాడుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనైనా తమ బలాన్ని నిరూ పించుకోలేకపోతే అధికారంలో ఉన్నన్ని రోజులు మా దయా దాక్షిణ్యాలతో పదవులు అనుభవిస్తున్నారని ఎత్తిపొడుస్తూనే ఉంటారని కూటమిలోని మూడు పార్టీల శ్రేణులు చర్చించుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో తిరుపతి, చిత్తూరు జిల్లాలోని మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల్లో తమ బలం ఏమిటో నిరూపించుకోవాలని జనసేన ఉవ్విళ్లూరుతోంది. పార్టీ శ్రేణుల ఒత్తిడి మేరకు అధిష్టానం నుంచి కూడా సంకేతాలు అందినట్టు విశ్వసనీయ సమాచారం. ఆమేరకు జనసేన శ్రేణులు క్షేత్రస్థాయిలో ప్రయాత్నాలు మొదలుపెట్టారు. ఎన్నికల్లో పోటీచేయకపోతే పరువు పోతుందని బీజేపీ భావిస్తోంది. తిరుపతి, శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట, నాయుడుపేట మున్సిపాలిటీల ఎన్నికల్లో బరిలో దిగాలని భావిస్తోంది. పోటీ చేస్తే గెలుపు అవకాశాలు ఎలా ఉంటాయోనని ఎవరికి వారు బృందాలను ఏర్పాటు చేసి సర్వేలు చేయించుకుంటున్నారు.తిరుపతి, చిత్తూరు మేయర్ స్థానాలతో పాటు జిల్లాలోని మున్సిపాలిటీల చైర్మన్ పీఠాల కోసం టీడీపీ, జనసేన నేతల నుంచి తీవ్రమైన పోటీ ఉంది. కుర్చీలు కావాలంటే భారీగా ఖర్చు అవుతుందని ముఖ్య నాయకులు చెబితే.. అందుకు సరే పెట్టుకుంటాం అంటూ స్పష్టం చేసినట్లు ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నారు. తిరుపతి మేయర్ పీఠం కోసం టీడీపీ నుంచి 11 మంది, జనసేన నుంచి ఇద్దరు, బీజేపీ నుంచి ఇద్దరు పోటీపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో తిరుపతి మేయర్ కోసం బీజేపీ నేత భానుప్రకాష్‌రెడ్డి తన కుమారుడి కోసం ప్రయత్నించినట్లు తెలిసింది. డిప్యూటీ మేయర్ పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. అదేవిధంగా మరో బీజేపీ నేత కూడా మేయర్ కోసం ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. చిత్తూరు మేయర్ పీఠం కోసం టీడీపీ నుంచి ఐదుగురు, జనసేన నుంచి ఇద్దరు పోటీపడుతున్నారు. తిరుపతి, చిత్తూరు కార్పొరేషన్ మేయర్ల కుర్చీ కోసం పోటీ పడుతున్న టీడీపీ, జనసేన పార్టీలో ఐదుగురు నాయకులు ఒక్కొక్కరు రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధిష్టానానికి సంకేతాలు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. మున్సిపల్ చైర్మన్ కుర్చీల కోసం రూ.5 కోట్ల నుంచి రూ.7 కోట్లు పెట్టేందుకు కొందరు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట, నాయుడుపేట మున్సిపాలిటీల్లో చైర్మన్ పీఠం కోసం బీజేపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అదే విధంగా తమ పార్టీ కార్యకర్తలు కూడా వార్డుల్లో పోటీచేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. నగరి, పలమనేరు, కుప్పంలోనూ జనసేన నేతలు కొందరు పోటీ చేయాలని ఆశపడుతున్నారు. స్థానిక టీడీపీ ఎమ్మెల్యేల అభిప్రాయం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిసింది. ఏది ఏమైనా రిజర్వేషన్లు ఖరారు అయ్యాక మేయర్, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల విషయమై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కూటమిలో కుమ్ములాట అసెంబ్లీ ఎన్నికల్లో కలిసికట్టుగా కొట్టాం.. అధికారం తెచ్చాం.. అని సంబరపడిన కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య ఇప్పుడు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వేళ అసలు రంగు బయటపడుతోంది. నగరపాలక పీఠంపై జెండా పాతేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఎవరికి వారు కత్తులు నూరుకుంటున్నారు. మా బలం లేకపోతే మీరు గెలిచేవారా? అంటూ ఒకరికొకరు ఎత్తిపొడుపులకు దిగుతున్న నేతలు, కుర్చీ కోసం కోట్లు కుమ్మరించడానికై నా వెనుకాడబోమని బాహాటంగానే ప్రకటిస్తున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీల మార్క్ చూపించుకోకపోతే భవిష్యత్తు శూన్యమనే భావన క్యాడర్లో బలంగా నాటుకు పోయింది. మిత్ర పక్షాల ముసుగులో సాగుతున్న ఆధిపత్య పోరు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. -
ఆకాశంలో అద్భుతం
– చంద్రుడి చుట్టూ కాంతి వలయం! కాణిపాకం : ఆకాశంలో ఒక అరుదైన, సుందర దృశ్యం ఆవిష్కృతమైంది. గురువారం రాత్రి వేళ చందమామ చుట్టూ దివ్య వలయం ఏర్పడి ప్రజలను అబ్బురపరిచింది. నింగిలో జాబిల్లికి రత్నాల ఉంగరం తొడిగినట్లున్న ఈ దృశ్యాన్ని చిత్తూరు నగరంలో పలువురు తిలకించి, తమ ఫోన్లలో బంధించారు. ఎత్తులో ఉన్న మేఘాల్లోని మంచు స్పటికాల గుండా చంద్రకాంతి ప్రయాణించినప్పుడు ‘వక్రీభవనం’ చెందడం వల్లే ఈ కాంతి చక్రం ఏర్పడుతుందని నిపుణులు తెలిపారు. ఇది పూర్తిగా సహజమైన భౌతిక ప్రక్రియ మాత్రమేనని వివరించారు. -
వ్యవస్థాగత మనుగడకు ముప్పు
ప్రభుత్వాల సమాచారాన్ని ప్రజలకు చేరవేసేందుకు ఇప్పటికే బడ్జెట్ నిధులతో నడిచే సమాచార పౌర సంబంధాల శాఖ (ఐఅండ్‌పీఆర్) అనే శాఖ ఒకటి ఉంది. ఈ వ్యవస్థను బలోపేతం చేయకుండా, పబ్లిసిటీ పేరుతో ప్రయివేటు ఇన్‌ఫ్లూయెన్సర్స్‌కు ప్రజాధనం చెల్లించడం వల్ల జవాబుదారీతనం దెబ్బతింటుంది. ఆర్థిక లోటున్న రాష్ట్రంలో ప్రాధాన్యత రహిత ప్రచారాల కంటే విద్య, వైద్యం, ఉపాధి కల్పన, రైతు సంక్షేమంపై దృష్టి పెట్టడం తక్షణ అవసరం. – వాడ గంగరాజు, సీపీఎం జిల్లా కార్యదర్శి. చట్టపరమైన నిబంధనలు, పక్షపాత ముప్పు ప్రభుత్వ నిధులతో నిర్వహించే ప్రచారాల్లో ఎలాంటి పక్షపాతం, రాజకీయరంగు ఉండకూడదని స్పష్టమైన ఆదేశాలున్నాయి. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్స్‌ను ఎంపిక చేసే ప్రక్రియలో పారదర్శకత లోపిస్తే, ఇది అధికార దుర్వినియోగానికి దారితీస్తుంది. – విజయసింహారెడ్డి, రిటైర్డ్ తహసీల్దార్, అడ్వకేట్. హామీలను విస్మరించారు ‘ప్రభుత్వం తమ సొంత సెల్ఫ్ డబ్బా’ కోసం లక్షలాది రూపాయలను సోషల్ మీడియా ప్రచారకర్తలకు ధారపోయడం సమంజసం కాదు. ఇచ్చిన హామీల ప్రకారం నిరుద్యోగ భృతిని పునరుద్ధరించడం, ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడం, సంక్షేమ పింఛన్ల విస్తరణపై దృష్టి పెట్టాలి. ప్రచారాల కోసం ప్రజాధనాన్ని వృధా చేయడం సరైన విధానం కాదు. – మనోజ్‌రెడ్డి, యువత. చిత్తూరు. ఆర్థిక శ్రేయస్సు, నిధుల దుర్వినియోగమే రాష్ట్రం తీవ్రమైన అప్పులు, ఆర్థిక లోటు ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రచారాలకు ప్రత్యేక బడ్జెట్ అవసరమా? ఏటా పబ్లిసిటీ కోసం కోట్లాది రూపాయాలు ధారపోయడం వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై మరింత భారం పడుతుందే తప్ప ప్రజలకు ఎలాంటి ప్రత్యేక్ష ప్రయోజనం చేకూరదు. – సోను, యువత, ఐరాల. ఐటీడీపీకి దోచిపెట్టే యత్నం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీను అమలు చేయకుండా ఇప్పుడు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్స్‌కు శ్రీకారం చుట్టడం అన్యాయం. ఈ ప్రక్రియతో ప్రైవేట్ వ్యక్తులకు నెలకు రూ.25 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు ప్రజాధనాన్ని పంచిపెట్టడం దారుణం. ఇది కేవలం ఎన్నికల ముందు టీడీపీ తరఫున ప్రచారం చేసిన ఐటీడీపీ కార్యకర్తలకు, సోషల్ మీడియా విభాగాలకు బహుమానంగా ప్రజాధనాన్ని దోచిపెట్టే పక్షపాత చర్య తప్ప మరొకటి కాదు. – శివారెడ్డి, ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యదర్శి. -
40 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం
పుత్తూరు: రైలులో అక్రమంగా తరలిస్తున్న ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) 40 బస్తాల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పుత్తూరు ఆర్పీఎఫ్ సీఐ కేపీ సెబాస్టియన్ తెలిపారు. గురువారం వివిధ రైళ్లలో ఎస్ఐ విజయ్‌నాయక్ బృందం నిర్వహించిన తనిఖీల్లో 40 బస్తాల్లోని 1000 కిలోల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని తమిళనాడు రాణిపేట ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారికి అందజేసినట్లు తెలిపారు. గ్రంథాలయాల అభివృద్ధికి చర్యలు చిత్తూరు కలెక్టరేట్ : గ్రంథాలయాల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర గ్రంథాలయ శాఖ అధికారి కృష్ణమోహన్ అన్నారు. గురువారం జిల్లా పర్యటనకు విచ్చేసిన ఆయన జిల్లా గ్రంథాలయ చైర్మన్ గురువారెడ్డితో కలిసి తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని గ్రంథాలయాల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే నిరుద్యోగులకు నూతన పుస్తకాలను అందుబాటులోకి తెస్తామన్నారు. అనంతరం స్థానిక పాఠకులతో మాట్లాడి వసతులపై ఆరా తీశారు. కార్యక్రమంలో కార్యదర్శి శర్మ, డిప్యూటీ లైబ్రేరియన్ లావణ్య తదితరులు పాల్గొన్నారు. మెరుగైన వైద్య సేవలు అందించాలి కాణిపాకం: చిత్తూరు జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పని చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి నాగశశిభూషణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన వైద్యాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న నులిపురుగుల నివారణ దినోత్సవంలో భాగంగా మొత్తం 3,10,910 మంది పిల్లలకు మాత్రలు పంపిణీ చేయాలని స్పష్టం చేశారు. తొలిరోజు మాత్రలు అందుకోలేకపోయిన వారి కోసం అక్టోబర్ 5వ తేదీన ప్రత్యేకంగా ‘మిస్సింగ్ డే’ నిర్వహించి మాత్రలు అందజేస్తామన్నారు. 1–2 ఏళ్ల పిల్లలకు సగం మాత్ర నీటిలో కలిపి, 2–19 ఏళ్ల పిల్లలకు ఒక పూర్తి మాత్రను భోజనం తర్వాత చప్పరించి మింగేలా చూడాలన్నారు. అదనపు డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకట ప్రసాద్ మాట్లాడుతూ, సెప్టెంబర్ 11 నుంచి 24 వరకు నిర్వహిస్తున్న లెప్రసీ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించి వ్యాధిగ్రస్తులను ముందస్తుగా గుర్తించాలని సూచించారు. ముగిసిన జాతీయ సదస్సు కుప్పంరూరల్: కుప్పం ఇంజినీరింగ్ కళాశాలలో ఈసీఈ, ఐఈఈఈ బ్రాంచ్‌ల ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ సదస్సుకు 450 పరిశోధనా పత్రాలు వచ్చినట్లు వైస్ చైర్మన్ డాక్టర్ సునీల్‌రాజ్ తెలిపారు. సంస్కృతి, సాంకేతిక, వినోద కార్యక్రమంలో వెయ్యి మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నట్లు ఆయన చెప్పారు. పరిశోధనల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు 60 వేల రూపాయలు బహుమతిగా అందజేశామన్నారు. విద్యార్థులు ఎప్పటికప్పుడు తమ పరిశోధనా సామర్థ్యాలను పెంచుకోవాలని, అందుకు ఇంజినీరింగ్ కళాశాలలో అన్ని వసతులు కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ సుధాకర్‌బాబు, అధ్యాపకులు, విద్యార్థులు ఉన్నారు. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి శ్రీకాళహస్తిరూరల్(తొట్టంబేడు) : తొండమనాడు సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. రూరల్ సీఐ ఇబ్రహీం కథనం మేరకు.. లక్ష్మణ్ (25) అనే యువకుడు బైక్‌పై శ్రీకాళహస్తి వైపు వస్తున్నాడు. శేఖర్ అనే వ్యక్తి రాంగ్ రూట్లో వస్తూ ఢీకొన్నాడు. ఈ ఘటనలో లక్ష్మణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని స్వస్థలం విశాఖపట్నం. ఇతను ఏర్పేడు మండలం ఐసర్‌లో సూపర్ వైజర్‌గా పనిచేస్తున్నాడు. శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రిలో పోస్ట్ మార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అడ్డ దారిలో వచ్చి ఢీకొన్న ద్విచక్ర వాహనదారుడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
హాంమ్మా.. అసలు గుట్టు ఇదేనా..?
సాక్షి, చిత్తూరు: హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హాం) పేరిట నాలుగు రోజుల క్రితం కుప్పంలో చంద్రబాబు వర్చువల్ విధానంలో మునిసిపాలిటీల్లో రూ.11,360 కోట్ల విలువైన పనులు చేస్తున్నట్లు శంఖుస్థాపన చేశారు. దీనివల్ల పట్టణాల రూపురేఖలు మార్చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ క్షేత్రస్థాయిలో చూస్తే మాత్రం ఇది ఎన్నికల స్టంట్ తప్ప మరేమీలేదు. పైగా మునిసిపాలిటీలను అప్పుల ఊబిలో దింపడమే ఈ ‘హాం’ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. అసలు మతలబు.. ‘హాం’ కింద జిల్లాలోని చిత్తూరు మునిసిపల్ కార్పొరే షన్‌కు రూ.60 కోట్లు, పలమనేరు మునిసిపాలిటీకు రూ.25 కోట్లు, నగరికి రూ.15 కోట్లు కేటాయిస్తున్నట్లు సమగ్ర ప్రాజెక్టు నివేదికలో పేర్కొన్నారు. ఇందులో 40 శాతం నిధులను ప్రభుత్వం, 60 శాతం నిధులు ప్రైవేటు డెవలపర్లు సమకూరుస్తున్నట్లు పేర్కొన్నారు. వాస్తవానికి 40 శాతం నిధులు ఆయా మునిసిపాటీలకు చెందిన డబ్బులే. భవన నిర్మాణ సమయంలో ప్రతి మునిసిపాలిటీకి ప్రజలు చెల్లించే రుసుములు పట్టణ–గ్రామీణ ప్రణాళిక సంచాలకత్మం (డీటీసీపీ) ఖాతాలో జమ అవుతుంది. ఇలా దాదాపు పదేళ్ల పాటు మునిసిపాలిటీలకు జమ కావాల్సిన భవన నిర్మాణ అనుమతి ఫీజులన్నీ డీటీసీపీ వద్ద ఉండిపోవడం, వాటిని ప్రభుత్వం ఇతర అవసరాలకు వాడుకోవడం జరిగిపోయింది. తాజాగా ‘హాం’ కింద ఈ 40 శాతం నిధులు మునిసిపాలిటీలకు సమకూరుస్తూ, మిగిలిన 60 శాతం డెవలపర్లు అప్పుగా ఇవ్వనున్నారు. కాంట్రాక్టర్లు కనుమరుగు.. ఇందులో మరో మతలబు కూడా ఉంది. ప్రైవేటు డెవలపర్ల ప్రమేయంతో మునిసిపాలిటీలో చిన్నా, చితక పనులు చేసుకుంటున్న కాంట్రాక్టర్ల ఉనికి ‘హాం’తో పూర్తిగా కనుమరుగు కానుంది. కేవలం బడా కార్పొరేట్ కంపెనీలు, పేరుమోసిన సంస్థలు మాత్రమే టెండర్లలో పాల్గొంటాయి. సామాన్య కాంట్రాక్టర్లు అంత మొత్తం పెట్టుబడులు పెట్టడం, బ్యాంకు నుంచి రూ.వందల కోట్ల రుణాలు పొందడం అసాధ్యం. ఫలితంగా రూ.పది లక్షల లోపు పనులు చేసుకునే కాంట్రాక్టర్లు భవిష్యత్తులో మునిసిపాలిటీల్లో కనిపించకపోవచ్చని పలువురు ఆందోళన చెందుతున్నారు. మున్సిపాలిటీలను అప్పుల్లో దింపడమే లక్ష్యం -
శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాలు
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలో మూడవ రోజైన గురువారం పవిత్రోత్సవాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. నిత్య పూజల్లో జరిగే దోషాలను సరిచేసేందుకు ఈ పూజలు చేస్తారు. ఇందులో భాగంగా ఆలయంలోని యాగశాలలో వేదపండితులు, అర్చకులు శ్రీ–కాళ–హస్తి, భరద్వాజ మహర్షికి అభిషేకాలు, పూజలు చేశారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించి ధూప, దీప నైవేద్యాలు సమర్పించారు. శ్రీకాళహస్తీశ్వరాలయ అధికారులు పూజా ద్రవ్యాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈవో బీకే వెంకటేశులు, పాలకమండలి సభ్యులు, వేదపండితులు, అర్చకులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. -
రసాయన రహిత మామిడితో ఆదాయం
తిరుపతి కల్చరల్: రైతులు రసాయన అవశేషాలు లేని, నాణ్యత కలిగిన మామిడి ఉత్పత్తులు పండించినప్పుడే మంచి గిట్టుబాటు ధరతో పాటు, ఎలాంటి ఆటంకాలు లేకుండా విదేశాలకు మామిడి ఉత్పత్తులు ఎగుమతి చేసి ఆదాయం పొందవచ్చని రాస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్.వెంకటరత్నం తెలిపారు. రాస్, రాస్ కృషి విజ్ఞానకేంద్రం ఆధ్వర్యంలో కోకాకోలా ఇండియా పౌండేషన్, న్యూడిల్లీ వారి సహకారంతో గురువారం రాస్ సేవా నిలయంలో మామిడిలో సుస్థిర ఆదాయ మె లకువలపై రైతులకు శిక్షణ చేపట్టారు. ఆయన మాట్లాడుతూ రైతులు శాస్త్రవేత్తలు సూచించిన ప్రకారం యాజమాన్య పద్దతులు పాటించి, జీవన ఎరువులు ,సూక్ష్మ పోషకాలు వాడాలని తెలిపారు. సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ ఉన్నతి మ్యాంగో ప్రాజెక్టులో భాగంగా ఇది వరకే చేపట్టిన వివిధ కార్యక్రమాలు, వాటి ప్రభావం గురించి వివరించారు. ఉద్యాన శాస్త్రవేత్త పీఎస్.సుధాకర్ మాట్లాడుతూ కొమ్మ కత్తిరింపులు చేసిన తోటలలో యూరియా 10 గ్రాము లు, సూఓ్మపోషకాల మిశ్రమం 5 గ్రాముల చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారి చేస్తే త్వరగా కొత్త చిగురు పెరిగి పూత తొందరగా వస్తుందని తెలిపారు. జీవన ఎరువులైన అజోస్పైరిల్లం, ఫాస్పోబాక్టిరియా, పొటాషియం మొబిలైజింగ్ బాక్టీరియాల మిశ్రమాన్ని వినియోగించటం ద్వారా తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి పొందవచ్చని తెలిపారు. విస్తరణ శాస్త్రవేత్త రాముకుమార్ మాట్లాడుతూ కృషి విజ్ఞాన కేంద్రం చేపడుతున్న భూసార పరీక్ష ఆధారిత ఎరువుల యాజమాన్యం, ఆహార ఉ ద్యాన పంటలలో ఎల్‌నినో పరిస్థితుల్లో తీసుకోవాల్సిన మెలకువలు, వ్యవసాయ డ్రోన్ సాంకేతికత గురించి వివరించారు. ఈ సందర్భంగా వంద మంది మామిడి రైతులకు ప్రదర్శనా క్షేత్రాల నిర్వహణ కోసం ఎన్పీకే జీవన ఎరువుల మిశ్రమం, కానుగ నూనె, సూక్ష్మ పోషకాల మిశ్రమం, మ్యాంగో స్పెషల్ పంపిణీ చేశారు. మిలటరీ స్కూల్స్‌లో ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు తిరుపతి అర్బన్: రాష్ట్రీయ మిలటరీ స్కూల్స్‌లో 2027–28 సంవత్సరంలో 6, 9 తరగతుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ విడుదలైనట్లు కోచింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షుడు, విశ్వం పోటీ పరీక్షల సమాచార కేంద్రం అధినేత ఎన్.విశ్వనాథ్ రెడ్డి గురువారం తెలిపారు. ఈ ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల సమర్పణకు అక్టోబర్ 20 వరకు గడువు ఉందని చెప్పారు. డిసెంబర్ 13న పరీక్ష ఉంటుందని తెలిపారు. నిర్దేశిత వయోపరిమితి, అర్హతలకు అనుగుణంగా ప్రస్తుతం 5 నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు అర్హులని తెలిపారు. అర్హతలు, వయోపరిమితి, దరఖాస్తు, పరీక్షా విధానం, శిక్షణ, మాక్ టెస్టుల వివరాల కోసం 86888 88802, 93999 76999 నంబర్లను తిరుపతి వరదరాజనగర్‌లోని విశ్వం సైనిక్–నవోదయ పోటీ పరీక్షల కేంద్రాన్ని సంప్రదించవచ్చని సూచించారు. -
23 మంది విద్యార్థులకు అస్వస్థత
బైరెడ్డిపల్లె: మండలంలోని ఓ ప్రాథమిక పాఠశాలలో గురువారం పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపిన వివరాల మేరకు.. చిక్కనపల్లె ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయుడు పాఠశాలలోని విద్యార్థులకు ప్రతి రోజు ఆయుర్వేద వైద్యం పేరుతో కొన్ని ఆకులు, సుగంధ ద్రవ్యాలు ఇచ్చేవారు. గురువారం కూడా విద్యార్థులు ఆకులు, ద్రవ్యాలు ఇచ్చారు. మధ్యాహ్న భోజనం తిన్న తర్వాత ఆశా వర్కర్ పాఠశాలకు వచ్చి విద్యార్థులకు ఐరన్ మాత్రలు ఇచ్చారు. ఆ తర్వాత 23 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో బాధపడ్డారు. అస్వస్థతకు కారణం ఏమైందో తెలియదు గానీ గ్రామస్తులు విషయం తెలుసుకుని 108 వాహనానికి సమాచారం అందించి బైరెడ్డిపల్లె పీహెచ్‌సీకి తరలించారు. అక్కడి వైద్యులు చికిత్స నిర్వహించి ఎలాంటి ప్రమాదం లేదని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న ఎంఈవో దేశమ్మ బైరెడ్డిపల్లె పీహెచ్సీ చేరుకుని విద్యార్థుల యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తున్నట్టు తెలిపారు. -
సిఫారసుల్లేని పాలన
మాట్లాడుతున్న జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు చిత్తూరు కలెక్టరేట్ : తమ పాలనలో జెడ్పీ ఉద్యోగుల ఉద్యోగోన్నతులు, జిల్లాల విభజనలో ఎలాంటి సిఫార్సులకు తావులేకుండా నిర్ణయాలు తీసుకున్నామని జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు అన్నారు. గురువారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. హాజరైన ఆయన మాట్లాడుతూ తమ ఐదేళ్ల పాలనలో ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, సిఫార్సులకు అవకాశం ఇవ్వకుండా సీనియారిటీ ప్రకారమే ఉద్యోగోన్నతులు, కారుణ్య నియమకాలు చేపట్టామని తెలిపారు. జిల్లాల పునర్విభజనలో ఉద్యోగుల విభజన అనివార్యమైందన్నారు. ఇందులోనూ ఎలాంటి సిఫార్సులకు తావివ్వకుండా సీనియారిటీ ప్రాతిపదికన జిల్లాలను కేటాయించా మని తెలిపారు. తనవల్ల ఏ ఉద్యోగి అయినా ఇబ్బంది పడి ఉంటే క్షమించాలని కోరుతూ భావోద్వేగానికి గురయ్యారు. గురువారంతో ప్రస్తుత జెడ్పీ పాలకవర్గం పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో ఆయన చివరి ప్రసంగం భావోద్వేగభరితంగా సాగింది. అనంతరం జెడ్పీ సీఈఓ రవికుమార్ నాయుడు ఉద్యోగుల సమక్షంలో సీనియారిటీ జాబితా ఆధారంగా వారికి జిల్లాల కేటాయింపు ప్రక్రియను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
ప్రజా ధనం..
హామీల అమలెక్కడ బాబు ? చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిరుద్యోగ భృతి ఊసే లేదు. నిరుద్యోగ భృతి కోసం జిల్లా వ్యాప్తంగా 4.15 లక్షల మంది యువత ఎదురుచూస్తున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు 50 ఏళ్లకే పింఛను హామీ అమలు కాలేదు.ఈ హామీ కోసం జిల్లాలో 2.58 లక్షల మంది ఎదురు చూపులు చూడాల్సిన దుస్థితి. ఆడబిడ్డ నిధి కింద మహిళలకు నెలకు రూ.1500 ఇస్తామన్న హామీని కూటమి ప్రభుత్వం మరిచిపోయింది. చిత్తూరు కలెక్టరేట్ : ఎన్నికల ముందు ఇచ్చిన నెరవేర్చలేని బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం, ఇప్పుడు ప్రజా ధనంతో విచ్చలవిడిగా ప్రచారాలు చేసుకునేందుకు సరికొత్త నాటకానికి తెరతీసింది. సంక్షేమ పథకాలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైన చంద్రబాబు ప్రభుత్వం, తమ సొంత ప్రచారానికి ‘సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్స్’ను నియమించుకునేందుకు విచిత్రమైన పాలసీకి శ్రీకారం చుట్టింది. పాలసీకి కేబినెట్ సైతం ఆమోదం తెలపడంపై జిల్లాలోని ప్రజలతో పాటు పలువురు మేధావులు, యువత, విద్యార్థి సంఘ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ప్రజాధనం ఐటీడీపీ కార్యకర్తల పాలేనా? – రూ.25 వేల నుంచి రూ.1.5 లక్షల వరకు నజరానా ప్రభుత్వ పథకాలు, నిర్ణయాలను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసేందుకు వేల రూపాయిల ప్రజాధనాన్ని ఇన్‌ఫ్లూయెన్సర్స్‌కు పంచిపెట్టేందుకు సిద్ధమయ్యారు. ఫాలోవర్ల సంఖ్యను బట్టి నెలకు రూ.25 వేల నుంచి ఏకంగా రూ.1.50 లక్షల వరకు చెల్లించేలా నిబంధనలు రూపొందించారు. టీడీపీ శ్రేణులకు ఈ నిధులను దోచిపెట్టేందుకు ఈ విచిత్ర పాలసీని తీసుకొచ్చారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజా సమస్యలు గాలికి.. జిల్లాలో రైతులు, పేదలు, విద్యార్థులు, నిరుద్యోగులు అనేక సమస్యలతో అల్లాడుతుంటే, వారిని ఆదుకోవాల్సిన ప్రభుత్వం తన సొంత డబ్బా కొట్టుకోవడం కోసం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని సోషల్ మీడియా కార్యకర్తలకు ధారపోస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హామీలు నెరవేర్చని ప్రభుత్వం, విమర్శలను అణచివేసేందుకు, అసత్యాలను ప్రచారం చేసేందుకు ప్రజల సొమ్ముతో పబ్లిసిటీ చేయడం ఎంతవరకు సమంజసం అని మేధావి వర్గాలు, యువత, విద్యార్థి సంఘాల నాయకులు, వామపక్ష పార్టీలు సూటిగా ప్రశ్నిస్తున్నాయి. విచిత్ర పాలసీకి తెరలేపిన చంద్రబాబు ప్రభుత్వం -
మృత్యువులోనూ వీడని స్నేహ బంధం
యాదమరి: అతివేగం.. అజాగ్రత్తగా వాహనం నడపడం ఇద్దరు స్నేహితుల ప్రాణాలను బలితీసుకుంది. రహదారిపై మృత్యువు రూపంలో దూసుకొచ్చిన టాటా ఏస్ వాహనం ద్విచక్రవాహనాన్ని బలంగా ఢీకొనడంతో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. యాదమరి మండలంలో బుధవారం అర్ధరాత్రి సమయంలో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంతో రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. స్థానిక ఎస్ఐ ఈశ్వర్ కథనం మేరకు.. వైఎస్సార్ కడప జిల్లా వేంపల్లి మండలం నాగూరు గ్రామానికి చెందిన రామచంద్రారెడ్డి కుమారుడు రాంప్రసాద్‌రెడ్డి(21) ముత్తిరేవుల సమీపంలోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. బుధవారం రాత్రి రాంప్రసాద్ తన స్నేహితుడైన చిత్తూరు పెద్ద హరిజనవాడకు చెందిన సురేష్ కుమారుడు ధనుష్(21)తో కలసి ద్విచక్రవాహనంలో ఓ ప్రైవేటు కార్యక్రమానికి వెళళ్లారు. అక్కడ నుంచి పని ముగించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో మండల పరిధి వరిగపల్లి జంక్షన్ వద్ద ఉన్న సర్వీసు రోడ్డులో ఎదురుగా వస్తున్న వీరి వాహనాన్ని టాటా ఏస్ వాహనం ఢీకొంది. ఈ ఘోర ప్రమాదంలో రాంప్రసాద్‌రెడ్డి తీవ్ర గాయాలతో అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వారు హుటాహుటిన ఘటన స్థలికి చేరుకున్నారు. తీవ్ర రక్తగాయాలతో మృత్యువుతో పోరాడుతున్న ధనుష్‌ను 108 అంబులెన్సు ద్వారా చితూరు ప్రభుత్వాసుపత్రికి తరలిలించారు. అయితే అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఇంజినీరింగ్ చదివి గొప్ప వాడై తమకు అండగా నిలుస్తాడని ఎన్నో ఆశలు పెట్టుకున్న రాంప్రసాద్ ఆసుపత్రిలో విగతిజీవిగా ఉండడాన్ని చూసి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఎస్ఐ ఈశ్వర్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా రోడ్డు ప్రమాదాల నివారణకు వాహనదారులు పరిమిత వేగంతో ప్రయాణించాలని, రహదారి భద్రతా నియమాలు విధిగా పాటించి ప్రమాదాల బారీన పడకుండా విలువైన ప్రాణాలు కాపాడుకోవాలని ఎస్ఐ సూచించారు. -
● అధికార నందివాహనంపై గణనాథుడు
అధికార నంది వాహనంపై ఊరేగుతున్న వరసిద్ధి వినాయకుడుప్రత్యేక ఉత్సవాల్లో భాగంగా గురువారం కాణిపాకంలో శ్రీసిద్ధి బుద్ధి సమేత వినాయకస్వామి అధికార నంది వాహనంపై కటాక్షించారు. కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి క్షేత్రంలో గురువారం ప్రత్యేక ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈసందర్భంగా మూలవిరాట్ అభిషేక పూజలు చేయించారు. అనంతరం భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. రాత్రి వళ్లువర్ వంశస్తుల ఆధ్వర్యంలో అధికార నంది వాహన సేవను నిర్వహించారు. తొలుత ఉత్సవమూర్తిని అలంకరించి నంది వాహనంపై ఆశీనులను చేశారు. ప్రత్యేక పూజలు చేసి గ్రామోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఊరేగింపుగా వస్తున్న స్వామి వారికి భక్తులు కర్పూర హారతులు పట్టి తరించారు. – కాణిపాకం -
చెరువు భూమి కబ్జా
పలమనేరు: పట్ణణ సమీపంలోని ఎక్స్‌ప్రెస్ హైవేకి ఆనుకుని ఉన్న టీఎస్ అగ్రహారం కొత్త చెరువు గట్టుపై చెరువు భూమిని కొందరు అధికార పార్టీ నేతల అండదండలతో ఆక్రమించుకుంటున్నారు. ఇప్పటికే జేసీబీ వాహనాలను పెట్టి చెరువు పోరంబోకు మూడెకరాలను ఆక్రమించేశారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం అసలు పట్టించుకోలేదు. చుట్టుపక్కల గ్రామాలకు చెందిన చెంగప్ప, క్రిష్ణప్ప, రమేష్, మహేష్ ఈ చెరువు భూమిని ఆక్రమించుకున్నారు. తమకు స్థానిక ఎమ్మెల్యే చెప్పారని ఆక్రమణదారులు చెప్పడం గమనార్హం. ఇంత జరుగుతున్నా ఇరిగేషన్ అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. ఇరిగేషన్ అధికారులు అధికార పార్టీకి ఏజెంట్లా మారాడనే మాట వినిపిస్తోంది. కనీసం రెవెన్యూ ఉన్నత అధికారులైనా దీనిపై చర్యలు తీసుకుంటారా అనుకుంటే వారు కూడా అధికార పార్టీ నాయకులు ఒత్తిళ్లను భరించలేక దీర్ఘకాలిక సెలవులో వెళ్ళిపోయారంటే ఇక్కడ పరిస్థితి ఎలాగుందో అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనా చెరువుకు సంబంధించిన లక్షల రూపాయల విలువజేసే భూమి పరులపాలు కానుంది. దీనిపై జిల్లా కలెక్టర్ అయినా చొరవచూపి వెంటనే చర్యలు తీసుకోవాల్సి ఉంది. -
ఆదివాసీలు ఆర్థికంగా బలోపేతం కావాలి
చిత్తూరు కలెక్టరేట్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆదివాసీలు ఆర్థికంగా బలోపేతం కావాలని ఆదివాసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సురేష్ తెలిపారు. నగరంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో బుధవారం ఆ సంఘం నాయకులు సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఆదివాసీల సమస్యలను పరిష్కరించాలన్నారు. ఎన్నికల హామీలను అమలు చేయాలన్నారు. ఆల్ ఇండియా ఎస్సీ, ఎస్టీ ఐక్యవేదిక ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మునస్వామి మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న కుల వివక్షను రూపుమాపేందుకు ఆదివాసీలు, దళితులు ఐక్యమత్యంగా పోరాటాలు చేయాలన్నారు. నూతన జిల్లా అధ్యక్షుడు కుమార్ మాట్లాడుతూ జిల్లా, డివిజన్, నియోజకవర్గ, మండల, పంచాయతీ స్థాయిల్లో కమిటీలను ఏర్పాటు చేసి ఆదివాసీల సంక్షేమం, అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఈ సమావేశంలో భీమ్ ఆర్మీ ఆర్గనైజింగ్ సెక్రటరీ పార్థసారథి, మేదర సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు మురళి, అంబేద్కర్ యువజన సంఘం కన్వీనర్ బాబు తదితరులు పాల్గొన్నారు. నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష యాదమరి: అదనపు కట్నం కోసం భార్యను వేధించి, ఆమె ఆత్మహత్యకు కారణమైన నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష, రూ.పది వేల జరిమానా విధిస్తూ బుధవారం చిత్తూరు ఆరవ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి హరిత తీర్పు చెప్పారు. యాదమరి ఎస్ఐ ఈశ్వర్ కథనం మేరకు.. మండల పరిధి రామభద్రాపురం గ్రామానికి చెందిన సతీష్‌కు కళైవాణి అనే యువతితో వివాహం జరిగింది. కొద్ది రోజులకే అదనపు కట్నంగా రూ.50 వేలు తీసుకురావాలని భార్యను శారీరకంగా, మానసికంగా వేధించేవాడు. ఈ క్రమంలో వేధింపులకు తాళలేక కళైవాణి 2015 జనవరిలో అదే గ్రామంలోని ఓ చెరువు పాకలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్ఐ రఘుపతి కేసు నమోదు చేయగా, డీఎస్పీ లక్ష్మినాయుడు దర్యాప్తు చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి శిక్ష ఖరారు చేశారు. విలేజ్ సర్వేయర్‌కు పాముకాటు గుడిపాల: గుడిపాల మండలంలో రీ–సర్వే విధులు నిర్వహిస్తున్న విలేజ్ సర్వేయర్ భవ్య బుధవారం పాముకాటుకు గురయ్యారు. ఆమె 190 రామాపురం రెవెన్యూ పరిధిలో రీసర్వే పనులు చేస్తున్నారు. పాము కాటు వేయడంతో అస్వస్థతకు గురయ్యారు. గమనించిన సహోద్యోగులు వెంటనే చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గుడిపాల ఎంపీపీ గోళ్ల హరిప్రసాద్ ఆసుపత్రికి వెళ్లి ఆమెను పరామర్శించారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో రీసర్వే పనులు చేసే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎంపీపీ సూచించారు. -
నేటి నుంచి ప్రత్యేక ఉత్సవం ప్రారంభం
కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి క్షేత్రంలో గురువారం నుంచి ప్రత్యేక బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయని ఈవో పెంచల కిషోర్ తెలిపారు. ఇందులో భాగంగా ఉదయం స్వామికి అభిషేకం ఉంటుందన్నారు. రాత్రికి స్వామి అధికార నంది వాహనంపై ఊరేగుతూ భక్తులను కటాక్షిస్తారని పేర్కొన్నారు. ఇందుకు కాణిపాకం పళ్లువర్ వంశస్తులు ఉభయదారులుగా వ్యవహరించనున్నారని తెలిపారు. జీతాలు ఇవ్వాలని డీఈఓకు వినతి చిత్తూరు కలెక్టరేట్: హై స్కూల్ ప్లస్‌లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు జీతాలు మంజూరు చేయాలని ఏపీటీఎఫ్ నాయకులు కోరారు. వారు బుధవారం డీఈఓ లక్ష్మీనారాయణకు వినతి పత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ ఎంటీఎస్ ఉపాధ్యాయులకు పెండింగ్ జీతాలు మంజూరు, మధ్యాహ్నం భోజన పథకం నిర్వహణకు జూన్ నుంచి బకాయిలు విడుదల చేయాలన్నారు. ప్రతి నెలా జరుగుతున్న సీఆర్సీ సమావేశాల్లో ఏకోపాధ్యాయ పాఠశాల ఉపాధ్యాయులు హాజరుకాలేకపోతున్నారని, పాఠశాల నిర్వహణకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో ఫెడరేషన్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చలపతిరావు, గిరిబాబు, నాయకులు చంగల్రాయమందడి, దేవానంద్, ధనుంజయలు పాల్గొన్నారు. చురుగ్గా ఎస్ఐఆర్ ప్రక్రియ చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ పారదర్శకంగా, వేగవంతంగా నిర్వహిస్తున్నట్లు డీఆర్వో మోహన్ కుమార్ తెలిపారు. ఆయన బుధవారం కలెక్టరేట్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలోని నగరి, జీడీ నెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పం నియోజకవర్గాల్లో ఈ నెల 22వ తేదీ నాటికి మొత్తం 1,34,307 నోటీసులు జారీ చేసి విచారణ పూర్తి చేశామన్నారు. 2026 జనవరి 1 నుంచి సెప్టెంబర్ 22 వరకు జిల్లాలో ఆఫ్‌లైన్, ఆన్లైన్లో మొత్తం 2,22,096 ఫారాలు నమోదైనట్లు చెప్పారు. వీటిలో పరిశీలన అనంతరం 2,10,466 ఫారాలు రోల్ అప్డేట్కు ఆమోదం పొందాయన్నారు. కొత్త ఓటర్ల నమోదుకు (ఫారమ్–6)లో 31,931 దరఖాస్తులు వచ్చాయని, వాటిలో 24,684 దరఖాస్తులు ఆమోదం పొందినట్టు పేర్కొన్నారు. 3,055 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. పకడ్బందీగా ఫొటో నాణ్యత పరిశీలన జిల్లా వ్యాప్తంగా ఫొటో నాణ్యత పరిశీలన ప్రక్రియ పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు డీఆర్వో వెల్లడించారు. జిల్లాలోని మొత్తం 12,04,067 మంది ఓటర్లలో ఇప్పటి వరకు 10,52,741 ఫొటోలు అప్లోడ్ అయ్యాయన్నారు. బీఎల్వోల పరిశీలనలో 9,20,404 ఎస్ఐఆర్ ఫొటోలు ఆమోదం పొందాయన్నారు. బీఎల్వోల వద్ద పెండింగ్ లేవని, ఈఆర్వో, ఏఈఆర్ఓ స్థాయిలో 2.14 శాతం పెండింగ్‌లో ఉన్నట్లు వెల్లడించారు. ఓటర్ల జాబితాలో ఎలాంటి తప్పులు లేకుండా, అర్హులందరికీ అవకాశం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు సైతం క్షేత్రస్థాయి పరిశీలనలో తమ సూచనలు అందించవచ్చని తెలిపారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ నుంచి విజయసింహారెడ్డి, ఉదయ్, ఆమ్ఆద్మీ పార్టీ నుంచి బాలసుబ్రహ్మణ్యం, బీఎస్పీ నుంచి సురేంద్రబాబు, బీజేపీ నుంచి అట్లూరి శ్రీనివాసులు, సీపీఐ నుంచి వాడ గంగరాజు పాల్గొన్నారు. ప్రాణదాన ట్రస్ట్‌కు రూ.10 లక్షల విరాళం తిరుమల : టీటీడీ ఆధ్వర్యంలోని ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్‌కు హైదరాబాద్ మణికొండకు చెందిన కొండూరు రాజేశ్వరి, సుబ్రమణ్యం దంపతులు రూ.10 లక్షల విరాళం అందజేశారు. సోమవారం టీటీడీ చైర్మన్న్ బీఆర్ నాయుడిని క్యాంపు కార్యాలయంలో కలిసి విరాళం చెక్కును అందించారు. ఈ సందర్భంగా దాత దంపతులకు చైర్మన్ కృతజ్ఞతలు తెలిపారు. -
ఆగని తుమ్మింద గ్రానైట్ దందా!
