చిత్తూరు కలెక్టరేట్ : ఈ ఏడాది పదో తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకన ప్రక్రియలో పారదర్శకతను పెంచేందుకు రాష్ట్ర విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా అధునాతన సాంకేతి కతతో పహారా చేపట్టనున్నారు. అజాగ్రత్తగా జవా బు పత్రాలు దిద్దినా, మార్కుల్లో తేడాలు వచ్చి నా దిద్దుబాటు చర్యలతో పాటు భారీ జరిమానా విధించనున్నారు. చిత్తూరులోని పీసీఆర్ ప్రభుత్వ పాఠశాలలో ఏప్రిల్ 4 నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షల జవాబు పత్రాలను మూల్యాంకనం ప్రారంభంకా నుంది. ఈ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు డీఈవో రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పా ట్లు చేస్తున్నారు.
స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియ ఇలా..
స్పాట్ వాల్యుయేషన్‌కు సంబంధించి 1400 మంది నిపుణులైన సిబ్బందిని నియమించారు. ఇందులో 200 మంది చీఫ్ ఎగ్జామినర్లు, 800 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్లు, 400 మంది స్పెషల్ అసిస్టెంట్లు ఉంటారు. చిత్తూరులోని పీసీఆర్ ఉన్నత పాఠశాలలో 25కి పైగా తరగతి గదులను సిద్ధం చేశారు. ప్రతిరోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరంతరాయంగా వాల్యుయేషన్ ప్రక్రి య కొనసాగుతుంది. సుమారు 7 జిల్లాల నుంచి వచ్చే 7 సబ్జెక్టులకు సంబంధించిన 2 లక్షల సమాఽ దాన పత్రాలను ఇక్కడ దిద్దనున్నారు. ఒక్కో ఉపాఽ ద్యాయుడికి రోజుకు 40 పేపర్ల చొప్పున కేటాయించనున్నారు.
నిర్లక్ష్యం వహిస్తే పెనాల్టీల మోత
ఈసారి మూల్యాంకనంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ఉపాధ్యాయులకు జరిమానా తప్పదని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఉత్తీర్ణత కాని విద్యార్థిని ఉత్తీర్ణత అయినట్లు చూపించినా (1 నుంచి 5 మార్కుల తేడా వచ్చినా), చీఫ్ ఎగ్జామినర్‌కు రూ.4 వేలు, సహాయ ఎగ్జామినర్‌కు రూ.2 వేల చొప్పున జరిమానా విధిస్తారు. మార్కు ల లెక్కింపులో పెరిగే ప్రతి అదనపు మార్కును బట్టి జరిమానా మొత్తం కూడా పెరుగుతుంది. తద్వారా విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోకుండా ఉపాధ్యా యులను అప్రమత్తం చేస్తున్నారు.
సాంకేతికతతో తప్పులకు చెక్
గతంలోలా కాకుండా ఈ సారి మూల్యాంకనంలో అత్యాధునిక సాంకేతికతను అమలు చేయనున్నా రు. మార్కులను నేరుగా ట్యాబ్‌లలో నమోదు చేయడం వల్ల మానవ తప్పిదాలకు తావుండదని అధికారులు చెబుతున్నారు. ఓఎంఆర్ షీట్లను స్కాన్ చేసే ప్రక్రియను ప్రవేశపెట్టడం వల్ల డేటా సేకరణలో వేగం, కచ్చితత్వం పెరుగుతుంది. మార్కుల నమోదు, పునః పరిశీలన, పునః లెక్కింపు దశల్లో ఎక్కడా లోపాలు జరగకుండా రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ నేరుగా పర్యవేక్షించనున్నారు. నిబంధనలు అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.


