చిత్తూరు కలెక్టరేట్ : ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏప్రిల్ 1న ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జీవీ రమణ తెలిపారు. ఆయన శుక్రవారం ఆ సంఘం నేతలతో కలిసి కలెక్టరేట్‌లో డీఆర్‌వో మోహన్‌కుమార్‌కు ముందస్తు నోటీసు అందజేశారు. ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అవుతున్నా హామీలు నెరవేర్చలేదన్నారు. 2023 జూలై 1 నుంచి అమలు కావాల్సిన 12వ పీఆర్‌సీ కోసం ఇప్పటి వరకు కమిషన్ నియమించకపోవడం తగదన్నారు. జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రెడ్డెప్పనాయుడు, మణిగండన్ మాట్లాడుతూ 12వ పీఆర్‌సీ కమిషన్ చైర్మన్‌ను వెంటనే నియమించాలని డిమాండ్ చేశా రు. 29 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న డీఏలు విడుదల చేయాలన్నారు. విశ్రాంత ఉద్యోగులకు గ్రాట్యూటీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ బకాయిలు చెల్లించాలని, సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్నారు. కారుణ్య నియామకాలు చేపట్టి కోవిడ్ సమయంలో మృతి చెందిన 953 మంది పంచాయతీరాజ్ ఉద్యోగుల కుటుంబాలకు న్యాయం చేయాలన్నారు. సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికే లక్ష పోస్టు కార్డుల ఉద్యమం చేపట్టామన్నారు. విజయవాడలో భారీ ధర్నా చేపట్టినప్పటికీ ప్రభు త్వం నుంచి ఆశించిన స్పందన లేదని మండిపడ్డా రు. అందుకే దశలవారీ పోరాటాల్లో భాగంగా ఏప్రి ల్ 1న నిరాహార దీక్ష చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో జిల్లా సహాధ్యక్షులు ఎస్.రెహనాబేగం, డి.ఏకాంబరం, రాష్ట్ర కౌన్సిలర్ ఎస్.పి.బాషా, జిల్లా కార్యదర్శి ఎం.పార్థసారథి, నాయకులు జి.రవీంద్ర, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.


