అంగరంగ వైభవంగా ప్రమాణం, కనిపించని మాజీ ప్రధాని | Balen Shah oath All former PMs turned up But KP Oli absence steals attention | Sakshi
Sakshi News home page

అంగరంగ వైభవంగా ప్రమాణం, కనిపించని మాజీ ప్రధాని

Mar 27 2026 3:03 PM | Updated on Mar 27 2026 3:24 PM

Balen Shah oath All former PMs turned up But KP Oli absence steals attention

ర్యాపర్‌గా కెరీర్ ప్రారంభించి,  అతి చిన్న వయసులోనే నేపాల్‌ రాజకీయాలను మలుపు తిప్పిన యువనేత బాలేంద్ర షా (Balen Shah)నేపాల్‌ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించారు.  శుక్రవారం నేపాల్‌ కొత్త ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు.  రాష్ట్రపతి కార్యాలయం శీతల్ నివాస్‌లో ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో అట్టహాసంగా, రాజకీయ సందడి నెలకొంది. ప్రధానిగా బాలెన్ షా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నేపాల్ రాజకీయ దిగ్గజాలు హాజరయ్యారు. మాజీ ప్రధానమంత్రులు ప్రత్యేక ఆకర్షణగా నిలవగా,  ఒకరు  మాత్రం  గైర్హాజరు కావడం గమనార్హం.

కేపీ శర్మ ఓలీ గైర్హాజరు

ఈ కార్యక్రమానికి పుష్ప కమల్ దహల్ “ప్రచండ”, మాధవ్ కుమార్ నేపాల్, ఝలనాథ్ ఖనాల్, , బాబురామ్ భట్టారాయ్‌లతో సహా పలువురు మాజీ ప్రధానమంత్రులు హాజరయ్యారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి , తాత్కాలిక ప్రభుత్వ అధిపతి అయిన ఖిల్ రాజ్ రెగ్మీ కూడా హాజరయ్యారు. విదేశాలలో ఉన్నందున హాజరు కాలేకపోయిన నేపాలీ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, మాజీ ప్రధానమంత్రి షేర్ బహదూర్ దేవుబా కూడా ఈ సమావేశానికి హాజరుకాని వారిలో ముఖ్యమైనవారు.కా నీ మాజీ ప్రధానమంత్రి, యూఎంఎల్ ఛైర్మన్,కేపీ శర్మ ఓలీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాకపోవడం ఆశ్చర్యపరిచింది.

ఇదీ  చదవండి: బాలేన్‌ షా సరికొత్త చరిత్ర..32 ప్రభుత్వాల్లో ఒక్కటీ..!

బోర్న్‌ లీడర్‌ బాలెన్‌
ముగ్గురు తోబుట్టువులలో చిన్నవాడైన బాలేన్, అక్క  బావ సుజాత , కౌశల్ షాల వద్ద పెరిగాడు. వారు అతనిలోని నాయకత్వ లక్షణాలను చిన్నప్పుడే గుర్తించారు. అందుకే అతను "బాలెన్ పుట్టుకతోనే నాయకుడు అంటారు. బాలెన్ మానసికంగా చాలా దృఢమైన వ్యక్తి, అతను ఎల్లప్పుడూ దేశానికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటున్నామనంటూ సుజాత, కౌశల్‌ దంపతులు అభిలషించారు.  కానీ  మొదట రాజకీయాల్లోకి ప్రవేశించినప్పుడు, ఆశ్చర్యం కలిగించింది. నాయకుడుగా  బాలెన్‌ ఎదిగిన తీరు చూశాక తాము తీసుకున్న అత్యంత సరైన నిర్ణయమని  ఫ్రీలాన్స్ ఆర్టిస్ట్ సుజాత  ఆనందాన్ని  వెలిబుచ్చారు. 

కాగా తన సొంత కంచుకోటలో ఓలీ  ఘోర పరాజయాన్ని మూట గట్టుకున్నారు.  నాలుగు సార్లు ప్రధాని అయిన  ఓలీకి కేవలం 18,734 ఓట్లు మాత్రమే వచ్చాయి. ప్రభుత్వం విధించిన సోషల్ మీడియా నిషేధం, అవినీతికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరిగిన ఉద్యమం కారణంగా చెలరేగిన విస్తృత నిరసనల నేపథ్యంలో, ఓలీ 2025 సెప్టెంబర్ 9న ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement