జైపూర్ : జైపూర్‌లో జరిగి ఒక విభ్రాంతికర ఘటన నెట్టింట వైరల్‌గా మారింది. జైపూర్‌లోని ఒక కల్వర్టు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం చిలికి చిలికి గాలివానలా మారి, ఒక మహిళ బహిరంగంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్‌ను ధ్వంసం చేసే వరకు వెళ్లింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సంఘటన మార్చి 22న జరిగింది.
సౌరభ్ శర్మ అనే వ్యక్తి తన రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్‌పై ఆఫీసుకి వెళ్తుండగా, ముందున్న స్కూటర్ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో వెనుక ఉన్న క్యాబ్ కూడా ఆగింది. అయితే నియంత్రణ కోల్పోయిన సౌరభ్ తన ముందున్న క్యాబ్‌ను బుల్లెట్‌తో స్వల్పంగా ఢీకొట్టాడు.అయితే మర్యాదగా సౌరభ్ వెళ్లి వెంటనే క్యాబ్ డ్రైవర్‌కు క్షమాపణలు చెప్పాడు. కానీ క్యాబ్‌లో ఉన్న మహిళ మాత్రం హైడ్రామా క్రియేట్ చేసింది.
ఆగ్రహం ఊగిపోతూ ఆమె బుల్లెట్ రైడర్‌తో గొడవకు దిగడమే కాకుండా, ఊహించని విధంగా సౌరభ్ హెల్మెట్ తీసుకుని అతని బైక్ అద్దాలను పగలగొట్టింది. ఆ తర్వాత అక్కడే ఉన్న ఒక పెద్ద రాయిని తీసుకుని బైక్ బాడీని, వెనుక లైట్లను పదే పదే బాదుతూ విధ్వంసం సృష్టించింది. ఈ తంతంగా అంతా సీసీటీవీలో రికార్డైయింది.
Jaipur Woman Badly Damages Man's Bullet After It Grazes Her Scooterhttps://t.co/VNGAn5Q54t pic.twitter.com/Gt52R463vS
— NDTV (@ndtv) March 26, 2026
ఇప్పటికే రూ. 1,700 నష్టం జరిగింది, చాలు ఇక వదిలేయండి. బైక్ పాడైపోతోంది అంటూ సౌరభ్ వేడుకున్నా ఆమె వదల్లేదు సరిగదా, ఎందుకు వదలాలి?" అంటూ మరింత కసిగా బైక్‌ను రాయితో కొట్టింది. బైక్ పాడైపోతోంది, వదిలేయండి, కేసుపెడతాను బెదిరించాడు అతగాడు. దీంతో నువ్వు నన్నేమీ చేయలేవు అంటూ విరుచుకుపడింది.
పోలీసుల తీరుపై విమర్శలు
సౌరభ్ ఆరోపణల ప్రకారం, ఈ గొడవ జరుగుతున్నప్పుడు కేవలం కొద్ది మీటర్ల దూరంలోనే ఒక ట్రాఫిక్ పోలీస్ ఉన్నప్పటికీ, అతను పట్టించుకోలేదు. మహిళను ఆపమని పదే పదే కోరినప్పటికీ ఆ అధికారి పట్టించుకోలేదని బుల్లెట్ రైడర్ సౌరభ్ శర్మ ఆరోపించారు.
ఈ విషయం పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లగా ఇరు పక్షాలకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ పరిస్థితి సామరస్యంగా పరిష్కారమైందని, ఆ మహిళపై ఎలాంటి అధికారిక కేసు గానీ, చట్టపరమైన చర్యలు గానీ నమోదు చేయలేదని అధికారులు ధృవీకరించారు. అయితే, బహిరంగంగా ఒక వ్యక్తి వాహనాన్ని ధ్వంసం చేయడం, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం, పోలీసుల నిర్లిప్తతపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని చాలామంది నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

ఇదీ చదవండి: దేశవ్యాప్త లాక్‌డౌన్ : కేంద్ర మంత్రి ఏమన్నారంటే!
ఇదిలా ఉండగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాజస్థాన్ పోలీస్ హెల్ప్‌డెస్క్ బహిరంగంగా స్పందిస్తూ, ఈ కేసును సమీక్షించి, ప్రస్తుత పరిస్థితిపై అప్‌డేట్ అందించాలని జైపూర్ పోలీసులను కోరింది.
ఇదీ చదవండి : బాలేన్ షా సరికొత్త చరిత్ర..32 ప్రభుత్వాల్లో ఒక్కటీ..!