చిత్తూరు మండలం తుమ్మింద గ్రామంలో గ్రానైట్ అక్రమ తవ్వకాల దందా హద్దు మీరుతోంది. స్థానిక ప్రజాప్రతినిధి, ఆయన బంధువుల అండ చూసుకుని గ్రానైట్ మాఫియా రెచ్చిపోతోంది. రూ.కోట్ల విలువైన ప్రకృతి సంపదను యథేచ్ఛగా దోపిడీ చేస్తోంది. క్వారీ నిర్వాహకుల నుంచి రూ.కోట్లు మామూళ్లు డిమాండ్ చేయడం, ఇవ్వకపోతే దౌర్జన్యాలకు దిగి క్వారీలనే హస్తగతం చేసుకోవడం ఇక్కడ నిత్యకృత్యంగా మారింది. సాక్షి టాస్క్‌ఫోర్స్: తుమ్మింద ప్రాంతంలో లభ్యమయ్యే గ్రానైట్ ఎంతో నాణ్యమైనది. దీనికి మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉంది. రూ.కోట్లు విలువ చేసే నల్ల బంగారం కావడంతో దీనిపై ప్రజాప్రతినిధి బంధువు కన్ను పడింది. క్వారీ నిర్వాహకుడిని పిలిపించి రూ.3 కోట్లు మామూళ్లు ఇవ్వాలని హుకుం జారీ చేశాడు. అంత పెద్ద మొత్తంలో ఇచ్చుకోలేనని సదరు నిర్వాహకుడు చేతులెత్తేయడంతో బెదిరింపుల పర్వం మొదలైంది. దౌర్జన్యంగా క్వారీ స్వాధీనం..? మామూళ్లు రాకపోవడంతో కక్ష పెంచుకున్న ఆ ప్రజాప్రతినిధి బంధువు దౌర్జన్యానికి దిగాడు. క్వారీ నిర్వాహకుడిని బెదిరించి పక్కకు నెట్టేసి, క్వారీ నిర్వహణను తన చేతుల్లోకి తీసుకున్నాడు. యంత్రాలు పెట్టి రాత్రింబవళ్లు చట్టవిరుద్ధంగా గ్రానైట్ రాళ్లను తోడేస్తున్నాడు. కొన్నాళ్లు బంద్.. మళ్లీ షురూ సదరు ప్రజా ప్రతినిధి బంధువు వేధింపులు, దౌర్జన్యాలను తట్టుకోలేక బాధితుడు గతంలో ఆధారాలతో సహా జిల్లా కలెక్టర్, ఎస్పీతో పాటు రాష్ట్ర స్థాయి అధికారులను ఆశ్రయించినట్లు తెలిసింది. ప్రజాప్రతినిధి బంధువు చేస్తున్న అక్రమాల చిట్టాను వారి ముందుంచాడని సమాచారం. ఈ విషయం తెలిసి ఆ బంధువు కొన్నాళ్ల క్రితం ఆ అక్రమ క్వారీని బంద్ చేయించాడు. అధికారుల తనిఖీలు సడలడం, రాజకీయ ఒత్తిళ్లు పెరగడంతో గడిచిన నెలరోజులుగా మళ్లీ అక్కడ అక్రమ క్వారీ దందా ముమ్మరంగా సాగుతోంది. రోజుకు పదుల సంఖ్యలో లారీల్లో నల్ల బంగారాన్ని సరిహద్దులు దాటించేస్తున్నారు. ఈ వ్యవహారం మళ్లీ జిల్లా కలెక్టర్ చెవిలో పడడంతో అధికార వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. రూ.3 కోట్లు ఇవ్వాలని క్వారీ నిర్వాహకుడికి బెదిరింపులు కూటమి నేతల భగ్గు.. ప్రజాప్రతినిధి, ఆయన బంధువులు, అనుచరుల హద్దుమీరిన అక్రమాలు, దౌర్జన్యాలపై సొంత పార్టీ నేతలే తీవ్రస్థాయిలో భగ్గుమంటున్నారు. నియోజకవర్గంలో పార్టీ ప్రతిష్టను, ప్రభుత్వం తెచ్చిన మంచి పేరును ఈ ప్రజాప్రతినిధి, ఆయన అనుచరులు తమ స్వార్థం కోసం నాశనం చేస్తున్నారని బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులను బెదిరించి, క్వారీ నిర్వాహకులను లొంగదీసుకుంటూ సాగిస్తున్న ఈ మాఫియా రాజ్యాంగంపై కూటమిలోని ముఖ్య నాయకులు, కార్యకర్తలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ అక్రమ దందాలపై పూర్తి ఆధారాలతో కూడిన నివేదికను పార్టీ అధిష్టానానికి ఫిర్యాదుల రూపంలో పంపుతున్నారు. -
రైలు ఢీకొని యువకుడి మృతి
చిత్తూరు కార్పొరేషన్: ఒక యువకుడు ఫోన్ మాట్లాడుతూ రైలు వస్తున్న విషయాన్ని గుర్తించలేకపోయాడు. రైలు ఢీకొనడంతో మృతిచెందాడు. ఈ సంఘటన బుధవారం జరిగింది. రైల్వే ఎస్ఐ నరసింహులు కథనం మేరకు.. స్థానిక బండపల్లెలో జరిగిన చావుకు డప్పు కొట్టడానికి జీడీనెల్లూరు మండలం ఎస్ఎస్ కొండ గ్రామానికి చెందిన మంజునాథ(22) బృందంతో పాటు వచ్చాడు. సమీపంలోని అంగడికి వెళ్లి వస్తువులు కొనుక్కొని తిరిగి వచ్చే సమయంలో ఫోన్ మాట్లాడుతూ రైల్వే ట్రాక్ దాటుతున్నాడు. అటువైపు వస్తున్న తిరుచిరాపల్లె ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొనడంతో మృతి చెందాడు. ఈ విషయాన్ని మృతుడి కుటుంబ సభ్యులకు తెలియజేసి మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి పంపించినట్టు ఎస్ఐ తెలిపారు. పవిత్రోత్సవాలకు అంకురార్పణ చంద్రగిరి: తిరుచానూరు పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలు మూడు రోజులు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ చేశారు. విష్వక్సేనారాధన, పుణ్యా హవచనం, మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణం, పవిత్ర అధివశం నిర్వహించారు. ఆలయంలో సంవత్సరం పొడవునా పలు క్రతువుల్లో తెలియక జరిగిన దోషాల నివారణకు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా గురువారం పవిత్ర ప్రతిష్ట, శుక్రవారం పవిత్ర సమర్పణ, 26న పూర్ణాహుతి చేపడతారు. భక్తులు ఒక్కొక్కరు రూ.750లు చెల్లించి ఒకరోజు ఈ పవిత్రోత్సవాల్లో పాల్గొనవచ్చని అధికారులు తెలిపారు. గృహస్తులకు 2 లడ్డూలు, 2 వడలు బహుమానంగా అందజేయనున్నట్లు తెలిపారు. -
ముగిసిన వరసిద్ధుడి బ్రహ్మోత్సవాలు
కాణిపాకం: స్వయంభు శ్రీవరసిద్ధి వినాయకస్వామి నవరాత్రి బ్రహ్మోత్సవాలు బుధవారం ధ్వజావరోహణంతో ముగిశాయి. ఉదయం ఆలయ పుష్కరిణిలో త్రిశూలానికి శాస్త్రోక్తంగా పవిత్ర స్నానం చేయించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ సిద్ధి, బుద్ధి సమేత వినాయకుడి ఉత్సవమూర్తులను, త్రిశూలాన్ని ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు తీసుకెళ్లారు. యాగశాలలో ఏర్పాటు చేసిన 108 కలశాలలోని తీర్థాలను పుష్కరిణిలో కలిపి త్రిశూలానికి పవిత్ర స్నానం చేయించారు. భక్తులు పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు. కనుల పండువగా వసంతోత్సవం త్రిశూల స్నానం అనంతరం వసంతోత్సవాన్ని కోలాహలంగా నిర్వహించారు. స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు రంగు నీళ్లు చల్లుకుంటూ దేవస్థానం సిబ్బంది, గ్రామస్తులు, భక్తులు ఉత్సాహంగా ఊరేగించారు. అనంతరం యాగశాలలోని పర్యవేక్షణ యాగమూర్తికి ముగింపు హోమం, ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం స్వర్ణ ధ్వజస్తంభానికి అభిషేక పూజలు చేశారు. మూషిక చిత్రపటాన్ని శాస్త్రోక్తంగా అవరోహణ చేశారు. -
శాస్త్రోక్తం.. చక్రస్నానం
తిరుపతి రూరల్ : తుమ్మలగుంట శ్రీకల్యాణ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు బుధవారంతో విజయవంతంగా ముగిశాయి. ఉత్సవాల్లో చివరి రోజు ఉదయం పుష్కరిణిలో శాస్త్రోక్తంగా చక్రస్నానం, మహా పూర్ణాహుతి చేపట్టారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీకల్యాణ వేంకటేశ్వర స్వామి, సుదర్శన చక్రత్తాళ్వార్లకు వేడుకగా స్నపన తిరుమంజనం జరిపించారు. అనంతరం పుష్కరణి సంప్రోక్షణ, హారతి సమర్పించారు. సుదర్శన చక్రాన్ని పుష్కరిణిలోకి తీసుకువెళ్లి పవిత్ర స్నానం చేయించారు. అనంతరం భక్తులు గోవింద నామస్మరణతో పుణ్యస్నానాలు ఆచరించారు. ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, లక్ష్మి దంపతులు, మోహిత్‌రెడ్డి, హర్షిత్‌రెడ్డి, వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. లోక సంక్షేమం కోసం.. బ్రహ్మోత్సవాల్లో స్వామివారి వెన్నంటి ఉండి వాహన సేవలు, వైదిక క్రతువుల్లో పాల్గొన్న చక్రతాళ్వార్‌కు చక్రస్నానం నిర్వహించడం ఆనవాయితీ. లోక సంక్షేమం, భక్తుల సుఖశాంతులను కాంక్షిస్తూ ఈ పవిత్ర క్రతువును నిర్వహిస్తారు. అనంతరం తిరుచ్చి వాహనంపై శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి, చక్రతాళ్వార్ విహరించారు. యాగశాలలో మహా పూర్ణాహుతి నిర్వహించి, కుంభజలంతో గర్భాలయంలో సంప్రోక్షణ చేపట్టారు. సాయంత్రం 7 నుంచి 9గంటల మధ్య ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు సంపూర్ణమయ్యాయి. అందరి సహకారంతోనే.. తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు గ్రామస్తులు, భక్తులు, ప్రజలు, ప్రభుత్వ అధికారులు, పోలీసులు, ఆలయ సిబ్బంది అందరి సహకారంతో విజయవంతంగా ముగిశాయని ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తెలిపారు. బ్రహ్మోత్సవాల నిర్వహణకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. -
ఎమ్మెల్యే పీఏ సర్వీస్ రూల్స్ ధిక్కరణ
సాక్షి టాస్క్‌ఫోర్స్: ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అధికారిక పీఏ కుమారస్వామి సర్వీస్ రూల్స్ ధిక్కరించారంటూ వైఎస్సార్ సీపీ 12వ డివిజన్ అధ్యక్షుడు కిషోర్‌యాదవ్ ఆరోపించారు. ఆయన బుధవారం కలెక్టరేట్లో డీఆర్వో మోహన్‌కుమార్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. చిత్తూరు ఎమ్మెల్యే పీఏగా వ్యవహరిస్తూ, ఇరిగేషన్ శాఖలో పనిచేస్తున్న పల్లెబోయిన కుమారస్వామి యాదవ్ ఈ నెల 22న నిర్వహించిన విలేకరుల సమావేశం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ నిబంధనలకు విరుద్ధంగా ప్రెస్‌మీట్ నిర్వహించడమే కాకుండా, సర్వీస్ రూల్స్‌ను బేఖాతరు చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. చిత్తూరు మండలం నాయనిచెరువులో క్వారీ నిర్వహణకు సంబంధించి వచ్చిన ఆరోపణలను ఖండించేందుకు కుమారస్వామి ప్రెస్‌క్లబ్‌లో సమావేశం ఏర్పాటు చేశారు. ప్రభుత్వ సర్వీసులో ఉన్న ఒక ఉద్యోగి కలెక్టర్ అనుమతి లేకుండా విలేకరుల సమావేశం పెట్టడం సర్వీస్ రూల్స్‌కు వ్యతిరేకం. టీడీపీ నాయకులతో కలిసి వేదిక పంచుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిష్పాక్షిక విచారణ జరపాలి ఎమ్మెల్యే పీఏ నిర్వహించిన ప్రెస్‌మీట్ వీడియో పుటేజ్, పేపర్ క్లిప్పింగ్‌లను పరిశీలించి, ఆయన నియామక వివరాలు, సర్వీస్ నిబంధనల ఉల్లంఘనపై సమగ్ర నిష్పాక్షిక విచారణ జరిపించాలని కిషోర్ యాదవ్ డీఆర్వోను కోరారు. ప్రాథమిక విచారణ ఆధారంగా నిబంధనలు ఉల్లంఘించినట్లు రుజువైతే క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
● పవిత్రం.. పునీతం
శ్రీవారి పుష్కరిణికి పోటెత్తిన భక్తులు (ఇన్సెట్) చక్రస్నానం నిర్వహిస్తున్న వేద పండితులుతిరుమల: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన బుధవారం ఉదయం శ్రీవారి పుష్కరిణిలో శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు.. విశేష సంఖ్యలో భక్తులు పుష్కరిణిలో పుణ్యస్నానమాచరించారు. ఈ క్రమంలోనే వేకువజామున శ్రీవారికి పల్లకీ ఉత్సవం జరిపించారు. భూవరాహస్వామివారి ఆలయ ముఖమండపంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారు, సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపన తిరుమంజనం చేపట్టారు.అభిషేకానంతరం పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి దివ్యప్రబంధ పాశురాలను పఠించారు. అనంతరం సుదర్శన చక్రత్తాళ్వార్లను శ్రీవారి పుష్కరిణికి తీసుకువచ్చి పవిత్ర జలాల్లో స్నానం చేయించారు. రాత్రి 7 గంటలకు బంగారు తిరుచ్చి ఉత్సవం నిర్వహించారు. అనంతరం ధ్వజావరోహణంతో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఏమి మా భాగ్యము.. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవ భువి వైకుంఠంలో అడుగిడిన మా జీవితము ధన్యము.. చక్రత్తాళ్వార్‌ను స్పృశించిన పవిత్రజలములో స్నానమాచరించిన మాదే కదా పుణ్యము.. ఉభయ దేవేరీ సమేతంగా కొలువుదీరిన శ్రీమలయప్పస్వామివారి తిరుమంజన సేవ వీక్షణంతో తరించెను మా జన్మము.. అంటూ భక్తజనులు పరవశించారు. వైకుంఠనాథుని వైభవోత్సవంలో పాలుపంచుకుని పులకించారు. ఆనందనిలయంలో కొలువుదీరిన శ్రీవేంకటేశ్వరుని దివ్యతేజోవిరాజిత మూర్తిని దర్శించుకుని పునీతులయ్యారు. -
వీడని హత్యకేసు మిస్టరీ
చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు మండలం తాళంబేడు పంచాయతీ మంగాపురంలో జరిగిన ఆనందరావు (50) దారుణ హత్య కేసు మిస్టరీ వీడడం లేదు. నెలన్నర రోజులు గడిచినా హంతకులను పట్టుకోవడంలో పోలీసులు విఫలమయ్యారు. కేసును నీరుగార్చడంలో భాగంగానే పోలీసులు ఇలా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆగస్టు 7వ తేదీ అర్ధరాత్రి చోటుచేసుకున్న ఈ దారుణ ఘటనపై పోలీసులు విచారణ మందగించడంతో అసలు కేసును మర్చిపోయారా అనే విమర్శలు వస్తున్నాయి. దోపిడీ కాదు.. పక్కా స్కెచ్? హత్య జరిగిన తొలినాళ్లలో ఇది దొంగల పని అని అందరూ భావించారు. ఇంటి అద్దాలు పగులగొట్టేందుకు నాటు బాంబులు వాడారన్న వార్తలు వచ్చాయి. పోలీసుల తనిఖీల్లో నాటు బాంబుల కోసం వాడిన టపాసుల బాక్సు, సమీపంలోని పొలంలో కత్తి, ఒక బ్యాగు లభించాయని గ్రామస్తులు పేర్కొన్నారు. పోలీసులు మాత్రం ఈ విషయాలను కొట్టిపారేస్తూ వచ్చారు. కేసు విచారణలో భాగంగా ప్రత్యేక బృందాలు తమిళనాడు వరకు వెళ్లి పలువురు అనుమానితులను విచారించాయి. గ్రామంలోని సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలించినా దొంగల ఆనవాళ్లు లభించలేదు. దీంతో ఇది దొంగతనం కోసం వచ్చిన దొంగల పని కాదని, పక్కా పథకం ప్రకారమే జరిగిందని పోలీసులు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. సమాధానం లేని ప్రశ్నలు పోలీసుల తీరుపై స్థానికుల్లోనూ, చుట్టుపక్కల గ్రామాల్లోనూ అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. దొంగల పని కాకపోతే ఒక ఇంటి పని మనిషిని మాత్రమే ఇంత దారుణంగా గొంతు కోసి చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? ఒకవేళ దోపిడీ దొంగలే అయితే ఇంట్లో ఏ ఒక్క వస్తువు లేదా నగదును తాకకుండా ఎందుకు వెళ్లిపోతారు? గొంతును 80 శాతం వరకు కోసి అంత కక్షపూరితంగా చంపడానికి ఆనందరావు చేసిన తప్పేంటి? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుంటేనే.. ఈ హత్యకు సంబంధించి గ్రామస్తుల్లో కొన్ని బలమైన అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ, పోలీసులు ఆ కోణంలో లోతుగా విచారణ జరిపేందుకు జంకుతున్నారనే చర్చ నడుస్తోంది. స్థానిక పోలీసుల విచారణ నెమ్మదించడంతో ఈ కేసును ఉన్నతాధికారులు నేరుగా పర్యవేక్షిస్తే తప్ప అసలు నిజాలు బయటకు రావని అభిప్రాయపడుతున్నారు. జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు తక్షణమే జోక్యం చేసుకుని ఆనందరావు హత్య వెనుక ఉన్న అసలు సూత్రధారులను బయటకు తీయాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
ముగిసిన విశ్వగురు సంకల్ప సిద్ధి మహాయాగం
నారాయణవనం: విశ్వగురు సంకల్పం సిద్ధించాలని, దైవబలం చేకూరాలని స్థానిక సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలో తొమ్మిది రోజులుగా నిర్వహిస్తున్న ‘భారత విశ్వగురు సంకల్ప సిద్ధి మహాయాగం‘ పూర్ణాహుతితో బుధవారం ముగిసింది. ఉదయం ఆగమ వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ సర్వ దేవత మూల మంత్ర హోమం, మహా శాంతి యాగం నిర్వహించారు. కళాశాల చైర్మన్ అశోక్‌రాజు దంపతులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, ఉపాధ్యక్షుడు కోలా ఆనంద్, జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్, నేత రమేష్ నాయుడు తదితరులు పాల్గొని హోమ గుండంలో పూర్ణాహుతి సమర్పించారు. యాగ నిర్వాహకులు అశోక్ రాజు దంపతులు మాట్లాడుతూ దేశ ప్రయోజనాల కోసం శ్రమిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి సర్వశక్తులనూ ప్రసాదించాలని, భారత దేశం విశ్వగురుగా నిలవాలనే సంకల్పం నెరవేరాలని ఈ యాగం తలపెట్టినట్లు వివరించారు. తొమ్మిది రోజుల పాటు వేద పండితుల మంత్రోచ్ఛారణలతో సుదర్శన, ధన్వంతరి, మహాలక్ష్మి, ఆయుష్యు, అకల్మష, శాంతి, సంకల్పసిద్ది హోమాలను, వెంకటేశ్వరస్వామి, సీతా రాముల కల్యాణం, సుందరకాండ పారాయణంతో పాటు ప్రముఖుల ధార్మిక ప్రవచనాలతో ఈ ప్రాంతమంతా ఆధ్యాత్మికమయమైదని వెల్లడించారు. -
గ్రానైట్ లారీ స్వాధీనం
సాక్షి టాక్స్ ఫోర్స్: బిల్లులు లేకుండా అక్రమంగా గ్రానైట్ దిమ్మెలు తరలిస్తున్న లారీని బుధవారం జీడీ నెల్లూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం మేరకు.. పోలీసులు బుధవారం జీడీ నెల్లూరులో వాహనాల తనిఖీలు చేపట్టారు. ఒక లారీ గ్రానైట్ దిమ్మెలతో వస్తుండగా సీఐ కృష్ణమోహన్ తనిఖీ చేశారు. ఎట్టేరి ఓ గ్రానైట్ ఫ్యాక్టరీ నుంచి వేల్కూరులో మరో ఫ్యాక్టరీ నుంచి లోడింగ్ చేసి ఉత్తరాఖండ్‌కు గ్రానైట్ దిమ్మెలను తరలిస్తున్నట్టు గుర్తించారు. వాటికి బిల్లులు లేకపోవడంతో వాహనాన్ని స్వాధీనంచేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తమ వద్ద బిల్లులు ఉన్నాయని బుకాయిస్తూ అక్కడి నుంచి వెళ్లినట్టు సమాచారం. గతంలో పట్టుకుని వదిలేశారు కొద్దిరోజుల క్రితం జీడీ నెల్లూరు పోలీసులు అక్రమ గ్రానైట్ దిమ్మెల లారీని పట్టుకున్నారు. ఆ లారీ కూటమికి చెందిన బడా నేతదని, తమ లారీనే పట్టుకుంటారా అంటూ వారు నానా దుర్భాషలాడినట్టు సమాచారం. సాయంత్రానికల్లా బిల్లులు పుట్టించుకుని లారీని అక్కడ నుంచి పంపించేశారు. కూటమి నేతల లారీ పట్టుకున్న సందర్భంగా జీడీ నెల్లూరు సీఐని బదిలీ చేశారు. దొంగ బిల్లులతో అక్రమ గ్రానైట్ రవాణాతో ప్రభుత్వానికి తీవ్రంగా గండిపడుతున్న పట్టించుకోవాలని ప్రజలు చర్చించుకుంటున్నారు. -
పచ్చ తమ్ముడు బరితెగింపు
● 20 ఏళ్లుగా రాకపోకలు సాగిస్తున్న దారి మూసివేత ● పట్టా భూమి అంటూ రోడ్డుపై రాతి కంచె వేసి దౌర్జన్యం పూతలపట్టు(యాదమరి): బెంగళూరులో వ్యాపారాలు సాగిస్తున్న మండలానికి చెందిన ఓ టీడీపీ నాయకుడి అండదండలతో ఆ పార్టీ సానుభూతిపరుడు రెచ్చిపోయాడు. 20 ఏళ్లుగా గ్రామంలో రాకపోకల కొనసాగిస్తున్న దారికి ఫెన్సింగ్ వేశాడు. దీంతో గ్రామస్తులు రాకపోకలకు తీవ్ర అవస్థలు పడుతున్నారు. బాధితుల కథనం మేరకు.. పూతలపట్టు మండలం బి.రామాపురం గ్రామంలో వైఎస్సార్సీపీ సానుభూతిపరులు 15 కుటుంబాల వారు ఉన్నారు. వీరు 20 ఏళ్లుగా గ్రామ కంఠం భూమిలో ఉన్న దారిలో రాకపోకలు సాగిస్తున్నారు. రాజవీధిలో కొంత భూభాగం తమదే అని అదే గ్రామానికి చెందిన టీడీపీ సానుభూతిపరుడు గ్రామస్తులతో ఘర్షణకు దిగాడు. అంతటితో ఆగక రాతి స్తంభాలతో ఫెన్సింగ్ వేసాడు. దీనిపై ప్రశ్నించిన వారిపై దౌర్జన్యానికి దిగాడు. తాము 20 ఏళ్లుగా ఈ దారి నుంచి రాకపోకలు సాగిస్తున్నామని, ఇప్పుడు పట్టా భూమి అనడం ఎంతవరకు సమంజమని గ్రామస్తులు వాపోతున్నారు. రాజకీయ అండ చూసుకుని ఆక్రమణకు తెగబడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దారిని మూసివేయడంతో తాగునీటి ట్యాంకర్లు లోపలికి రాలేకపోతున్నాయి. కూటమి ప్రభుత్వ పాలకుల నిర్వాకం వల్ల తాగునీరు దొరకక నరకయాతన అనుభవిస్తున్నామని మహిళలు ఆవేదన చెందుతున్నారు. అత్యవసర సమయాల్లో వృద్ధులు, రోగులు పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. ఈ విషయంపై తహసీల్దార్, చిత్తూరు ఆర్డీఓకు వినతి పత్రాలు అందజేసినట్లు తెలిపారు. దీనిపై తహసీల్దార్ ఉదయ్ సంతోష్‌ను వివరణ కోరగా సమస్య తమ దృష్టికి రావడంతో క్షేత్ర స్థాయిలో విచారణ చేశామన్నారు. ఇరువర్గాల మధ్య సయోధ్య కుదర్చడానికి ప్రయత్నించగా విఫలమైనట్టు పేర్కొన్నారు. మరోసారి చర్చించి దారి సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు. -
‘విశ్రాంతి’లో అశాంతి
తిరుపతి అన్నమయ్యసర్కిల్: టీటీడీ విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘ సభ్యుల్లో అసంతృప్తి సెగలు భగ్గుమన్నాయి. ఇంతకాలంగా అంతర్గతంగా నెలకొన్ని విభేదాలు బహిర్గతం కావడంతో సంఘ అధ్యక్షుడు ఆర్.ప్రభాకర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి మునిరెడ్డి తమ పదవులకు రాజీనామా చేశారని తెలుస్తోంది. విశ్రాంత ఉద్యోగులకు సంబంధించిన ఇంటి స్థలాల కేటాయింపులో చోటు చేసుకున్న పరిణామాలు రాజీనామాల పర్వానికి తెర తీసిందనే ప్రచారం వినిపిస్తోంది. మరోవైపు సంఘంలో కీలకంగా ఉన్న కోశాధికారి దాస్ కూడా అదే బాటలో తన పదవికి రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే టీటీడీ విశ్రాంత ఉద్యోగుల సంఘం పూర్తిగా రద్దయినట్టేనని చర్చనడుస్తోంది. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే టీటీడీలో విశ్రాంత ఉద్యోగులు ఏర్పాటు చేసుకున్న సంక్షేమ సంఘంలో 8,500 మందికి పైగా సభ్యత్వం కలిగి ఉన్నారు. వీరు పదవీ విరమణకు ముందే సర్వీసులో ఉన్నపుడు చాలావరకు సీనియారిటీ కలిగిన వారున్నారు. అయితే రెండున్నరేళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం మార్కెట్ ధరకు ఇంటి స్థలాలు కేటాయించేలా చర్యలు తీసుకుంది. ఏర్పేడు మండలం, పల్లం గ్రామ పరిధిలో ఒక్కొక్కరికీ 50 అంకణాల చొప్పున 3,500 మంది విశ్రాంత ఉద్యోగులకు స్థలం కేటాయిస్తూ ప్రొసీడింగ్స్ ఇచ్చారు. అయితే అప్పటికే సర్వీసులో ఉన్న ఉద్యోగుల్లో చాలామంది సీనియర్లు ఉన్నా అలాంటి వారికి స్థలాల కేటాయింపు ప్రక్రియలో నిరాశ ఎదురైంది. అయితే స్థల విస్తీర్ణం, ప్లాట్లు వంటివి కేటాయించాలనే సమయంలో సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో అది కాస్తా పెండింగ్‌లో ఉండిపోయింది. ఇప్పటికీ ఇది పరిష్కారం కాలేదు సర్వీసు ఉద్యోగులకు ఊరట కాగా అదే సమయంలోఅప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం సర్వీసులో కొనసాగుతున్న ఉద్యోగులకు వడమాలపేట మండలం పాదిరేడు, పల్లం గ్రామ పరిధిలో 432.27 ఎకరాల విస్తీర్ణంలో ఇంటి స్థలాలను కేటాయించి ప్లాట్ల రిజిష్టేషన్ కూడా చేయించింది. ఆ తర్వాత ప్రబుత్వం మారడంతో టీటీడీ ఎంప్లాయీస్ హౌసింగ్ సొసైటీ పలుమార్లు ప్రభుత్వం, టీటీడీ యాజమాన్యం దృష్టికి సమస్యను తీసుకెళ్లి ఎట్టకేలకు ఇంటి స్థలాల అభివృద్ధి పనులకు ఇటీవల నిధుల మంజూరుకు అనుమతి పొందింది. అసలు సమస్య ఇక్కడే సర్వీసులో ఉన్నపుడు తమకు సీనియారిటీ ప్రాతిపదికన ఇంటి స్ధలాల కేటాయింపులో నిబంధనలు పాటించలేదనే అంశాలపై క్రింది స్థాయిలో పదవీ విరమణ పొంది ప్రస్తుతం విశ్రాంత ఉద్యోగుల సంఘంలో ఉన్న వారు అసంతృప్తితో రగిలిపోతున్నారనే విషయం బాహటంగా వినిపిస్తోంది. అయితే ఎంతో పటిష్టంగా ఉన్నటువంటి విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘంలో ఇంకా నాలుగు వేల మందికి పైగా ఇంటి స్థలాలు పొందలేని వారున్నారు. ఇంత కాలం అంతర్గతంగా రగిలిపోతున్న వారిలో వ్యతిరేక స్వరం బహిర్గతం కావడంతో సంఘ పెద్దలకు సమస్యగా మారింది. సర్వీసులోని ఉద్యోగులు పొందిన ఇంటి స్థలాల అభివృద్ధి పనులకు ఆయా సంఘాల నాయకుల కృషిని గుర్తుచేస్తూ విశ్రాంత సంఘంలో ఆ విధమైన కృషి సంఘ పెద్దలు ఎందుకు చేయలేదంటూ ఘాటుగా ప్రశ్నించడం వంటి పరిణామాలు కలకలం రేపడంతో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాజీనామా చేయాల్సి వచ్చినట్టు సమాచారం. నాలుగేళ్లుగా రెన్యూవల్ పెండింగ్ టీటీడీ విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్రతి ఏటా రెన్యూవల్ చేయించాలనే విషయాన్ని పక్కదారి పట్టింది. నాలుగేళ్లు అవుతున్నా రెన్యూవల్ చేయించాలనే దిశగా ఆలోచన చేయకపోవడం ఏమిటని పలువురు సంఘ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. సంఘ బైలా ప్రకారం కార్యవర్గ కమిటీలో 15 మంది మాత్రమే ఉండాలి. అయితే ప్రస్తుతం ఆ సంఖ్య 33కు చేరుకోవడంతో రెన్యూవల్ చేయించడంతో నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. దీంతో నాలుగేళ్లుగా పేరుకే సంఘం ఉన్నట్లుగా గొప్పగా ప్రచారం చేసుకున్నట్టు టీటీడీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. -
‘1980 ట్రెండ్’తో అప్రమత్తం
చిత్తూరు కలెక్టరేట్ : ప్రస్తుతం 1980 ట్రెండ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బడి పిల్లల నుంచి ఇంజినీరింగ్ విద్యార్థుల వరకు 1980 ట్రెండ్‌ను అనుసరిస్తున్నారు. ఫొటోలను యాప్‌లో అప్లోడ్ చేస్తే చాలు...1980 కాలానికి చెందినవిగా ఆకర్షణీయంగా వస్తున్నాయి. దీంతో పిల్లల నుంచి పెద్దల వరకు ఈ ట్రెండ్‌కు విపరీతంగా మొగ్గుచూపుతున్నారు. ఏ మాత్రం ఆలోచించకుండా వ్యక్తిగత ఫొటోలను సైతం అప్లోడ్ చేసి చూసుకుని మురిసిపోతున్నారు. ఇదే అదునుగా సైబర్ నేరగాళ్లు మోసాల వల విసురుతున్నారు. అందుకు గాను 1980 ట్రెండ్ పేరుతో ఉచిత యాప్‌లను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ యాప్‌లతో జాగ్రత్తగా ఉండాలంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు పాఠశాలలు, కళాశాలలో విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. ఒక్కసారి పర్సనల్ డేటాకు యాక్సెస్ ఇస్తే...ఇక అది మన నియంత్రణలో ఉండదనే విషయాన్ని గుర్తించుకోవాలని సూచిస్తున్నారు. యాప్‌లను ఇన్స్టాల్ చేసేటప్పుడు అధికారిక ప్లే స్టోర్ నుంచి మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలని చెబుతున్నారు. అవసరమైన అనుమతులకు మాత్రమే ఓకే చేయాలని వెల్లడిస్తున్నారు. అనుమానస్పద లింక్‌లపై క్లిక్ చేయకూడదని, యాప్స్‌లో ఫొటోలు, కాంటాక్ట్స్, ఫైల్స్, కెమెరా, లొకేషన్ అన్నింటికీ యాక్సెస్ అడుగుతారని, వాటన్నింటికీ అనుమతిస్తే కష్టాలు తప్పవని స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలో 1980 ట్రెండ్‌పై అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. సైబర్ నేరాలపై అప్రమత్తం చిత్తూరు రూరల్ (కాణిపాకం): సైబర్ నేరాలపై ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, మోసపోయిన తర్వాత బాధపడేకంటే ముందే జాగ్రత్త పడడం శ్రేయస్కరమని ఎస్పీ తుషార్ డూడీ సూచించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ గత ఏడాది సెప్టెంబర్ 16 నుంచి ఈ నెల 15వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా నమోదైన 1,608 ఫిర్యాదులపై తక్షణమే స్పందించిన పోలీసులు రూ.4.01 కోట్ల నగదును హోల్డ్ చేయించి, అందులో రూ.2.15 కోట్లను బాధితులకు రీఫండ్ చేయించినట్లు వెల్లడించారు. బ్యాంకు వివరాలు, ఓటీపీ, కార్డు వెనుక ఉన్న సీవీవీ ఎవరితోనూ పంచుకోవద్దని, డిజిటల్ అరెస్ట్, ఆన్లైన్ పెట్టుబడుల మోసాలపై జాగ్రత్తగా ఉండాలని కోరారు. మోసం జరిగిన వెంటనే గోల్డెన్ అవర్‌లో 1930 హెల్ప్‌లైన్, లేదా పోర్టల్‌లో ఫిర్యాదు చేస్తే నగదును నిలిపివేసే అవకాశముంటుందని ఎస్పీ స్పష్టం చేశారు. 25న నులి పురుగుల నిర్మూలన దినోత్సవం చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో ఈ నెల 25వ తేదీన జాతీయ నులి పురుగుల దినోత్సవం నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ తెలిపారు. మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. 1 నుంచి 19 ఏళ్ల పిల్లలందరికీ అల్బెండజోల్ మాత్రలు వేయించాలని అధికారులను ఆదేశించామన్నారు. అంగన్వాడీ, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్, పాలిటెక్నిక్, ఐఐటీ, కళాశాలల్లో కార్యక్రమాన్ని సమన్వయంతో నిర్వహించాలని స్పష్టం చేశారు. 1 నుంచి 2 ఏళ్ల వారికి సగం మాత్ర, 3 నుంచి 19 ఏళ్ల వారికి ఒక మాత్ర ఇవ్వాలని సూచించారు. -
కలకలం రేపిన ప్రెస్‌మీట్
సాక్షి టాస్క్‌ఫోర్స్: చిత్తూరు మండలం నాయని చెరువులో ఎమ్మెల్యే పీఏ అక్రమంగా క్వారీ నిర్వహిస్తున్నారంటూ కొన్నిరోజులుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో తనపై వచ్చిన ఆరోపణలను ఖండించేందుకు ఎమ్మెల్యే పీఏ కుమారస్వామి మంగళవారం చిత్తూరు నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. అయితే, ఒక ప్రభుత్వ ఉద్యోగి రాజకీయపార్టీ నేతలతేఓ కలిసి వేదిక పంచుకోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ సర్వీస్ రూల్స్ ప్రకారం ఒక ఉద్యోగిపై ఆరోపణలు వస్తే అధికారిక ప్రకటన ద్వారా ఖండించడం లేదా జిల్లా పరిపాలనాధికారి ముందస్తు అనుమతి తీసుకుని ప్రెస్‌మీట్ పెట్టడం పరిపాటి. కానీ, అందుకు విరుద్ధంగా ఏకంగా రాజకీయ పార్టీ నాయకులు, కార్యకర్తలను పక్కన కూర్చోబెట్టుకుని ప్రెస్‌మీట్ నిర్వహించడం సర్వీస్ నిబంధనలను ధిక్కరించడమేనని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మండిపడుతున్నారు. ఈ వ్యవహారంపైఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది. -
అబద్ధమే బాబు అస్త్రం
బైరెడ్డిపల్లె : ఎన్నికల సమయంలో చంద్రబాబు అబద్ధాలనే అస్త్రంగా వాడుకుంటారని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం బైరెడ్డిపల్లెలో ఆయన వైఎస్సార్సీపీ నేతలతో మాట్లాడారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను క్షేత్రస్థాయిలో స్పష్టంగా వివరించాలన్నారు. రైతులను ఆదుకునేందుకు ఒక్క రూపాయి కూడా విదిల్చిన పాపాన పోవడం లేదని మండిపడ్డారు. 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ మహిళలకు పింఛన్, 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలకు ప్రతి నెలా రూ.1,500 ఇస్తామని మోసం చేశారన్నారు. 20 లక్షల మందికి ఉద్యోగాలు, లేకుంటే నిరుద్యోగ భృతి రూ.3వేలు ఇస్తామన్న హామీలు అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచారని స్పష్టం చేశారు. ప్రజల్లో టీడీపీపై తీవ్రమైన వ్యతిరేకత వచ్చిందని, దీంతో కొత్త పింఛన్లు ఇస్తున్నట్లు ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వలంటీర్ వ్యవస్థ తీసుకువచ్చి ఇంటి వద్దనే అర్హులను గుర్తించి పింఛన్లు అందించామని వెల్లడించారు. గతంలో ఇచ్చిన పింఛన్లను కూడా చంద్రబాబు ప్రభుత్వం తీసేసిందని ఆరోపించారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు పైబడినా ఒక్క కొత్త పింఛన్ కూడా ఇవ్వలేదని విమర్శించారు. చంద్రబాబు చేస్తున్న మోసాలను ఎండగడుతూ విజయం సాధించాలని పిలుపునిచ్చారు. ఎంపీపీ మొగసాల రెడ్డెప్ప, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి బైరెడ్డిపల్లె కృష్ణమూర్తి, కో–ఆప్షన్ సభ్యుడు పైజుల్లాసాబ్, రెడ్డి వీనస్, వెంకట్ తేజ, పీరూసాబ్ పాల్గొన్నారు. -
ఆపదలో ఉన్నా.. ఆదుకోండి!
