బాలేన్‌ షా సరికొత్త చరిత్ర..32 ప్రభుత్వాల్లో ఒక్కటీ..! | After Landslide victory Balen Shah Takes Oath As Nepal Youngest PM At 35 | Sakshi
Sakshi News home page

బాలేన్‌ షా సరికొత్త చరిత్ర..32 ప్రభుత్వాల్లో ఒక్కటీ..!

Mar 27 2026 2:30 PM | Updated on Mar 27 2026 3:22 PM

After Landslide victory Balen Shah Takes Oath As Nepal Youngest PM At 35

ర్యాపర్‌గా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన యువకెరటం బాలేంద్ర షా (Balen Shah) నేపాల్‌ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించారు. బాలెన్‌గా పాపులర్‌ అయిన బాలేంద్రషా గత ఏడాది జరిగిన అవినీతి వ్యతిరేక ఉద్యమంలో ప్రభుత్వాన్ని కూలదోసిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో బాలేంద్ర షా  నేతృత్వంలోనిపార్టీ రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ ఘన విజయం సాధించింది.  1999 తర్వాత తొలిసారిగా ప్రతినిధుల సభలో మెజారిటీ సాధించింది  కూడా  బాలేంద్రనే. దీంతో దశాబ్దాల కాలం తర్వాత భారత్ సరిహద్దుల్లోని దక్షిణ మైదాన ప్రాంతానికి చెందిన 'మధేసీ' వ్యక్తి నేపాల్ పగ్గాలు చేపట్టడం ఒక విశేషం


అవినీతి రహిత పాలన కోరుతూ గత ఏడాది జరిగిన జెన్ జెడ్  విప్లవం తర్వాత జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికలలో, నేపాల్ సంప్రదాయ పార్టీలను చిత్తుగా ఓడించాడు ఖాఠ్మండు మాజీ మేయర్ బాలేన్‌. మార్చి 5న జరిగిన ఈ ఎన్నికల్లో బాలేన్‌ నేతృత్వంలోని ఆర్‌ఎస్‌పీ 182 సీట్లు (మొత్తం 275లో) సాధించి రికార్డు సృష్టించింది. దీంతో 35 ఏళ్ల వయసులో నేపాల్‌ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం 12:34 గంటలకు ఖాట్మండులోని 'శీతల్ నివాస్'లో ప్రెసిడెంట్ రామ్ చంద్ర పౌడెల్ సమక్షంలో బాలేన్ షా ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు.

చారిత్రాత్మక విజయం ప్రమాణ స్వీకారం 
పూజారుల వేద మంత్రాలమధ్య ఎర్రని వస్త్రాలు ధరించిన బౌద్ధ సన్యాసుల సమక్షంలో జరిగిన ఒక కార్యక్రమం అనంతరం రాష్ట్రపతి రామ్ చంద్ర పౌడెల్  ప్రమాణ స్వీకారం చేయించారు.  బాలేంద్ర షా తన మార్కు స్టైల్  స్కిన్-టైట్ ప్యాంటు, మ్యాచింగ్ జాకెట్,నల్ల కళ్లజోడు ధరించి దేశం, ప్రజల తరఫున, రాజ్యాంగానికి విధేయుడిగా ఉంటానని, ప్రధానమంత్రిగా నా కర్తవ్యాన్ని నెరవేరుస్తానని ప్రతిజ్ఞ చేశారు బాలేన్‌ షా. నేపాల్ చరిత్రలో  మధేసీ ప్రాంతానికి చెందిన వ్యక్తి తొలి  ప్రధాని  కావడంతో దేశంలోని మధేసీ ప్రజలలో కొత్త ఆశలను చిగురింపజేసింది.

మాజీ ప్రధాని  కేపీ శర్మ ఓలీకి షాక్‌ 
స్ట్రక్చరల్ ఇంజనీర్‌ ర్యాపర్‌గా పాపులర్‌ అయిన బాలేన్‌ రాజకీయ ఆరంగేట్రం2022లో జరిగింది. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఖాట్మండు మేయర్‌గా గెలిచారు. తాజా ఎన్నికల్లో ఝాపా-5 నియోజకవర్గంలో మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీని సుమారు 50 వేల ఓట్ల భారీ మెజారిటీతో ఓడించడం విశేషం. దేశంలోనే అత్యంత పురాతన పార్టీ అయిన నేపాలీ కాంగ్రెస్ పార్టీ, కేవలం 38 స్థానాలతో పరిమితమూ రెండో స్థానానికి పడిపోయింది. జెన్ జెడ్ ఆందోళనల తర్వాత రాజీనామా చేయవలసి వచ్చిన ఓలీకి చెందిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (యూనిఫైడ్ మార్క్సిస్ట్-లెనినిస్ట్) 25 సీట్లను గెల్చుకుంది. 

ముందున్న సవాళ్లు
3 కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో ఉద్యోగాల కొరత, పాతుకుపోయిన అవినీతి కారణంగా యువత నేతృత్వంలోని నిరసనలు చోటు చేసుకున్నాయి. ఇక్కడ జనాభాలో ఐదవ వంతు మంది పేదరికంలో జీవిస్తుండగా, ప్రతిరోజూ సుమారు 1,500 మంది పని కోసం విదేశాలకు వలస వెళ్తున్నారు. దేశంలో రాజకీయ అస్థిరత కూడా ఒక శాపంగా మారింది. 1990 నుండి 32 ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినా, వాటిలో ఏదీ ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేయలేదు.సోషల్ మీడియాను సమర్థవంతంగా వాడుకోవడం , క్షేత్రస్థాయిలో అవినీతిపై పోరాటమే కీలకమైన బలంగా అధికారంలోకి వచ్చిన బాలేన్‌ ముందు అస్థిరతను తొలగించడం, ఉద్యోగాల కల్పన, అవినీతి నిర్మూలన లాంటి  అనేక సవాళ్లను  ఏ మేరకు అధిగమించగలడు అనేది కాలమే చెప్పాలి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement