చిత్తూరు కలెక్టరేట్ : విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యం వెలికితీసేలా జిల్లా క్రీడాభివృద్ధి సంస్థ అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఏడాది పొడవునా పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులు వేస వి సెలవుల్లో ఉల్లాసంగా గడిపేలా క్రీడా శిక్షణ ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. మే 1వ తేదీ నుంచి 31 వరకు నిర్వహించనున్న వేసవి క్రీడా శిక్షణా శిబిరాలను ఈ సారి ఆసక్తి ఉన్న స్వచ్ఛంద సంస్థలు, క్రీడా సంఘాలకు అప్పగించనున్నారు. ఈ నేపథ్యంలో క్రీడా సంఘాల నిర్వాహకులతో పాటు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్, వ్యాయామ టీచర్లు, కోచ్‌లు, సీనియర్ క్రీడాకారుల నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు చర్యలు చేపడుతున్నారు. ఎనిమిది నుంచి 14 ఏళ్ల బాలబాలికల్లో ప్రతిభను వెలికితీసేందుకు అన్ని క్రీడా విభాగాల్లో వేసవి శిక్షణా తరగతులు నిర్వహించడానికి చర్యలు చేపట్టారు.
ముమ్మరంగా
ప్రైవేట్ బస్సుల తనిఖీ
చిత్తూరు రూరల్ (కాణిపాకం): మార్కాపురం రోడ్డు ప్రమాదం నేపథ్యంలో జిల్లా రవాణా శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లా వ్యాప్తంగా వాహనాల తనిఖీలను ముమ్మరం చేశారు. శుక్రవారం కూడా తనిఖీలను కొనసాగించారు. ఇకపై సరిహద్దులో విధిగా తనిఖీలు చేసేలా చర్యలు చేపట్టారు. పోలీసు, అగ్నిమాపక, రవాణా శాఖల అధికారులు బృందంగా ఏర్పడి నరిహరిపేట, పలమనేరులో ప్రైవేట్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. టెస్టులు, పత్రాల తనిఖీ, సేఫ్టీ ప్రమాణాలు, నిబంధనలను అనుసరిస్తున్నారా లేదా అని చూస్తున్నారు. ఇలా ఒక్కరోజులోనే 170 ప్రైవే ట్ బస్సులను తనిఖీ చేశారు. రవాణా నియమాలు పాటించని వాటిపై 20 కేసులు నమో దు చేసి, రూ.13 లక్షల వరకు జరిమానా విధించినట్లు డీటీసీ నిరంజన్ రెడ్డి వెల్లడించారు.
శ్రీవారి దర్శనానికి
12 గంటలు
తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 30 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. గురువారం అర్ధరాత్రి వరకు 65,600 మంది స్వామి ని దర్శించుకున్నారు. 24,292 మంది భక్తులు తలనీలాలు ఇచ్చారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.18 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు.