పలమనేరు : రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం. భార్యాభర్తలు చిన్నపాటి హోటల్‌ను నడుపుకుంటూ ముగ్గురు పిల్లలను చదివించుకునేవారు. ఇంతలో విధి వక్రించింది. ఇంటి ఇల్లాలుకు వచ్చిన చిన్నపాటి వ్యాధికోసం చికిత్సకు వెళితే అది ప్రాణాలను మింగేసే రోగంగా తేలింది. దీంతో ఆ కుటుంబం పరిస్థితి దారుణంగా తయారైంది. ఇప్పటి వరకు అప్పులు చేసి రూ.9 లక్షలు ఖర్చు చేయాల్సి వచ్చింది. అయితే రోగం మాత్రం నయం కాలేదు. మానవత్వం ఉన్న దాతలెవరైనా ఆదుకుంటారేమోనని ఆ కుటుంబం ఆశగా ఎదురుచూస్తోంది. వివరాలు.. పెద్దపంజాణి మండలం అప్పినపల్లెకు చెందిన కళైవాణి, బాలాజీ దంపతులకుఇద్దరు అమ్మాయిలు, ఓ అబ్బాయి ఉన్నారు. డిగ్రీ, ఇంటర్ చదువుతున్న ఆడపిల్లలు చదువుల్లో టాపర్లుగా ఉన్నారు. గ్రామంలోని బడిలో చదివే కుమారుడు కూడా చదవరే. బాలాజీ అదే గ్రామంలో చిన్నపాటి హోటల్ నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇలా ఉండగా ఏడాది క్రితం అతడి భార్య కళైవాణి(42)కు శ్వాసతీసుకోవడంలో ఇబ్బందిగా ఉందని పలమనేరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చూపించారు. అక్కడి వైద్యులు పెద్దాస్పత్రికి రెఫర్ చేశారు. దీంతో తిరుపతిలోని ఓమెగా హాస్పిటల్‌కు తీసుకెళ్లగా టెస్ట్‌లు చేసి వైద్యులు ఆమె లివర్ దెబ్బతిందని తేల్చారు. లివర్‌కు సంబందించిన ఆపరేషన్ చేయాలని సూచించారు. ప్రైవేటు ఆస్పత్రిలో తమవల్ల కాదమటూ బాధితులు తిరుపతిలోని స్విమ్స్‌లో చేరారు. అక్కడ పలు రకాల పరీక్షలు నిర్వహించిన వైద్యులు లివర్ క్యాన్సర్‌గా తేల్చారు. ఆపరేషన్ చేసేందుకు సైతం వీలుకాదని 70 శాతం దాకా లివర్ దెబ్బతిందని నిర్ధారించారు. అదే సమయంలో ఎన్టీఆర్ వైద్యసేవ కింద చికిత్స చేయించుకునేందుకు రోజుల తరబడి ఎదురు చూశారు. అయితే అనుమతులు రాకపోవడంతో బాలాజీ తన భార్య కష్టం చూడలేక ఇంటిని తనఖా పెట్టి, అప్పులు చేసి దాదాపు రూ.9లక్షలు ఖర్చుపెట్టాడు. ప్రస్తుతం చికిత్సకు డబ్బుల్లేక ఆమె ఇంట్లో మంచానికే పరిమితమైంది. తమ తల్లికిలా అయిందనే బెంగ పిల్లలకు పట్టుకుంది. తల్లి పరిస్థితిని తెలుసుకున్న మధు కళాశాల యాజమాన్యం ఇద్దరు ఆడపిల్లలకు ఫీజులు కూడా తీసుకోవడం లేదు. తమ తల్లి వైద్యానికి దాతలెవరైనా సాయం చేయాలని ఆ బిడ్డలు, భర్త వేడుకుంటున్నారు. ఎవరికై నా సాయం చేయాలనిపిస్తే వారి నంబర్:9505803100ను సంప్రదించాలని కోరుతున్నారు. ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి స్పందించి సీఎంఆర్ఎఫ్ ద్వారా చేయూతనందించాలని విన్నవిస్తున్నారు. -
వైభవంగా విశ్వగురు సంకల్ప సిద్ధి మహాయాగం
నారాయణవనం: స్థానిక సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల ఆవరణలో జరుగుతున్న నవాహ్నిక భారత విశ్వగురు సంకల్ప సిద్ధి మహాయాగంలో మంగళవారం ఉదయం ఆకల్మష హోమం, సాయంత్రం చతుర్వేదాల నడుమ వైభవంగా మహా పుష్పయాగం నిర్వహించారు. అంతకుముందు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాధవ్ ఆధ్యాత్మిక, ఆధునిక పోకడలపై ఉపన్యసించారు. ఉదయం 8 గంటలకు హోమశాలలో 108 హోమ గుండాలలో రిత్వికులు ఆకల్మష యాగాన్ని నిర్వహించారు. పూర్ణాహుతి క్రతువులో టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్‌రెడ్డి పాల్గొన్నారు. సాయంత్రం నిర్వహించిన ప్రవచన కార్యక్రమంలో ముఖ్యవ్యక్తగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాధవ్ హాజరై ప్రసంగించారు. ప్రధాని నరేంద్రమోదీ ఆయురారోగ్యాలు, 2047 వరకు ఆయన నాయకత్వంలో దేశాభివృద్ధి, వర్షాలు సమృద్ధిగా కురిసి దేశం సస్యశ్యామలంగా ఉండాలని కోరుతూ కళాశాల చైర్మన్ అశోక్‌రాజు దంపతులు ఈ నవాహ్నిక దీక్షలు చేపట్టారని తెలిపారు. మత సామరస్యాన్ని చాటుతూ ముస్లిం సోదరులు మహాయాగంలో పాల్గొన్నారు. మనుష్యుల్లో కల్మషాలు తొలగి ఐక్యత పెరగడానికి ఆకల్మష హోమం, యాగ నిర్వహణలోని లోటుపాట్ల నివృత్తికి, ఉపశమనానికి మహా పుష్పయాగం నిర్వహించినట్లు అశోక్ రాజు తెలిపారు. నవాహ్నిక యాగాలలో చివరి రోజైన బుధవారం ఉదయం మహా పూర్ణాహుతి, సాంస్కృతిక కార్యక్రమాలలో భక్తులందరూ పాల్గొనాలని అశోక్‌రాజు కోరారు. -
డిప్ ఐడియా ఫలించేనా..?
ఇక జిల్లాలో 30 వరకు దుకాణాల నిర్వాహకులు లైసెన్సుల పునరుద్ధరణను పట్టించుకోలేదు. పైగా ఓ ఐడియా రచించి, దాన్ని అమలు చేయడానికి టీడీపీ నేతలే సలహా ఇచ్చారన్నది బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. పాత లైసెన్సు పునరుద్ధరించుకోవాలంటే రూ.25 లక్షలు చెల్లించాలి. కా, లక్కీడిప్‌కు వెళితే..?! ఒక్కో దరఖాస్తు రుసుము నాన్–రీఫండబుల్ ఫీజు కింద రూ.3లక్షలు చెల్లించాలి. నాలుగు దరఖాస్తుల నిబంధన పెట్టినా రూ.12 లక్షలకే లైసెన్సు కొట్టేయొచ్చని కొందరు నిర్వాహకులు పథకం వేశారు. ఫలితంగా 30 వరకు దుకాణాలకు గురువారం నుంచి దరఖాస్తులు స్వీకరించడం ఖాయంగా కనిపిస్తోంది. ఆపై వచ్చిన దరఖాస్తుల్లో లక్కీడిప్ ద్వారా లైసెన్సులు కేటాయిస్తారు. ఇక్కడే టీడీపీ నేతలు సిండికేట్‌గా మారారు. ముందుగా మాట్లాడుకుని ఒకరు దరఖాస్తు చేసిన దుకాణానికి మరొకరు అప్లికేషన్ వేయకూడదని చీకటి ఒప్పందం చేసుకున్నారు. ఇలా చేయడం ద్వారా ప్రభుత్వ ఆదాయానికి గండి పడ్డా పర్లేదు.. అధికారం ఉండగానే కిక్కు ద్వారా సంపాదించుకోవాలని తీర్మానం చేసుకున్నారు. టీడీపీ నేతలు మద్యం మాఫియాగా మారిపోయారు. రెండేళ్లుగా రాత్రింబవళ్లు విక్రయాలు సాగిస్తూ ప్రజల రక్తం తాగేశారు. లైసెన్స్ రెన్యూవల్ పేరిట చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ అవకాశం కల్పించడంతో హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మరికొందరు తెలుగు తమ్ముళ్లు తమ తెలివితేటలను ఉపయోగిస్తున్నారు. రెన్యూవల్ కంటే లక్కీడిప్‌లో వైన్‌షాపు తీసుకుంటే తక్కువ ఫీజుతో సరిపోతుందని పన్నాగాలు పన్నారు. అందులో భాగంగానే జిల్లావ్యాప్తంగా సుమారు 30 మద్యం దుకాణాల లైసెన్స్‌లను పునరుద్ధరించుకోకుండా మంత్రాంగం నడుపుతున్నారు. అధికార పార్టీ నేతలే సిండికేట్‌గా మారి గంపగుత్తగా వైన్‌షాపులను కై వసం చేసుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. సాక్షి, చిత్తూరు : చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పచ్చ నేతలకు ఉపాధి చూపించడానికి మద్యం దుకాణాల లైసెన్సులు ప్రైవేటుపరం చేసింది. రెండేళ్ల పాటు ఇందులో సమకూరిన భారీ ఆదాయాన్ని చూసిన కొందరు వ్యాపారులు అతితెలివిని ప్రదర్శించి, ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టాలని సిద్ధపడిపోయారు. జిల్లాలో మద్యం దుకాణాల రెన్యూవల్ కోసం ఇచ్చిన గడువు బుధవారం అర్థరాత్రితో ముగియనుంది. ఇప్పటికి దాదాపు 83 దుకాణాల వరకు లైసెన్సులు రెన్యూవల్ చేసుకోగా.. 30 దుకాణాల నిర్వాహకులు మాత్రం లక్కీడిప్ దిశగానే మొగ్గుతున్నారు. పునరుద్ధరణతో రూ.20 కోట్ల ఆదాయం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మద్యం విక్రయాలను ఆదాయ వనరుగా చూడకుండా, ప్రజలు మత్తుకు బానిస కాకుండా ఉండాలని ఇతర రాష్ట్రాల్లో అమల్లో ఉన్న పాలసీను తీసుకువచ్చారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యం వ్యాపారాన్ని భారీ ఆదాయ వనరుగా పరిగణించి.. తమ కార్యకర్తల చేతికి మద్యం దుకాణాల లైసెన్సులను అప్పగించిన విషయం తెలిసిందే. రెండేళ్ల కాలపరిమితితో లైసెన్సు పొందిన నిర్వాహకులకు మళ్లీ మరో ఏడాది పాటు లైసెన్సును కట్టబెట్టడానికి రెన్యూవల్ పేరిట కొత్త ఎత్తు వేసింది. రెండు శ్లాబుల్లో ఉన్న మద్యం దుకాణాలకు రూ.23 లక్షలు, రూ.27 లక్షలు చెల్లించాలని పేర్కొంది. అంటే సగటున ఒక్కో దుకాణానికి రూ.25 లక్షల వరకు రెన్యూవల్ రుసుము చెల్లించాలి. ఇప్పటి వరకు జిల్లాలో 113 దుకాణాలకు గానూ దాదాపు 83 దుకాణాల నిర్వాహకులు లైసెన్సులను రెన్యూన్యువల్ చేసుకున్నారు. దీని ద్వారా ప్రభుత్వానికి రూ.20 కోట్లకు పైగా ఆదాయం లభించింది. కొన్నింటికే రెన్యూవల్ జిల్లాలో ఎనిమిది ఎకై ్సజ్ పోలీస్ సర్కిళ్లు ఉన్నాయి. అందులో చిత్తూరు అర్బన్‌లో 9, రూరల్ 4, పుంగనూరు 5, నగరి 1, పలమనేరు 4, కుప్పం 1, పులిచెర్లలో 7 మద్యం దుకాణాలను రెన్యూవల్ చేసుకోలేదన్నది అధికారుల మాట. కార్వేటినగరం సర్కిల్లో మాత్రం పది దుకాణాలను రెన్యూవల్ చేసుకున్నారు. మద్యం దుకాణాల పునరుద్ధరణ ఆటలో ఎవరి ఐడియా ఫలిస్తుంది..? ఎవరికి అసలైన కిక్కు దక్కుతుందో వేచి చూడాలి. జిల్లాలో 83 వైన్‌షాపుల లైసెన్స్ రెన్యూవల్ -
గుడిసెలోకి దూసుకెళ్లిన లారీ
బైరెడ్డిపల్లె : పలమనేరు– కుప్పం జాతీయ రహదారిలోని కై గల్ దుముకురాళ్ల బస్‌స్టాప్ వద్ద మంగళవారం తెల్లవారుజామున ఓ గుడిసెలోకి లారీ దూసుకెళ్లింది. వివరాలు.. కుప్పం నుంచి చిత్తూరు వైపు గ్రానైట్ బండలతో లారీ వెళుతుండగా డ్రైవర్ నిద్రమత్తు కారణంగా అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న పూరి గుడిసెలోకి వెళ్లింది. అయితే డ్రైవర్, క్లీనర్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. గుడిసెలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి గంగాధర నెల్లూరు : మండలంలోని పద్మాపురంలో విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి మంగళవారం మృతి చెందాడు. వివరాలు.. గ్రామానికి చెందిన వాసు (32) పశువులకు దాణా వేసేందుకు షెడ్లులోకి వెళ్లగా వాటికి విద్యుత్ తీగలు తగలడంతో కరెంట్ షాక్‌కు గురయ్యాడు. వెంటనే 108లో చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రైలు కిందపడి ఆత్మహత్య కుప్పంరూరల్ : మండలంలోని గుల్లేపల్లె వద్ద మంగళవారం రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సుమారు 30 నుంచి 40 ఏళ్ల వ్యక్తి రైలు కింద పడి బలవన్మరణం చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మృతుడి ఒంటిపై పసుపు రంగ టీషర్టు ఉందని వెల్లడించారు. ఆచూకీ తెలిసిన వారు కుప్పం రైల్వే పోలీసులను సంప్రదించాలని కోరారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. సంక్షేమ పథకాలకు హౌస్‌హోల్డ్ మ్యాపింగ్ సమస్య చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో వేలాది మంది అర్హులు హౌస్‌హోల్డ్ మ్యాపింగ్ సమస్యతో సంక్షేమ పథకాలకు దూరమవుతున్నారు. ఈ సమస్యను ప్రజలు అధికారుల దృష్టికి తీసుకెళుతున్నప్పటికీ ప్రయోజనం ఉండడం లేదు. తమ చేతుల్లో ఏమీ లేదని అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి వివాహం జరిగినప్పుడు, వారిని పాత కుటుంబం నుంచి విడదీసి కొత్త కుటుంబంగా మార్చాల్సి ఉంటుంది. అలాగే 60 ఏళ్లు పైబడిన వారితో పాటు జీవిత భాగస్వామిని కోల్పోయి ఒంటరిగా ఉన్న వారికి హౌస్‌హోల్డ్ మ్యాపింగ్‌లో ఫ్యామిలీ స్పిట్ (కుటుంబం నుంచి వేరు) చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం హౌస్‌హోల్డ్ మ్యాపింగ్‌లో చేర్పులు, మార్పులు లేకపోవడంతో వేలాది మంది పథకాలు పొందలేక నష్టపోతున్నారు. చాలా కుటుంబాల్లో రేషన్ కార్డులు వేర్వేరుగా జారీచేసినా, ఆన్లైన్లో హౌస్‌హోల్డ్ మ్యాపింగ్ లో ఒకే కుటుంబంగా చూపిస్తున్నారు. దీంతో పలు రకాల నిబంధనలతో పథకాలకు అర్హత ఉన్నా అనర్హులుగా మిగిలిపోతున్నారు. హౌస్‌హోల్డ్ మ్యాపింగ్ పెండింగ్ ఉండడంతో జిల్లాలో ప్రస్తుతం వేలాది మంది కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోలేకపోయారు. ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ తామేమి చేయలేమని అంతా ప్రభుత్వమే చేయాలని తెగేసి చెప్పేస్తున్నారు. హౌస్‌హోల్డ్ మ్యాపింగ్ సమస్య పరిష్కరిస్తే జిల్లాలో వేలాది మందికి న్యాయం జరుగుతుందని పలువురు కోరుతున్నారు. శ్రీవారి దర్శనానికి 4 గంటలు తిరుమల: తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 3 కంపార్టుమెంట్లు నిండాయి. సోమవారం అర్ధరా త్రి వరకు 65,223 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 27,112 మంది భక్తులు తలనీలా లు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.52 కోట్లు సమర్పించారు. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 4 గంటల సమయం పడుతోంది. -
అక్రమ కేసులకు భయపడం
తిరుపతి లీగల్: కూటమి ప్రభుత్వంలో నాయకులు చేస్తున్న అక్రమాలను ప్రశ్నిస్తే వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయించడం, ఎదురుదాడి చేయడం తప్ప ప్రజలకు ఎటువంటి సేవలు అందడం లేదని తిరుపతి వైఎస్సార్సీపీ సమన్వయకర్త భూమన అభినయ్ తెలిపారు. వైఎస్సార్సీపీ నాయకులు పసుపులేటి సురేష్, వాసు యాదవ్‌తో పాటు మరికొంతమంది తిరుపతి టీడీపీ ఇన్చార్జ్ శ్రీనివాస్ ఇంటి వద్ద దాడికి పాల్పడ్డారన్న అభియోగం కింద కేసు నమోదు చేయడం తెలిసిందే. ఆ కేసులో ఆరుగురు వైఎస్సార్సీపీ నాయకులు, ఓ మీడియా ప్రతినిధి తిరుపతి సబ్ జైల్లో రిమాండ్ లో ఉన్నారు. మంగళవారం భూమన అభినయ్ స్థానిక సబ్ జైల్లో వైఎస్సార్సీపీ నాయకులను కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో జరిగిన అక్రమ నియామకాల పట్ల సీబీఐ దర్యాప్తు చేయాలని జగనన్నతోపాటు డీఎస్సీ అభ్యర్థులు డిమాండ్ చేస్తుంటే కూటమి నాయకులు వారిపై ఎదురుదాడి చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ దాడులను ఆయన తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో తిరుపతి జిల్లా వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు ఐ.చంద్రశేఖర్‌రెడ్డి, నరహరరెడ్డి, దొరబాబు, కొత్తపల్లి విజయకుమార్, రాజశేఖర్, వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. స్థిరత్వ విశ్లేషణపై వర్క్‌షాప్ ఏర్పేడు: ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటీలో మంగళవారం తిరుపతి ఐఐటీ సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్ సహకారంతో ఆంధ్రప్రదేశ్ పవర్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీ ట్రాన్స్ కో) ఉద్యోగుల కోసం ‘అధిక పునరుత్పాదక ఇంధన వినియోగంతో స్థిరత్వ విశ్లేషణ’ అంశంపై మూడు రోజుల వర్క్‌షాప్ ప్రారంభమైంది. ప్రారంభోపన్యాస కార్యక్రమానికి తిరుపతి ఐఐటీ కాంపిటెన్సీ డెవలప్మెంట్ – అవుట్‌రీచ్ డీన్ ప్రొఫెసర్ అరుణ్‌కుమార్ తంగిరాల, ఐఐటీ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగాధిపతి డాక్టర్ కె.పి.నవీన్, ఏపీ ట్రాన్స్‌కో ఎస్ఈ ఎన్.శామ్యూల్ రాజు, ఐఐటీ ప్రోగ్రామ్ లీడ్ డాక్టర్ విఘ్నేష్ హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు, వివిధ విభాగాలకు చెందిన సుమారు 30 మంది ట్రాన్స్‌కో ఉద్యోగులు ఈ వర్క్‌షాప్‌లో పాల్గొన్నారు. పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగం పెరగడం వల్ల తలెత్తే విద్యుత్ వ్యవస్థ స్థిరత్వ సమస్యలపై అవగాహనతో పాటు ఆచరణాత్మక, ప్రత్యక్ష అనుభవాన్ని అందించేలా కార్యక్రమం జరిగింది. -
రిజర్వేషన్లకు కసరత్తు
మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి తొలి ఘట్టం ముగిసింది. జిల్లాలోని ఓ కార్పొరేషన్‌తో పాటు రెండు పురపాలక సంఘాల్లో వార్డుల వారీ ఓటర్ల జాబితా ప్రచురితమైంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల వివరాలను నిర్దారించే పని మరో మూడు రోజుల్లో పూర్తి కానుంది. అనతరం వార్డులతోపాటు మేయర్, చైర్పర్సన్ రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేయనుంది. అయితే మొత్తం ప్రక్రియలో హైకోర్టు బుధవారం వెలువరించనున్న తీర్పు కీలకం కానుంది. ఈ మేరకు పురపోరుపై పూర్తి స్పష్టత రానుంది. సాక్షి, చిత్తూరు : వార్డుల పునర్విభజన ఇప్పటికే పూర్తి కావడంతో చిత్తూరులో 60 డివిజన్లు, పలమనేరులో 36, నగరిలో 40 వార్డులు అమల్లోకి వచ్చాయి. వీటి ప్రకారం వార్డుల వారీగా ఓటర్ల వివరాలను ఆయా మున్సిపాలిటీల్లో కమిషనర్లు ప్రచురించారు. వీటిపై అభ్యంతరాల స్వీకరణ, మార్పులు, చేర్పులకు మరో మూడు రోజుల అవకాశం కల్పించారు. పనిలో పనిగా బుధవారం నుంచి వార్డుల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల గుర్తింపు, నిర్ధారణ చేపట్టనున్నారు. ఈనెల 25వ తేదీకి ఈ ప్రక్రియను పూర్తిచేసి, 26న వార్డులవారీగా ఉన్న ఎస్టీ, ఎస్టీ, బీసీ ఓటర్ల జాబితాను ప్రచురించనున్నారు. అనంతరం 27,28వ తేదీల్లో అభ్యంతరాల స్వీకరణ, 29, 30వ తేదీల్లో అభ్యంతరాలపై విచారణ, అక్టోబర్ 1న తుది ఓటర్ల జాబితా ప్రచురించి, రాష్ట్ర మున్సిపల్ సంచాలకులకు అందజేయనున్నారు. అక్కడి నుంచి ఆదేశాలు రాగానే వార్డులను ఏయే సామాజికవర్గాలకు రిజర్వు చేసామనే వివరాలను కలెక్టర్ గెజిట్ ద్వారా నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. తర్వాత మేయర్, చైర్పర్సన్ రిజర్వేషన్లను ప్రకటించడం, ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయడం తరువాయిగా ఉంటుంది. వార్డుల వారీగా ఇలా.. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు ఏయే వార్డు కేటాయించాలనే దానిపై నిబంధనల ప్రకారం కలెక్టర్ తుదిగా ప్రచురిస్తారు. మొత్తం వార్డుల సంఖ్యలో ఎస్టీ 1 శాతం, ఎస్సీ 16 శాతం, బీసీ 34 శాతం (అంచనా) ఉండనుంది. అంటే చిత్తూరు కార్పొరేషన్లో 60 డివిజన్లు ఉంటే ఎస్టీకి ఒక డివిజన్, ఎస్సీలకు 10, బీసీలకు 20 డివిజన్లు రిజర్వు చేయనున్నటు తెలుస్తోంది. మిగిలినవి ఓపెన్ కేటగిరీ కిందకు వస్తాయి. 60 డివిజన్లలో 30 డివిజన్లను తప్పనిసరిగా మహిళలకు రిజర్వు చేయనున్నారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు కోర్టు తీర్పుపై ఉత్కంఠ షెడ్యుల్ ప్రకారం మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు వార్డుల వారీ రిజర్వేషన్లపై ముందుకు వెళ్లాలా..? వద్దా..? అనేదానిలో బుధవారం రాష్ట్ర హైకోర్టు వెలువరించనున్న తీర్పు కీలకం కానుంది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రకారం ఓటర్లు తేలితే రిజర్వేషన్లు ఖరారు చేయాలని, మరోవైపు రిజర్వేషన్లు 50 శాతం మించ కూడదని కోర్టులో దాఖలైన పిటిషన్లపై వెలువడే తీర్పు ఎలా ఉంటుందోనని రాజకీయ పార్టీలు, అధికారులు ఉత్కంఠంగా చూస్తున్నారు. పిటిషన్లు కొట్టేస్తే మున్సిపల్ ఎన్నికలు షెడ్యుల్ ప్రకారం జరుగుతాయి. పిటిషన్లలోని అంశం సమంజసంగా ఉందంటే మాత్రం పురపాలక సంఘాల ఎన్నికలకు బ్రేకులు పడనున్నాయి. -
ప్రత్యేక టెట్‌లో మార్పులు అవసరం
చిత్తూరు కలెక్టరేట్:ఇన్ సర్వీస్ టీచర్లకు నిర్వహించే ప్రత్యేక టెట్‌లో మార్పులు అవసరమని వైఎస్సార్‌టీఏ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రెడ్డి శేఖర్‌రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఉపాధ్యాయులు తాము నిత్యం బోధిస్తున్న సబ్జెక్టులు కాకుండా, ఇతర సబ్జెక్టులతో టెట్ నిర్వహించడం సరికాదన్నారు. దీంతో టీచర్లు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నా రని ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల మనుగడకు గొంతుపై కత్తిలా మారిన టెట్ అర్హత విషయంలో చంద్రబాబు ప్రభుత్వం అలసత్వం వహిస్తోందని ఆరోపించారు. స్పెషల్ టెట్ అని చెబుతున్నప్పటికీ, అందులో ఉపాధ్యాయులకు ప్రయోజనకరమైన అంశాలేవీ లేవని, ఇదంతా మభ్యపెట్టడమేనని విమర్శించారు. అందరికీ ఒకే రకమైన ప్రశ్నపత్రం ఇచ్చినప్పుడు, అర్హత, ఉత్తీర్ణత మార్కుల్లో తేడాలు చూపడం అన్యాయమని స్పష్టం చేశారు. అందరికీ 40 శాతం మార్కు లతో ఒకే రకమైన ఉత్తీర్ణత ప్రామాణికం ఉండాలని విజ్ఞప్తి చేసినా పరిగణనలోకి తీసుకోకపోవడం సబబు కాదన్నారు. టెట్ సిలబస్, అర్హత ప్రమాణాలపై ప్రభుత్వం పునఃసమీక్షించాలని డిమాండ్ చేశారు. -
కృష్ణమ్మకు సీఎం జల హారతి
కుప్పం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గ పర్యటనలో భాగంగా రెండో రోజు మంగళవారం ఆయన శాంతిపురం మండలం గుండి శెట్టి పల్లి వద్ద హంద్రీ–నీవా ద్వారా వచ్చిన కృష్ణా నీటికి జల హారతి ఇచ్చారు. అనంతరం కృష్ణమ్మకు పసుపు, కుంకుమ పూల సారెను సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా హంద్రీ–నీవా ద్వారా రెండో దశ కింద కృష్ణా జలాలను కుప్పానికి తీసుకువచ్చామన్నారు. కుప్పం ప్రాంత వాసులు చిరకాల ఆకాంక్ష అయిన కృష్ణా జలాల రాకతో సాగుకు, తాగునీటి అవసరాలకు కీలక అడుగు పడిందన్నారు. ఈ మేరకు నియోజకవర్గంలోని అన్ని చెరువులను నింపుతామని వెల్లడించారు. -
● అర్హత లేకపోయినా అండగా నిలుస్తున్న టీడీపీ నేతలు ● కొత్త పింఛన్ల మంజూరు ప్రక్రియలో అక్రమాలు ● విచారణలో వెలుగులోకి వాస్తవాలు ● వివరాలు సేకరిస్తున్న సచివాలయ ఉద్యోగులు
చిత్తూరు కలెక్టరేట్ : ఎలాగైనా పింఛన్ పొందాలనే లక్ష్యంతో పెద్దసంఖ్యలో దరఖాస్తుదారులు టీడీపీ నేతల చుట్టూ తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో కొందరు నాయకులు డబ్బులు సైతం డిమాండ్ చేస్తున్నారు. దరఖాస్తు ఆమోదం పొందితే నెలనెలా పింఛను వస్తుంది.. పోతే రూ.30 వేల వరకు పోతుందనే ఉద్దేశంతో చాలామంది నగదు ఇచ్చేందుకు వెనకాడడం లేదు. ఇలా గ్రామాలు, పట్టణాల్లో పలువురు దరఖాస్తుదారులు అక్రమంగా టీడీపీ నేతలతో సిఫార్సు చేయించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. వివిధ పింఛన్లకు దరఖాస్తు చేసుకున్నవారిలో 10 నుంచి 25 శాతం వరకు అనర్హులే ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆధార్‌లో మార్పులు చేయించి.. వృద్ధాప్య పింఛన్లకు దరఖాస్తు చేసుకున్నవారిలో 60 ఏళ్ల కంటే తక్కువ వయసున్నవారు పలువురు ఉన్నట్లు సమాచారం. వీరు ఆధార్ కార్డులో వయసు మార్పు చేయించుకుని పింఛను కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఒంటరి మహిళల పింఛన్లకు దరఖాస్తు చేసుకున్నవారిలో సైతం పలువురు అనర్హులున్నట్లు చర్చ సాగుతోంది. వీటన్నింటిపై విచారణ జరిపిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పలువురు కోరుతున్నారు. పచ్చనేతల అండతోనే బోగస్ దందా కొత్త పింఛన్ల దరఖాస్తును ఆసరాగా చేసుకుని అన్ని సౌకర్యాలు ఉన్నవారు, భారీగా ఆస్తులున్న వారు, అర్హత లేని వ్యక్తులు సైతం పింఛన్ జాబితాలో చేరేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ నేతలు రంగంలోకి దిగి నకిలీలకు కొత్త పింఛన్లు ముట్టజెప్పేందుకు చర్యలు చేపడుతున్నారు. తమ అనుచరులకు, తాము చెప్పిన వారికి ఎలాగైనా పింఛన్లు మంజూరు చేయించేందుకు సచివాలయ సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నారు. దాదాపు అన్ని వృత్తుల్లోనూ అక్రమాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. చేనేత, డప్పు, చర్మకారులు, దివ్యాంగుల పింఛన్ల కేటగిరీల్లో అర్హత లేని వ్యక్తుల నుంచి నకిలీ పత్రాలు తయారు చేయిస్తున్నట్లు విమర్శలు వెలువెత్తుతున్నా యి. నకిలీ పత్రాలు దరఖాస్తు చేయించడంలో టీడీపీ నాయకులే కీలకపాత్ర పోషిస్తున్నారని సమాచారం. జిల్లా సమాచారం పింఛన్ విభాగం అందిన దరఖాస్తులు డప్పు కళాకారులు 2,970 దివ్యాంగులు 7,673 మత్స్యకారులు 64 వృద్ధులు 23,304 ఒంటరి మహిళలు 250 కల్లుగీత కార్మికులు 104 చర్మకారులు 372 ట్రాన్స్జెండర్లు 11 చేనేత కార్మికులు 116 వితంతువులు 8,629 మొత్తం 43,493సొసైటీల చేతివాటం పింఛన్ల మంజూరులో భాగంగా 50 ఏళ్లు నిండిన చేనేత కార్మికుల నుంచి కూడా దరఖాస్తులు స్వీకరించారు. నిబంధనల ప్రకారం ఈ విభాగంలో పింఛనుకు దరఖాస్తు చేసుకునేవారి ప్రధాన జీవనోపాధి చేనేత వృత్తిగా ఉండాలి. సొసైటీలో సభ్యత్వం ఉండాలి. ఆయా సొసైటీలు ఇచ్చిన గుర్తింపు పత్రంతో చేనేత, జౌళి శాఖకు దరఖాస్తు చేసుకుంటే పింఛన్‌్ మంజూరుకు కావాల్సిన ధ్రువీకరణపత్రం ఇస్తారు. దీంతో పింఛనుకు దరఖాస్తు చేసుకోవచ్చు. చాలామంది నేత కార్మికులు కాకపోయినప్పటికీ పింఛను కోసం దరఖాస్తు చేసుకున్నారు. కొన్ని చేనేత సొసైటీలు నిబంధనలకు విరుద్ధంగా గుర్తింపు పత్రాలు ఇచ్చాయనే ఆరోపణలున్నాయి. డప్పు కళాకారుల పింఛనుకు దరఖాస్తు చేసుకున్న వారిలోనూ కొందరు అనర్హులున్నట్లు తెలుస్తోంది. -
శ్రీహరి రాజసం
ప్రభల తేజసం..ఘటాటోపం నీడన చంద్ర ప్రభ వాహన సేవ(ఇన్సెట్) ప్రత్యేక అలంకరణలో మలయప్పతిరుమల: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవా లు అంగరంగ వైభవంగా సాగుతున్నా యి. ఏడో రోజు సోమవారం ఉదయం సూర్య ప్రభపై తేజోమయంగా, రాత్రి చంద్ర ప్రభపై చల్లని వెన్నెల కాంతుల్లో శ్రీమలయప్పస్వామి దేదీప్యమానంగా ఊరేగుతూ కనువిందు చేశారు. సూర్యప్రభ వాహనంపై స్వర్ణకాంతులు వెదజల్లుతూ భక్తకోటిని కటాక్షించిన స్వామివారు.. రాత్రి చంద్ర ప్రభపై శ్వేతవర్ణ పుష్పాలంకరణలో సాక్షాత్తు చల్లని చంద్రుడిని తలపించారు. వాహన సేవకు ముందే వర్షం రావడంతో ఘటాటోపం నీడలో చంద్రప్రభ వాహన సేవ సాగింది. స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. మంగళవారం ఉదయం మహారథోత్సవం, రాత్రి అశ్వవాహన సేవకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. బుధవారం చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. వాహన సేవల ముందు వివిధ కళాబృందాల సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. వాహన సేవల్లో పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి, టీటీడీ ఈవో రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్యచౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణ పాల్గొన్నారు. -
మోహన్‌బాబు యూనివర్సిటీతో ‘ఫిజిక్స్ వాలా’ ఒప్పందం
చంద్రగిరి: మోహన్ బాబు యూనివర్సిటీ ప్రాంగణం సోమవారం ఒక చారిత్రాత్మక ఘట్టానికి వేదికగా నిలిచింది. దేశంలోనే ప్రముఖ ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫామ్ ‘ఫిజిక్స్ వాలా’, మోహన్‌బాబు యూనివర్సిటీల మధ్య కీలక అవగాహన ఒప్పందం కుదిరింది. ప్రో ఛాన్స్లర్ మంచు విష్ణు ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగిన ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ ఛాన్స్లర్, పద్మశ్రీ డాక్టర్ మంచు మోహన్‌బాబు, ఫిజిక్స్ వాలా వ్యవస్థాపకుడు అలఖ్ పాండే, డైరెక్టర్ వినయ్ మహేశ్వరి, వైస్ ఛాన్స్లర్ పి.వి.రమణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ భాగస్వామ్యం ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధనతో పాటు పోటీ పరీక్షలకు మెరుగైన శిక్షణ అందించడమే లక్ష్యంగా ఇరు సంస్థలు హర్షం వ్యక్తం చేస్తూ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశాయి. ఛాన్స్లర్ మోహన్‌బాబు మాట్లాడుతూ.. నేటి తరం విద్యార్థుల చేతుల్లోనే దేశ భవిష్యత్తు ఉందనే విషయాన్ని గుర్తుచేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మోహన్‌బాబు యూనివర్సిటీలో ప్రతి ఏటా సరికొత్త సాంకేతికతను, డిజైన్లను అందుబాటులోకి తెస్తూ దేశంలోనే మొదటి సారిగా వినూత్న విద్యా విధానాలను అమలు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. ఫిజిక్స్ వాలా వ్యవస్థాపకుడు అలఖ్ పాండే మాట్లాడుతూ.. తానూ ఒకప్పుడు యూపీలోని ప్రయాగ్‌రాజ్ నుంచి వచ్చి కోచింగ్ ఫీజులు భరించలేక, హైదరాబాద్, కోటి వంటి ప్రాంతాలకు వెళ్లి చదువుకోలేక ఎన్నో ఇబ్బందులు పడ్డానని గుర్తు చేసుకున్నారు. పేదరికం కారణంగా ఏ ఒక్క విద్యార్థి విద్యకు దూరం కాకూడదనే ఉద్దేశంతోనే ఉచితంగా యూట్యూబ్‌లో బోధన ప్రారంభించి, నేడు అత్యంత తక్కువ రుసుముతో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తున్నట్లు చెప్పారు. యూట్యూబ్‌లో 6.5 కోట్లకు పైగా, యాప్‌లో 60 లక్షల మందికి పైగా విద్యార్థులకు 54 రకాల పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తూ ప్రపంచస్థాయి గుర్తింపు సాధించామని తెలిపారు. అనంతరం ఎంఓయూలను చేసుకున్నారు. -
సూర్య తేజం.. చంద్ర వికాసం
తిరుపతి రూరల్: తుమ్మలగుంటలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన సోమవారం ఉదయం సూర్యప్రభ, రాత్రి చంద్రప్రభ వాహన సేవలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం సూర్యప్రభ వాహనంపై అనంత తేజోమయుడిగా స్వామివారు భక్తులకు దర్శనమివ్వగా.. రాత్రి చంద్రప్రభ వాహనంపై చల్లనయ్యగా కటాక్షించారు. ఉదయం సూర్యప్రభ వాహన సేవ సందర్భంగా సరిగ్గా 6.45 గంటలకు సూర్యకిరణాలు స్వామివారి పాదాలు తాకిన సమయంలో అర్చకులు ప్రత్యేక హారతులు సమర్పించారు. ఈ అపురూప దృశ్యాన్ని తిలకించి భక్తులు పరవశించిపోయాయి. చంద్రప్రభపై.. చల్లనయ్యగా.. సోమవారం రాత్రి చంద్రప్రభ వాహనంపై శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి విహరిస్తూ భక్తులను కటాక్షించారు. సూర్యప్రభ వాహన సేవకు చంద్రగిరి మండలంలోని చంద్రగిరి, రెడ్డివారిపల్లి, నరసింగాపురం, రాయలపురం, తిరుపతి రూరల్ మండలం నుంచి గాంధీపురం గ్రామాలకు చెందిన భక్తులు సారె తీసుకువచ్చి స్వామివారికి సమర్పించారు. సారె తెచ్చిన భక్తులకు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సాదర స్వాగతం పలికారు. చంద్రప్రభ వాహన సేవకు రామచంద్రాపురం మండలం నెన్నూరు, నడవలూరు, సొరకాయలపాలెం, దేసూరికండ్రిగ, సి.రామాపురం, పి.వి.పురం గ్రామాలకు చెందిన భక్తులు సారె సమర్పించారు. చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి వాహన సేవల్లో పాలు పంచుకున్నారు. నేడు రథోత్సవం బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన మంగళవారం ఉదయం 6 గంటలకు రథోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. స్వామివారు రథంపై ఆశీనులై పురవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. అలాగే రాత్రి 7 గంటలకు అశ్వ వాహన సేవ నిర్వహించనున్నారు. -
హృదయమనే కోవెలలో..
తిరుపతి తుడా: టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్ ఆధ్వర్యంలోని తిరుపతి శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయ చికిత్సా కేంద్రంలో 27వ గుండె మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు. గుండె మార్పిడి కోసం ఎదురుచూస్తున్న 14 ఏళ్ల బాలికకు గుంటూరులో లభించిన దాత గుండెను సకాలంలో తిరుపతికి తరలించి విజయవంతంగా మార్పిడి చేశారు. గుంటూరులోని కిమ్స్ ఆస్పత్రిలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్‌డెడ్‌గా ప్రకటించిన 38 ఏళ్ల వ్యక్తి కుటుంబం అవయవదానానికి ముందుకు వచ్చింది. వారి మానవతా నిర్ణయం మరో చిన్నారికి ప్రాణం పోసింది. ఎయిర్ అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో టీటీడీ రవాణా విభాగం వాహనంలో ఈనెల 20న మధ్యాహ్నం 3 గంటలకు గుంటూరు నుంచి గుండెను రోడ్డు మార్గంలో తిరుపతికి తరలించారు. ఎస్పీసీహెచ్సీకి చెందిన ఫిజీషియన్ అసిస్టెంట్ విజయ్, శ్యామ్‌బాబు గుండెతో పాటు ప్రయాణించి, వైద్య బృందంతో నిరంతర సమన్వయం చేశారు. సోమవారం సాయంత్రం 7 గంటలకు గుండె తిరుపతికి చేరుకోగా, వైద్య బృందం వెంటనే మార్పిడి ప్రక్రియను ప్రారంభించింది. సుమారు ఎనిమిది గంటలపాటు జరిగిన సంక్లిష్ట శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తిచేశారు. పద్మావతి చిన్నపిల్లల హృదయాలయ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్‌రెడ్డి సమన్వయంతో, చీఫ్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ దీపేష్ త్రివేది నేతృత్వంలో కార్డియాక్ అనస్థీషియాలజిస్ట్ డాక్టర్ మధుయాదవ్‌తో పాటు కార్డియాక్ సర్జన్లు, కార్డియాలజిస్టులు, వైద్య బృందం విజయంతంగా బాలికకు గుండె మార్పిడి చేసి ప్రాణం పోశారు. -
అభివృద్ధి పనులకు శంకుస్థాపన
కుప్పం : కుప్పం పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పురపాలక పరిధిలో రూ.184 కోట్లతో నిర్మించనున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి భూమి పూజ చేశారు. రూ.13కోట్లతో నిర్మించనున్న ఏఎస్పీ, ఆర్డీఓ కార్యాలయ భవనాల పనులకు శ్రీకారం చుట్టారు. పది ఎకరాల విస్తీర్ణంలో మల్లానూరు జూనియర్ కళాశాల నిర్మాణానికి సైతం శంకుస్థాపన చేశారు. 3.30 కోట్లతో నిర్మించనున్న సమగ్ర ఘన వ్యర్థాల నిర్వాహణ ప్లాంట్ల పనులను ప్రారంభించారు. అలాగే రూ.32 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకస్థాపన చేశారు. 35 పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు రూ.15 కోట్లు మంజూరు చేశారు. తంబిగానిపల్లె వద్ద నూతనంగా నిర్మించనున్న రైతు బజారుకు భూమి పూజ చేపట్టారు. కుప్పంమార్కెట్ యార్డులో 2.5 కోట్లతో పలు అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారు. రూ.16 కోట్ల వ్యయంతో బీటీ, సీసీ రోడ్లు నిర్మించేలా హెరిటేజ్ గ్రానైట్ స్టోన్ క్రషర్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అధికార బలంతో ఆక్రమణ చిత్తూరు రూరల్ (కాణిపాకం):అధికార బలంలో టీడీపీ నేతలు సాక్షాత్తు ఆంజనేయస్వామి ఆల య భూమికే ఎసరు పెట్టారని హిందూ చైతన్య వేదిక జిల్లా అధ్యక్షుడు రామమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం చిత్తూరు ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడారు. వెదురుకుప్పం మండలం దేవళంపేటలోని శ్రీభక్తాంజనేయ స్వామి ఆలయ భూములను టీడీపీ నేతలు ఆక్రమించుకుంటుంటే దేవదాయ, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఓ ప్రజాప్రతినిధి అండదండలతో పచ్చమూక ఆలయ భూములను సైతం వదలడం లేదని ఆరోపించారు. పురాతన ఆంజనేయస్వామి ఆలయానికి తూర్పు వైపున ఉన్న విలువైన స్థలాన్ని అక్రమంగా ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారని తెలిపారు. ఈ అక్రమ నిర్మాణాల కారణంగా మురుగు వ్యర్థాలు ఆలయ ప్రాంగణంలోకి చేరుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసే పనులను మానుకుంటే న్యాయపోరాటానికి దిగుతామని హెచ్చరించారు. శ్రీవారి దర్శనానికి 6 గంటలు తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 6 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఆదివారం అర్ధరాత్రి వరకు 72,019 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 25,431 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.50 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 6 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది. -
సిద్ధార్థలో వైభవంగా సీతారాముల కల్యాణం
నారాయణవనం: స్థానిక సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో నిర్వహిస్తున్న నవాహ్నిక‘మహా సంకల్పసిద్ధి మహాయాగం’లో భాగంగా సోమవారం సీతారాముల కల్యాణం కన్నుల పండువగా సాగింది. ఉదయం సుందరకాండ సంపూర్ణ పారాయణం, సంపూర్ణ పారాయణ యజ్ఞాన్ని నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక క్రతువులో రాష్ట్ర వైద్య విద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌యాదవ్, రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు కోలా ఆనంద్, తిరుపతి జిల్లా బీజేపీ అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్, రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు నిషితరాజు దంపతులు, మాజీ శాసన సభ్యులు జీవీ శ్రీనాథ్‌రెడ్డి పాల్గొన్నారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ మట్లాడుతూ భారత ప్రధాని నరేంద్రమోదీ శ్రేయస్సును కోరుతూ, లోక కళ్యాణార్థం ఈ యజ్ఞాన్ని నిర్వహిస్తున్న అశోక్ రాజును ఆయన ప్రత్యేకంగా అభినందించారు. సాయంత్రం వేళ సీతారామ పట్టాభిషేకం, శ్రీరాముల వరి పల్లకీ ఉత్సవం నిర్వహించగా, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. రాత్రి మంత్రోచ్ఛారణల మధ్య శ్రీరామ మూల మంత్ర యజ్ఞం సాగింది. -
రమణీయం.. రథోత్సవం
కాణిపాకం : కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయకస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. అందులో భాగంగా సోమవారం అత్యంత రమణీయంగా రథోత్సవం నిర్వహించారు. సర్వాలంకార భూషితుడై, సిద్ధి, బుద్ధి సమేతంగా స్వామివారు రథంపై కొలువుదీరి భక్తులను అనుగ్రహించారు. గణేశుని వైభవాన్ని వీక్షించేందుకు పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. శాస్త్రోక్తంగా పూజలు బ్రహ్మోత్సవాల్లో భాగంగా వేకువజామునే మూలవిరాట్‌కు సంప్రదాయబద్ధంగా ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. అనంతరం సుగంధ పరిమళ భరిత పుష్పాలతో స్వామివారిని విశేషంగా అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఉదయం ఉత్సవమూర్తుల ను అన్వేటి మండపానికి వేంచేపు చేసి విశేష సమర్పణ లు చేపట్టారు. పుణ్యాహవాచనం, వాస్తు పూజ, రథసా రథి ప్రతిష్టతో పాటు రథబలి, కూష్మాండ బలి పూజల ను అర్చకులు శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. అనంతరం మంగళవాయిద్యాల నడుమ ఉత్సవమూర్తులను ఆల యం నుంచి ఊరేగింపుగా తీసుకువచ్చి రథంపై కొలువుదీర్చారు. ఉభయకర్తలు సమర్పించిన ఉభయం అనంతరం రథానికి ప్రత్యేక పూజలు జరిపించారు. జయజయధ్వానాల నడుమ.. ఆలయ అధికారులు మధ్యాహ్నం రథోత్సవాన్ని ప్రారంభించడంతో స్వామి నామస్మరణలు, భక్తుల జయజయధ్వానాలతో కాణిపాకం క్షేత్రం మార్మోగింది. వివిధ కళారూపాలు, దివ్య మంగళ వాయిద్యాలు, ఆధ్యాత్మిక నృత్య ప్రదర్శనలు రథోత్సవానికి మరింత శోభను తీసుకువచ్చాయి. రథంపై అధిరోహించిన స్వామివారు కాణిపాక పురవీధుల్లో ఊరేగుతూ భక్తజనులకు అభయమిచ్చారు. అశేష భక్తజనుల నడుమ రథోత్సవం ఉప్పొంగిన భక్తిభావం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం నిర్వహించిన రథోత్సవంలో భక్తిభావం ఉప్పొంగింది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన రథోత్సవం సాయంత్రం 5:45 గంటలకు వైభవంగా ముగిసింది. అయితే రథోత్సవం సాగుతుండగానే సాయంత్రం 4 గంటల సమయంలో ఒక్కసారిగా వర్షం మొదలైంది. భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వేలాదిగా తరలివచ్చిన భక్తులు రథం వెంటే సాగారు. -
చిన్నారులకు అరుదైన చికిత్స
తిరుపతి తుడా: స్విమ్స్ ఆస్పత్రిలో ఇద్దరు చిన్నారులకు అరుదైన క్లిష్టమైన శస్త్ర చికిత్సను వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారని డైరెక్టర్ డాక్టర్ జగదీష్ తెలిపారు. అన్నమయ్య జిల్లా, రాయచోటికి చెందిన రెండేళ్ల బాలిక కడుపులో అసాధారణంగా మాస్ గుర్తించడంతో తల్లిదండ్రులు చిన్నారిని స్విమ్స్‌కు తీసువచ్చారని తెలిపారు. వైద్య పరీక్షల అనంతరం చిన్నారి కుడి కిడ్నీలో ట్యూమర్ ఉన్నట్లు నిర్ధారించి డాక్టర్ భార్గవి ఆధ్వర్యంలోని వైద్య బృందం చిన్నారికి నాలుగు సైకిళ్ల కీమోథెరపీ చికిత్సను పూర్తి చేశారని తెలిపారు. అలాగే తిరుపతి జిల్లా, పుత్తూరు మండలానికి చెందిన రెండేళ్ల బాలుడు విల్మ్స్ ట్యూమర్‌తో స్విమ్స్‌లో చేరారని, మూడు నెలల క్రితం ఈ చిన్నారికి మెడికల్ ఆంకాలజీ విభాగం డాక్టర్ భార్గవి బృందం కీమోథెరపీ అందించగా, అనంతరం సర్జికల్ ఆంకాలజీ ప్రొఫెసర్ డాక్టర్ మణిలాల్ నేతృత్వంలోని వైద్య బృందం విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించినట్టు తెలిపారు. -
ఆనవాళ్లు లే‘కొండ’!
నగరి : నగరిలో క్రషింగ్ మాఫియా విశ్వరూపం ప్రదర్శిస్తోంది. రూ.కోట్ల విలువైన సంపదను కొల్లగొట్టేస్తోంది. అనుమతులు ఇచ్చేశాం ఇక మనకేం పని అంటూ అధికారులు కళ్లుమూసుకుంటున్నారు. ఇదే అదునుగా అక్రమార్కులు కంకరను తరలించుకుపోతున్నారు. మండలంలోని గుండ్రాజుకుప్పంలోనే కొండలు ఎక్కువగా ఉండడంతో క్రషింగ్ మాఫియా కన్ను ఈ పంచాయతీపై పడింది. జాతీయ రహదారి పనులు వీరికి కలసి వచ్చాయి. దీంతో ఎడాపెడా కొండలను పిండి చేసేస్తున్నారు. ఈ మేరకు టీడీపీ ముఖ్య నాయకుల కనుసన్నల్లోనే మొత్తం దందా నడుస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. ఒక్క బిల్లుతోనే.. నగరి పట్టణం తమిళనాడుకు సరిహద్దులో ఉండడంతో కంకర తరలింపు జోరుగా సాగుతోంది. ఒకే బిల్లుపై మూడు, నాలుగు ట్రిప్పర్ల కంకరను తరలిస్తూ ప్రభుత్వ ఖజానాకు గండికొడుతున్నారు. అరికట్టాల్సిన మైనింగ్‌శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ ఆధాయానికి గండి పడడంతో పాటు ప్రకృతి సంపద తరించుకుపోతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. క్రషింగ్ నడిపేవారిలో తమిళనాడుకు చెందిన కాంట్రాక్టర్లే ఎక్కువగా ఉండంతో తరలింపు సులభతరంగా మారుతోంది. ఏపీఎండీసీ భూముల్లో సైతం.. ఆంధ్రప్రదేశ్ మినరల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎండీసీ) భూములను కూడా మైనింగ్ మాఫియా వదలిపెట్టడం లేదు. ఆ భూముల్లో సైతం రిగ్గులు వేసి బ్లాస్టింగ్ చేస్తున్నారు. ఈ పేలుళ్లకు సమీప గ్రామాలు సైతం అదిరిపడుతున్నాయి. ప్రధాన రహదారి పక్కనే ఉన్న కొండల్లో పెట్టే బ్లాస్టింగ్ల కారణంగా దారి మొత్తం పొగ కమ్ముకుంటోంది. రాత్రి వేళ పేలుళ్ల కారణంగా జనం నిద్రకు సైతం దూరమవుతున్నారు. సాధారణంగా జనావాసాలకు దూరంగా ఉండే కొండలకు మాత్రమే బ్లాస్టింగ్ అనుమతులు ఇవ్వాలి. అయితే ఇళ్ల సమీపంలోని కొండలపై కూడా యథేచ్ఛగా బ్లాస్టింగ్ జరుగుతోంది. దీనిపై మైనింగ్‌శాఖ, విజిలెన్సు అధికారులు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. -
వర్షాలపై విద్యుత్‌శాఖ అప్రమత్తం
తిరుపతి రూరల్: భారీ వర్షాలు, బలమైన గాలుల నేపథ్యంలో ఏపీఎస్పీడీసీఎల్ అధికారులు అప్రమత్తమయ్యారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడితే వెంటనే పునరుద్ధరించేలా ముందస్తు చర్యలు చేపట్టాలని సంస్థ సీఎండీ శివశంకర్ లోతేటి అధికారులను ఆదేశించారు. వర్షాల నేపథ్యంలో అధికారులుతో సోమవారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. స్తంభాలు కూలిపోవడం, విద్యుత్ తీగలు తెగిపడటం వంటి ఘటనలు కనిపిస్తే వెంటనే సమీప విద్యుత్ శాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని కోరారు. అలాగే 1912, 1800 425 155333 టోల్‌ఫ్రీ నంబర్లకు లేదా 91333 31912 వాట్సాప్ నంబర్‌కు సమాచారం అందించాలని సూచించారు. అంతకుముందు గురజాడ అప్పారావు చిత్రపటానికి నివాళి అర్పించారు. డయల్ యువర్ సీఎండీకి 103 వినతులు ‘డయల్ యువర్ సీఎండీ’, ‘డయల్ యువర్ ఎస్ఈ’ కార్యక్రమాలకు 103 మంది వినియో గదారులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. వివిధ సమస్యలపై వినతులు అందినట్లు సీఎండీ శివశంకర్ తెలిపారు. నేటి నుంచి పవిత్రోత్సవాలు శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలో మంగళవారం నుంచి 26వ తేదీ వరకు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. పవిత్రోత్సవాల సందర్భంగా ప్రతిరోజూ యాగశాల నుంచి పట్టువస్త్రాలు, పట్టు పవిత్రాలు, పాదుకలు, సుగంధ ద్రవ్యాలు తదితర పూజా సామగ్రిని ఆలయ ప్రదక్షిణగా తీసుకొచ్చి వినాయకస్వామి, చెంగల్రాయస్వామి, శ్రీకాళహస్తీశ్వరస్వామి, జ్ఞానప్రసూనాంబ గర్భాలయాల్లో ఉంచి విశేష పూజలు నిర్వహించనున్నారు. ప్రతిరోజూ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటలు వరకు, సాయంత్రం 5.30 నుంచి రాత్రి 7.30 గంటల వరకు గర్భాలాయల్లో విశేషాధిపూజా కార్యక్రమాలు నిర్వహించనున్న ఆ సమయాల్లో అంతరాలయ దర్శనం ఉండదన్నారు. ప్రతిరోజూ ఉదయం 10గంటలకు నిర్వహించే ఉచ్ఛికాల అభిషేకం పవిత్రోత్సవాల సందర్భంగా ఉదయం 9.30గంటలకు నిర్వహిస్తారన్నారు. సాయంత్రం దీపారాధణ సేవ టిక్కెట్లు కూడా తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. రుయాలో హోమ్ కేర్ నర్సింగ్ కోర్సు తిరుపతి తుడా: రుయా ఆసుపత్రిలో హోమ్ కేర్ నర్సింగ్ ఎయిడ్ సర్టిఫికెట్ కోర్సు ప్రారంభించినట్లు ఎస్వీ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జీ.రవిప్రభు తెలిపారు. రుయా ఆస్పత్రి, రోటరీ క్లబ్ ఆఫ్ తిరుపతి, శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో మూడు నెలల కాలవ్యవధితో హోమ్ కేర్ నర్సింగ్ ఎయిడ్ సర్టిఫికెట్ కోర్సును వైద్యాధికారులతో కలిసి ఆయన సోమవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాలియేటివ్ కేర్ రోగులకు సేవలందించేందుకు శిక్షణ పొందిన సంరక్షకుల అవసరం ఎంతో ఉందని పేర్కొన్నారు. రుయా సూపరింటెండెంట్ డాక్టర్ బీ.మనోహర్ మాట్లాడుతూ ఆస్పత్రితో పాటు ఇంటి వద్ద పాలియేటివ్ కేర్ అవసరమైన రోగులకు మెరుగైన సేవలందించగల నైపుణ్యం కలిగిన నర్సింగ్ సహాయకులను తీర్చిదిద్దడం ఈ కోర్సు ప్రధాన ఉద్దేశమన్నారు. -
చంద్రబాబు, పవన్ క్షమాపణ చెప్పాలి
పలమనేరు/పెద్దపంజాణి: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి వారి పవిత్ర లడ్డూ ప్రసాదాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వివాదంలోకి లాగిన చంద్రబాబు, పవన్ కల్యాణ్ అసలు స్వరూపం బయటపడిందని పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ తెలిపారు. ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. లడ్డూ తయారీలో ఉపయోగించిన నెయ్యిలో ఆవు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె వంటి పదార్థాలు ఉన్నాయనడానికి ఆధారాలు లేవ ని సీబీఐ తేల్చిందన్నారు. అంతే కాకుండా వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ తిరస్కరించిన నెయ్యి ట్యాంకర్ల లోని నిల్వలను మారు పేరు తో ఆగస్టు 2024లో చంద్రబాబు ప్రభు త్వం వచ్చిన తర్వాత మళ్లీ టీటీడీకి సరఫరా చేసినట్లు సీబీఐ సిట్ దర్యాప్తులో వెల్లడైందని పేర్కొన్నారు. ఇప్పుడు చంద్రబాబు, పవన్ కల్యాణ్ రాష్ట్ర ప్రజలు, కోట్లాదిమంది శ్రీవారి భక్తులకు ఏమి సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఇప్పటికై నా మీరు చేసిన ఆరోపణలు తప్పు అని అంగీకరిస్తారా? అని నిలదీశారు. జంతు కొవ్వు ఉందని ఆరోపణలతో వైఎస్ జగన్, వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై బురద జల్లడం రాజకీయ కుట్ర కాదా? అని ప్రశ్నించారు. టీటీడీకి వచ్చిన ప్రతి నెయ్యి ట్యాంకర్ నుంచి నమూనాలు తీసుకుని నాణ్యత పరీక్షలు చేస్తారని జగన్ ముందే చెప్పారని గుర్తు చేశారు. లడ్డూలో జంతు కొవ్వు కలిపారని ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఆధారాలు లేకుండా ఎలా ప్రకటించారని, కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసిందుకు చంద్రబాబు బేషరుతగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నిజానిజాలు తేలకముందే ప్రాయశ్చిత్త దీక్షలు, సభలు, ప్రకటనలతో భక్తులను మరింత రెచ్చగొట్టిన పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏమి సమాధానం చెబుతారని నిలదీశారు. -
ఐరావతారూఢుని వైభవం
కాణిపాకం: కాణిపాకం స్వయంభు వరసిద్ధి వినాయకస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం రాత్రి స్వామివారు మహాగజ వాహనంపై కొలువుదీరి భక్తులకు దివ్యదర్శనమిచ్చారు. భక్తులు విఘ్న వినాశకుని మంగళరూపాన్ని తిలకించి పరవశించిపోయారు. వేకువజామునే మూలమూర్తికి విశేష పూజలు ప్రారంభమయ్యాయి. సిద్ధి, బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామివారి ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా తిరుమంజనం చేశారు. అనంతరం సర్వాంగ సుందరంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. గజవాహనంపై కొలువుదీరిన గణాధిపతి స్వామివారికి రాత్రి అలంకార మండపంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అధికారులు, ఉభయదారులు ఉత్సవమూర్తులను ఊరేగింపుగా తీసుకెళ్లి, మహాగజ వాహనంపై కొలువుదీర్చి ఊరేగించారు. మేళతాళాలు, మంగళవాయిద్యాలు, కోలాటాలు, జానపద నత్యాలు. పలు ఆధ్యాత్మిక సాంస్కతిక ప్రదర్శనల నడుమ గజవాహన సేవ అత్యంత అంగరంగ వైభవంగా, నేత్రపర్వంగా సాగింది. పురవీధుల్లో స్వామివారు విహరిస్తుంటే ఓం శ్రీవరసిద్ధి వినాయక స్వామినే నమః జై గణేశా అంటూ భక్తులు చేసిన నామస్మరణలతో కాణిపాక క్షేత్రం మారుమోగింది. -
‘ఒమేగా’లో క్యాన్సర్‌కు ఉచిత వైద్యం
తిరుపతి సిటీ : ఒమేగా హాస్పిటల్లో ప్రజలకు అధునాతన క్యాన్సర్ వైద్య సేవలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ చిగురుపాటి మోహన్ వంశీ తెలిపారు. ఆదివారం తిరుపతి రూరల్ మండలం గాంధీపురం సమీపంలోని వకుళమాత ఆలయం వద్ద ఉన్న ఒమేగా హాస్పిటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ కింద పూర్తి స్థాయి సమగ్ర క్యాన్సర్ వైద్య సేవలను ప్రారంభించినట్లు వెల్లడించారు. తిరుపతి, రాయలసీమ ప్రజలకు మెరుగైన క్యాన్సర్ వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో రెండేళ్ల క్రితం తిరుపతిలో ఒమేగా హాస్పిటల్ ప్రారంభించామన్నారు. క్యాన్సర్‌కు ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా పూర్తి ఉచితంగా చికిత్స అందించనున్నట్లు చెప్పారు. చైన్నె, తిరుపతిలోఎక్కడా లేనివిధంగా అత్యాధునిక సదుపాయాలు, డిజిటల్ పెట్ సిటీ, ట్రూ బీమ్ రేడియేషన్ చికిత్స ఓమెగాలో ఉందని, నిపుణులైన సర్జికల్, మెడికల్, రేడియేషన్ అంకాలజిస్ట్‌లు అందుబాటులో ఉండడంతో వంద శాతం సక్సెస్ రేట్‌ను సాధించగలుగుతున్నామని వివరించారు. ఏపీజెన్కో, ట్రాన్స్‌కో, బీఎస్ఎన్ఎల్, ఇండియన్ రైల్వేస్ ఉద్యోగులకి ఉచిత వైద్య సేవలు అందించడమే కాకుండా, ప్రధాన ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. అనంతరం మెడికల్ డైరెక్టర్ డాక్టర్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ క్యాన్సర్‌ను ప్రథమ దశలో గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చని వెల్లడించారు. ఏ స్థాయిలో ఉన్న క్యాన్సర్‌నైనా గుర్తించగలిగే అధునాతన పరికరాలు ఒమేగా హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయని, వాటి ద్వారా క్యాన్సర్‌ను ప్రారంభంలోనే గుర్తించి చికిత్స అందిస్తామని వివరించారు. సమావేశంలో సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ శివనాథ్‌రెడ్డి, రేడియేషన్ అంకాలజిస్ట్ డాక్టర్ నవీన్ రెడ్డి, డాక్టర్ మురళీకృష్ణ, డాక్టర్ అలేఖ్య, డాక్టర్ వర్షిత, జీఎం నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
మూడు నెలల చిన్నారి బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు
చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరుకు చెందిన మూడు నెలల చిన్నారి బండి జియారెడ్డి పొడవైన సహజ జుట్టుతో యంగెస్ట్ బేబీ డాక్యుమెంటెడ్ విత్ ఎక్సెప్షనల్లీ లాంగ్ నేచురల్ హెయిర్ అట్ త్రీ మంత్స్ అనే టైటిల్‌కు సంబంధించి బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటుదక్కించుకుంది. చిన్నారి తల్లిదండ్రులు బండి శివకుమార్, అలేఖ్యను ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అభినందించారు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం ఎమ్మెల్యే బీవీ రెడ్డి కాలనీలోని తన నివాసంలో చిన్నారి బండి జియారెడ్డిని ఆశీర్వదించడంతో పాటు, చిన్నారి తల్లిదండ్రులను సైతం అభినందించారు. -
ముడుపులిస్తేనే ఫైల్స్ ముందుకు
రాష్ట్రంలో ఎక్కడా లేని వింత రూల్స్ చిత్తూరు డీడీ కార్యాలయంలోనే తెరపైకి వస్తాయి. కొత్త కొత్త రూల్స్‌ను తెరపైకి తెస్తూ చిత్తూరు ట్రెజరీ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనల పేరుతో టీచర్లను రకరకాలుగా వేధిస్తున్నారు. తెరవెనుక ముడుపులు ముట్టజెబితేనే ఫైళ్లు ముందుకు కదిలేలా ట్రెజరీ అధికారులు చక్రం తిప్పుతున్నారనే విమర్శలు బహిరంగానే వినిపిస్తున్నాయి. ఒకవైపు హైస్కూల్ ప్లస్ టీచర్లు కుటుంబ పోషణకు, ఈఎంఐల చెల్లింపుకు నానా అవస్థలు పడుతున్నారు. ఖజానా శాఖ అధికారులు మాత్రం తమ అక్రమ నిబంధనలతో కాలయాపన చేస్తుండటం పట్ల సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పటికై నా రాష్ట్ర స్థాయి అధికారులు, ఆర్థిక శాఖ తక్షణమే జోక్యం చేసుకుని కలెక్టర్ ఆదేశాలు ధిక్కరిస్తున్న ఆ అధికారిపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. మూడు నెలలుగా నిలిచిపోయిన హైస్కూల్ ప్లస్ టీచర్ల జీతాలను తక్షణమే విడుదల చేయాలని కోరుతున్నారు. -
స్కానింగ్ కన్నింగ్
సాక్షి టాస్క్‌ఫోర్స్: చిత్తూరు జిల్లా కేంద్రంలో అక్రమ లింగ నిర్ధారణ పరీక్షలు, స్కానింగుల దందా యథేచ్ఛగా సాగుతోంది. ఆడో.. మగో చెప్పి రూ.వేలకు వేలు గుంజుతున్న ఈ ముఠా వెనుక కూటమికి చెందిన ఓ కీలక బీసీ నేత ఉన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకుని, ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న ఆ కార్యాలయాన్నే ఈ అక్రమ స్కానింగ్ సెంటర్‌కు ప్రధాన అడ్డాగా మార్చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చట్టానికి, పోలీసులకు భయపడాల్సిన చోట.. ఏకంగా అధికార పార్టీ నేత ఆఫీసులోనే ఈ దందా సాగుతుండడం గమనార్హం. కమీషన్ల కోసం కోవర్టులు ఈ అక్రమ ముఠా అత్యంత ప్రణాళికతో, విస్తృతమైన నెట్‌వర్క్‌తో పనిచేస్తోంది. గ్రామాలు, స్థానిక ప్రాంతాల్లో ఏజెంట్లుగా ఉండే కోవర్టుల ద్వారా గర్భిణులను గుర్తిస్తున్నారు. వారికి రకరకాల ఆశలు చూపి, తమ ఆటోల ద్వా రా నేరుగా సదరు బీసీ నేత కార్యాలయానికి తరలిస్తున్నా రు. అక్కడ ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా, రహస్యంగా స్కానింగ్ పూర్తి చేస్తున్నారని తెలుస్తోంది. కడుపులో ఉన్నది ఆడపిల్లా లేక మగపిల్లా అని నిర్ధారించి చెప్పడానికి ఏకంగా రూ.17 వేలు వసూలు చేస్తున్నారు. రోజు కు పదుల సంఖ్యలో గర్భిణులను తీసుకొచ్చి ఈ దందా నడిపిస్తూ అక్రమార్కులు కాసుల వర్షంలో తడుస్తున్నారు. పాత నిందితులు ఉన్నా సరే... గతేడాది చిత్తూరు నగరంలోని లక్ష్మీనగర్‌కాలనీలో జరిగిన అక్రమ స్కానింగ్ దందాపై జిల్లా కలెక్టర్ స్వయంగా దాడి చేసి, విచారణ జరిపి బట్టబయలు చేసిన సంగతి తెలిసిందే. ఆ కేసులో నిందితులుగా ఉన్న కొందరు కన్నుగప్పి మళ్లీ తెరపైకి వచ్చారనే వాదనలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ దందాకు పాత నిందితులు, ఓ కానిస్టేబుల్, ఓ మెడికల్ షాప్ నిర్వాహకుడు గ్యాంగ్‌గా ఏర్పడ్డారనే విమర్శ లు వస్తున్నాయి. వీరికి సదరు కూటమి బీసీ నేత తోడు కావడంతో చిత్తూరు నడిబొడ్డున మళ్లీ ఈ పాపపు వ్యాపారాన్ని ప్రారంభించారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. టచ్ చేసే దమ్ము ఎవరికుంది? కూటమి నేత ఇచ్చిన పొలిటికల్ అభయంతోనే ఈ అక్రమార్కులు యథేచ్ఛగా రెచ్చిపోతున్నారని ఈ అక్రమల చిట్టా తెలిసిన కొందరు వ్యక్తులు ఈ అక్రమాలను బహిరంగం చేస్తున్నారు. అధికారుల దాడి భయం లేకుండా, ఎవరైనా అధికారులు వచ్చి అడ్డొస్తే అన్నీ నేను చూసుకుంటా.. రాష్ట్ర స్థాయిలో ఒక్క ఫోన్ కాల్ కొట్టిస్తే చిత్తూరులో మమ్మల్ని తాకే దమ్ము, ధైర్యం ఎవరికీ లేదంటూ ఆ నేత భరోసా ఇవ్వడంతో, ఈ ముఠా బహిరంగంగానే బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. వెంటనే చర్యలు తీసుకోకుంటే తీవ్ర ముప్పు నగరంలో యథేచ్ఛగా సాగుతున్న ఈ అక్రమ లింగ నిర్ధారణ పరీక్షలు, భ్రూణ హత్యల దందాపై జిల్లా యంత్రాంగం, ఆరోగ్య శాఖ, సీఐడీ పోలీసులు స్పందించాల్సిన అవసరం ఉంది. అధికార పార్టీ నేత నీడన సాగుతున్న ఈ రాకెట్‌ను వెంటనే అణచివేయకపోతే జిల్లాలో ఆడపిల్లల సంఖ్య పూర్తిగా తగ్గుముఖం పట్టే ప్రమాదముందని పలువురు హెచ్చరిస్తున్నారు. ఈ అక్రమ స్కానింగ్ గ్యాంగ్‌ను, వారికి కొమ్ము కాస్తున్న కూటమి నేతను, సహకరిస్తున్న పోలీసు సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ప్రజా ప్రతినిధిని కలవాలన్నా భయమే ఈ అక్రమ దందాకు లొంగని వారిపై, ఎదురు తిరిగిన వారిపై ఈ ముఠా వేధింపుల పర్వానికి తెరలేపింది. ప్రశాంత్ నగర్లో స్కానింగ్ సెంటర్ నిర్వహిస్తున్నట్లు ఓ మహిళను టార్గెట్ చేసి ఆమెను ఆ నేత తీవ్రంగా భయభ్రాంతులకు గురిచేస్తున్నారని కొందరు మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్ర మ కేసుల్లో ఇరికిస్తామని బెదిరిస్తున్నారని బాధిత మహిళలు వాపోతున్నారు. ఈ దందాలు, వేధింపులపై స్థానిక ప్రజాప్రతినిధిని కలిసి ఫిర్యాదు చేద్దామని బాధిత మహిళలు ప్రయత్నించినప్పటికీ.. కూటమి నేతల బెదిరింపులు, ఎమ్మెల్యే వద్దకు వెళితే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందోననే భయాందోళనల కారణంగా వెనక్కి తగ్గాల్సి వచ్చిందని సమాచారం. -
నేడు కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ రద్దు
చిత్తూరు కలెక్టరేట్ : ప్రజా సమస్యల పరిష్కారానికి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించాల్సిన పీజీఆర్ఎస్ (ప్రజాసమస్యల పరిష్కార వేదిక)ను రద్దు చేశారు. ఈ మేరకు ఆదివారం కలెక్టరేట్ అధికారులు వెల్లడించారు. ఈ నెల 21, 22 తేదీల్లో సీఎం చంద్రబాబునాయుడు కుప్పం పర్యటన ఉండడంతో పీజీఆర్ఎస్ను రద్దు చేసినట్లు తెలిపారు. జిల్లాలోని ప్రజలు ఈ విషయాన్ని గమనించి వ్యయప్రయాసలకు ఓర్చి కలెక్టరేట్‌కు రావద్దని అధికారులు కోరారు. సీఎం పర్యటన ప్రదేశాల పరిశీలన కుప్పం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 21, 22 తేదీల్లో కుప్పంలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ, ఎస్పీ తుషార్ డూడి ఆదివారం శాంతిపురం మండలం గుండిశెట్టిపల్లి గ్రామం వద్ద చేపట్టనున్న జలహారతి స్థలాన్ని పరిశీలించారు. అనంతరం కుప్పం మున్సిపాలిటీ తంబిగానిపల్లి వద్ద శంకుస్థాపన చేయనున్న రైతు బజార్ స్థలాన్ని, కొత్తపేటలో నిర్వహించే బహిరంగ సభ ప్రాంగనాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. రైల్వే స్టేషన్లో దాదర్–పుదుచ్చేరి రైలు కుప్పం హాల్ట్ ప్రదేశాలను పరిశీలించారు. కడపల్లి వద్ద పార్టీ కేడర్ సమావేశంలో సీఎం పాల్గొనుండడంతో ఆయా ప్రాంతాలను పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, సీఎం పర్యటన లైజెన్ ఆఫీసర్ వెంకటేష్, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, సీఎం పీఏ శ్రీకాంత్, పీఎస్ మునిరత్నం తదితరులు పాల్గొన్నారు. విఘ్నేశ్వరుడికి 1,516 కేజీల లడ్డూ ప్రసాదం చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు నగరం డీఐ రోడ్డులో వినాయక చవితి వేడుకలు భక్తిశ్రద్ధల నడుమ ఘనంగా జరుగుతున్నాయి. 50వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వాహకులు తొలి సారిగా 1,516 కేజీల భారీ లడ్డూ ప్రసాదాన్ని తయారు చేయించి విఘ్నేశ్వరుడికి సమర్పించారు. ఆదివారం సాయంత్రం పొన్నియమ్మ గుడివీధిలోని వీరాంజనేయ స్వామి ఆలయం నుంచి మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా లడ్డూను డీఐ రోడ్డులోని గణపతి మండపానికి తీసుకెళ్లారు. సెప్టెంబర్ 14న పండగ రోజున ఏకంగా 50 విగ్రహాలను ప్రతిష్టించి రోజు వారీ అన్నదానాలు, సహస్ర గణపతి హోమాలు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. -
● కూటమి ప్రభుత్వంలో తగ్గిపోయిన 102 సర్వీసులు ● చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో గణనీయంగా తగ్గిన వాహనాలు ● అరకొర సేవలపై ఆస్పత్రుల వద్ద బాలింతల నిరీక్షణ ● తప్పని ప్రైవేటు వాహనాల బాదుడు ● కనుమరుగైన హైరిస్క్ గర్భిణుల రవాణా సదుపాయం ● పట్టించుకోని అధికార యంత్ర
కాణిపాకం: చిత్తూరు, తిరుపతి జిల్లాల పరిధిలో 2 జిల్లా ఆస్పత్రులు, 98 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 22 అర్బన్ హెల్త్ సెంటర్లు, 15 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, 9 ఏరియా ఆస్పత్రులు విస్తరించి ఉన్నప్పటికీ, వాటికి అనుసంధానంగా ఉండాల్సిన రవాణా వ్యవస్థను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. చాలీచాలని వాహనాలు ప్రభుత్వాసుపత్రుల్లో కాన్పులైన అనంతరం బాలింతలను సురక్షితంగా, ఉచితంగా వారి ఇళ్లకు చేర్చేందుకు గత ప్రభుత్వం తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఉచితంగా ఇంటి వద్ద దింపి వచ్చేవారు. కూటమి ప్రభుత్వం ఈ సేవలపై నిర్లక్ష్యం చూపుతోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో చిత్తూరు జిల్లాలో 16 తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలు నిరంతరం అందుబాటులో ఉండగా, ప్రస్తుతం 11 ఉన్నాయి. రోజూ 25 నుంచి 30 మంది బాలింతలను మాత్రమే ఇళ్లకు చేరుస్తున్నారు. అలాగే తిరుపతి జిల్లాలో గతంలో 19 వాహనాలు ఉండగా, ప్రస్తుతం వాటి సంఖ్యను 16కు తగ్గించారు. అక్కడ రోజువారిగా 30 నుంచి 40 మంది తల్లులను మాత్రమే ఇళ్లకు తీసుకెళ్తున్నారు. హైరిస్క్ సేవలు ఏవీ? గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో హైరిస్క్ గర్భిణుల కోసం ప్రత్యేకంగా తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలను విస్తరించారు. ఒక కాల్ చేస్తే చాలు.. ఇంటి నుంచే వాహనాన్ని బుక్ చేసుకుని గర్భిణిని సురక్షితంగా ఆస్పత్రికి తీసుకెళ్లి ఉచితంగా వైద్య పరీక్షలు చేయించిన తర్వాత తిరిగి క్షేమంగా ఇళ్లకు చేర్చేవారు. ప్రస్తుత ప్రభుత్వం హైరిస్క్ రవాణా సేవల గురించి పట్టించుకోలేదు. పల్లె ప్రాంతాలతో పాటు మారుమూల ప్రాంతాల్లో నేటికీ సరైన బస్సు సౌకర్యాలు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో ఆటోలు, ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తూ గర్భిణులు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని ఆస్పత్రులకు రావాల్సి వస్తోంది. ఈ సేవలు అందించే విషయంలో స్థానిక ఆశావర్కర్లు, ఏఎన్ఎంలు సైతం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తూ చేతులెత్తేస్తున్నారు. అధికారులు సైతం ఈ సేవలను పట్టించుకోవడం మానేయడంతో హైరిస్క్ గర్భిణుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలు పేరుకే మిగిలిపోయాయని, ప్రభుత్వం తక్షణమే స్పందించి వాహనాల సంఖ్యను పెంచి, పాత పద్ధతిలోనే రవాణా సేవలను పూర్తిస్థాయిలో పునరుద్ధరించాలని ఉమ్మడి జిల్లాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అరకొర సేవలే జిల్లాల్లో తల్లీబిడ్డ వాహనాలు పరిమితంగా తిరుగుతుండటంతో అందరికీ ఉచిత రవాణా అంద డం లేదు. బాలింతలు ఉదయం డిశ్చార్జ్ అయి నా సాయంత్రం వరకు వాహనం రాదని సిబ్బంది తేల్చిచెబుతున్నారు. దీంతో బాలింతలు పసిపాపలతో ఆస్పత్రి ఆవరణలోనే నిరీక్షించా ల్సి వస్తోంది. ఒకేసారి ఇద్దరు, ముగ్గురు డిశ్చార్జ్ అయితే ఎవరిని తీసుకెళ్లాలో తెలియక సిబ్బంది చేతులెత్తేస్తున్నారు. దీంతో వేచి ఉండలేక బాధితులు సొంత డబ్బులు వెచ్చించి ప్రైవేటు ఆటోలు, టాక్సీలను ఆశ్రయించాల్సి వస్తోంది. -
వైభవంగా వెంకన్న కల్యాణం
– శాస్త్రోక్తంగా వరుణ యాగం నారాయణవనం: మండలంలోని సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో చైర్మన్ అశోక్‌రాజు నిర్వహిస్తున్న నవాహ్నిక విశ్వగురు మహా సంకల్ప సిద్ధి యాగంలో భాగంగా ఆదివారం వైభవంగా వెంకన్న కల్యాణం, వరుణ యాగం నిర్వహించారు. ఉదయం 8 నుంచి నాలుగు గంటల పాటు నిర్వహించిన అరుణ పారాయణం, సూర్య యంత్ర పూజల్లో మాజీ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ యాగ ఫలితంగా ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సిరిసంపదలతో సంతోషంగా జీవించడానికి భగవంతుని అనుగ్రహం లభిస్తుందని తెలిపారు. సాయంత్రం 4 గంటలకు డాక్టర్ నారాయణం తనూజ్ విష్ణువర్ధన్ కల్యాణం– వైశిష్ట్యతపై ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు. అనంతరం 5 గంటలకు శ్రీదేవీ, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామివారి కల్యాణోత్సవం జరిపించారు. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పాల్గొన్నారు. రాత్రి 7 నుంచి రెండు గంటల పాటు వేద పండితులు విశేష వరుణ యాగం చేపట్టారు. అశోక్‌రాజు మాట్లాడుతూ వరుణ యాగంతో వర్షాలు కురిసి, నదులు ప్రవహించి, చెరువులు, కుంటలు నిండి ప్రజల తాగునీటి సమస్యలు తీరడంతో పాటు వ్యవసాయానికి సాగునీరు పుష్కలంగా అందాలని భగవంతుడిని ప్రార్థించినట్లు వివరించారు. -
ఐదుగురు అంతర్రాష్ట్ర దొంగల అరెస్టు
చిత్తూరు రూరల్ (కాణిపాకం): వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేసినట్టు డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. వారి నుంచి సుమారు రూ.90 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలతో పాటు 3 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఆయన ఆదివారం చిత్తూరు నగరంలోని పోలీస్ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. కల్లూరు– పుంగనూరు రోడ్డులోని శ్రీకృష్ణ జ్యువెలరీస్ దుకాణంలో జూలై 17న భారీ చోరీ జరిగిందన్నారు. అలాగే పాలసముద్రం, గంగాధర నెల్లూరు, తవనంపల్లె మండలాల పరిధిలోని నాలుగు వరుస దొంగతనాలు జరిగాయని తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. శనివారం సాయంత్రం పాలసముద్రం మండలం దీనబంధాపురం గ్రామం వద్ద నిందితులను అరెస్టు చేసినట్టు తెలిపారు. వారిలో ప్రధాన నిందితుడు ఆర్.దినేష్ (25)పై ఇప్పటికే 18 దొంగతనం కేసులు ఉన్నాయని, బాలయ్య చిరంజీవి (34)పై తిరుపతి జిల్లా పుత్తూరులోని ఒక హత్య కేసుతో సహా 4 కేసులు ఉన్నట్లు వెల్లడించారు. వీరితో పాటు తమిళనాడు, చిత్తూరు జిల్లాలకు చెందిన జగన్ అలియాస్ బెరికి (19), వసంత్ కుమార్ అలియాస్ తుపాకి (19), ఈ.సిలంబరసన్ అలియాస్ శింబు (19)ను అరెస్ట్ చేశామన్నారు. వారి నుంచి 404 గ్రాముల బంగారు ఆభరణాలు, 17 కిలోల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న మొత్తం సొత్తు విలువ ప్రస్తుత మార్కెట్ ప్రకారం రూ.90 లక్షలు ఉంటుందని తెలిపారు. ఈ కేసును వేగంగా ఛేదించి భారీగా సొత్తును రికవరీ చేసిన కల్లూరు పోలీస్ సిబ్బంది, ప్రత్యేక బృందాన్ని జిల్లా ఎస్పీ తుషార్ డూడి ప్రత్యేకంగా అభినందించారని డీఎస్పీ తెలిపారు. -
టెంకాయ చెట్టు పడి యువకుడి మృతి
పుత్తూరు:రామకృష్ణాపురం పంచాయతీ మిట్టపాళెం గ్రామ సమీపంలో శనివా రం రాత్రి టెంకాయ చెట్టు పైన పడడంతో యువకు డు మృతిచెందాడు. పోలీసు ల కథనం మేరకు.. పుత్తూ రు మండలం ఎగవ గూళూరు హరిజనవాడకు చెందిన ఎ.కె.విశాల్(18), అతని మిత్రుడు వి.గణేష్(18) శనివారం రాత్రి 9 గం టల సమయంలో బైక్‌లో మిట్టపాళెం గ్రామాని కి బయలుదేరా రు. బైక్‌ను అతివేగంగా నడపడంతో అదుపు తప్పి రోడ్డు సమీపంలోని టెంకాయ చెట్టును బలంగా ఢీకొన్నారు. ఇద్దరూ కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. అదే సమయంలో టెంకాయ చెట్టు మొదలు బలహీనంగా ఉండడంతో విశాల్‌పై పడింది. గాయపడ్డ వీరిని పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం తిరుపతి రుయాకు తరలించారు. అక్కడ చికిత్స పొందు తూ విశాల్ మృతి చెందాడు. గణేష్ చికిత్స పొందుతున్నాడు. మృతుడు విశాల్ ఐటీఐ చేస్తుండగా, గణేష్ ఇంటర్ చదువుతున్నాడు. మృతుడు తండ్రి శేఖర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఏపీఆర్ఎస్ఏ రాష్ట్ర సెక్రటరీగా శేషగిరిరావు చిత్తూరు కలెక్టరేట్ : ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర సెక్రటరీగా శేషగిరిరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విజయవాడలో ఆదివారం ఆ సంఘం రాష్ట్ర కార్యవర్గ ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో చిత్తూరు కలెక్టరేట్లో ఇన్సెక్షన్ సూపరింటెండెంట్, తహసీల్దార్‌గా పనిచేస్తున్న శేషగిరిని ఎన్నుకున్నారు. ఆయ న విలేకరులతో మాట్లాడుతూ తనకు అప్పగించిన బాధ్యతలను తూచా తప్పకుండా పాటిస్తూ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తారని చెప్పా రు. రెవెన్యూ ఉద్యోగుల అపరిష్కృత సమస్యల ను పరిష్కరించేందుకు ఉన్నతాధికారులు, ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు చర్చిస్తామన్నారు. నూతనంగా ఎన్నికై న ఆయనకు జిల్లా రెవెన్యూ ఉద్యోగులు హుస్సేన్, హేమాద్రి, సంపత్, శివకుమార్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రాణాలు తీసిన నిద్రమత్తు ఐరాల: నిద్రమత్తు ఇద్దరి ప్రాణాలను బలి తీసుకుంది. మండలంలోని బొమ్మసముద్రం బ్రిడ్జి సమీపంలోని తిరుపతి– బెంగళూరు జాతీ య రహదారిపై ఆదివారం సాయంత్రం కారు డివైడర్‌ను ఢీకొనడంతో తమిళనాడుకు చెందిన ఇద్దరు మృతి చెందారు. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. కాణిపాకం ఎస్ఐ నరసింహులు కథనం మేరకు.. తమిళనాడులోని వాణియంబాడికి చెందిన అశ్విన్ కుటుంబ సభ్యులతో కలిసి శనివారం కారులో తిరుమలకు వెళ్లారు. తిరుమల బ్రహ్మోత్సవాలను తిలకించి, శ్రీవారిని దర్శించుకుని తిరిగి ఆదివారం స్వగ్రామానికి బయలుదేరారు. అశ్విన్ కారును నడుపుతుండగా బొమ్మసముద్రం బ్రిడ్జి సమీపంలోని తిరుపతి– బెంగళూరు జాతీయ రహదారిపై నిద్రమత్తులోకి జారుకున్నాడు. ఈ క్రమంలో కారు డివైడర్‌ను బలంగా ఢీకొంది. దీంతో అశ్విన్ కుమార్తె కీర్తికశ్రీ(10) అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన అశ్విన్, భార్య షణ్ముఖప్రియ, అత్త జయంతి, మామ కుత్తుస్వామి, వెన్మధి, సాయిసుధన్ను హైవే అంబులెన్స్‌లో చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ జయంతి(52) చికిత్స పొందుతూ మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన ఐదుగురిని వైద్యులు మెరుగైన చికిత్స నిమిత్తం రాణిపేట సీఎంసీకి తరలించారు. ఈ ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సిద్ధార్థలో వైభవంగా ధన్వంతరి యజ్ఞం, తిరుప్పావడ సేవ
నారాయణవనం: స్థానిక సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల ఆవరణలో నావాహ్నిక ‘విశ్వగురు మహా సంకల్ప సిద్ధి యాగం’లో భాగంగా శనివారం ఉద యం తిరుప్పావడ సేవను, సాయంత్రం ధన్వంతరి హో మాన్ని నిర్వహించారు. కేంద్ర పార్లమెంటరీ వ్యవహరాలు, సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి లోకనాథన్ మురుగన్ హోమంలో పాల్గొన్నారు. తమిళ పెరటాసి తొలి శనివారాన్ని పురస్కరించుకుని ఉదయం 8:30 గంటల నుంచి నాలుగు గంటల పా టు వేంకటేశ్వర స్వామికి వైభవంగా తిరుప్పావడ సేవను 115 హోమ గుండాలతో హోమ క్రతువుతో నిర్వహించారు. సాయంత్రం 4 గంటల నుంచి రెండు గంటల పాటు ప్రవచనకర్త చంద్రశేఖరేంద్ర పరబ్రహ్మ భక్తులను ఉద్దేశించి ‘ఆధునికత, ఆధ్యాత్మికత సమన్వయం‘పై ప్రవచనం చేశారు. సాయంత్రం నిర్వహించిన ధన్వంతరి యజ్ఞంలో కేంద్ర మంత్రి లోకనాథన్ మురుగన్ పాల్గొని స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. ఆయన మాట్లాడుతూ భారత ప్రధాని క్షేమం, దీర్ఘాయుష్షు కోసం ‘విశ్వగురు మహాసంకల్ప సిద్ధి యాగం’ అశోక్‌రాజు తలపెట్టడం అభినందనీయమని అన్నారు. అశోక్‌రాజు మాట్లా డుతూ ధన్వంతరి యజ్ఞంతో దేశ ప్రజలందరికీ ఆరోగ్యం,ఐశ్వర్యం, ఆయుష్షు చేకూరుతాయని తెలిపారు. తిరుప్పావడ ఉత్సవంలో అశోకరాజు దంపతులు ధన్వంతరి హోమంలో కేంద్రమంత్రి మురుగన్ -
అయ్య బాబోయ్ సీఎం పర్యటనా !
చిత్తూరు కలెక్టరేట్ : ‘అయ్యబాబోయ్... మళ్లీ సీఎం పర్యటనా? అంటూ జిల్లా యంత్రాంగం, అధికార వర్గాలు బెంబేలెత్తిపోతున్నాయి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తర్వాత జిల్లాలో పలుమార్లు పర్యటించారు. ఆయా పర్యటనల్లో వీఐపీ పర్యటనల నిర్వహణకు ఖర్చు చేసిన ప్రభుత్వ నిధులు, బకాయి బిల్లులు నేటికీ విడుదల కాకపోవడంతో అధికారిక యంత్రాంగం భయాందోళనకు గురవుతోంది. ముఖ్యమంత్రి పర్యటన అంటే సాధారణంగా జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు ఎంతో ఉత్సాహంగా ఏర్పాట్లు చేయాలి. కానీ, చిత్తూరు జిల్లాలో పరిస్థితి ఇందుకు పూర్తి విరుద్ధంగా మారింది. సీఎం పర్యటనల నిమిత్తం ఖర్చు చేసిన ప్రభుత్వ నిధులు, బకా యి బిల్లులు నేటికీ విడుదల కాకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. రూ. 21.50 కోట్ల బకాయిలు పెండింగ్ జిల్లాలో సాధారణంగా ఒక్క రోజు సీఎం పర్యటనకు రూ.40 నుంచి 70 లక్షలు, రెండు రోజుల పర్యటనకు రూ.1 కోటి నుంచి రూ.1.50 కోటి వరకు ఖర్చు అవుతుందని అధికారుల అంచనా. అధికార వర్గాల సమాచారం ప్రకారం ఇప్పటివరకు జిల్లాలో జరిగిన సీఎం పర్యటనల ఏర్పాట్ల నిమిత్తం ఖర్చుచేసిన బిల్లులు ఏకంగా రూ.21.50 కోట్ల వరకు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. వీఐపీ పర్యటనలు ఖరారైన ప్రతిసారీ స్టేజీలు, మైక్ సెట్లు, షామియానాలు, తాత్కాలిక హెలిప్యాడ్ల నిర్మాణం, రవాణా, పారిశుధ్యం, భద్ర త, ప్రొటోకాల్ ఏర్పాట్లు వంటి అత్యవసర పనుల కోసం నిధులు ఎక్కడి నుంచి తెచ్చి ఖర్చు చేయాలో తెలియక జిల్లా యంత్రాంగం తలలు పట్టుకుంటోంది. గతంలో ముఖ్యమంత్రి పర్యటనలు జరిగితే నిధుల మంజూరు ప్రక్రియ వేగంగా జరిగేదని, కానీ ప్రస్తుతం ఈస్థాయి బకాయిలు పేరుకుపోవడం, కాంట్రాక్టర్లకు జవాబు చెప్పలేక సతమతమవడం వంటి దుస్థితి ఎప్పుడూ ఎదురవ్వలేదని స్థానిక అధికారులు అంతర్గత సంభాషణల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. 21, 22 తేదీల్లో సీఎం జిల్లా పర్యటన ఇదిలా ఉండగానే, సీఎం చంద్రబాబు నాయుడు ఈ నెల 21, 22 తేదీల్లో (సోమ, మంగళవారాల్లో) చిత్తూ రు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో రెండు రోజు ల పాటు పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. అయితే పర్యటనల సందర్భంగా వేదికల నిర్మాణాలు, రంగురంగుల ఫ్లెక్సీ లు, ఆర్భాటాలు, హంగామాపై ఉన్న ఆసక్తి.. క్షేత్రస్థాయిలో అయ్యే వ్యయానికి సంబంధించిన నిధుల మంజూరుపై చూపకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నూతన పర్యటన ఖర్చులకు తోడు, పాత బకాయిలు ఎలా క్లియర్ అవుతాయో తెలియక అధికారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సీఎం జిల్లా పర్యటనలు ఇలా 2025 జనవరి 6,7,8 తేదీల్లో కుప్పం పర్యటన 2025 మార్చి 1 జీడీ నెల్లూరు మండలం పర్యటన 2025 మే 21 కుప్పం పర్యటన 2025 మే 25 కుప్పం పర్యటన 2025 జూలై 1,2 కుప్పం పర్యటన 2026 జనవరి 24 నగరి పర్యటన 2026 జనవరి 30 కుప్పం పర్యటన 2026 మే 23 యాదమరి మండలం పర్యటన 2026 జూలై 4 కుప్పం పర్యటన 2026 సెప్టెంబర్ 21,22 (తాజాగా) కుప్పం పర్యటన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా పర్యటనల పేరుతో జరుగుతున్న ఆర్భాటాలు, ఏర్పాట్ల వెనుక ఉన్న ఆర్థిక భారం ఇప్పుడు జిల్లా యంత్రాంగాన్ని భయాందోళనకు గురిచేస్తోంది. అయ్య బాబోయ్.. మళ్లీ సీఎం పర్యటనా? అంటూ అధికార వర్గాలు అంతర్గతంగా కలవరపడుతున్నాయి. సీఎంవో దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదు జిల్లాకు చెందిన ఉన్నతాధికారులు సీఎం పర్యటనల వ్యయం పేరుకుపోయిన బకాయిల అంశాన్ని పలుమార్లు ముఖ్యమంత్రి కార్యాలయం దృష్టికి, ఆర్థిక శాఖ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎలాంటి స్పందన రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఒకవైపు పర్యటన ఏర్పాట్లను అత్యంత ప్రతిష్టాత్మకంగా, ఎలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని యంత్రాంగాన్ని ఆదేశిస్తున్న ఉన్నతాధికారులు, అదే స్థాయిలో నిధుల విడుదలకు మాత్రం సుముఖత చూపకపోవడం గమనార్హం. పాత బకాయిల విడుదల విషయంలో వచ్చే సరికి మౌనం వహించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై తనిఖీ
కాణిపాకం: కాణిపాక శ్రీవరసిద్ధి వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలపై జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ శనివారం ప్రత్యేక శ్రద్ధ వహించారు. దేవస్థానం ఈవో పెంచ ల కిషోర్‌తో కలసి ఆలయ పరిసర ప్రాంతాలు, క్యూలైన్లు, దర్శన ప్రాంగణాలను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా పక్కా ఏర్పాట్లు పూర్తిచేయాలని ఆదేశించారు. క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు నిరంతరాయంగా తాగునీరు, అల్పాహారం, ఎండ తగలకుండా షెడ్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. పరిసర ప్రాంతా ల్లో పారిశుధ్య లోపం లేకుండా నిరంతరం పర్యవేక్షించాలని, అత్యవసర వైద్య సేవల కోసం ప్రత్యేక మెడికల్ క్యాంపులు, అంబు లెన్సులను సిద్ధంగా ఉంచాలని తెలిపారు. వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ మళ్లింపు, పోలీసు భద్రతపై అధికారులకు పలు సూచనలు చేశారు. అధికారులు సమన్వయంతో పనిచేసి భక్తులకు సుఖవంతమైన దర్శనం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు. -
కుక్కల దాడిలో 79 కోళ్లు మృతి
కుప్పంరూరల్: వీధి కుక్కల దాడిలో 79 నాటు కోళ్లు మృతి చెందిన సంఘటన కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని తంబిగానిపల్లిలో చోటుచేసుకుంది. శనివారం ఉదయం జరిగిన ఘటన వివరాలు యజమాని జ్యోతిశ్వర్ కథనం మేర కు ఇలా ఉన్నాయి. తంబిగానిపల్లి గ్రామానికి చెందిన జ్యో తీశ్వర్ 100 నాటి కోళ్లును పెంచుకుంటున్నాడు. శనివారం కోళ్లను వదిలిపెట్టి బయటికి వెళ్లడంతో వీధి కుక్కలు దాడిచేసి 79 కోళ్లను చంపేశాయి. దీంతో యజమాని జ్యోతిశ్వర్‌కు సుమారు 80 వేల రూపాయలు నష్టం వాటిల్లింది. కుటుంబ కలహాలతో ఆత్మహత్య పలమనేరు: పట్టణ సమీపంలోని బైపాస్ రోడ్డు వద్ద ఓ లేఅవుట్లో దండుమిట్టకు చెందిన నాగరాజు(45) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నా డు. ఈ విషయాన్ని స్థానికులు శనివారం పొద్దు న గుర్తించి పోలీసులకు సమాచారమందించా రు. ఇతను పెయింటర్‌గా పనిచేస్తూ కుటుంబా న్ని పోషించేవాడిని తెలిసింది. కుటుంబ కలహాలతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడినట్టి సమాచారం. మృతదేహాన్ని స్థాని ఏరియా ఆస్పత్రికి తరలించి పోలీసులు విచారిస్తున్నారు. ఇంటిపై కూలిన చింత చెట్టు – సుమారు రూ.10వేలు నష్టం పెద్దపంజాణి: నివాసం ఉన్న ఇంటిపై చింత చెట్టు పడిన సంఘటన మండలంలోని బనకందొడ్డి గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. భాది తుని కథనం మేరకు వివరాలు.. గ్రామంలోని రెడ్డెప్ప కుటుంబీకులు నివాసం ఉన్న ఇంటి పక్కనే పురాతనమైన చింత చెట్టు ఉంది. శనివారం ఉదయం అకస్మాత్తుగా చింత చెట్టు లోని అర్ధ భాగం కూలి ఇంటిపై పడింది. అదృష్టవశా త్తు ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ హాని జరగలేదు. అయితే ఇంటికి ఏర్పాటుచేసి న గోడలు, పాక్షికంగా పైకప్పు ధ్వంసం కావడంతో దాదాపు రూ.10వేలు నష్టం వాటిల్లిందని బాదితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడవిపందులను వేటాడిన ముగ్గురి అరెస్టు చిత్తూరు కార్పొరేషన్: అడవి పందులను వేటాడిన ఘటనలో ముగ్గురిని అరెస్టు చేయగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు ఈస్ట్ ఎఫ్ఆర్వో థామస్ తెలిపారు. శుక్రవారం తమకు అందిన సమాచా రం మేరకు రొంపిచెర్లలో తనిఖీ చేశామన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించగా ఐదుగురు అడవి పందులను వేటాడినట్టు గుర్తించామన్నారు. పులిచెర్ల మండలం పెద్దమల్లెల పంచాయతీ గురికివారిపల్లి చెందిన దొరస్వామి, రొంపిచెర్ల ఎలపడ్డ హరిజనవాడకు చెందిన బాబు, రొంపిచెర్ల చెన్నమరెడ్డిగారిపల్లికి చెందిన వెంకటరమణారెడ్డిని అదుపులోకి తీసుకున్నామన్నారు. వీరి నుంచి రెండు అడవి పందులు, మరో రెండు అడవి పందుల మాంసం, నాలుగు కత్తులు, విద్యుత్ వైర్లు, బైయిండింగ్ వైర్లు, చెక్క మొద్దు, ఒక బైక్, 3 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. రొంపిచెర్ల హరిజనకాలనీ ఎలపాడకు చెందిన వాసు, పెద్దమల్లెలకు చెందిన రాజు పరారయ్యారన్నారు. వీరిపై కేసు నమోదు చేసి విచారించగా, అటవీ ప్రాంతంలో విద్యుత్ కంచెలు ఏర్పాటు చేసి, అడవి పందులను వేటాడి, వాటి మాంసం విక్రయిస్తున్నట్లు తెలిసిందన్నారు. కార్యక్రమంలో ఎఫ్బీఓ గౌస్‌బాషా, ప్రభాకర్‌రెడ్డి, ఎబీఓ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. శనివారం నిందితులను అరెస్టు చేసి స్టేషన్ బెయిల్ మంజూరు చేసినట్లు చిత్తూరులో మీడియాకు తెలిపారు. -
దళితులంటే ఎందుకీ వివక్ష ?
శ్రీరంగరాజపురం : దళితుడైన చీకటి గోపి హత్యపై న్యాయవిచారణ జరిపించాలని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా దళిత సంఘాలు, ప్రజా సంఘలు, వివిధ పార్టీలతో కలసి ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పుత్తూరులోని తన నివాసంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉమ్మడి గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామానికి చెందిన దళిత యువకుడు చీకటి గోపి(30) ఉంగరం దొంగతనం చేశారని నెపంతో తాడికొండ పోలీసులు ఎలాంటి నోటీసులు లేకుండా విచక్షణారహితంగా దాడిచేసి, చిత్ర హింసలకు గురిచేసి లాకప్ డెత్‌కు కారణమయ్యారన్నారు. అయితే ఆ పోలీసులపై కూటమి ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చూస్తుంటే దళితుల మరణాలపై కూటమి ప్రభుత్వం ఎంత వివక్ష చూపిస్తుందో అర్థంవుతోందని అన్నారు. జనసేన పార్టీ కార్యకర్త అయిన చీకటి గోపి చనిపోతే ఇంతవరకు డీప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ మాట్లాడడం లేదని, అదే అగ్రవర్ణాలకు జరిగుంటే మౌనంగా ఉండేవారా అని ప్రశ్నించారు. ఎందుకంటే చీకటి గోపి ఒక దళితుడని, దళితులకు ఏం జరిగినా ఎవరూ పట్టించుకోరనే ధైర్యంతో కూటమి ప్రభుత్వం ఉందని అన్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు పోలీసు ఉన్నతాధికారులు, రాష్ట్ర హోం మంత్రి అనిత, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ స్పందించకపోవడం దుర్మార్గమన్నారు. నేను పెద్ద మాదిగ అని చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేడు దళితులను హత్యలు చేస్తుంటే ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. అదే కమ్మ సామాజిక వర్గానికి చెంది వీరయ్యచౌదరి, లక్ష్మణ నాయుడు కక్షల ద్వారా గొడవపడి చనిపోతే వారికి కుటుంబానికి కోటి రూపాయలు ఎక్స్‌గ్రేషియా, 10 ఎకరాల పొలం, వారి భార్యలకు రాష్ట్ర గ్రంథాలయం చైర్మన్ పదవి ఇచ్చారన్నారు. అదే దళితులు 25 మంది చనిపోతే ఒక్క రూపాయి అయినా ఎక్స్‌గ్రేషియా ప్రకటించరా అని ప్రశ్నించారు. చీకటి గోపి హత్య విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. మందకృష్ణ మాదిగ కూడా దళితులపై జరుగుతున్న దాడుల గురించి మాట్లాడుతున్నారని, ఈ విషయంపై ముఖ్యమంత్రిని నిలదీయాలన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలపై పోరాటం చేయడానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు కలసి రావాలని పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పి, ప్రజల మేలు కోరే జగనన్న ప్రభుత్వానికి కృషి చేయాలన్నారు. -
శ్రీవారి ప్రసాదాలు పరమ పవిత్రం
– మాజీ మంత్రి ఆర్కే రోజా నగరి : తిరుమల శ్రీవారి బ్రహ్మో త్స వాలు అత్యంత వైభవంగా జరుగుతున్న వేళ శ్రీవారి ప్రసాదాల పవిత్రతపై మరోసారి స్పష్టత వచ్చిందని మాజీ మంత్రి ఆర్కే రోజా పేర్కొన్నారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడా రు. శ్రీవారి ప్రసాదాలను అపవిత్రం చేసేందు కు, వాటిపై కళంకం అంటించేందుకు గతంలో జరిగి న ప్రయత్నాలు నిరాధారమని తాజా పరిణామా లు స్పష్టం చేస్తున్నాయని ఆమె అన్నా రు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాల వేళ శ్రీవారి ప్రసాదాల పవిత్రతపై నిజం మరోసారి నిర్ధారణ కావడం భక్తులకు సంతోషకరమైన విషయమని పేర్కొన్నారు. పవిత్రమైన శ్రీవారి ప్రసాదాలకు కళంకం అంటించే ప్రయత్నాలు చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీసిన వారు ఇప్పటికై నా రాజకీయ ప్రయోజనాల కోసం ఇలాంటి చర్యలకు ముగింపు పలకాలని సూచించారు. జగనన్న మనసు పచ్చి పాలు లాంటిదని, పచ్చి పాలలో కల్తీకి ఆస్కారం ఉండదన్నారు. 21, 22 తేదీల్లో సీఎం కుప్పం పర్యటన కుప్పం: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు రోజులు కుప్పంలో పర్యటిస్తున్నట్లు రాష్ట్ర ఆర్టీసీ వైస్ చైర్మన్ పీఎస్ మునిరత్నం, చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి శ్రీకాంత్ తెలిపారు. పార్టీ కార్యాలయంలో శనివారం జరిగిన విలేకర్ల సమావేశంలో వారు ముఖ్యమంత్రి పర్యటన వివరాలను వెల్లడించారు. ఆమేరకు సీఎం 21 తేదీ సోమవారం ఉదయం విజయవాడ నుంచి బెంగళూరు చేరుకుని, అక్కడి నుంచి ఉదయం 10.30 గంటలకు శాంతిపురం మండలం తుమ్మిసి వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ చేరుకుంటారు. అక్కడి నుంచి శాంతిపురం మండలం గుండిశెట్టిపల్లి వద్ద హాంద్రీ–నీవా కాలువలో జల హారతి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం కుప్పం పట్టణంలో రైతు బజార్ శుంకుస్థాపన చేపట్టి, పక్క నే ఉన్న కొత్తపేటలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అక్కడి నుంచి శాంతిపురం మండలం కడపల్లి వద్ద తన సొంత ఇంటికి చేరుకుంటారు. రాత్రి 9.45 గంటలకు కుప్పం రైల్వే స్టేషన్ చేరుకుని, కుప్పం మీదుగా కొత్తగా ప్రారంభమైన పాండిచ్చేరి రైలును ప్రారంభిస్తారు. తర్వాత కడపల్లిలోని తన స్వగృహంలో రాత్రి బస చేస్తారు. రెండో రోజు బాబు పర్యటన 22 వ తేదీ మంగళవారం కడపల్లిలోని తన ఇంటి వద్ద ఉదయం ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటిలో హెచ్ఏఎం ప్రాజెక్టులు, ఏకో పౌల్ట్రీ షెడ్లను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 1.35 గంటలకు హెలీ ప్యాడ్‌కు చేరుకుని విజయవాడకు ప్రయాణమవుతారు. పెంచిన మెస్ బిల్లులు తగ్గించండి తిరుపతి సిటీ: ఎస్వీయూ వసతి గృహాల్లో ఎస్టాబ్లిష్మెంట్, మెయింటెనెన్స్, రూమ్ రెంట్ పేరుతో అక్రమంగా విద్యార్థుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేయడం ఆపాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం వర్సిటీ ఎదుటగల అంబేడ్కర్ విగ్రహానికి వారు వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఎస్ఎఫ్ఐ తిరుపతి జిల్లా ఉపాధ్యక్షుడు అశోక్ మాట్లాడు తూ ఎస్వీయూలోని బాయ్స్ హాస్టళ్లకు సంబంధించి జూలై నెల మెస్ బిల్లు దాదాపు రూ.3వేల నుంచి రూ.4వేల వరకు పెంచడం దారుణమన్నారు. గతంలో యూనివర్సిటీలో చదువుకునే విద్యార్థుల మెస్ బిల్లుల కోసం ప్రభుత్వం ప్రతి విద్యార్థికి సుమారు రూ.1,400 నుంచి రూ.2,500 వరకు హాస్టల్ ఖాతాకు నిధులు అందించేదని గుర్తుచేశారు. -
బసవన్నపై బ్రహ్మాండరూపం!
కాణిపాకం: వరసిద్ధి వినాయకుడు శనివారం రాత్రి వృషభ వాహనంపై విహరిస్తూ భక్తులను కటాక్షించారు. కాణిపాకంలో వరసిద్ధుని బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం మూలస్థానంలోని స్వామివారికి విశేష అభిషేక పూజ లు, అలంకరణలు చేశారు. అనంతరం భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. అలంకార మండపంలో శ్రీసిద్ధి, బుద్ధి సమే త వినాయకస్వామి ఉత్సవ మూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించారు. మంగళ హారతులతో చిలుక వాహనంపై కొలువుదీర్చారు. పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు అడుగడుగునా పసుపు, పళ్లెం, కర్పూర హారతులు పట్టారు. రాత్రి వృషభ వాహనంపై స్వామివారు అభయమిచ్చా రు. అనంతరం రాత్రి అలంకార మండపంలో ఉభ య దేవేరుల సహిత వినాయకస్వామి ఉత్సవమూర్తులను పట్టు పీతాంబరాలు, పరిమళభరిత పుష్పమాలికలు, విశేష ఆభరణాలతో అలంకరించి ఉభయదారులు, ఆలయ అధికారులు పల్లకిలో ఊరేగింపుగా తీసుకువచ్చి వృషభ వాహనంపై కొలువుదీర్చారు. ముందుగా ఈ వాహన సేవ ఉభయదారులు ఊరేగింపుగా వచ్చి పట్టువస్త్రాలు సమర్పించారు. తర్వాత ఉత్సవమూర్తిని వృషభ వాహనంపై పురవీధుల్లో ఊరేగిస్తూ భక్తులకు దర్శనప్రాప్తి కల్పించారు. ఈ క్రమంలో భక్తులు స్వామిని భక్తిప్రపత్తులతో స్మరిస్తూ, మోకరిల్లారు. నేడు గజ వాహన సేవ బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వయంభు శ్రీవరసిద్ధి వినాయకస్వామి ఆదివారం రాత్రి గజ వాహనంపై భక్తులకు దర్శనమిస్తారని ఈవో పెంచల కిషోర్ తెలిపారు. ఈ వాహనసేవకు కాణిపాకం వన్నియ నాయకర్ వంశస్తులు ఉభయదారులు వ్యవహరిస్తారని ఆయన పేర్కొన్నారు. -
విశేష విహారం
● వైభవంగా వరసిద్ధుని బ్రహ్మోత్సవాలు కాణిపాకం: కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మో త్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. శుక్రవా రం ఉత్సవాల్లో భా గంగా స్వామివారు ఉదయం బంగారు చిన్న శేష వాహనంపై ఊరేగారు. అనంత రం గణనాథునికి 400 లీటర్ల పాలు, వివిధ రకాల విశేష ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. సుగంధ పుష్పాలతో అర్చించారు. సాయంత్రం యాగశాలలో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం రాత్రి ఉభయకర్తల ఆధ్వరంయలో బంగారు పెద్ద శేష వాహనంపై వినాయకస్వామిని కొలువుదీర్చి గ్రామోత్సవం జరిపించారు. పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. -
ఆఖరి రోజు అవస్థలు
దరఖాస్తుకు శుక్రవారం ఆఖరి రోజు కావడంతో ఓటీపీ కష్టాలు ఎదురయ్యా యి. జిల్లాలోని చిత్తూరు, కుప్పం, పలమనేరు, పూతలపట్టు, నగరి, జీడీ నెల్లూరు నియోజకవర్గాల్లో ఓటీసీ సమస్యలతో అర్హులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పోర్టల్ సమస్యతో ఓటీపీ పక్రియ నిలిచిపోయింది. మొబైల్ ఫోన్లకు ఓటీపీలు సకాలంలో రాకపోవడంతో ఆన్లైన్ నమోదులు నిలిచిపోయాయి. దీంతో ఉదయం నుంచి రాత్రి వరకు సచివాలయాల వద్ద గంటల తరబడి వృద్ధులు, దివ్యాంగులు అవస్థలు ఎదుర్కొన్నారు. సర్వర్లు మొండికేయడంతో వేలాది మంది అర్హులు గడువులోపు దరఖాస్తులు చేసుకోలేక నిరాశగా వెనుదిరిగారు. -
వాయిదాలకు పట్టాభిషేకం
కుప్పం : కుప్పం ద్రవిడ విశ్వవిద్యాలయం ఏర్పాటై సుమారు 30 ఏళ్లు గడుస్తోంది. అయితే ఏటా స్నాతకోత్సవం నిర్వహించేందుకు వర్సిటీలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇప్పటి వరకు కేవలం 2 పర్యాయాలు మాత్రమే స్నాతకోత్సవం నిర్వహించారు. 2007లో మొదటిసారి, 2015లో రెండో సారి కాన్వొకేషన్ డే జరిపించారు. తర్వాత ఇప్పటి వరకు స్నాతకోత్సవం నిర్వహించేందుకు వర్సిటీ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ప్రతిసారి స్నాతకోత్సవానికి ఏర్పాట్లు చేయడం చివరకు వాయిదా వేయడం చేస్తూ వస్తున్నారు. ప్రస్తుత వీసీ ఆచార్య ఎల్సి మల్లయ్య ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీన స్నాతకోత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పా ట్లు చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరవుతారని ప్రచారం చేశారు. ఈ మేరకు ఆహ్వాన పత్రికలు సైతం ముద్రించారు. ఇంతలో ఏమైందో తెలియదు కానీ, స్నాతకోత్సవం వాయిదా వేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. సర్వం సిద్ధమైనా.. వర్సిటీ కాన్వొకేషన్ డేకి సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆహ్వాన పత్రికలు పంచేశారు. అడ్మి ట్ కార్డులు, స్నాతకోత్సవ సర్టిఫికెట్లు, పతకాలు, గౌరవ డాక్టరేట్లు సిద్ధం చేశారు. మరో మూడు రోజుల్లో కాన్వొకేషన్ డే ఉందనగా మళ్లీ వాయిదా వేసేశారు. దీంతో ఏర్పాట్లకు అయిన ఖర్చు వృథాగా మారింది. 2022లో ఒకసారి ఇలాగే ఏర్పాట్లు చేసిన తర్వాత వాయిదా పడింది. అనంతరం ఇన్చార్జి వీసీగా దొరస్వామి ఉన్నప్పుడు సైతం వాయిదా వేశారు. అయోమయంలో అభ్యర్థులు ద్రవిడ విశ్వవిద్యాలయంలో ఒకేసారి 3 నుంచి 15 స్నాతకోత్సవాలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. దీంతో 700 మంది అభ్యర్థులకు పట్టాలు అందించాల్సి ఉంది. ఇందులో 350మందికి పైగా డాక్టరేట్లు అందుకోవాల్సి ఉంటుంది. దేశ నలుమూలల నుంచి అభ్యర్థులు స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు రిజర్వేషన్లు సైతం చేసుకుని సిద్ధంగా ఉన్నారు. మళ్లీ స్నాతకోత్సవం వాయిదా పడడంతో అయోమయానికి గురవుతున్నారు. ద్రవిడ విశ్వవిద్యాలయం, కుప్పం పాలనాపరమైన కారణాలతోనే.. ద్రవిడ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవాన్ని ఈ నెల 22వ తేదీన నిర్వహించాల్సి ఉంది. అయి తే పాలనా పరమైన కారణాలతో వేడుకలను వాయిదా వేస్తున్నాం. త్వరలోనే నూతన తేదీని ప్రకటిస్తాం. అభ్యర్థులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. – కిరణ్ కుమార్, రిజ్రిస్టార్ -
పింఛన్లకు నిబంధన
శ్రీవిల్లి పుత్తూరు నుంచి తిరుమలకు చేరిన పుష్ప మాలలతో జియ్యంగార్లు, అధికారులు అద్దె ఇంట్లో ఉంటున్న అభాగ్యుల కొత్త పింఛన్ల ఆశలపై చంద్రబాబు ప్రభుత్వం నీళ్లు చల్లింది. అద్దె ఇంట్లో ఉండి పింఛన్‌కు దరఖాస్తు చేసుకుంటే ఆయా అప్లికేషన్లను వెరిఫికేషన్‌లో తొలగించేందుకు చర్యలు చేపడుతోంది. దరఖాస్తుదారు పేరు మీదే కరెంటు బిల్లు ఉండాలనే నిబంధన విధించింది. అలాగే వెయ్యి అడుగుల స్థలానికి మించి ఇల్లు నిర్మించి ఉంటే అనర్హత వేటు వేసేందుకు తెగబడుతోంది. ఈ క్రమంలో నామమాత్రంగా దరఖాస్తులను పరిశీలించి తిరస్కరించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఎంత మంది అర్హులు పింఛన్ అందుకుంటారో 26వ తేదీ పైన తేలనుంది. సర్కారు నిబంధలపై పలువురు మండిపడుతున్నారు. కొత్త పింఛన్లు ఇస్తామని ఆశపెట్టి.. సవాలక్ష ఆంక్షలు విధించి నిరుపేదల గొంతు కోస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరు కలెక్టరేట్ : పేరుకేమో కొత్త పింఛన్ల దర ఖాస్తుకు శ్రీకారం చుట్టామని చంద్రబాబు డప్పు కొట్టుకుంటోంది. క్షేత్రస్థాయిలో కొత్త పింఛన్ల నమోదులో తీవ్రమైన ఆంక్షలు పెడుతోంది. ఈ కఠిన నిబంధనలతో జిల్లావ్యాప్తంగా వేలాది మంది కొత్త పింఛన్లకు నమోదు చేసుకోలేక నష్టపోతున్నారు. ఒక వైపు దరఖాస్తు కు ఈ నెల 18వ తేదీ ఆఖరి తేదీ అని వెల్లడించడంతో వేలాది మంది సచివాలయాల వద్ద క్యూ కట్టారు. ఉదయం నుంచి రాత్రి వరకు నిరీక్షించారు. దరఖాస్తు సమయంలో ఓటీపీలు రాకపోవడం, నమోదులో సవాలక్ష నిబంధనలు పాటించాల్సి రావడంతో పెద్దసంఖ్యలో అర్హులు దరఖాస్తులు చేసుకోలేకపోయారు. అలాగే ఒక వైపు సాంకేతిక లోపాలు, మరోవైపు కఠిన ఆంక్షలు అర్హుల గొంతు కోస్తున్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించడంలో సర్కారు విఫలమైందని విమర్శలు గుప్పిస్తున్నారు. అద్దె ఇళ్లలో ఉండేవారికి బిగ్ షాక్ కొత్త పింఛన్ల వెరిఫికేషన్ ప్రక్రియలో సచివాలయ సిబ్బంది దరఖాస్తుదారుల నుంచి కరెంట్ బిల్లులను తప్పనిసరని డిమాండ్ చేస్తున్నారు. దీంతో జిల్లాలో అద్దె ఇళ్లల్లో ఉంటున్న వారికి బిగ్ షాక్ తగిలింది. అద్దె ఇళ్లలో నివసిస్తున్న వారికి ఇది తలపోటుగా మారింది. ఓనర్ పేరిట ఉన్న కరెంట్ బిల్లులను సమర్పించడం, అద్దె ఇళ్లలోని మీటర్ల వినియోగం పరిమితికి మించితే దరఖాస్తులను తిరస్కరించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పింఛన్ అర్హత సాధించాలంటే గృహ విద్యుత్ వినియోగం నెలకు 300 యూనిట్ల కంటే తక్కువగా ఉండాలని, ఆస్తి పరిమితిలో పట్టణ,గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు, స్థలం విస్తీర్ణం 1000 చదరపు అడుగులలోపే ఉండాలనే నిబంధన విధించారు. దీంతో దరఖాస్తుదారులు దిక్కుతోచక కొట్టుమిట్టాడుతున్నారు. దివ్యాంగులు, డప్పు కళాకారుల ఇక్కట్లు పింఛన్ల దరఖాస్తులో దివ్యాంగులకు ఆధార్మిస్ మ్యాచ్ సమస్య పెద్ద సమస్యగా మారింది. సదరం సర్టిఫికెట్లో ఉన్న వివరాలకు, ఆధార్‌కార్డులోని పేరు, పుట్టిన తేదీ, బయోమెట్రిక్ వివరాలకు తేడా లు ఉన్నాయంటూ దరఖాస్తులను తిరస్కరిస్తున్నా రు. ఈ సమస్యతో దివ్యాంగులు కొత్త పింఛన్లు పొందలేని దుస్థితి తలెత్తింది. మరోవైపు ఐఅండ్‌పీఆర్ శాఖ అధికారుల అలసత్వంతో డప్పు కళాకారులు సకాలంలో ఐడీ కార్డులు పొందలేకపోయా రు. దీంతో వందలాది మంది డప్పుకళాకారులు దరఖాస్తుకు అవకాశం కోల్పోయారు. వడపోత ప్రక్రియ ప్రారంభం జిల్లా వ్యాప్తంగా శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు 42,458 మంది కొత్త పింఛన్లకు దరఖాస్తు లు చేసుకున్నారు. ప్రభుత్వం తొలి విడతలో తక్కు వ మందికి మాత్రమే పింఛన్లు మంజూరు చేయనుందనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. ఇందులో వెరిఫికేషన్ పేరుతో దరఖాస్తులను తిరస్క రించి, సంఖ్యను తగ్గించే కుట్ర చేస్తున్నారని సమాచారం. ఈ క్రమంలోనే కఠిన నిబంధనలను తెరపైకి తెచ్చారని బాధితులు ఆరోపిస్తున్నారు. కరెంట్ బిల్లు ఉంటేనే దరఖాస్తుకు అవకాశం -
టీటీడీ ఉద్యోగుల ఇళ్ల స్థలాలపై.. బాబు పచ్చి అబద్ధాలు
తిరుపతి మంగళం : శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వచ్చి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు శ్రీవారి సన్నిధిలో టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇచ్చింది తానేనని పచ్చి అబద్ధాలు చెప్పడం సిగ్గుచేటని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి పద్మావతిపురంలోని తన నివాసంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా, తాను టీటీడీ చైర్మన్‌గా ఉన్నప్పుడే టీటీడీ ఉద్యోగులందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాలని సంకల్పించినట్టు గుర్తుచేశారు. ఆయన అకాల మరణం చెందడం, కోర్టు వ్యాజ్యాలతో ఆ కార్యాచరణను పూర్తి చేయలేకపోయామన్నారు. అయితే వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక, తాను శాసనసభ్యుడిగా, టీటీడీ అధ్యక్షుడిగా ఉండి టీటీడీ ఉద్యోగుల ఇళ్ల పట్టాల కల నెరవేర్చాలా చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు. 12 ఎకరాలు యుద్ధప్రాతిపదికన సమీకరించి 2023లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదగా టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు అందించామన్నారు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం కొలువుదీరడంతో టీటీడీ ఉద్యోగులకు ఆ తర్వాత చేయాల్సిన పనులన్నీ నిలిచిపోయాయన్నారు. 17 సంవత్సరాలు పాటు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఏనాడైనా టీటీడీ ఉద్యోగుల బాగు కోరుకున్నారా? అని ప్రశ్నించారు. 1989లో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న మర్రి చెన్నారెడ్డి తిరుపతి బైరాగిపట్టెడలో టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇచ్చారని, ఆ తర్వాత టీటీడీ ఉద్యోగుల ఇళ్ల స్థలాల సంకల్పం వైఎస్ రాజశేఖరరెడ్డిదైతే ఆ కార్యాచరణను పూర్తిచేసిన ఘనత జగనన్నదని పేర్కొన్నారు. టీటీడీలో శాశ్వత ఉద్యోగులు ఉండకూడదా?. శాశ్వతంగా చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకోవచ్చు కానీ, టీటీడీలో శాశ్వత ఉద్యోగులు ఉండకూడదా? అని భూమన కరుణాకరరెడ్డి ప్రశ్నించారు. శ్రీవారి సేవకులతో సేవ చేయించుకుంటే సరిపోదా అని చంద్రబాబు మాట్లాడిన మాటలు బాధాకరమన్నారు. చంద్రబాబు జీవితాంతం ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటారు కానీ టీటీడీ ఉద్యోగులు మాత్రం సేవకులుగా పనిచేయాలా..? అని భూమన ప్రశ్నించారు. జగనన్న అధికారంలోకి రాగానే టీటీడీలో ఖాళీగా ఉన్న 7వేల పోస్టులను భర్తీ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. అందులో స్థానికులకు 75శాతం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికల్లో ఓట్లు కోసం టీటీడీ ఉద్యోగులకు చంద్రబాబు పట్టాలు ఇచ్చినట్లుగా పచ్చి అపద్ధాలు చెబుతున్నారని భూమన మండిపడ్డారు. -
మహిళా సాధికారతతోనే సమాజ ప్రగతి
చిత్తూరు కలెక్టరేట్ : మహిళా సాధికారతతోనే సమాజ ప్రగతి సాధ్యమని రాష్ట్ర సీ్త్ర నిధి శాఖ ఎండీ హరిప్రసాద్ తెలిపారు. జిల్లా పర్యటనకు విచ్చేసిన ఆయన శుక్రవారం కలెక్టరేట్లోని డీఆర్డీఏ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్షించారు. హరిప్రసాద్ మాట్లాడుతూ మహిళల ఆర్థిక పురోగతి, సాధికారత లక్ష్యంగానే సీ్త్ర నిధి సంస్థ పనిచేస్తోందన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలు కష్టపడి పనిచేసి ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు. చిత్తూరు జిల్లాను బ్రాండ్ నేమ్‌గా తీర్చిదిద్దాలని కోరారు. ప్రతి నూతన ప్రాజెక్ట్, సంక్షేమ కార్యక్రమం చిత్తూరు జిల్లా నుంచే ప్రారంభం కావడం యంత్రాంగానికి దక్కిన ప్రతిష్టని ప్రశంసించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, రుణాలు లబ్ధిదారులకు ఏ విధంగా అందుతున్నాయి, క్షేత్రస్థాయిలో వాటి ఫలితాలు ఎలా ఉన్నాయనే అంశాలపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని వివరించారు. డీఆర్డీఏ పీడీ శ్రీదేవి మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకున్నప్పుడే వారి కుటుంబాలు, సమాజం పురోగతి సాధిస్తాయన్నారు. సంస్థలో ఉన్న ఖాళీ పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని తెలిపారు. దీంతో సంస్థ పనితీరు మరింత వేగవంతమై ప్రగతి సాధించవచ్చని వెల్లడించారు. రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌కు పెద్దపంజాణి విద్యార్థిని పెద్దపంజాణి: తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం తుమ్మలగుంటలోని కేవీఎస్ మైదానంలో ఈ నెల 16వ తేదీన రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌కు ఎంపిక పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో పెద్దపంజాణి మండలంలోని శంకర్రాయలపేట మహా త్మా జ్యోతిబా పూలే పాఠశాలకు చెందిన 9వతరగతి విద్యార్థిని జి.మౌనిక అండర్–14 అథ్లెటిక్స్ విభాగంలో ప్రతిభ కనబరచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపల్ జ్యోత్స్న శుక్రవారం తెలిపారు. త్వరలో కర్నూలు జిల్లా ఆదోనిలో నిర్వహించనున్న 41వ స్టేట్ మీట్లో జిల్లా తరఫున పాల్గొంటుందని వెల్లడించారు. ఈ మేరకు విద్యార్థినిని పీఈటీ చెంచులక్ష్మి, వైస్ ప్రిన్సిపల్ విక్టోరియా అభినందించారు. నేడు తుమ్మలగుంటలో గరుడోత్సవం తిరుపతి రూరల్: తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి గరుడోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. వైఖానస ఆగమోక్తంగా విశేష అలంకరణలతో గరుడోత్సవాన్ని నిర్వహించేందుకు ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. శనివారం రాత్రి 7 నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు స్వామివారు గరుడ వాహనంపై విహరిస్తూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. తిరుమలలో గరుడసేవను దర్శించలేని శ్రీవారి భక్తులు తుమ్మలగుంటకు విచ్చేసి గరుడ వాహన సేవలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు చెవిరెడ్డి భాస్కరెడ్డి విజ్ఞప్తి చేశారు. సమావేశంలో తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో తండ్రీకూతురి దుర్మరణం
సాక్షి, చిత్తూరు : తమిళనాడులోని రాణిపేట జిల్లా షోలింగర్ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చిత్తూరుకు చెందిన తండ్రి, కుమార్తె అక్కడికక్కడే దుర్మణం చెందారు. నగరంలోని కొంగారెడ్డిపల్లె గజానన్ పోలీస్ కాలనీలో నివసిస్తున్న సురేష్ (47), చిత్తూరు ఎస్టే ట్లో జేసీబీ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. అత డి కుమార్తె మధుమిత (20) చిత్తూరులోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ ఫైనలియర్ చదువుతోంది. తమిళనాడులోని షోలింగర్లో ఓ ఫంక్షనకు ద్విచక్రవాహనంపై ఇద్దరూ వెళ్లారు. తిరుగుప్రయాణంలో ఉండగా షోలింగర్– తిరుత్తణి రోడ్డులోని ద్రౌపదీ అమ్మన్ ఆలయం సమీపంలో తమిళనాడు ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో సురేష్, మధుమిత అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఇద్దరి మృతదేహాలకు స్థానిక ప్రభుత్వాస్పపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి, కుటుంబ సభ్యులకు అప్పగించారు. సాయంత్రం మృతదేహాలను చిత్తూరుకు తీసుకువచ్చారు. శనివారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా, సురేష్‌కు భార్య, కుమారుడు ఉన్నారు. విద్యుదాఘాతంతో మెకానిక్ మృతి పలమనేరు : మోటార్‌సైకిల్‌కు వాటర్ సర్వీస్ చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఓ మెకానిక్ మృతి చెందిన ఘటన పలమనేరులోని గడ్డూరు కాలనీలో శుక్రవారం జరిగింది. వినాయక (30) అనే యువకుడు మెకానిక్‌షాపు నిర్వహించేవాడు. ఓ బైక్‌కు వాటర్సర్వీస్ చేసేందుకు గన్ తీయగా ఉన్నట్టుండి నీటిలోకి కరెంట్ ప్రసరించడంతో షాక్‌కు గురై అక్కడిక్కడే మరణించాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వైభవంగా మహాలక్ష్మియాగం నారాయణవనం: మండలంలోని సిద్ధార్థ కళాశాలలో తొమ్మిది రోజుల పాటు నిర్వహించనున్న నవాహ్ని హోమ మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం మహాలక్ష్మి యాగాన్ని ఘనంగా నిర్వహించారు. అలాగే సాయంత్రం లక్ష కుంకుమార్చన, ఆధ్యాత్మిక ప్రవచనాలు వైభవంగా జరిగాయి. ఉదయం 8.30 గంటలకు కళాశాల చైర్మన్ అశోక్‌రాజు దంపతుల ఆధ్వర్యంలో ఆగమ వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ మహాలక్ష్మి యాగం, లక్ష కుంకుమార్చన పూజను శాస్త్రోక్తంగా నిర్వహించారు. సాయంత్రం 4 నుంచి రెండు గంటల పాటు ‘యజ్ఞఫలం – లోకక్షేమం’ అంశంపై డాక్టర్ శేషచార్యులు ప్రవచించారు. అనంతరం మహాలక్ష్మి అమ్మవారి పల్లకీ సేవను నిర్వహించారు. అశోక్‌రాజు మాట్లాడుతూ మహాలక్ష్మి యాగంతో ప్రజలందరికీ ధార్మిక, ఆర్థిక, సాంస్కృతిక, జ్ఞాన, విజ్ఞాన, సిరిసంపదలు చేకూరుతాయన్నారు.సురేష్, మధుమిత (ఫైల్) -
షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం
చిత్తూరు కలెక్టరేట్: నగరంలోని ఆర్యవైశ్య వీధిలో షార్ట్ సర్క్యూట్ వల్ల ఓ ఇంట్లో శుక్రవారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. రమేష్ ఇంట్లో విద్యుత్ సమస్య కారణంగా ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. ఈ ప్రమాదంలో ఫ్రిజ్, టీవీ, ఇంటి పైకప్పు, ఫ్నరిచర్, 40 గ్రాము ల బంగారం, 500 గ్రాముల వెండి కాలిపోయాయి. ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. అగ్నిప్రమాదంలో రూ.10 లక్షల ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అగ్నిమాపకశాఖ అధికారులు అంచనా వేశారు. సకాలంలో స్పందించడంతో దాదాపు రూ.20 లక్షల విలువైన ఆస్తిని రక్షించగలిగారు. ఈ ఘటన పై అగ్నిమాపకశాఖాధికారులు సమగ్ర విచారణ నిర్వహిస్తున్నారు. -
ఎలక్ట్రిక్ సైకిళ్ల పంపిణీలో ‘రికార్డు’
కుప్పం : కుప్పం నియోజకవర్గంలో ఒక్కరోజులోనే అత్యధికంగా 3,742 ఎలక్ట్రిక్ సైకిళ్ల పంపిణీ చేసినందుకు గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు దక్కింది. శుక్రవారం ఈ మేరకు కాన్పూర్ ఐఐటీ ప్రతినిధి హరి శంకర్ చేతులమీదుగా గిన్నిస్ బుక్ రికార్డు సర్టిఫికెట్‌ను కలెక్టర్ సుమి త్ కుమార్ అందుకున్నారు. ఈఏడాది జనవరి 31వ తేదీన కుప్పం నియోజకవర్గంలో 3,742 ఎలక్ట్రిక్ సైకిళ్లు పంపిణీ చేసి చరిత్ర సృష్టించినట్లు అధికారులు తెలిపారు. ఐటీఐలో 6వ విడత అడ్మిషన్లు చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐ కళాశాలల్లో 6వ విడత అడ్మిషన్లకు అవకాశం కల్పించినట్లు జిల్లా కన్వీనర్ రవీంద్రరెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఖాళీగా ఉన్న సీట్లను 6వ విడత లో భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. ఐటీఐ కోర్సుల్లో చేరేందుకు అర్హత, ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల 22వ తేదీలోపు దరఖాస్తు లు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు 6302634177, 9440738121 నంబర్లలో సంప్రదించాలని కోరారు. అక్టోబర్ 9న ఓటర్ల తుది జాబితా చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియ తుది ఓటర్ల జాబితా అక్టోబర్ 9వ తేదీన ప్రచురించనున్నారు. జిల్లాలో మొత్తం 1,34,307 మందికి నోటీసులు పంపిణీ చేయగా 100 శాతం విచారణ పూర్తి చేశారు. ఓటరు కార్డుల ఫొటోలకు సంబంధించి 10,51,000 మందిలో 8.4 లక్షల మంది ఫొటోలను బీఎల్ఓలు అప్డేట్ చేశారు. ఇందులో 5 లక్షల మందికి సంబంధించిన వివరాలను ఈఆర్ఓలు ఆమోదించారు. కొత్త ఓటర్ల నమోదు, తొలగింపులు, మార్పులు, చేర్పులకు సంబంధించి ప్రస్తుతం ఫారమ్–6 దరఖాస్తులు 7,600 , ఫారమ్–7 దరఖాస్తులు 430, ఫారమ్– 8 దరఖాస్తులు 4,100 పెండింగ్‌లో ఉన్నట్లు కలెక్టరేట్ అధికారులు వెల్లడించారు. డిప్యూటేషన్‌పై బదిలీ చిత్తూరు కార్పొరేషన్ : స్వర్ణ గ్రామం ఇంజినీరింగ్ సహాయకులు ఆరుగురిని డిప్యూటేషన్‌పై సమగ్రశిక్షకు బదిలీ చేస్తూ పీఆర్ఐ ఈఈ నవీన్‌కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. సమగ్రశిక్ష పరిధిలో మనబడి–మన భవిష్యత్ కింద చేపడుతున్న సివిల్ పనుల పర్యవేక్షణకు వీరిని నియమించారు. అరాఫత్ (గొల్లచీమనపల్లె, బైరెడ్డిపల్లె), అపర్ణ (చింతలగుంట, చిత్తూరు మండలం), నిరోషా (పెరయ్యగారిపల్లె, ఐరాల), గురుప్రకాష్ (డీఎంపురం, కార్వేటినగరం), విద్య (గ్యారంపల్లె, పెనుమూరు), దివ్యభారతి (పాలకూరు, పూతలపట్టు)ని సమగ్రశిక్షకు నియమించారు. వీరు త్వరలోనే విధుల్లో చేరనున్నారు. -
ప్రాసెసింగ్ యూనిట్ కార్యకలాపాల నిలిపివేత
నగరి: మండలంలోని వీకేఆర్ పురం గ్రామంలోని పాల ఫ్యాక్టరీని గురువారం అధికారులు తనిఖీ చేశారు. కార్యకలాపాలను నిలిపివేశారు. ఈ ఫ్యాక్టరీ నుంచి వస్తున్న గాలిని పీల్చ డం వల్ల ముక్కులో మంట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటోందని గ్రామస్తులు గతంలో నిరసన తెలిపారు. ఈ క్రమంలో అధికారులు స్పందించారు. ఆర్డీవో అనుపమ, తహసీల్దార్ రవికుమార్, ఎంపీడీవో వాణి గురువారం కష్వి మిల్క్ ప్రాడెక్ట్స్ డెయిరీ యూనిట్‌ను తనిఖీ చేశారు. తనిఖీలో భాగంగా యూనిట్‌లోని కార్యకలాపాలను పరిశీలించారు. అధికారుల నుంచి అనుమతులు పొందకుండానే చిల్లింగ్ యూనిట్‌ను ప్రాసెసింగ్ యూనిట్‌గా మార్చినట్లు గుర్తించారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు చిల్లింగ్, ప్రాసెసింగ్ యూనిట్ కార్యకలాపాలను నిలిపివేయాల ని ఆదేశాలు జారీచేశారు. ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్డీవో స్పష్టం చేశారు. అమలులో ఉన్న చట్టాలు, నిబంధనల ప్రకారం సంబంధిత వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. కంపెనీ కార్యకలాపాలను నిలిపివేయాలంటూ గురువారం ఎంపీడీవో వాణి సంబందిత పాల ఫ్యాక్టరీ యాజమాన్యానికి నోటీసులు అందజేశారు. చిత్తూరులో వీధి కుక్కల వీరంగం చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు నగరం సంతపేట 45వ వార్డులో వీధి కుక్కలు విజృంభించాయి. గురువారం ఒక్కసారిగా ఆరుగురిపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచాయి. దీంతో ఆ ప్రాంత ప్రజలు భయంతో వణికిపోతున్నారు. స్థానికంగా ఉన్న ఓ కుటుంబం తమ ఇంటి ప్రాంగణాన్ని ఏకంగా డంపింగ్ యార్డుగా మార్చేయడంతో అక్కడికి భారీగా వీధి కుక్కలు చేరి తిష్ట వేశాయని అధికారులు చెబుతున్నారు. చెత్త దుర్వాసనకు తోడు కుక్కల సంచారం ఎక్కువై ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తాయో తెలియక ప్రజలు భయాందోళన చెందుతున్నారని స్థానికులతో పాటు అధికారులు వెల్లడించారు. పేరుకుపోయిన చెత్త కుప్పల్లోకి కుక్కలు దూరిపోవడంతో అధికారులు ఒక్క కుక్కను మాత్రమే పట్టుకున్నారు. ఘనంగా ఆయుష్య హోమాలు, కోటి దీపోత్సవం నారాయణవనం : స్థానిక సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల ఆవరణలో తొమ్మిది రోజుల పాటు తలపెట్టిన నవాహ్నిక హోమ కార్యక్రమంలో భాగంగా గురువారం హోమాలు, ధార్మికోపన్యాసం, సాయంత్రం దీపోత్సవం, వేణుగోపాలస్వామి ఊరేగింపు తదితర కార్యక్రమాలు నిర్వహించారు. చైర్మన్ అశోకరాజు ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్రమోదీ పేరున ఉదయం ఆయుష్య హోమం, మృత్యుంజయ హోమం లక్ష తులసి అర్చనలను నిర్వహించారు. సాయంత్రం ప్రవచనకర్త కుప్పా విశ్వనాథ శా స్త్రిచే ‘ధర్మము – పునరవలోకనం‘ ప్రవసచనం కొనసాగింది. సాయంత్రం హోమ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ హాజరై శ్రీకృష్ణ వేణుగోపాలస్వామి విగ్రహాన్ని ఆవిష్కరించి, గోపూజ నిర్వహించారు. దీపో త్సవం అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి (వేణుగోపాల అలంకారంలో) పల్లకీ ఉత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మాధవ్, అశోకరాజు మాట్లాడుతూ 25 ఏళ్ల సూదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా, ప్రధాన మంత్రిగా పనిచేస్తున్న నరేంద్రమోదీ నాయకత్వంలో భారతదేశం విశ్వగురు స్థానానికి చేరుకుంటుందన్నారు. ఆధ్యాత్మిక వేడుకల్లో కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు, భక్తులు పాల్గొని స్వామి వారి దివ్యాశీస్సులు అందుకున్నారు. -
బాలుడి వైద్యానికి ఎంపీ మిథున్‌రెడ్డి భరోసా
వెదురుకుప్పం: అనారోగ్యంతో బాధపడుతూ వేలూరు సీఎంసీలో చికిత్స పొందుతున్న బాలుడికి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి చేయూత ఇచ్చారు. పీఎంఎన్ఆర్ఎఫ్ కింద రూ.3 లక్షలు మంజూరు చేయించారు. వెదురుకుప్పం మండలం తంగేళిమిట్టకు చెందిన గిరిబాబు కుమారుడు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. వివిధ ఆస్పత్రుల్లో చికిత్స చేయించినా ఫలితం లేదు. ప్రస్తుతం వేలూరు సీఎంసీలో చికిత్స పొందుతున్నాడు. బాలుడి వైద్యం కోసం తల్లిదండ్రులు ఇప్పటికే రూ.లక్షలు ఖర్చు చేశారు. ఆర్థిక స్థోమత లేని కారణంగా ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ విషయాన్ని స్థానిక నాయకులు కొండారెడ్డి, రామయ్య వైఎస్సార్సీపీ గంగాధరనెల్లూరు నియోజకవర్గ సమన్వయకర్త కే.కృపాలక్ష్మి దృష్టికి తీసుకెళ్లారు. ఆమె బాలుడిని ఆదుకోవాలని రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని కోరారు. స్పందించిన ఎంపీ మిథున్‌రెడ్డి పీఎంఎన్ఆర్ఎఫ్ కింద రూ.3 లక్షలు మంజూరు చేయించారు. తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గురువారం సాయంత్రం పుత్తూరులోని క్యాంపు కార్యాలయంలో పీఎంఎన్ఆర్ఎఫ్ మంజూరుకు సంబంధించిన ప్రొసీడింగ్ కాపీని బాలుడి తల్లిదండ్రులకు అందజేశారు. మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, సమన్వయకర్త కృపాలక్ష్మి మాట్లాడుతూ వైఎస్సార్సీపీ అధికారంలో లేకున్నా బాలుడి కుటుంబ ఆర్థిక పరిస్థితిని వివరించిన వెంటనే ప్రధానమంత్రి జాతీయ రిలీఫ్ పండ్ కింద రూ.3 లక్షలు మంజూరు చేయించడం అబినందనీయమన్నారు. కష్ట కాలంలో బాలుడి కుటుంబానికి ఆర్థికంగా భరోసా కల్పించడం కొండంత ధైర్యాన్నిచ్చినట్టేనన్నారు. నిధులు మంజూరు చేయించడంతో స్థానిక నాయకులు హర్షం వ్యక్తం చేశారు. -
సింహ వాహనంపై యోగనరసింహుడి రూపంలో మలయప్ప
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. మూడో రోజు గురువారం రాత్రి మలయప్ప స్వామివారు ముత్యపు పందిరి వాహనంపై శ్రీమన్నారాయణుడి అలంకరణలో తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. ఉదయం సింహ వాహనాన్ని అధిష్టించి యోగనరసింహుడి రూపంలో కనువిందు చేశారు. వాహన సేవల ముందు కళాబృందాల ప్రదర్శన ఆకట్టుకుంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్రమైన గరుడ వాహనాన్ని అధిరోహించి మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించనున్నారు. – తిరుమల నిధి విలంబన! ఆదర్శప్రాయుడు జగనన్న -
ఏనుగు దాడిలో పంట నష్టం
రామకుప్పం(కుప్పం) : రామకుప్పం మండ లం పరిధిలోని ననియాల తాండా, ఆరిమానుపెంట, పెద్దూ రు అటవీ సరిహద్దులోని పంట పొలాలపై బుధవారం రాత్రి ఒంటరి ఏనుగు దాడి చేసింది. తమిళనాడు నుంచి వచ్చిన ఒంటరి ఏనుగు వారం రోజులుగా పొలాల్లో తిరుగుతూ పంటలను ధ్వంసం చేస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగు బారి నుంచి పంటలను కాపాడాలని, దెబ్బతిన్న పంటలకు పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు. ఇద్దరికి తీవ్ర గాయాలు పుత్తూరు: స్థానిక బైపాస్ రోడ్డులో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. పుత్తూరు మున్సిపాలిటీలోని 2వ వార్డు కేఎం అగ్రహారం గ్రామానికి చెందిన రంజిత్(23), రోహిత్(22) బైక్‌లో పుత్తూరుకు వస్తుండగా తిరుపతి నుంచి నగరి వైపు వెళ్తున్న వ్యాన్ ఢీకొంది. దీంతో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. బైక్ నుజ్జునుజ్జు అయింది. యువకులను స్థానికులు 108లో తిరుపతి రుయాకు తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. యువతి అదృశ్యం పుత్తూరు: పట్టణంలోని ఎన్జీవో కాలనీకి చెందిన ఏళ్ల యువతి (19) గురువారం కళాశాలకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె స్థానిక ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ తొలి ఏడాది చదువుతోంది. నెల రోజుల క్రితం ఒక కుటుంబం పెళ్లి చూపులకు పుత్తూరుకు వచ్చి వెళ్లింది. సదరు అబ్బాయే తమ అమ్మాయిని తీసుకెళ్లి ఉండవచ్చునని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
శ్రీవారి దర్శనానికి 4 గంటలు
తిరుమల: తిరుమలలో గురువారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 4 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. బుధవారం అర్ధరాత్రి వరకు 71,196 మంది స్వామిని దర్శించుకున్నారు. 22,581 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.2.246 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 4 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకుంటున్నారు. -
ఏడుకొండలవాడే కాపాడాడు!
తిరుమల శ్రీవారిని దర్శించుకుని సంతోషంగా ఇంటికి బయలుదేరిన ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. పలమనేరు సమీపంలోని మొగిలి ఘాట్‌లో ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బొలేరో కారు ఢీకొంది. దీంతో అక్కడికక్కడే ఒకరు, పలమనేరు ఆస్పత్రిలో మరొకరు మృతిచెందారు. అదే కారులోని తల్లి, బిడ్డ ప్రాణాలతో బయటపట్టారు. తమను ఏడు కొండల వాడే కాపాడాడని వారు తెలిపారు. పలమనేరు: తమిళనాడు రాష్ట్రం క్రిష్ణగిరి జిల్లా వేపనపల్లికి చెందిన పాండియన్(64), కుమారుడు ఉమాపతిరాజా(33), అతని భార్య నిత్య(26), కుమార్తె పోమిత(3), గణపతి(44), అతని భార్య కాంచన(38) బుధవారం కారులో తిరుమల వెళ్లారు. గురువారం ఉదయం స్వామిని దర్శించుకుని తిరిగి స్వగ్రామానికి బయలుదేరారు. పాండ్యన్ వాహనాన్ని నడుపుతున్నారు. పలమనేరు సమీపంలోని మొగిలిఘాట్‌లో వెళుతున్న సమయంలో రెండు రోజులుగా నిద్రలేని పాండ్యన్ నిద్రలోకి జారుకున్నాడు. ఈ క్రమంలో ఎదురుగా ఉన్న లారీని కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో కాంచన అక్కడికక్కడే మృతిచెందింది. ఉమాపతిరాజు(33) తీవ్రంగా గాయపడి పలమనేరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. కుడివైపున్నవారు సురక్షితం కారులో కుడివైపు ఉన్న డ్రైవర్ పాండ్యన్, అతని వెనుక సీట్లో ఉన్న గణపతి, నిత్య, ఈమె కుమార్తె పోమిత గాయాల బారిన పడి ప్రాణాలతో బయటపడ్డారు. ఎడమవైపున ఉన్న కాంచన, ఉమాపతిరాజు మృతిచెందారు. ప్రమాదానికి కారణం నిద్రమత్తే.. ఇటీవల సంభవిస్తున్న రోడ్డు ప్రమాదాల్లో సెల్ఫ్ డ్రైవర్లే ఎక్కువగా కారణమవుతున్నారు. వీరు డ్రైవర్లను పెట్టుకోకుండా సొంతంగా డ్రైవ్ చేస్తూ ఇలాంటి ఘటనలకు కారణమవుతున్నారని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలోనూ కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనం చేసుకుని విశ్రాంతి లేకుండా తిరుగు ప్రయాణం చేయడంతో నిద్ర మత్తులోకి జారుకుని ఆగి ఉన్న లారీని ఢీకొట్టినట్టు లారీ డ్రైవర్ పేర్కొంటున్నారు. రోడ్డు ప్రమాదంలో సురక్షితంగా బయటపడిన తలి, బిడ్డ -
ఏడీ సరెండర్‌పై దివ్యాంగుల హర్షం
చిత్తూరు కలెక్టరేట్ : దివ్యాంగుల సంక్షేమ నిధులను పక్కదోవ పట్టించిన విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ వినోద్ కుమార్‌ను కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ప్రభుత్వానికి సరెండర్ చేసిన విషయం తెలిసిందే. దీంతో దివ్యాంగుల రాష్ట్ర జేఏసీ అధ్యక్షుడు కొణతల చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి మురళి, జేఏసీ సభ్యులు గురువారం కలెక్టరేట్లోని ఏడీ కార్యాలయం వద్ద సంబరాలు చేసుకున్నారు. వినూత్న నిరసన, శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టారు. కొంతకాలంగా కార్యాలయంలో నెలకొన్న అవినీతి మరకలు, గ్రహణం తొలగిపోవాలని కోరుతూ ప్రాంగణంలో పసుపు నీళ్లు చల్లి, పుణ్యాహ వచనం చేశారు. అనంతరం దివ్యాంగులతో కలసి కార్యాలయంలోకి ప్రవేశించారు. లోకాయుక్తకు ఫిర్యాదు జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు కొణతల చంద్రశేఖర్ విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని దివ్యాంగులకు అందాల్సిన సుమారు రూ.కోటి వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులను ఏడీ వినోద్ కుమార్ తన సొంత ఖాతాలకు మళ్లించి అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. దీనిపై తాము పలుమార్లు కలెక్టరేట్ వద్ద నిరసనలు తెలిపినట్లు చెప్పారు. కలెక్టర్ స్పందించి సమగ్ర విచారణ జరిపించారని తెలిపారు. అవినీతి నిజమని తేలడంతో ఏడీ వినోద్‌ను మాతృశాఖకు సరెండర్ చేశారని తెలిపారు. ఏడీని సరెండర్‌తో సరిపెట్టకుండా, ఆయన దోచుకున్న నిధులను తిరిగి సేకరించి జిల్లాలోని దివ్యాంగులకు అందజేసేలా త్వరలోనే లోకాయుక్తకు ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. ఇన్చార్జి జిల్లా విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ గా ఫారెస్ట్ సెటిల్మెంట్ అధికారి పుల్లారెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగులు లీలావతి, సుమతి, చెంచులక్ష్మి, గోపి, సతీష్, చిట్టిబాబు, గజేంద్ర, పురుషోత్తం, మధు, శ్రీనివాసులు, ఈశ్వర్ పాల్గొన్నారు. -
30న జిల్లా స్థాయి యువజనోత్సవాలు
చిత్తూరు కలెక్టరేట్ : ఏపీ యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేదీన విజ యం ఇంజినీరింగ్ కళాశాలలో జిల్లా స్థాయి యువజనోత్సవాలు నిర్వహించనున్నట్టు జిల్లా యువజన శాఖ అధికారిని సంకీర్తన చావన్ తెలిపారు. ఆమె గురువారం విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో 15 నుంచి 29 ఏళ్లలోపున్న యువతీ యువకుల్లో ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు జానపద నృత్యాలు, జానపద గేయాలు, నుక్కడ్ నాటక్, చిత్రలేఖనం, కవితా రచన పోటీలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి ఉన్న వారు ఈ నెల 29వ తేదీలోపు పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. వివరాలకు 9440573537 నంబర్లో సంప్రదించాలని కోరారు. సేవా సంకల్ప అభియాన్ ప్రారంభం చిత్తూరు రూరల్ (కాణిపాకం): రోగులకు మెరుగైన వైద్య సేవలే ధ్యేయంగా గురువారం నుంచి వచ్చే అక్టోబర్ 17 వరకు జిల్లా వ్యాప్తంగా సేవా సంకల్ప అభియాన్ ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు డీసీహెచ్ఎస్ పద్మాంజలిదేవి, సూపరింటెండెంట్ ఉషశ్రీ తెలిపారు. పేషెంట్ కేర్ వీక్ ముగింపు సందర్భంగా గురువారం చిత్తూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ శిబిరాల్లో బీపీ, షుగర్, గైనకాలజీ, కంటి పరీక్షలు చేసి మందులు అందజేస్తామని తెలిపారు. వరసిద్ధుడికి కనకదుర్గమ్మ పట్టువస్త్రాలు కాణిపాకం: శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం తరఫున గురువారం స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. విజయవాడ ఈవో శీనా నాయక్, చైర్మన్ రాధాకృష్ణ పట్టువస్త్రాలు అందజేయగా, కాణిపాకం ఈవో పెంచల కిషోర్, చైర్మన్ మణి నాయుడు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశా రు. అనంతరం వారికి తీర్థప్రసాదాలు, చిత్రపటం అందజేశారు. 22 మంది గిరిజనులకు పట్టాల పంపిణీ చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని అర్హులైన గిరిజనులు 22 మందికి అటవీ హక్కుల పట్టాలను కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ, ఎంపీ దగ్గుమళ్ల ప్రసాద్‌రావు పంపిణీ చేశారు. కలెక్టరేట్లో గురువారం జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అటవీ హక్కుల చట్టం (ఆర్వోఎఫ్ఆర్) కింద జిల్లాలోని గంగవరం మండలానికి చెందిన 18 మంది, తవణంపల్లి మండలానికి చెందిన నలుగురు గిరిజనులకు 31.07 ఎకరాలకు సంబంధించి పట్టాలు, పట్టదారు పాసు పుస్తకాలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా అటవీశాఖ అధికారి సుబ్బరాజు, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి శివప్రసాద్, గిరిజనులు పాల్గొన్నారు. కొత్త పింఛన్లకు 40,020 దరఖాస్తులు చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో కొత్త పింఛన్లకు దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. పొడిగించిన గడువు శుక్రవారంతో గడువు ముగియనుంది. డీఆర్డీఏ పీడీ శ్రీదేవి మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 7 నుంచి గురువారం సాయంత్రం వరకు మొత్తం 40,020 దరఖాస్తులు అందినట్టు పేర్కొన్నారు. ఇందులో వృద్ధులు 21,304 మంది, వితంతువులు 8,156 మంది, దివ్యాంగులు 6,673 మంది, చేనేత కార్మికులు 116 మంది, మత్స్యకారులు 64 మంది, ఒంటరి మహిళలు 250 మంది, ట్రాన్స్‌జెండర్స్ 11 మంది, చర్మకారులు 372 మంది, డప్పు కళాకారులు 2,970 మంది, కల్లుగీత కార్మికులు 104 మంది దరఖాస్తులు చేసుకున్నారని తెలిపారు. సచివాలయాల సిబ్బంది ఆధ్వర్యంలో క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 1,608 మంది దరఖాస్తులను అర్హులుగా గుర్తించగా, 197 దరఖాస్తులను తిరస్కరించారు. వచ్చి న దరఖాస్తులన్నింటినీ నిబంధనల ప్రకారం క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి ఈ నెల 21వ తేదీలోగా సంబంధిత ఎంపీడీవోల లాగిన్‌కు పంపించేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఎంపీడీవోలు వాటిని పరిశీలించి ఆమోదించిన అనంతరం ఈ నెల 24వ తేదీ నాటికి నేరుగా సెర్ప్ సీఈఓకు సమర్పించేలా డీఆర్డీఏ అధికారులు కసరత్తు నిర్వహిస్తున్నారు. -
బడి ఎన్నికలకు వేళాయె!
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, మౌలిక వసతులు, ప్రభుత్వ పథకాల అమలు, విద్యార్థుల సంక్షేమం, విద్యాప్రమాణాల మెరుగుదలలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు కీలకం. దీంతో ఈ కమిటీల్లో స్థానం కోసం ఆశావహులైన తల్లిదండ్రులు సైతం నేతలను ఆశ్రయిస్తున్నారు. నాయకులు సైతం తమకు అనుకూలమైన వ్యక్తులు పదవుల్లో ఉండేలా ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు ఇప్పటికే నాయకుల చుట్టూ తిరుగుతుండగా, మరికొందరు తల్లిదండ్రులను కూడగట్టే పనిలో నిమగ్నమయ్యారు. ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు డీఈవో లక్ష్మీనారాయణ, సమగ్రశిక్ష శాఖ ఏపీసీ వెంకటరమణ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఉన్నతాధికారులు జారీచేసిన ఉత్తర్వుల మేరకు ఎన్నికల కసరత్తు చేస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ ఇలా జిల్లాలోని 2047 ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో ఈ నెల 18న ఓటర్ల జాబితాను ప్రదర్శిస్తారు. అభ్యంతరాలు, మార్పులు, చేర్పుల పరిశీలన అనంతరం 25న తుది ఓటర్ల జాబితాను ఖరారు చేస్తారు. ఈ నెల 29వ తేదీన అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 1702, ప్రాథమికోన్నత పాఠశాలలు 40, ఉన్నత పాఠశాలలు 305 ఉన్నాయి. వీటిలో 1,10,672 మంది విద్యార్థులు ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు విద్యనభ్యసిస్తున్నారు. ఈ విద్యార్థుల తల్లిదండ్రులు తమ ఓటు హక్కును ఎన్నికల్లో వినియోగించుకోనున్నారు. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. 12 నుంచి 25 మందితో కమిటీ విద్యార్థుల సంఖ్యను బట్టి ఒక్కో పాఠశాలలో 12 నుంచి 25 మంది సభ్యులతో యాజమాన్య కమిటీ ఏర్పడుతుంది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, నిబంధనల ప్రకారం ఇతర సభ్యులు ఇందులో ఉంటారు. నూతన కమిటీ పదవీకాలం రెండేళ్లు ఉంటుంది. పాఠశాలల అభివృద్ధి, విద్యార్థుల సంక్షేమంలో కమిటీలు బాధ్యత వహించాల్సి ఉంటుంది. 2024 ఆగస్టు 8న పాఠశాల యాజమాన్య కమిటీల ఎన్నికలు నిర్వహించారు. రెండేళ్ల పదవీకాలం ఈ నెల 8వ తేదీతో ముగిసింది. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు జరుగుతుండటంతో బడి కమిటీల ఎన్నికలకు రాజకీయ ప్రాధాన్యం పెరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే పల్లెల్లో రాజకీయ వేడి మొదలైంది. పాఠశాల యాజమాన్య కమిటీల ఎన్నికలు ఈ నెల 29వ తేదీన జరగనుండటంతో నేతలు, ఆశావహులు పావులు కదుపుతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులే కీలక ఓటర్లు కావడంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న పాఠశాలల వారిగా వారి వివరాలను ఆరా తీస్తూ మద్ధతు కూడుగట్టుకునే ప్రయత్నాలు మొదలయ్యాయి. గ్రామాల్లో తమ పట్టును కొనసాగించేందుకు కమిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను దక్కించుకోవడంపై రాజకీయ వర్గాలు ప్రత్యేక దృష్టి సారించాయి. జిల్లా సమాచారం జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 1,702 ప్రాథమికోన్నత పాఠశాలలు 40 ఉన్నత పాఠశాలలు 305 ప్రాథమిక పాఠశాల విద్యార్థులు 48,231 ప్రాథమికోన్నత విద్యార్థులు 2,458 ఉన్నత పాఠశాలల విద్యార్థులు 59,983 మొత్తం విద్యార్థులు 1,10,672 పల్లెల్లో వేడెక్కనున్న రాజకీయం 25న తుది జాబితా విడుదల -
వరసిద్ధి సన్నిధికి డిజిటల్ పోటు?
కాణిపాకం: యూపీఐ చెల్లింపులపై విధించే ఎండీఆర్ చార్జీలు కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంపై కూడా ఉండనుందనే వార్తలు వినిపిస్తున్నా యి. కేంద్ర ఆర్థిక శాఖ చెప్పినట్లు ఆ అదనపు ఛార్జీ దేవస్థానం పడుతుందా లేక భక్తుల పైనా అనే అంశంపై స్పష్టత రావడం లేదు. రూ.వెయ్యికి మించిన గదుల అద్దె వంటి వాటికి భక్తులు ఇప్పటికే 5 శాతం జీఎస్టీ చెల్లిస్తున్నారు. జీఎస్టీలో మినహాయింపు లేదు కాబ ట్టి యూపీఐ చెల్లింపులపై కూడా ఆలయం ఎండీఆర్ చెల్లించాల్సి ఉంటుందనే వివరాలు తెలుస్తున్నాయి. ప్రస్తుతం స్వామివారి వ్రతాలు, ప్రత్యేక పూజల టిక్కె ట్లు, ప్రసాదం, వసతి గదుల రిజర్వేషన్ నుంచి దర్శనం వరకూ ఆన్లైన్లోనే చెల్లింపులు జరుగుతున్నాయి. సాధారణ రోజుల్లో రూ.10 లక్షల వరకూ ఉంటే, సంకటహర చతుర్ది, ఆదివారాలు, పర్వదినాల్లో రూ.12 లక్షల వరకూ ఉంటున్నాయి. ప్రతి నెలా రూ.2 కోట్ల వరకు ఆన్లైన్ పేమెంట్లు జరుగుతున్నాయి. వీటిపై ఎండీఆర్ వడ్డన -
సమస్యలకు సత్వర పరిష్కారం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని ఎస్సీ, ఎస్టీల సమస్యలకు సత్వరం పరిష్కారం చూపాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ, ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు హెచ్చరించారు. కలెక్టరేట్లో గురువారం జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ (డీవీఎంసీ) సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి తక్షణమే పరిష్కరించాలన్నారు. బాధితులను ఆఫీసుల చుట్టూ తిప్పించు కోవడం, చులకనగా, దురుసుగా మాట్లాడ టం వంటి ఘటనలు చోటుచేసుకుంటే సహించేది లేదన్నారు. ఎస్ఆర్.పురం మండలంలో అర్హులైన ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు ఇంటి పట్టాలు మంజూ రు చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించా రు. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో శ్మశాన వాటికలు, రహదా రి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. వెట్టిచాకిరీ బాధితులకు 7 రోజుల్లో పరిహారం జిల్లాలోని బంగారుపాళ్యం ప్రాంతానికి చెందిన 74 మంది వెట్టిచాకిరీ (బాండెడ్ లేబర్) బాధితులకు మరో 7 రోజుల్లోపు పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆర్డీవోను ఆదేశించారు. గుడిపాల మండలం 189 కొత్తపల్లిలో ఎస్సీ కాలనీ శ్మశాన భూమిని పరిశీలించి, 5 రోజుల్లో స్థలాన్ని కేటాయించాలని ఆర్డీవోకు సూచించారు. జిల్లాలో ఇప్పటి వరకు అట్రాసిటీ బాధితులైన 154 మంది ఎస్సీ, ఎస్టీ వ్యక్తులకు రూ.1.16 కోట్ల పరిహారాన్ని పంపిణీ చేసినట్లు వెల్లడించారు. ప్రధాని ఆవాస్ యోజన పథకంలో అర్హులైన ఎస్సీ, ఎస్టీలకు గృహాలు, స్థలాలు మంజూరు చేయాలని హౌసింగ్, రెవెన్యూ శాఖల అధికారులను ఆదేశించారు. 30 శాతం తగ్గిన నేరాల నమోదు ఎస్పీ తుషార్ డూడి మాట్లాడుతూ గతంతో పోలిస్తే జిల్లాలో ఎస్సీ, ఎస్టీలపై నేరాల నమోదు దాదాపు 30 శాతం తగ్గిందని తెలిపారు. అట్రాసిటీ, పరస్పర దాడు లు, దూషణల కేసుల్లో స్వతంత్ర సాక్షులు, శాసీ్త్రయ ఆధారాల లోపంతో కోర్టుల్లో నేరం నిరూపించడం క్లిష్టంగా మారుతోందన్నారు. తీవ్రమైన నేరాల్లో ఎఫ్ఐఆర్ నమోదు నుంచి ఛార్జ్‌షీట్ దాఖలు వరకు పక్కా ఆధారాలతో బాధితులకు న్యాయం జరిగేలా చేస్తున్నట్టు పేర్కొన్నారు. సమావేశంలో డీఆర్వో మోహన్‌కుమార్, డీఎఫ్‌వో సుబ్బరాజు, ఎస్సీ వెల్ఫేర్ డీడీ రబ్బానిబాషా, డీవీఎంసీ సభ్యులు మునీంద్రనాయక్, వరలక్ష్మమ్మ, రవి, రాజ్‌కుమార్, శంకర్, మునస్వామి, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. -
మూషికుడిపై గణపతి విహారం
కాణిపాకం: కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా మూడో రోజైన గురువారం రాత్రి సిద్ధి, బుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామి తన వాహనమైన మూషికంపై విహరిస్తూ దర్శనమిచ్చారు. స్వామివారి దివ్య మంగళ రూపాన్ని తిలకించి భక్తులు మైమరిచిపోయారు. ఉదయం ఆలయంలోని మూలవిరాట్‌కు అర్చకులు శాస్త్రోక్తంగా పండ్ల రసాలు, సుగంధ ద్రవ్యాలతో తిరుమంజనం నిర్వహించారు. అనంతరం స్వామివారికి విశేష ధూపదీప నైవేద్యాలు సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు. రాత్రి స్వామివారిని పరిమళ భరిత వివిధ రకాల పుష్పమాలికలతో విశేషంగా అలంకరించారు. వేద మంత్రోచ్ఛరణలు, మంగళ వాయిద్యాలు, భజన బృందాల కోలాటాలు, నృత్య ప్రదర్శనల నడుమ స్వామివారు మూషిక వాహనంపై కొలువుదీరి విహరించారు. విఘ్నాలు తొలగించి, తమ కుటుంబాలను చల్లగా కాపాడాలని భక్తులు కర్పూర హారతులు పట్టి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ మూషిక వాహన సేవకు కాణిపాకం, తిరువణంపల్లె, అగరంపల్లె, పట్నం, వడ్రాంపల్లె, కొత్తపల్లె, చినకాంపల్లె గ్రామాల విశ్వకర్మ వంశస్తులు ఉభయదారులుగా వ్యవహరించారు. -
ఆటో బోల్తాపడి వ్యక్తికి గాయాలు
వి.కోట: మండలంలోని తోటకనుమ–వి.కోట రోడ్డులోని మోర్నపల్లి గ్రామం వద్ద బుధవారం ఆటో బోల్తా పడడంతో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. తోటకనుమ గ్రామానికి చెందిన వరదప్ప కుమారుడు రాజశేఖర్ ఆటోలో వి.కోటకు బయ లుదేరాడు. మోర్నపల్లి వద్ద ఆటో బోల్తా పడింది. రాజశేఖర్ తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని స్థానికులు వి.కోట సీహెచ్‌సీకి తరలించి చికిత్స అందించారు. వరకట్నం వేధింపులపై కేసు నమోదు పుత్తూరు: మహిళ ఫిర్యాదు మేరకు అదనపు కట్నం కోసం వేధిస్తున్న భర్తతో పాటు అత్తింటి వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పుత్తూరు మండలం నేసనూరుకు చెందిన వి.మునిలక్ష్మి(30)కి చైన్నె రాజకీలపాక్కానికి చెందిన ఎం.మణికంఠశివ అలియాస్ వరుణ్శివతో 2018లో వివాహమైంది. ఆ సమయంలో 20 సవర్ల బంగారు నగలు, రూ.10 లక్షల నగదు ఇచ్చారు. వివాహం తర్వాత ఆస్ట్రేలియాలో కాపురం పెట్టిన మణికంఠశివ అదనపు కట్నం కింద రూ.20 లక్షలు తీసుకురావాలని వేధించేవాడు. ఇతనికి అతని బంధువులైన శేఖర్, జానకి, విజయలక్ష్మీ, గోపి మద్దతు తెలిపారు. ఈ మేరకు మునిలక్ష్మీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బ్రహ్మాండోత్సవం
ప్రభుత్వ బడుల్లో స్టెమ్ ల్యాబ్‌లు విద్యార్థుల్లో సాంకేతిక ఆలోచనలను పెంపొందించేందుకు పాఠశాలల్లో స్టెమ్ ల్యాబ్‌లు ఏర్పాటుచేస్తున్నారు.తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉభయ దేవేరుల సమేతంగా శ్రీమలయప్ప స్వామి విశేష వాహనాల్లో కొలువుదీరి భక్తులను అనుగ్రహిస్తున్నారు. బుధవారం ఉదయం చిన్నశేష వాహనంపై ఊరేగుతూ అశేష జనులను కటాక్షించారు. రాత్రి వీణాపాణి అలంకారంలో హంస వాహనంపై విహరించారు. భువి వైకుంఠంలో ఏడుకొండలస్వామి దివ్యతేజోవిరాజిత మూర్తిని వీక్షించి భక్తకోటి పులకించింది. తిరుమాడ వీధుల్లో దేదీప్యంగా ప్రకాశిస్తున్న తిరుమలేశుని దర్శించి పరవశించింది. ఎన్ని జన్మల ఫలమో కదా.. అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుని సేవించు భాగ్యము దక్కిందంటూ మురిసిపోయింది. – తిరుమల అక్రమాల ‘వినోదం’ జిల్లా విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఏడీ అవినీతి ఎట్టకేలకు బయట పడింది. ఆయనపై వేటు వేశారు. గురువారం శ్రీ 17 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026 -
నేడు డీవీఎంసీ సమావేశం
చిత్తూరు కలెక్టరేట్ : ప్రస్తుత ఏడాదిలో 1, 3 త్రైమాసికాలకు సంబంధించి జిల్లా విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ (డీవీఎంసీ) సమీక్ష గురువారం నిర్వహించనున్నట్లు ఎస్సీ వెల్ఫేర్ డీడీ రబ్బానీ బాషా తెలిపారు. ఆయ బుధవారం విలేకరులతో మాట్లాడుతూ గురువారం 10.30 గంటలకు కలెక్టరేట్లో సమీక్ష ఉంటుందన్నా రు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చ ట్టం అమలు, నమోదైన కేసులు, బాధి తులకు అందించిన పరిహారం, వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష ఉంటుందని పేర్కొన్నారు. ఈ సమావేశానికి సంబంధిత శాఖల అధికారులు తమ పరిధిలోని కేసుల పురోగతి, చేపట్టిన చర్యల నివేదికలు, సమగ్రమైన డేటాతో హాజరుకావాలని వెల్లడించారు. అభ్యంతరాల పరిశీలన చిత్తూరు కార్పొరేషన్: జెడ్పీ ఎన్నికలకు సంబంధించి ప్రచురించిన ముసాయిదా ఓటర్ల ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలపై పలు అభ్యంతరాలు వచ్చాయి. వీటిపై అధికారులు బుధవారం ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రజలు, రాజకీయ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఐదేళ్ల క్రితం 2,912 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, ప్రస్తుతం 144 కేంద్రాలను అదనంగా ప్రతిపాదించారు. దీంతో 3,056 చేరాయి. అదనపు కేంద్రాల ఏర్పాటుపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పెద్ద ఎత్తున అభ్యంతరాలు తెలిపినట్లు తెలుస్తోంది. కూటమి, వైఎస్సార్ సీపీ, బీజేపీ, వామపక్ష పార్టీలతో పాటు పలువురు పలు సమస్యలు తెలిపారు. వాటినిఽ అధికారులు నమోదు చేసుకుని క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. తదుపరి నివేదికను జెడ్పీ సీఈవోకు పంపించనున్నారు. చివరిగా కలెక్టర్ ఆమోదం పొందాక ఈ నెల 19న తుది జాబితాను ప్రకటించనున్నట్లు జెడ్పీ సీఈఓ రవికుమార్‌నాయుడు వివరించారు. స్తంభించిన ఈ–వాహన్ చిత్తూరు రూరల్ (కాణిపాకం): వాహనాల కొనుగోలు, విక్రయాలు చేసే వారిపై కేంద్ర రవాణా శాఖ నిర్లక్ష్యం తీవ్ర ప్రభావం చూపుతోంది. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఈ–వాహన్ ఇంటర్నెట్ పోర్టల్‌లో వాహన యజమాని పేరు మార్పిడి సేవలు ఒక్కసారిగా స్తంభించిపోయాయి. కేంద్ర స్థాయిలో పోర్టల్ సాఫ్ట్వేర్ మార్పులు, నవీకరణ పనులు చేపడుతున్నామంటూ గత నాలుగైదు రోజులుగా ఈ సేవలను రవాణా శాఖ నిలిపివేసింది. ఫలితంగా జిల్లా రవాణా అధికారి కార్యాలయంతో పాటు జిల్లా పరిధిలోని రవాణా శాఖ కార్యాలయాలకు వచ్చే వాహనదారులు, కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో రోజుకు సగటున పదుల సంఖ్యలో యజమాని పేరు మార్పిడి దరఖాస్తులు వస్తున్నాయి. ఇంటర్నెట్ పోర్టల్ పనిచేయకపోవడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ఎల్ఎల్ఆర్, డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ రెన్యువల్ వంటి ఇతర సర్వీసులు యధావిధిగా కొనసాగుతున్నాయి. కీలకమైన యజమాని పేరు మార్పిడి దరఖాస్తులు మాత్రం ముందుకుసాగడం లేదు. సాఫ్ట్వేర్ మార్పులు త్వరలోనే పూర్తవుతాయని, అనంతరం ఈ సేవలు పునరుద్ధరణకు నోచుకుంటాయని జిల్లా రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. ఏడీగా పుల్లారెడ్డి చిత్తూరు కలెక్టరేట్: జిల్లా విభిన్న ప్రతిభవంతులశాఖ ఇన్చార్జి ఏడీగా పుల్లారెడ్డిని నియమించారు. ఈ మేరకు కలెక్టర్ సుమిత్‌కుమార్‌గాంధీ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆ శాఖ ఏడీగా పనిచేస్తున్న వినోద్‌ను ప్రభుత్వానికి సరెండర్ చేశారు. కలెక్టరేట్లో ఫారెస్టు సెటిల్మెంట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న పుల్లారెడ్డికి విభిన్న ప్రతిభవంతులశాఖ ఇన్చార్జి ఏడీగా అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. శ్రీవారి దర్శనానికి 4 గంటలు తిరుమల: తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 8 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. మంగళవారం అర్ధరాత్రి వరకు 61,361 మంది స్వామివారిని దర్శించుకోగా 18,722 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.70 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 4 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లో వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కేటాయించిన సమయాన్ని కంటే ముందు వెళ్లిన భక్తులను క్యూలో అనుమతించరని స్పష్టం చేసింది. -
సీఎం పర్యటన ప్రదేశాల పరిశీలన
కుప్పం: ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 22, 23 తేదీల్లో కుప్పంలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో ఆయా ప్రదేశాలను బుధవారం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ పరిశీలించారు. కొత్తపేటలో ఆర్డీవో, డీఎస్పీ కార్యాలయాలకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రదేశాలను ఆయన పరిశీలించి సిబ్బందికి సూచనలు ఇచ్చారు. సీఎం సభా వేదిక, రాజీవ్ కాలనీ సర్కిల్ వద్ద రైతు బజార్ ఏర్పాటు స్థలాన్ని పరిశీలించారు. భద్రతపై పోలీసులకు సూచనలు చేశారు. అంతేకాకుండా ప్రభుత్వ శాఖ అధికారులు వారి పరిధిలోని బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి సీఎం పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో కుప్పం ఏఎస్పీ హేమంత్ బోడ్డు, సీఎం వ్యక్తిగత కార్యదర్శి శ్రీకాంత్, ఆర్డీవో మహమ్మద్ హుసేన్ తదితరులు పాల్గొన్నారు. -
అక్రమాల ‘వినోదం’
జిల్లా విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖలో చోటుచేసుకున్న భారీ నిధుల అక్రమాల వ్యవహారంలో ఎట్టకేలకు కీలక పరిణామం చోటుచేసుకుంది. తీవ్రస్థాయి అవినీతి, ప్రభుత్వ నిధుల మళ్లింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏడీ వినోద్ కుమార్‌ను కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రభుత్వానికి సరెండర్ చేశారు. రూ.కోటి వరకు ప్రజాధనాన్ని పక్కదారి పట్టించిన అధికారిపై చర్యలు తీసుకోవాలని జూన్ నెల నుంచి సాగిస్తున్న పోరాటానికి ఫలితం దక్కిందని దివ్యాంగ సంఘాల నేతలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోనే వివిధ కేడర్లలో 30 ఏళ్లుగా పనిచేస్తూ వ్యవస్థలను మేనేజ్ చేస్తూ వచ్చిన వినోద్ కుమార్ ఏడీగా ఉద్యోగోన్నతి పొందిన 9 నెలల్లోనే భారీగా నిధుల మళ్లింపునకు పాల్పడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై ఏపీ దివ్యాంగ సంఘాల ఐక్యకార్యాచరణ సమితి నేతలు చంద్రశేఖర్, మురళి ఈ ఏడాది జూన్ నుంచి పలుమార్లు ఆందోళనలు చేపట్టారు. కలెక్టరేట్ వద్ద ధర్నాలు నిర్వహించడంతో పాటు, పీజీఆర్ఎస్లో కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీకి ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. విచారణతో తేలిన అక్రమాలు ఈ వ్యవహారంపై కలెక్టర్ సమగ్ర విచారణకు ఆదేశించారు. మొదట డిప్యూటీ కలెక్టర్ సురేష్‌ను విచారణాధికారిగా నియమించగా, ఆయన ట్రైనింగ్ నిమిత్తం అమరావతికి వెళ్లడంతో విచారణ బాధ్యతలను జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్‌కు అప్పగించారు. విచారణలో పలు అవకతకవలు వెలుగులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం అమలు చేసే నషాముక్త్ భారత్ అవగాహన కార్యక్రమాలు నిర్వహించకుండానే రూ.8.94 లక్షలను వేరే ఫొటోలను మార్ఫింగ్ చేసి బిల్లులు పొందడం, వయోవృద్ధుల చట్టాలపై ప్రచారానికి కేటాయించిన రూ.16 లక్షలు, అలాగే వివిధ వసతి గృహాల నిర్వహణ నిధులను తన బినామీలు, కుటుంబ సభ్యుల ఖాతాలకు మళ్లించడం, వాహనాన్ని వాడకుండా, చివరికి మెడికల్ లీవ్‌లో ఉన్న సమయంలోనూ నెలకు రూ.35 వేల చొప్పున అక్రమంగా వాహన బాడుగ బిల్లులు పొందినట్లు తేలినట్లు తెలిసింది. త్వరలో శాఖాపరమైన చర్యలు జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ సమర్పించిన సమగ్ర విచారణ నివేదిక ఆధారంగా ఏడీ వినోద్ కుమార్‌ను సరెండర్ చేస్తూ కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించి, దివ్యాంగుల సంక్షేమ నిధులను పక్కదారి పట్టించిన సదరు అధికారిపై క్రిమినల్, శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని దివ్యాంగ సంఘాల నేతలు కోరుతున్నారు. -
స్వర్ణ నెమలిపై గణనాథుడు
కాణిపాకం: కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయ ప్రాంగణం వినాయక నామస్మరణలతో మారుమోగుతోంది. బుధవారం సిద్ధి, బుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామి స్వర్ణ నెమలి వాహ నంపై కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చారు. ఉద యం స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. విశేష అలంకరణలు చేసి భక్తులకు దర్శనం కల్పించారు. ఆ తర్వాత ఉభయదారులు ప్రత్యేకంగా క్షీరాభిషేకం, గంధాభిషేకం, నారికేళం అభిషేకాలు చేయించారు. రాత్రి అలంకార మండపంలో సిద్ధి, బుద్ధి సమేత స్వామి వారి ఉత్సవమూర్తులను సర్వాంగసుందరంగా అలంకరించారు. తదుపరి బంగారు మయూర వాహనంపై కొలువుదీర్చి కోలాటాల నడుమ కనుల పండువగా ఊరేగించారు. భక్తజనం అడుగడుగునా కర్పూర హారతులు పట్టి నీరాజనాలు అర్పించారు. -
ఘనంగా నిమజ్జనోత్సవం
చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు నగరంలో గణేష్ నిమజ్జనోత్సవ వేడుకలు బుధవారం అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. నగరంలోని వివిధ మండపాల నుంచి స్వామివారి విగ్రహాలను శోభాయాత్రగా తరలించారు. ఊరేగింపులో యువత, భక్తులు డప్పు వాయిద్యాల దరువులకు నృత్యాలు చేశారు. రంగుల కేరింతలు, బాణసంచా పేలుళ్లు, కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనల మధ్య శోభాయాత్ర కోలాహలంగా సాగింది. ఊరేగింపు అనంతరం విగ్రహాలను కట్టమంచి చెరువు వద్దకు తరలించారు. భక్తులు భక్తిశ్రద్ధలతో వినాయకుడికి చివరి పూజలు చేసి జలధివాసం గావించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. క్రేన్ సాయంతో వినాయకుడిని నిమజ్జనం చేస్తున్న భక్తులు -
ప్రతి గ్రామంలోనూ వైద్యశిబిరాలు
చిత్తూరు రూరల్ (కాణిపాకం): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని జిల్లాలోని ప్రతి గ్రామంలోనూ ప్రత్యేక వైద్య శిబిరాలు, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నాగ శశిభూషణ్ రెడ్డి ఆదేశించారు. ఆయన బుధవారం తన కార్యాలయంలో సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమం అమలుపై జిల్లా వైద్యాధికారులు, సూపర్వైజర్లు, సిబ్బందితో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ గురువారం నుంచి అక్టోబర్ 17 వరకు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు. మాతా–శిశు సంరక్షణ, రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం, బీపీ–షుగర్ వంటి అసంక్రమిత వ్యాధులు, కంటి, చెవి పరీక్షలు, రక్తదాన శిబిరాలను క్షేత్రస్థాయిలో అందుబాటులోకి తేవాలని స్పష్టం చేశారు. -
యథేచ్ఛగా చెరువు కబ్జా
గుడిపాల: కొంతమంది ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారు. ఈ విషయం తెలిసినా అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. మండలంలోని వసంతాపురం పంచాయతీ పశుమంద రెవిన్యూలోని సర్వే నంబర్ 40/1లో 24.03 ఎకరాల్లో కొత్తచెరువు ఉంది. అలాగే సర్వే నంబర్లు 42/3, 38లో 1.82 ఎకరాల కాలువ పోరంబోకు ఉంది. ఈ చెరువుకు సంబంధించి అటవీప్రాంతం నుంచి వంకల ద్వారా చెరువులోకి నీరు వచ్చేది. వంకల పక్కన గ్రానైట్ క్వారీలు ఉండడంతో గ్రానైట్‌కు సంబంధించిన వ్యర్థాలను వంకల్లో వేసి పూడ్చివేశారు. చెరువుకు సంబంధించిన భూమిని కూడా గ్రానైట్ వ్యర్థాలు వేశారు. కొంతమంది చెరువు భూమిని దున్నుకుని పంటలు సాగు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కొత్తచెరువులో ఉన్న 24 ఎకరాల భూమిలో ఐదు ఎకరాల భూమి వరకు కబ్జా అయ్యింది. మిగిలిన భూమిని కుడా కబ్జా చేసేందుకు కొంతమంది పన్నాగం పన్నుతున్నారు. ఈ చెరువుకు రావాల్సిన వంకలన్నీ పూడిపోవడంతో వర్షాలు అధికంగా వస్తే వ్యవసాయ పొలాలవైపు నీరు పోవాల్సి ఉందన్నారు. రెవెన్యూ అధికారులు కబ్జాలకు గురైన భూమిని సర్వే చేయించడంతో పాటు పూడ్చివేసిన వంకలను సర్వేచేసి న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. -
ఏడాదిగా నో స్టాంపు డ్యూటీ!
చిత్తూరు కార్పొరేషన్: ఆస్తుల క్రయ విక్రయాల సమయంలో వినియోగదారులు రిజిస్ట్రేషన్ల శాఖకు స్టాంప్ డ్యూటీ కింద 6.5 శాతం చెల్లించాల్సి ఉంది. ఇందులో 5 శాతం ప్రభుత్వానికి పోగా, మిగిలిన 1.5 శాతం స్థానిక సంస్థలకు జమ చేయాల్సి ఉంది. ఏడాదిగా నిధులు జమ చేయకపోవడంతో స్థానిక సంస్థల్లో తీవ్ర ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. జెడ్పీకి అద్దెలు, స్టాంప్ డ్యూటీ, మైన్స్ తదితరాల నుంచి ప్రతి ఏటా కొంత ఆదాయం సమకూర్చాలి. ఆ మొత్తంతో జిల్లాలో తాగునీరు, రోడ్లు, డ్రైనేజీలు తదితర అభివృద్ధి పనులకు ఖర్చు చేస్తారు. దీనికి తోడు వచ్చే ఆదాయంలో 15 శాతం ఎస్సీలకు, 6 శాతం ఎస్టీలకు, 15 శాతం శిశు సంక్షేమ శాఖకు నిధులు వెచ్చిస్తారు. నిధులు రాకపోవడంతో జిల్లాలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టలేని పరిస్థితి నెలకొంది. ఎస్సీ, ఎస్టీ, సీ్త్ర శిశు సంక్షేమశాఖలకు ఇవ్వాల్సిన బడ్జెట్లోనూ కోత పడుతోంది. వీటి నుంచే ఆదాయం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే తలసరి ఆదాయం రూ.4 ప్రకారం కింద 2020–2026(ఆరేళ్లలో) వరకు జెడ్పీకి రూ.7.39 కోట్లు వచ్చాయి. శాండ్ సీనరేజ్ ఫీజు కింద 2020–26 వరకు రూ.27.75 కోట్లు వసూలైంది. ఇతర ఆదాయాల ద్వారా రూ.62.45 లక్షలు మాత్రమే ఆదాయం వస్తోంది. ఈ రకమైన పద్దుల నుంచి వచ్చే ఆదాయంతోనే ఉమ్మడి జిల్లాలోని అన్ని గ్రామాల్లో పలు రకాల అభివృద్ది పనులు చేపట్టాల్సి ఉంది. నిలిచిపోయిన స్టాంప్ డ్యూటీ స్థానిక సంస్థల్లో సింహభాగం వైఎస్సార్సీపీ చెందిన ప్రజాప్రతినిధులు ఉన్న కారణంగానే స్టాంప్ డ్యూటీపై రాష్ట్ర ప్రభుత్వం దెబ్బకొట్టిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆయా స్థానిక సంస్థలకు సంబంధిత రిజిస్ట్రేషన్ శాఖ ప్రతి ఆర్థిక సంవత్సరంలో స్టాంప్ డ్యూటీ విడుదల చేయాల్సి ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి స్థానిక సంస్థలకు స్టాంప్ డ్యూటీ విడుదల చేయవద్దని మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో జెడ్పీ పాలకవర్గం స్టాంప్ డ్యూటీపై ప్రత్యేక దృష్టి సారించడంతో రూ.5.29 కోట్లు వచ్చాయి. 2025–26 ఆర్థిక సంవత్సరం నుంచి ఒక రూపాయి కూడా రాలేదు. 2020–21 రూ.3,14,02,324 2021–22 రూ.9,95,52,209 2022–23 రూ.7,87,45,759 2023–24 రూ.4,30,82,293 2024–25 రూ.5,29,33,404 స్థానిక సంస్థలకు ప్రధాన ఆదాయ వనరు స్టాంప్ డ్యూటీ. దీనితోనే అభివృద్ధి పనులు చేస్తుంటారు. రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల్లో వైఎస్సార్ సీపీ పాలక వర్గాలు ఉన్నాయి. దీంతో కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఏడాదిగా స్టాంప్ డ్యూటీని జమ చేయడం లేదు. జిల్లా పరిషత్ స్టాంప్ డ్యూటీ నిధులను విడుదల చేయవద్దని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మౌఖిక ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఆదాయం లేకపోవడంతో చిన్నచిన్న పనులు కూడా చేయలేకపోతున్నట్టు పాలకవర్గాల ప్రతినిధులు వాపోతున్నారు. -
ఎర్రమట్టి తవ్వకాలపై గ్రామస్తుల నిరసన
●పాలసముద్రం : మండలంలోని తొట్టికండ్రిగ పంచాయతీ రాజుఇండ్లు సమీపంలో ఉన్న గుట్టలోని ఎర్రమట్టి తవ్వకాలు చేపట్టరాదని గ్రామస్తులు డిమాండ్ చేశారు. వారు బుధవారం గుట్ట వద్దకు వేస్తున్న రోడ్డు పనులను అడ్డుకుని నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ గుట్టలో గతంలో చెట్లు పెట్టి బిందెలతో నీరు పోసి సంరక్షించామని తెలిపారు. ప్రస్తుతం అధికార పార్టీ నాయకులు ఎర్రమట్టి కోసం అనుమతులు తెచ్చుకున్నామని చెబుతూ మామిడి చెట్లను తొలగించి రోడ్డు వేయడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. గుట్టలో మట్టిన తవ్వి తమిళనాడుకి తరలిస్తున్నారని, దీనిపై ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. తమ గ్రామానికి చెందిన కొందరు పశువులు, మేకలు, గొర్రెలను గుట్టలోకి మేత కోసం తీసుకెళుతున్నారని, గుట్టను తవ్వేస్తే వాటికి మేత ఎక్కడి నుంచి వస్తుందని పేర్కొన్నారు. ఇప్పటికై నా జిల్లా అధికారులు స్పందించి ఎర్రమట్టి తవ్వకాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో గుట్టలో మొక్కలు నాటాం మా గ్రామం సమీపంలో ఉన్న గుట్టలో గతంలో వివిధ మొక్కలు నాటి బిందెలతో నీరు పోసి పెద్ద చేసుకున్నాం. ఇప్పడు ఎర్రమట్టి తవ్వుకోవడానికి అనుమతి తీసుకున్నామని చెప్పి చెట్లను జేసీబీతో తొలగించి రోడ్డు వేస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలి. – పి.వెంగమరాజు, రాజు ఇండ్లు అధికారులు స్పందించాలి మా గ్రామ సమీపంలో పచ్చ పచ్చని చెట్లతో కూడిన గుట్టను ఎర్రమట్టి పేరుతో నాశనం చేసున్నారు. మూగజీవాలకు మేత లేకుండా చేస్తున్నారు. అధికారులు స్పందించి మా గ్రామానికి సమీపంలో ఉన్న గుట్టులో ఎర్రమట్టి గ్రావెల్ తవ్వకాలు చేపట్టకుండా చర్యలు తీసుకోవాలి. – కే ధనంజయరాజు, రాజు ఇండ్లు అనుమతిని రద్దు చేయాలి గుట్టలో ఎర్రమట్టి తవ్వకాలు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలి. ఎన్నడూ లేని విధంగా ఎర్రమట్టిని తవ్వి తమిళనాడుకు తరలిస్తున్నారు. ఇక్కడ జరుగుతున్న పనులకు తవ్వుకుంటే అధికారులు అడ్డు చెబుతున్నారు. తమిళనాడుకు తరలించడానికి అనుమతి ఎలా ఇచ్చారో అర్థం కావడం లేదు. – జగనాథరాజు, రాజు ఇండ్లు -
ప్రభుత్వ బడుల్లో స్టెమ్ ల్యాబ్‌లు
చిత్తూరు కలెక్టరేట్ : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో విజ్ఞాన, సాంకేతిక ఆలోచనలను పెంపొందించేందుకు వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. యూత్ ఫర్ సేవా ఎన్జీవో జిల్లా కో ఆర్డినేటర్ హరీష్ ఆధ్వర్యంలో జిల్లాలోని ఐరాల మండలం కాణిపాకం, ఎం.పైపల్లి, గంగాధరనెల్లూరు మండలం తూగుండ్రం జెడ్పీ హైస్కూళ్లను పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేశారు. వీటిలో ప్రత్యేకంగా స్టెమ్ ల్యాబ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్)లను ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం రూ.13 లక్షలు కేటాయించారు. ఈ మేరకు డీఈవో లక్ష్మీనారాయణ చర్యలు తీసుకుంటున్నారు. ఆధునిక సాంకేతికత, సమగ్ర పర్యవేక్షణ ల్యాబ్‌లలో సైన్స్, ఇంజినీరింగ్ ప్రయోగాలపై విద్యార్థులకు ప్రత్యక్ష అనుభూతిని కల్పించేలా అధునాతన టెక్నాలజీ సహాయంతో బోధన చేస్తారు. విద్యార్థుల ప్రతిభను అంచనా వేసేందుకు ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తారు. అలాగే ల్యాబ్ కార్యకలాపాలు, ఆన్లైన్ పరీక్షల నిర్వహణను ట్రాక్ చేసేందుకు ప్రత్యేక వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెస్తున్నారు. దీనిద్వారా విద్యార్థుల ప్రతిభ, ల్యాబ్ వినియోగంపై నెలానెలా పురోగతి నివేదికలను పర్యవేక్షిస్తారు. ఈ ల్యాబ్‌లను సమర్థవంతంగా నిర్వహించేందుకు వీలుగా సంబంధిత ఉపాధ్యాయులకు ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రముఖ కార్పొరేట్ కంపెనీల సామాజిక బాధ్యత నిధులు రూ.10 లక్షలతో జిల్లా కేంద్రంలోని సైన్స్ సెంటర్ అభివృద్ధి చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. -
భజే హం.. గణేశం
శాస్త్రోక్తంగా ధ్వజారోహణం బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం ఉదయం ధ్వజారోహణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. మంగళ వాయిద్యాలు, వేదమంత్రోచ్ఛారణల నడుమ ధ్వజస్తంభానికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. మూషిక చిత్రపటాన్ని ధ్వజస్తంభంపైకి ఎగురవేశారు. ముక్కోటి దేవతలను ఉత్సవాలకు ఆహ్వానించారు. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి స్వామివారు హంసవాహనంపై విహరిస్తూ భక్తులకు అభయమిచ్చారు. కాణిపాకం : కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో చవితి పర్వదిన వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. అలాగే మంగళవారం వార్షిక బ్రహ్మోత్సవాలను కనులపండువగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని విద్యుద్దీపాలు, పుష్పాలంకరణలతో అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. పర్వదినం రోజున శాస్త్రోక్తంగా మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం జరిపించారు. దివ్యాభరణాలతో స్వామివారిని అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మూలవర్లకు ప్రత్యేక అభిషేకాలు, అంతరాలయ దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు., ఉదయం నుంచి రాత్రి వరకు నిరంతరాయంగా సర్వదర్శన సేవలు అందించారు. అలాగే క్యూలో వేచి ఉన్న భక్తులకు ఆలయ అధికారులు తాగునీరు, ఉచిత ప్రసాదాలు పంపిణీ చేశారు. వందలాది మంది భక్తులు స్వామివారికి పుష్పకావళ్లను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తొలి రోజు రాత్రి ఉత్సవమూర్తి మూషిక వాహనంపై పురవీధుల్లో విహరించారు. పట్టువస్త్రాల సమర్పణ వార్షిక బ్రహ్మోత్సవాలు, వినాయక చవితిని పురస్కరించుకుని దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రభుత్వం తరఫున స్వామివారికి సంప్రదాయబద్ధంగా పట్టువస్త్రాలను సమర్పించారు. కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ తుషార్‌డూడి, ఎమ్మెల్యేలు మురళీమోహన్, గురజాల జగన్మోహన్, ఆలయ ఈఓవో పెంచల కిషోర్, చైర్మన్ మణినాయుడు పాల్గొన్నారు.. అనంతరం ప్రత్యేకంగా చేపట్టిన గణపతి వ్రతానికి మంత్రి హాజరయ్యారు. స్వర్ణ రథోత్సవ సేవ ప్రారంభం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో భక్తుల కోసం నూతనంగా స్వర్ణ రథోత్సవ ఆర్జిత సేవను ప్రవేశపెట్టినట్లు ఈఓ పెంచల కిషోర్ తెలిపారు. ప్రతి సంకటహర గణపతి వ్రతం రోజున ఈ సేవ అందుబాటులో ఉంటుందన్నారు. రూ.5వేల టికెట్‌పై గరిష్టంగా ఐదుగురు భక్తులను అనుమతిస్తామని వెల్లడించారు. పూజా సామగ్రిని ఆలయమే సమకూరుస్తుందని, భక్తులకు సిల్క్ శాలువా, జాకెట్ పీస్, రెండు అభిషేకం లడ్డూలు, రెండు వడలను ప్రసాదంగా అందిస్తామని వివరించారు. ఆన్లైన్ ద్వారా భక్తులు స్వర్ణ రథోత్సవం టికెట్లు పొందవచ్చని తెలిపారు. ఊరేగుతున్న స్వామివారు మూషిక వాహనంపై వినాయకుడు స్వయంభు.. నీ సన్నిధే మాకు పెన్నిధి. సకల దేవతాగణాలు పూజనీయమైన సుమ పాద పద్మాలే మాకు శరణ్యం. మూషిక వాహనంపై కొలువుదీరిన నీ దివ్య చరణాలే సర్వజగద్రక్ష.. అంటూ అశేష భక్త జనులు స్మరించుకున్నారు. వినాయక చవితిని పురస్కరించుకుని సోమవారం కాణిపాకం క్షేత్రానికి భారీగా తరలివచ్చారు. శోభాయమానంగా వెలుగొందుతున్న పార్వతీతనయుడిని దర్శించుకుని పులకించారు. మంగళవారం వైభవంగా ప్రారంభమైన వరసిద్ధుని బ్రహ్మోత్సవంలో గణనాథుని సేవించుకుని పరవశించారు. ఆలయాల అభివృద్ధే ధ్యేయం రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని 6,254 ఆలయాల్లో ధూప దీప నైవేద్య పథకం కింద ఏటా రూ.75 కోట్లు వెచ్చిస్తున్నామని చెప్పారు.సీజీఎఫ్ ద్వారా 767 ఆలయాల పునర్నిర్మాణానికి రూ.908.32 కోట్ల నిధులు మంజూరు చేశామన్నారు. రూ.750 కోట్లతో 5వేల భజన మందిరాల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటికే 1,788 మందిరాలకు నిధులు విడుదల చేశామని వివరించారు. 111 ఆలయాల్లో ఏటా రూ.3 కోట్ల మందికి అన్నదానం చేస్తున్నామని తెలిపారు. పాలనా సౌలభ్యం కోసం 996 ఆలయాలకు ట్రస్ట్ బోర్డుల నియామకం పూర్తి చేశామని వివరించారు. -
పురపోరుకు అడుగులు!
మరో వారంలో ఓటర్ల జాబితా సాక్షి, చిత్తూరు : మున్సిపల్ ఎన్నికల నిర్వహణ దిశగా రాష్ట్ర ఎన్నికల సంఘం అడుగులు వేస్తోంది. అందులో భాగంగా ఈనెల 22వ తేదీన జిల్లాలోని నగరపాలక సంస్థతోపాటు రెండు మున్సిపాలిటీల్లో వార్డుల వారీ గా ఓటర్ల జాబితా ప్రచురించాలని మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. చైర్మన్, మేయ ర్ స్థానాల ఖరారు చేసి.. ఎన్నికల షెడ్యుల్ విడుదల చేయడమే మిగిలింది. వార్డుల వారీగా వివరాలు జిల్లాలో చిత్తూరు కార్పొరేషన్‌తో పాటు పలమనేరు, నగరి, కుప్పం మునిసిపాలిటీలు ఉన్నాయి. కుప్పం పాలకవర్గానికి నవంబరు వరకు గడువు ఉంది. మిగిలిన చోట్ల పాలకవర్గాల పదవీకాలం పూర్తవడంతో ప్రస్తుతం ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా వార్డుల పునర్విభజన ప్రక్రియకు న్యాయపరమైన చిక్కులు వీడడంతో అధికారులు రెండు రోజుల క్రితం కొత్త వార్డుల సరిహద్దులు నిర్ణయిస్తూ వివరాలను గెజిట్ రూపంలో విడుదల చేశారు. దీంతో చిత్తూరు కార్పొరేషన్‌లోని 50 డివిజన్లు 60గా మారాయి. నగరిలోని 29 వార్డులను 40గా, పలమనేరులో ఉన్న 26 వార్డులను 36గా పెంచుతూ అధికారులు గెజిట్ విడుదల చేశారు. కానీ, కుప్పంలోని 25 వార్డులను 32 స్థానాలకు పెంచినప్పటికీ తొలి షెడ్యుల్‌లో ఇక్కడ ఓటర్ల జాబితా ప్రచురణ ఉండదు. రెండో దశలో ఇక్కడ ఎన్నికలు నిర్వహించే అవకాశముంది. ఇక మిగిలింది రిజర్వేషన్లే వార్డుల పునర్వభజన పూర్తవడం, వార్డుల వారీగా ఓటర్ల జాబితా ప్రచురణ పూర్తయితే మరో షెడ్యుల్ విడుదలవుతుంది. ప్రచురించిన ఓటర్ల జాబితాలో మళ్లీ ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్లను గుర్తించడానికి మున్సిపల్ అధికారులు ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించనున్నారు. అనంతరం వార్డులను ఏయే సామాజిక వర్గాలకు కేటాయించాలనే నిబంధన ప్రకారం కలెక్టర్ రిజర్వేషన్లు ప్రకటిస్తారు. తుదిగా మేయర్, చైర్మన్ స్థానాల రిజర్వేషన్లపై ప్రభుత్వం ప్రకటన జారీ చేయడం, తర్వాత ఎన్నికల షెడ్యుల్ విడుదల చేస్తారు. అభ్యర్థుల కోసం వేట చైర్మన్, మేయర్ స్థానాల రిజర్వేషన్ ప్రకటన వెలువడకముందే జిల్లాలో అభ్యర్థుల కోసం పార్టీల వేట మొదలైంది. తొలిగా ఓపెన్ కేటగిరీ వస్తే ఎవరిని బరిలోకి దించాలనే విషయంపై కసరత్తు ప్రారంభమైంది. రిజర్వేషన్ కేటగిరీలో అభ్యర్థుల ఎంపిక నిమిత్తం ఆర్థిక బలవంతుల కోసం టీడీపీ జల్లెడ పడుతోంది. చిత్తూరులో మేయర్ స్థానం ఆశిస్తునన వారు ఇప్పటికే ఫ్లెక్సీలు వేసుకుంటున్నారు. మేయ ర్ కుర్చీ కోసం రూ.20 కోట్లు సైతం ఖర్చు చేయడానికి సిద్ధమనే సంకేతాలు పంపిస్తున్నారు. కానీ, ప్రజాక్షేత్రంలో ఉన్న వ్యతిరేకత, క్షేత్రస్థాయిలో ప్రతిపక్షానికి ఉన్న ప్రజాబలాన్ని అంచనా వేయలేకపోతున్నారు. వార్డుల పునర్విభజన పూర్తవడంతో తాజాగా ఓటర్ల జాబితా ప్రచురణకు రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. ఈనెల 22వ తేదీ చిత్తూరు కార్పొరేషన్‌తో పాటు పలమనేరు, నగరి, మున్సిపాలిటీల్లోని 136 వార్డుల్లో ఓటర్ల జాబితా ప్రచురించనున్నారు. రాజకీయ పార్టీలు, ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించి, వార్డుల వారీగా పురుష, మహిళా ఓటర్ల తుది జాబితాను ప్రదర్శించనున్నారు. తర్వాత వార్డుల వారీగా పోలింగ్ కేంద్రాల జాబితా, ఒక్కో వార్డులోని ఓటర్లను పోలింగ్ కేంద్రాల వారీగా సర్దుబాటు చేయడం వంటి ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. -
తూకమేస్తున్నారు!
సాక్షి ప్రతినిధి, తిరుపతి: పేదలకు పంపిణీ చేసే బియ్యం మధ్యలోనే సగం మాయం అవుతోంది. స్టాక్ పాయింట్ల నుంచి రేషన్ డీలర్‌కు చేరవేసే మసయంలో భారీ తేడాలు వస్తున్నాయి. ప్రతి నెలా వచ్చే ఈ తేడాల కారణంగా అనేక మంది డీలర్లు తీవ్రంగా నష్టపోతున్నారు. మధ్యలో ఉన్న వారు మాత్రం బియ్యాన్ని నొక్కేసి బ్లాక్ మార్కెట్లకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారని డీలర్లు ఆరోపిస్తున్నారు. తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో మండల స్థాయి రేషన్ స్టాక్ పాయింట్లు అవకతవకలకు అడ్డాలుగా మారాయి. గోదాముల నుంచి వచ్చే బియ్యాన్ని కాటా వేయకుండానే నేరుగా ఎఫ్పీ (రేషన్) షాపులకు తరలిస్తూ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. తూకం లేదు .. కొలత లేదు స్టేజ్–1 గోదాముల నుంచి ఎంఎల్ఎస్ పాయింట్లకు వచ్చే బియ్యం లోడులను నిబంధనల ప్రకారం కాటా వేసి గోదాముల్లో దించాల్సి ఉంది. అయితే అవేవీ పట్టించుకోకుండా అసలు తూకమే వేయకుండా అన్న్లోడ్ చేస్తున్నారు. అక్కడితో ఆగకుండా స్టేజ్–1 లారీల నుంచి నేరుగా ఎఫ్పీ షాపులకు వెళ్లే లారీల్లోకి బస్తాలను మార్చేసి పంపించేస్తున్నారు. ఈ దందా వల్ల ప్ర తి బస్తాకు 2 నుంచి 3 కిలోల వరకు బియ్యం తక్కువ వస్తోందని డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలపైనే తరుగు భారం! ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి తక్కువ తూకంతో బియ్యం వస్తుండడంతో ఎఫ్పీ షాపు డీలర్లు తీవ్ర నష్టాన్ని చవిచూస్తున్నారు. చివరకు డీలర్లు కూడా కార్డుదారులకు ఇచ్చే కోటాలో కోతలు విధించాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. అంతిమంగా ఈ తూకాల తరుగు భారం మొత్తం పేద ప్రజల మీదే పడుతోంది. కార్డుదారులకు పూర్తి కోటా అందకపోవడంతో రేషన్ దుకాణాల వద్ద నిత్యం వాగ్వాదాలు చోటుచేసుకుంటున్నాయి. రేషన్ షాపులకు బియ్యం సరఫరాలో తేడాలు మామూళ్లు ఎవరిస్తారంటూ దబాయింపు ఈ తూకాల లోపాలపై రేషన్ డీలర్లు ఎంఎల్ఎస్ పాయింట్ ఇన్‌చార్జ్‌లను నిలదీస్తే.. వారు ‘మా పైవాళ్లకు నెల నెలా మామూళ్లు ఎవరు ఇవ్వాలి?.. మా జేబులో నుంచి ఇవ్వాలా?’ అంటూ డీలర్లపై కేకలు వేస్తున్నట్లు తెలిసింది. పై వాళ్లకు మామూళ్లు కావాలంటే.. బస్తాల్లో రెండు, మూడు కిలోలు తీసేస్తేనే కాదా? ఇవ్వగలం. కాబట్టి మేము ఇలాగే ఇస్తాం, మీ ఇష్టం వచ్చిన చోట చెప్పుకోండి’ అంటూ దబాయిస్తున్నట్లు డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు జిల్లా ఉన్నతాధికారుల అండదండలతోనే తూకాల్లో భారీ మోసం జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. తక్షణమే ఉన్నతాధికారులు, విజిలెన్స్ విభాగం స్పందించి ఎంఎల్ఎస్ పాయింట్లలో వేబ్రిడ్జి తూకం వేయాలని, అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు, డీలర్లు డిమాండ్ చేస్తున్నారు. -
దేశాభివృద్ధిలో ఇంజినీర్లు కీలకం
చిత్తూరు కార్పొరేషన్ : దేశాభివృద్ధిలో ఇంజినీర్ల పాత్ర కీలకమని కలెక్టర్ సుమిత్‌కుమార్ తెలిపారు. మంగళవారం జిల్లా ఆర్కిటెక్ట్ అండ్ సివిల్ ఇంజినీ ర్స్ అసోసియేషన్ వారు చిత్తూరు ఆర్అండ్బీ అతి థిగృహంలో ఇంజనీర్స్ డే నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్‌తోపాటు కలెక్టర్ పాల్గొన్నారు. ముందుగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహనికి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఇంజినీరింగ్ రంగానికి మార్గదర్శకుడైన మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలను స్మరించుకోవడం స్ఫూర్తిదాయకమన్నారు. వివిధ విభాగాలకు చెందిన ఇంజినీర్లు, ఆర్కిటెక్ట్‌లు దేశ ని ర్మాణంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారని వెల్లడించారు. గతంలో నిర్మించిన అనేక ఆనకట్టలు, రహదారులు, నీటిపారుదల వ్యవస్థలు, పట్టణ ప్రణాళికలు నేటికి చెక్కుచెదరకుండా ఉన్నాయని వివరించారు. కాలానుగుణంగా మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకుని ఇంజినీర్లు కొత్త ఆవిష్కరణలు, నాణ్యమైన నిర్మాణాలకు కృషి చేయాలని సూచించారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో చుడా చైర్మన్ హేమలత, ఆర్అండ్బీ ఎస్ఈ సురేష్, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఎస్ఈ కార్యాలయంలో.. ట్రాన్స్‌కో ఎస్ఈ కార్యాలయంలో మోక్షగుండ విశ్వేశ్వరయ్య చిత్రపటానికి ఎస్ఈ అమర్‌బాబు నివాళులర్పించారు. కార్యక్రమంలో పీఓ రెడ్డప్ప, ఏఈ జ్యోతి పాల్గొన్నారు. -
బ్రహ్మోత్సవ తేజం.. విశేష విహారం
పెద్దశేష వాహనంపై విహరిస్తున్న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారుకలియుగ వైకుంఠనాథుడి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. సోమవారం అంకురార్పణతో ఉత్సవాలకు నాంది పలకగా.. మంగళవారం మీన లగ్నంలో నిర్వహించిన ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు లాంఛనంగా ఆరంభమయ్యాయి. గరుడ పతాకాన్ని బంగారు ధ్వజస్తంభంపై ఎగురవేసి ముక్కోటి దేవతలకు ఉత్సవాలకు ఆహ్వానం పలికారు. రాత్రి పెద్ద శేష వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామివారు తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కనువిందు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీవారికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించి, స్వామివారిని దర్శించుకున్నారు. పెద్ద శేష వాహనంపై అభయముద్ర బ్రహ్మోత్సవాలలో తొలి రోజు మంగళవారం రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారు ఏడు తలల పెద్ద శేష వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరించారు. ఆదిశేషుడు తన పడగ నీడలో స్వామివారిని సేవిస్తూ దాస్యభక్తికి ప్రతీకగా నిలుస్తాడు. -
హక్కు.. సన్నాయి నొక్కు!
పేదల ఆశలపై నీళ్లు చిత్తూరు కలెక్టరేట్ : చంద్రబాబు సర్కారు ఫ్రీ హోల్డ్ భూముల విషయంలో చేస్తున్న కుట్రలు వివాదాలకు దారితీస్తున్నాయి. దశాబ్దాల తరబడి భూము లను నమ్ముకున్న పేద రైతులకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం లబ్ధి చేకూరిస్తే, కూటమి సర్కారు ఆ లబ్ధిని లాగేసుకుంటోంది. రైతులకు గతంలో అందించిన ఫ్రీ హోల్డ్ (పూర్తి యాజమాన్య) హక్కులను ప్రస్తుత సర్కారు కుట్రపూరితంగా లాక్కోవడంపై గ్రామీణ ప్రాంతాల్లో నిరసన వ్యక్తమవుతోంది. రీ వెరిఫికేషన్, సమీక్షల పేరుతో లక్షలాది ఎకరాలను తిరిగి 22 ఏ నిషేదిత భూముల జాబితాలోకి నెట్టివేయడంపై రైతాంగం మండిపడుతోంది. కుప్పంలో సైతం.. సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో సైతం ప్రభుత్వం పక్షపాత వైఖరికి పాల్పడి దగా చేస్తోందని రైతులు విమర్శిస్తున్నారు. కుప్పం, వి.కోట మండలాల్లో ఉద్దేశపూర్వకంగాానే భూ హక్కులపై కోత విధిస్తున్నారని ఆరోపిస్తున్నారు. కుప్పం మండలంలో సుమారు 8,674 ఎకరాలను గత వైఎస్సార్సీపీ సర్కారు ఫ్రీ హోల్డ్‌గా ప్రకటిస్తే, అందులో ఏకంగా 8,400 ఎకరాల భూ హక్కులను రద్దు చేసి 22 ఏలో పెట్టేందుకు కుట్రలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వి.కోట మండలంలో 12,226 ఎకరాల డీకేటీ భూములను గతంలో ఫ్రీహోల్డ్ గా ప్రకటిస్తే, ప్రస్తుతం ఏకంగా 9,243 ఎకరాలను చంద్రబాబు సర్కారు రద్దు చేస్తోంది. ఆందోళనలో రైతులు రీ వెరిఫికేషన్ అనేది కేవలం ఒక నాటకమని, వైఎస్సార్సీపీ సర్కారు పేదలకు చేసిన మంచిని చెరిపేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్రలకు తెరలేపిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా సమాచారం ఫ్రీ హోల్డ్ చేసిన మొత్తం భూములు 1.59 లక్షల ఎకరాలు ప్రభుత్వం అక్రమంగా కోత పెట్టినవి 1.05 లక్షల ఎకరాలు ప్రస్తుతం హక్కు కల్పిస్తున్నవి 53,917 ఎకరాలు నష్టపోతున్న రైతులు 30,150 మందిఫ్రీ హోల్డ్ భూముల విషయంలో పారదర్శకత పాటిస్తాం. చిన్న, సన్నకారు రైతులకు హక్కులు కల్పించేందుకు కృషి చేస్తాం. రీ వెరిఫికేషన్ చేయించి అర్హులందరికీ న్యాయం చేస్తాం.. అంటూ చంద్రబాబు ప్రభుత్వం సన్నాయి నొక్కులు నొక్కింది. వాస్తవంలోకి వచ్చేసరికి నిజమైన రైతుల భూములను 22 ఏ కింద నిషేధ జాబితాలోకి చేర్చేసింది. తమ్ముళ్లకు చెందిన సాగులేని భూములకు మాత్రం యథేచ్ఛగా సర్వ హక్కులు కట్టబెడుతోంది. గత వైఎస్సార్సీపీ సర్కారులో నిష్పక్షపాతంగా తయారు చేసిన జాబితాలను బుట్టదాఖలు చేసి.. టీడీపీ నేతలకే పెద్దపీట వేస్తుండడం చర్చనీయాంశంగా మారింది. గత వైఎస్సార్సీపీ సర్కారు అసైన్డ్ భూములకు సంబంధించి 20 ఏళ్ల పాటు అనుభవంలో ఉన్న పేద రైతులకు యాజమాన్య హక్కులు కల్పిస్తూ ఫ్రీ హోల్డ్ విధానం తెచ్చింది. దీంతో రైతుల తమ భూములను అమ్ముకునేందుకు, బ్యాంకు రుణాలు పొందేందుకు, పిల్లల చదువులు, పెళ్లిళ్లకు వినియోగించుకునేందుకు మార్గం సుగమమైంది. కానీ, చంద్రబాబు ప్రభుత్వం రాగానే రీ వెరిఫికేషన్ పేరుతో ఈ ప్రక్రియను నిలిపివేసింది. వైఎస్సార్సీపీ పాలనలో జిల్లా వ్యాప్తంగా 1.59 లక్షల ఎకరాల భూములకు ఫ్రీ హోల్డ్ కల్పించారు. ప్రస్తుతం కూటమి సర్కారు రీ వెరిఫికేషన్ పేరుతో 1.05 లక్షల ఎకరాలకు తగ్గిస్తున్నారు. ప్రస్తుతం 53,917 ఎకరాలకు మాత్రం ఫ్రీహోల్డ్ హక్కులు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నారు. ఈ ప్రక్రియలో విచిత్రమేమిటంటే...సాధారణ, పేద రైతుల భూములను రిజిస్ట్రేషన్లు కాకుండా 22 ఏలో పెడుతూ, పచ్చ నేతలకు మాత్రం సైలెంట్ గా ఫ్రీ హోల్డ్ జాబితాలో పెట్టి రిజిస్ట్రేషన్లు చేయించేలా కుట్ర చేస్తున్నారు. పక్షపాతంతో రెవెన్యూ రికార్డుల్లో యథేచ్చగా మార్పులు, చేర్పులు చేస్తూ నిజమైన లబ్ధిదారుల పొట్ట కొడుతున్నారు. -
భార్యను కడతేర్చిన భర్తకు జీవిత ఖైదు
మదనపల్లె టౌన్ : కట్టుకున్న భార్యను కొడవలితో దారుణంగా నరికి హత్య చేసిన భర్తకు జీవిత ఖైదు పడింది. చిత్తూరులోని ఆరవ అదనపు జిల్లా కోర్టు మహిళలపై నేరాల ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి టి.హరిత మంగళవారం ఈ సంచలన తీర్పు వెలువరించారు. పోలీసుల కథనం మేరకు.. అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని చిలకవారిపల్లెకు చెందిన పడపట్ల రఘు (60) తన భార్య పడపట్ల లక్ష్మీదేవమ్మను 2023 ఆగస్టు 31న పట్టపగలు నడిరోడ్డుపై కొడవలితో దారుణంగా నరికి హత్య చేశాడు. మదనపల్లె రెండో పట్టణ పరిధిలోని బాపూజీ పార్కు సమీపంలో ఈ సంచలన హత్య అందరూ చూస్తుండగానే జరిగింది. ఈ ఘటన అప్పట్లో తీవ్ర కలకలం కూడా రేపింది. ఈ ఘటనపై అప్పటి రెండో పట్టణ ఎస్ఐ జి.హేమాద్రి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు సేకరించిన సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయస్థానం.. రఘు హత్యకు పాల్పడినట్లు నిర్ధారించింది. హత్య నేరానికి జీవితకాల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.500 జరిమానా విధించింది. జరిమానా చెల్లించకపోతే మరో రెండు వారాల సాధారణ కారాగార శిక్ష అనుభవించాలని ఆదేశించింది. ఈ కేసులో పక్కా ఆధారాలు సేకరించి నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన మదనపల్లె డీఎస్పీ బుచ్చిరాజు, రెండో పట్టణ సీఐ ఎస్.మహమ్మద్ రఫీ, ఎస్ఐ నాగేశ్వరరావు, ప్రభుత్వ న్యాయవాది ఎం.బాలాజీ, న్యాయస్థాన పోలీసు సిబ్బంది ఎ.మునిరాజు, టి. వెంకటరమణలను జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి అభినందించారు. -
వినాయకుడి ఊరేగింపులో విషాదం
– తండ్రి కళ్ల ముందే చిన్నారి మృతి నగరి : వినాయక చవితి వేడుకల్లో ఆనందంగా సాగాల్సిన ఊరేగింపు ఒక కుటుంబంలో తీరని విషాదాన్ని మిగిల్చింది. వినాయక ప్రతిమను ట్రాక్టర్లో ఊరేగిస్తుండగా జరిగిన ప్రమాదంలో 11 ఏళ్ల చిన్నారి మృతి చెందింది. ఈ విషాద ఘటన నగరి మండలం దామరపాకం గ్రామంలో సోమవారం అర్ధరాత్రి జరిగింది. దామరపాకం గ్రామానికి చెందిన జి. శంకర్ కుమార్తె ప్రసన్నశ్రీ (11) స్థానిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది. వినాయక చవితి సందర్భంగా సోమవారం రాత్రి గ్రామంలో వినాయక విగ్రహాన్ని ట్రాక్టర్‌పై ఊరేగిస్తున్నారు. ఈ సమయంలో తండ్రి చిన్నారిని ట్రాక్టర్లో జనరేటర్ పక్కన కూర్చో బెట్టాడు. రాత్రి సుమారు 11.30 గంటల సమయంలో జనరేటర్ ఫ్యాన్‌న్‌కు చిన్నారి తల వెంట్రుకలు చుట్టుకోవడంతో తీవ్రంగా గాయపడింది. తిరుపతి రుయాకు తరలిస్తుండగా మార్గం మధ్యలో మరణించింది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు. -
గుడిసె దగ్ధం
శ్రీరంగరాజపురం : మండలంలోని తుంగమిట్ట గ్రామంలో సోమ వారం సాయంత్రం జి.ఆర్ముగం అనే వ్యక్తి పూరిల్లు దగ్ధమైంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌కారణంగా ప్రమాదం సంభవించిందని బాధితుడు తెలిపాడు. పిల్లల సర్టిఫికెట్లు రూ.2లక్షల నగదు, 90 పీవీసీ పైపులు, ఇంటి పట్టా, దుస్తులు, నిత్యావసర సరుకులు కాలిబూడిదైనట్లు వెల్లడించాడు. ప్రభు త్వం ఆదుకోవాలని కోరాడు. బొలేరో బోల్తా : ముగ్గురికి గాయాలు కుప్పంరూరల్ : బొలేరో వాహనం బోల్తాపడి ముగ్గురు గాయపడిన ఘటన కుప్పం మండలం, మల్లమ్మ చెరువు వద్ద సోమవారం జరిగింది. వివరాలు.. బేటరాయస్వామి కొండ వైపు నుంచి కుప్పం దిశగా వస్తున్న బొలేరో వాహనం అదుపు తప్పడంలో ప్రమాదం జరిగింది. దీంతో ముగ్గురు యువకులు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో రాహుల్ అనే యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు కుప్పంరూరల్ : కుప్పం పట్టణం సమీపంలోని వాణిమహల్ వద్ద సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు గాయపడ్డారు. మార్కెట్ యార్డు వైపు నుంచి వస్తున్న ద్విచక్ర వాహనాన్ని కుప్పం వైపు నుంచి వెళుతున్న కారు ఢీ కొంది. క్షతగాత్రులను ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రుల వివరాలు తెలియరాలేదు. బాల్ బ్యాడ్మింటన్‌లో జిల్లా జట్టు విజేత నగరి : ఉమ్మడి ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో ఈ నెల 11, 12, 13 తేదీల్లో నిర్వహించిన అంతర్ జిల్లాల సబ్ జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో చిత్తూ రు జిల్లా జట్టు అద్భుత ప్రతిభ కనబరిచి ప్రథమ బహుమతిని సాధించింది. ఈ పోటీల్లో జిల్లా జట్టు తరఫున పాల్గొన్న నగరికి చెందిన దువ్వూరు లక్ష్మీనరసింహారెడ్డి అత్యుత్తమ ప్రతిభ కనబరచి రాష్ట్ర బెస్ట్ ప్లేయర్ అవార్డు దక్కించుకున్నాడు. రాష్ట్ర స్థాయి ఎంపిక కమిటీ జాతీయ సబ్ జూనియర్ బాల్ బ్యాడ్మింటన్న్ జట్టుకు లక్ష్మీనరసింహారెడ్డిని ఎంపిక చేసింది. దీనిపై క్రీడాభిమానులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే రాష్ట్ర స్థాయి సబ్‌జూనియర్స్ పోటీల్లో 3వ సారి జిల్లా జట్టు విజయం సాధించి హ్యాట్రిక్ విజయం నమోదు చేసుకుంది. -
తమిళనాడు వాసి మృతి
కుప్పంరూరల్ : కుప్పంలోని పెద్ద గంగమ్మ ఆలయ ఆవరణలో తమిళనాడుకు చెందిన సోమసుందరం అనే వృద్ధుడు మంగళవారం ఉదయం మృతి చెందాడు. తమిళనాడు నుంచి వచ్చిన సోమ సుందరం పగటి పూట పట్టణంలో భిక్షాటన చేసు కుని రాత్రివేళ పెద్ద గంగమ్మ ఆలయ ఆవరణ లో నిద్రించేవాడు. కాగా సోమవారం రాత్రి పడుకున్న వృద్ధుడు నిద్రలోనే మరణించినట్లు స్థానికులు తెలిపారు. అయితే సోమసుందరం తన కుటుంబీకుల ఫోన్ నంబర్లు, చిరునామా ఓ పేపర్‌పై రాసుకుని ఉన్నాడు. దీంతో వృద్ధుడు మృది చెందిన వార్తను ఆయన కుటుంబీకులకు పోలీసులు తెలియజేశారు. బాణసంచా పేలి ఐదుగురికి గాయాలు బంగారుపాళెం: మండలంలోని కూర్మాయిపల్లె పంచాయతీ రోళ్లవారిపల్లెలో గణపతి విగ్రహ నిమజ్జనంలో సోమవారం సాయంత్రం అపశృతి జరిగింది. బాణసంచా పేలుడు కారణంగా ఐదురుగు గాయపడ్డారు. సీఐ శ్రీనివాసులు కథనం మేరకు.. వినాయ క చవితిని పురష్కరించుకుని సోమవారం ఉదయం రోళ్లవారిపల్లెవాసులు గణపతి ప్రతిమకు విశేష పూజలు నిర్వహించారు. సాయంత్రం నిమజ్జన ఊరేగింపు నిమిత్తం బాణసంచా తెప్పించారు. అందులో కొంత ఓ ఇంటి ఆవరణలో ఉంచారు. ఊరేగింపు మొదలైన తర్వాత బాణసంచా పేలుస్తుండగా రవ్వలు ఎగసి ఇంటి ఆవరణలో పెట్టిన టపాకాయలపై పడ్డాయి. దీంతో భారీ పేలుడు సంభవించింది. అక్కడే ఉన్న జగదీశ్వర్‌రెడ్డి, సుగుణ్ సింధుప్రసాద్, జయచంద్రారెడ్డి, కిషోర్‌రెడ్డి గాయపడ్డారు. స్థానికులు వెంటనే వారిని ప్రభుత్వాస్పత్రిఇక తరలించారు. జగదీశ్వర్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. వ్యక్తిపై కత్తితో దాడి కుప్పంరూరల్: పురపాలక పరిధిలోని అనిమిగానిపల్లెలో వెంకటేష్ అనే వ్యక్తిపై గుర్తుతెలియని దుండగుడు కత్తితో దాడి చేసిన ఘటన మంగళవారం జరిగింది. గ్రామానికి చెందిన వెంకటేష్ ఉదయం 6 గంటల సమయంలో బహిర్భూమికి సమీపంలోని పొలాల వద్దకు వెళ్లాడు. అక్కడ గుర్తు తెలియని వ్యక్తి రాయితో దాడి చేసి కత్తితో పొడిచాడు. వెంకటేష్ కేకలు వేయడంతో దుండగుడు పారిపోయాడు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం వెంకటేష్ ను పీఈఎస్ మెడికల్ కళాశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పాత కక్షలతో వెంకటేష్‌పై దాడి జరిగి ఉంటుందని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విద్యుదాఘాతంతో యువతి మృతి పూతలపట్టు(యాదమరి): మండలంలోని వసంతాపురం దళితవాడలో మంగళవారం విద్యుదాఘాతంతో ఓ యువతి మృతి చెందింది. వివరాలు.. గ్రామానికి చెందిన రవిశంకర్ కుమార్తె సబిత (23) ముత్తిరేవుల సమీపంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో పనిచేస్తోంది. మంగళవారం ఉదయం నీటి కోసం మోటారు వేసే క్రమంలో కరెంట్ షాక్‌కు గురై అక్కడిక్కడే కుప్పకూలిపోయింది. కుటుంబసభ్యులు వెంటనే పి.కొత్తకోట సీహెచ్‌సీకి తరలించగా, అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సీఐ తిమ్మయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుంతలో కర్ణాటక యువకుడు గల్లంతు శాంతిపురం : మండలంలోని 64 పెద్దూరు పంచాయతీ కారిముట్ల గ్రామం వద్ద రాతి క్వారీ గుంతలో కర్ణాటకకు చెందిన యువకుడు గల్లంతయ్యాడు. వివరాలు.. కె గొల్లపల్లెకు చెందిన మనోహర్‌కు కర్ణాటకలోని కేజీఎఫ్‌లో ఓ హోటల్లో పనిచేస్తున్న తుముకూరుకు ముబారక్(24) తో స్నేహం ఉంది. సోమవారంహోటల్కు సెలవు రావడంతో మిత్రుడి ఆహ్వానం మేరకు ముబారక్ వచ్చాడు. ఉక్కపోతగా ఉండడంతో సాయంత్రం మరో ఇద్దరితో కలిసి మొత్తం నలుగురు కారిముట్ల వద్ద ఉన్న క్వారీ గుంతలో ఈత కొట్టేందుకు వెళ్లారు. ఇంతలో ముబారక్ నీట మునిగిపోయా డు. మిగిలిన ముగ్గురు ఎంత గాలించినా ప్రయోజనం లేకపోయింది. విషయం తెలుసుకున్న రాళ్లబూదుగూరు పోలీసులు మంగళవారం ఉదయం నుంచి గాలింపు చర్యలు మొదలు పెట్టినా మృతదేహం లభించలేదు. అగ్నిమాపక సిబ్బందితో గాలింపు చర్యలను కొనసాగిస్తున్నారు. -
జేసీబీ, ట్రాక్టర్ సీజ్
పలమనేరు: పట్టణ సమీపంలోని కౌండిన్య నది లో ఏటిగడ్డ ఎల్లమ్మ ఆలయం వద్ద అక్రమంగా ఇసుకను తోడుతున్న జేసీబీ, ట్రాక్టర్‌ను ఆదివారం పలమనేరు పోలీసులు సీజ్ చేశారు. జీడిమాకులపల్లికి చెందిన ఇద్దరు ఇసుకాసురులపై కేసు నమోదు చేశారు. ఇక్కడి కౌండిన్య నదిలో కొందరు యథేచ్ఛగా ఇసుకను జేసీబీలతో తవ్వి తరలిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై నదికి ఆనుకుని ఉన్న రైతులు పలుమార్లు అధికారులకు తెలిపినా స్పందన లేకుండా పోయింది. ఇలా ఉండగా కొందరు ఆదివారం నేరుగా పోలీసులను తీసుకెళ్లి వారి కళ్లముందే ఇసుకాసరులను పట్టించినట్టు తెలిసింది. జేసీబీ, ట్రాక్టర్ మంజునాథ్, సురేంద్రకు చెందినవిగా తెలిసింది. పోలీసులు వారిపై కేసు నమోదు చేశారా లేదా వాహనాల డ్రైవర్లపై కేసులు పెట్టారా అనే విషయం తెలియరాలేదు. -
పూల ధరలకు రెక్కలు
కుప్పం రూరల్ : కుప్పం మార్కెట్లో పూల ధరలకు రెక్కలు వచ్చాయి. గత వారం రోజులుగా సరాసరిన రూ.500 పలికిన కనకాంబరం పూలు ఆదివారం కిలో రూ.600 నుంచి రూ.900 పలికాయి. మిగిలిన పూల ధరలు వందల్లో పెరిగింది. దిగుబడి తగ్గడం, వినాయక చవితి పండుగ కావడంతో పూల ధరలు పెరిగినట్టు వ్యాపారులు తెలిపారు. ఒకప్పుడు కుప్పం నుంచి దేశ విదేశాలకు పూలు ఎగుమతి అయ్యేవి. నేడు కుప్పం నుంచి బెంగళూరు, చైన్నె, ముంబయి, విజయవాడ, నెల్లూరు, గుంటూరు వంటి ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. ఎల్‌నినో ప్రభావంతో కుప్పం ప్రాంతంలో 20 శాతం బోర్లు ఎండిపోయాయి. ఉన్న బావుల వద్ద కొంత మంది రైతులు తక్కువ విస్తీర్ణంలో పూల తోటలు సాగు చేస్తున్నారు. దీంతో దిగుబడి కూడా అంతంత మాత్రంగానే వస్తోంది. కుప్పం పూల మార్కెట్లో ఆదివారం కిలో పూల ధరలు ఇలా ఉన్నాయి. కనకాంబరం కిలో రూ.600 – 900, మల్లెలు కిలో రూ.1000, కాగడాలు రూ.500, జాజిమల్లె రూ.900, నేల సంపంగి రూ.350, సెంటుజాజులు రూ.900, గన్నేరు రూ.260, చామంతి రూ.250, గులాబి రూ.250, బంతి రూ.50 పలుకుతున్నాయి. పూలను కొనేందుకు ఆదివారం మార్కెట్లో జనం ఎగబడడం కనిపించింది. ఉద యం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మార్కె ట్ సాగడం గమనార్హం. -
ప్రతిభకు ఆసరా ఎన్ఎంఎంఎస్
చిత్తూరు కలెక్టరేట్ : డ్రాపౌట్స్ సంఖ్యను తగ్గించడం, ఉన్నత విద్యను అభ్యసించేలా అల్పాదాయ కుటుంబాల్లోని పిల్లలను ప్రోత్సహించడం, ఆర్థిక కారణాలతో చదువు ఆగిపోకుండా చూడాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్)ను అమలు చేస్తోంది. జిల్లాలోని కొన్ని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ఎన్ఎంఎంఎస్ పరీక్షకు విద్యార్థులను ప్రత్యేకంగా సిద్ధం చేస్తున్నారు. జాతీయ స్థాయి ప్రతిభా పోటీల్లో సత్తా చాటితే నాలుగేళ్లపాటు స్కాలర్షిప్ అందుతుంది. ప్రస్తుత విద్యాసంవత్సరంలో ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్, నగరపాలక, ఎయిడెడ్, మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు. 7వ తరగతిలో ఓసీలు 55 శాతం, ఎస్సీ, ఎస్టీలు 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఎన్ఎంఎంఎస్కు ఎంపికై న విద్యార్థులకు 9 నుంచి 12వ తరగతి వరకు ప్రతి ఏటా రూ.12 వేల చొప్పున మొత్తం రూ.48 వేలు వారి బ్యాంకు ఖాతాల్లో డీబీటీ ద్వారా జమచేస్తారు. తెలుగు, ఉర్ధూ, హిందీ, ఇంగ్లీష్ మీడియంలలో పరీక్ష రాయవచ్చు. రెవెన్యూ డివిజన్, జిల్లా కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు. మెంటల్ ఎబిలిటీ 90, స్టాటిస్టిక్ ఆప్టిట్యూట్ 90 మార్కులకు ఉంటుంది. ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించేందుకు అక్టోబర్ 12 చివరి తేదీ. పరీక్ష రుసుం చెల్లించేందుకు అక్టోబర్ 13 వరకు గడువు ఉంది. పరీక్ష నవంబర్ 15వ తేదీన నిర్వహిస్తారు. అర్హులైన విద్యార్థులు www. bre.ap.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని డీఈవో లక్ష్మినారాయణ సూచించారు. -
బ్రహ్మాండం!
బ్రహ్మోత్సవం.. ప్రత్యేక పూజలు, వాహన సేవలు కాణిపాకం: కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల శోభ మొదలైంది. సోమవారం చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రారంభమయ్యే ఉత్సవాలు అక్టోబర్ 4వ తేదీ వరకు ఘనంగా నిర్వహించనున్నారు. అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయంతోపాటు పరిసరాలను శోభాయమా నంగా తీర్చిదిద్దారు. దేశ విదేశాల నుంచి నుంచి తరలివచ్చే లక్షలాది మంది భక్తులకు స్వామి వారి దర్శనంలో ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి నిత్యం శాస్త్రోక్తంగా విశేష అభిషేక పూజలు, అర్చనలు చేస్తారు. ఉదయం, సాయంత్రం వేళల్లో విఘ్నేశ్వరుడు వివిధ వాహనాలపై కాణిపాక వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. ఆలయ ఈవో పెంచల కిషోర్ పర్యవేక్షణలో అధికారులు భక్తుల రద్దీకి అనుగుణంగా ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శనాల క్యూలైన్ల పొడవును పెంచడంతో పాటు అదనపు షెడ్లను ఏర్పాటు చేశారు. దర్శనం అనంతరం భక్తులు ప్రసాదాల కోసం ఇబ్బంది పడకుండా ప్రసాద విక్రయ కేంద్రాల వద్ద కూడా క్యూలైన్లను ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. రథంతో పాటు వివిధ సేవలకు వినియోగించే వాహనాలకు రంగులు వేసి కొత్త కళను తీసుకువచ్చారు. చిత్తూరు, తిరుపతి మార్గాల నుంచి వచ్చే ప్రధాన రహదారుల్లో భక్తులకు స్వాగతం పలుకుతూ భారీ డిజిటల్ కటౌట్లు, తోరణాలు అమర్చారు. ఆలయ ప్రాంగణమంతా రంగురంగుల విద్యుత్ దీపాలంకరణలతో దేదీప్యమానంగా వెలిగిపోతోంది. మూషిక, అన్వేటి, సుపథ మండపాలతో పాటు నవగ్రహ, అభయాంజనేయస్వామి ఆలయాల వద్ద విద్యుత్ కటౌట్లు ఏర్పాటు చేశారు. ముఖద్వారం నుంచి ధ్వజస్తంభం, అంతరాలయం వరకు వివిధ రకాల దేశీయ, విదేశీ పూలతో అలంకరించారు. హోమాలు, జపాలు, యజ్ఞ పూజల కోసం ప్రత్యేకంగా యజ్ఞశాలను సిద్ధం చేశారు. మూడు చోట్ల పార్కింగ్ స్థలం భక్తుల వాహనాల రద్దీని నివారించేందుకు ముందుగానే పార్కింగ్ స్థలాలను సిద్ధం చేశారు. గణేష్ సేవాసదన్ భవనం పక్కన ఉన్న ఖాళీ స్థలంలో బస్సులు, భారీ వాహనాల పార్కింగ్‌కు కేటాయించగా, కాణిపాకం బస్టాండును ఆను కుని ఉన్న ప్రాంగణంలో కార్లు, ఆటోలు నిలి పేలా చర్యలు చేపట్టారు. అలాగే ఈవో నివాస భవనం వెనుక భాగంలో ద్విచక్ర వాహనాలు, ఇతర వాహనాల పార్కింగ్‌కు ఏర్పాట్లు చేశారు.పూలతో అలంకరణలు చేస్తున్న సిబ్బందివిద్యుత్ దీపాల వెలుగులో కాణిపాకం ఆలయం -
పట్టాలు ఇచ్చారు.. ఇప్పుడు ఖాళీ చేయమంటున్నారు
పెనుమూరు(కార్వేటినగరం): వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో 2022లో పట్టాలు ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇంటి నిర్మాణాలను ఆపి ఖాళీ చేయమంటున్నారు. ఇదెక్కడి న్యాయం అని పెనుమూరు మండలం కేసీపల్లి పంచాయతీ కంబాల చేను గ్రామస్తులు వాపోతున్నారు. కంబాల చేను గ్రామానికి చెందిన 13 మంది పేదలకు గత ప్రభుత్వం ఇళ్ల పట్టాలు మంజూరు చేసింది. 9 మంది ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. ఆర్థికంగా వెనుకడి ఉండడంతో కొందరు వివిధ దశల్లో నిర్మాణాలను ఆపేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నాయకులు రెవెన్యూ అధికారులతో కలిసి ఇళ్లు మంజూరు చేసిన సర్వే నంబర్ మారిందని, అందులో ఇళ్ల నిర్మాణం చేయకూడదని ఆంక్షలు విధించారు. బాధితులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. బెదిరింపులకు గురిచేస్తున్న వారికి లాయర్ ద్వారా నోటీసులు పంపించారు. ఇవేవీ పట్టించుకోకుండా కూటమి నాయకుల అండతో రెవెన్యూ అధికారులు ఆదివారం పునాదులను జేసీబీతో తొలగించారు. తాము వైఎస్సార్సీపీ సానుభూతిపరులుగా ఉండడమే మేము చేసిన పాపమా అంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా అధికారులు స్పందించి తమకు 2022లో మంజూరు చేసి పట్టాలను పరిశీలించి ఇళ్ల నిర్మాణాలు చేసుకోవడానికి అనుమతులు ఇవ్వాలని కోరుతున్నారు. ప్రభుత్వాలు మారినంత మాత్రాన భూమికి ఉన్న సర్వే నంబర్లు కూడా మారుతాయా అని ప్రశ్నిస్తున్నారు. పునాదులను జేసీబీతో తొలగిస్తున్న కూటమి నాయకులు గత ప్రభుత్వం మంజూరు చేసిన పట్టాలను చూపిస్తున్న లబ్ధిదారులు -
రేపు డయల్ యువర్ ఎస్ఈ
చిత్తూరు కార్పొరేషన్: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం మంగళవారం డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ట్రాన్స్‌కో ఎస్ఈ అమర్‌బాబు తెలిపారు. వినాయకచవితి రోజున ప్రభుత్వ సెలవు దినం కావడంతో సోమవారం నిర్వహించాల్సిన కార్యక్రమాన్ని మరుసటి రోజుకు మార్పు చేశారన్నారు. వినియోగదారులు మంగళవారం ఉద యం 8.30 నుంచి 9.30 గంటల మధ్య 7993147979 నంబర్‌కు కాల్చేసి సమస్యలు తెలియజేయాలని సూచించారు. కాణిపాకం బ్రహ్మోత్సవాలకు ఐదు టన్నుల కూరగాయలు పలమనేరు: కాణిపాకంలో జరిగే బ్రహ్మోత్సవాలకు పలమనేరుకు చెందిన మోహన్‌రెడ్డి ఐదు టన్నుల కూరగాయలను వితరణ చేశారు. వాటిని ఆదివారం ప్రత్యేక వాహనంలో పంపించారు. 21 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలకు ప్రతి మూడు రోజులకు ఓ లోడు కూరగాయలను దాతల ద్వారా పంపనున్నట్టు శ్రీవారి భక్తులు రవీంద్రారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో కిశోర్స్వామితోపాటు పలువురు పాల్గొన్నారు. నేడు వినాయకుడికి పట్టువస్త్రాల సమర్పణ కాణిపాకం: స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో 2026 వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి స్వామివారికి పట్టువస్త్రాలు అందజేస్తారని ఈవో పెంచల కిషోర్ ఒక ప్రకటనలో తెలిపారు. బయటపడిన హనుమ రాతి ప్రతిమ శాంతిపురం: మండలంలోని సొన్నేగానిపల్లి పంచాయతీ కూతేగౌనిపల్లిలో హనుమంతుడి రాతి విగ్రహం ఆదివారం బయటపడింది. గ్రామానికి చెందిన ఆనందగౌడుకు చెందిన ఆవు దూడ కాళ్లతో నేలపై గోకడంతో నల్లటి రాయి కొంత బయట పడింది. దీన్ని గమనించి మరి కొంత తవ్వడంతో ఆంజనేయస్వామి రాతి విగ్రహం బయటపడిందని గ్రామస్తులు చెప్పారు. విగ్రహానికి పూజలు చేశారు. వినాయక చవితి వేళ అన్ని గ్రామాలకు ప్రతిమల రూపంలో వినాయకుడు వస్తే తమ గ్రామానికి గణనాథుడితో పాటు హనుమంతుడు కూడా వచ్చాడని ఆనందం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న తహసీల్దార్ ప్రకాష్ బాబు, ఎస్ఐ నరేష్ గ్రామానికి వెళ్లి స్వాధీనం చేసుకుని తీసుకెళ్లారు. దాన్ని పరిశీలించి ఏకాలం నాటిదో తెలియజేస్తామన్నారు. -
ఉత్కంఠభరితంగా క్రికెట్ మ్యాచ్
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో డీఈఓ ఆఫీస్ క్రికెట్ టీమ్, చిత్తూరు ఫిజికల్ ఎడ్యుకేషన్ జట్ల మధ్య శనివారం నిర్వహించిన క్రికెట్ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది. ఈ మ్యాచ్‌లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీమ్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఘన విజయం సాధించింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు జరిగిన టాస్‌లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీమ్ నెగ్గి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన డీఈఓ ఆఫీస్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో పీఈడీ టీమ్ ముందు 175 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. బరిలోకి దిగిన ఫిజికల్ ఎడ్యుకేషన్ టీమ్ ఓపెనర్లు దేవేంద్ర (పీడీ), మోహన్ (పీడీ) ఆరంభం నుంచే ప్రత్యర్థిబౌలర్లపై విరుచుకుపడ్డారు. బౌండరీల వర్షం కురిపిస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. కేవలం 9.5 ఓవర్లలోనే వికెట్ ఏమీ నష్టపోకుండా 175 పరుగుల టార్గెట్‌ను ఛేదించి, తమ టీమ్‌ను విజేతగా నిలిపారు. మెరుపు ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను తక్కువ ఓవర్లలోనే ముగించిన ఓపెనర్లు దేవేంద్ర, మోహన్‌లను పలువురు పీఈడీలు, విద్యాశాఖ అధికారులు అభినందించారు. ఈ మ్యాచ్‌లో డీఈఓ కార్యాలయం నుంచి తులసి, ప్రసాద్, ఎంఈఓ పాండ్యన్, పీడీ సిరాజ్, పీఈటీ శరత్, పాల్గొన్నారు. వరసిద్ధునికి రూ.2.50 లక్షల విరాళం కాణిపాకం : కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారికి శనివారం రూ.2.5లక్షల విరాళం అందింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నోకు చెందిన దాత దిలీప్ కుమార్ సింగ్ తమ కుటుంబసభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని విరాళం సమర్పించారు. ఏఈఓ రవీంద్రబాబు, ప్రోటోకాల్ ఏఈఓ ధనపాల్, టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలాజీ నాయుడుపాల్గొన్నారు. అగ్నిమాపక శాఖ డీజీ పూజలు కాణిపాకం: శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ని అగ్నిమాపక శాఖ డీజీ వెంకటరమణ కు టుంబ సమేతంగా దర్శించుకున్నారు. శనివా రం ఆలయానికి విచ్చేసిన ఆయనకు అధికారు లు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. 12,496 కేసుల పరిష్కారం చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో 12,496 కేసులు పరిష్కరించినట్లు ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణసారిక తెలిపారు. కోర్టు వారీగా వాల్మీకిపురంలో 53 కేసులు, తంబళ్లపల్లె 71, శ్రీకాళహస్తి 1,106, సత్యవేడు 1,278, తిరుపతిలో 3,420, పుత్తూరు 903, పుంగనూరు 357, పీలేరు 1220, చిత్తూరులో 1,417, పలమనేరు 508, పాకాల 505, నగరి 191, మదనపల్లె 979, కుప్పంలో 488 కేసులు పరిష్కారమయ్యాయని వివరించారు. క్యాంపస్ డ్రైవ్‌లో ‘శ్రీరామ’ విద్యార్థుల ప్రతిభ తిరుపతి సిటీ : కరకంబాడి రోడ్డులోని శ్రీరామ ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం యత్వా ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహించిన క్యాంపస్ డ్రైవ్‌లో పలువురు విద్యార్థులు ఉన్నత స్థాయి ఉద్యోగాలకు ఎంపికయ్యారు. కళాశాల చైర్మన్ మన్నెం రామిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు సాంకేతిక విద్యతో పాటు నైపుణ్యాభివృద్ధి, కమ్యూనికేషన్ స్కిల్స్ ప్లేస్ మెంట్ శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. సెక్రటరీ మన్నెం రామసుబ్బారెడ్డి, డైరెక్టర్ మన్నెం అరవిందుకుమార్ రెడ్డి, ప్రిన్సిపల్ జయచంద్ర, వైస్ ప్రిన్సిపల్ వాసు, ప్లేస్మెంట్ ఆఫీసర్ విష్ణువర్ధన్‌రెడ్డి, ఎండీ రవిమారుతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


