దేశవ్యాప్త లాక్‌డౌన్‌ : కేంద్ర మంత్రి ఏమన్నారంటే! | Rumours Of Lockdown In India False No Such Proposal Hardeep Singh Puri | Sakshi
Sakshi News home page

దేశవ్యాప్త లాక్‌డౌన్‌ : కేంద్ర మంత్రి ఏమన్నారంటే!

Mar 27 2026 12:16 PM | Updated on Mar 27 2026 12:48 PM

Rumours Of Lockdown In India False  No Such Proposal Hardeep Singh Puri

సాక్షి, న్యూఢిల్లీ:  దేశంలో  దేశవ్యాప్త లాక్‌డౌన్ విధిస్తారన్న వదంతులు  నెట్టింట బాగా సందడి చేస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల పార్లమెంటులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోవిడ్‌ లాంటి సంక్షోభం మనముందుంది, అందరం సన్నద్ధంగా ఉండాలి, కలిసికట్టుగా దీన్ని అధిగమించాలన్న వ్యాఖ్యలు, ప్రపంచవ్యాప్త చమురు, గ్యాస్ కొరత నేపథ్యంలో  దేశంలో లాక్‌డౌన్‌ మళ్లీ తప్పదనే పుకార్లు షికార్లు చేశాయి. దీనిపై  కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి శుక్రవారం వివరణ ఇచ్చారు.  ప్రభుత్వం  పరిశీలనలో అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.  దేశవ్యాప్త లాక్‌డౌన్‌ వదంతులు పూర్తిగా అవాస్తవమని ఎక్స్‌లో క్లారిటీ ఇచ్చారు.

గ్లోబల్ పరిస్థితులు మారుతున్నప్పటికీ, ఇంధనం, నిత్యావసర వస్తువుల సరఫరాకు ఎటువంటి అంతరాయం కలగకుండా ప్రధాని మోదీ నేతృత్వంలో ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ఆయన భరోసా ఇచ్చారు. ప్రపంచ పరిస్థితి నిరంతరం మారుతూనే ఉంది. ఇంధనం, సరఫరా గొలుసులు, నిత్యావసర వస్తువుల రంగాలలో జరుగుతున్న పరిణామాలు, ముఖ్యంగా LPG సరఫరాపై  లాక్‌డౌన్ ఆందోళనలు వ్యక్తమవడంతో   కేంద్రమంత్రి ఈ వివరణ ఇచ్చారు.

ఇదీ చదవండి: కస్టమర్లకు షాక్‌ : పెట్రోలు రూ. 5 , డీజిల్‌ రూ. 3 పెంపు

 

ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ కొరత కారణంగా భారతదేశంలో లాక్‌డౌన్ విధించవచ్చనే ఊహాగానాలు చెలరేగుతున్న తరుణంలో పూరీ ఈ స్పష్టతనిచ్చారు. లాక్‌డౌన్ వార్తలను తీవ్రంగా ఖండించారు.  అటువంటి ప్రతిపాదన ఏదీ లేదని ఆయన తేల్చి చెప్పారు. ఇలాంటి క్లిష్ట సమయాల్లో ప్రశాంతంగా, బాధ్యతాయుతంగా, ఐక్యంగా ఉండటం ముఖ్యమని ఆయన హితవు పలికారు.  ప్రజల రాకపోకలపై గానీ, ఆర్థిక కార్యకలాపాలపై గానీ ఆంక్షలు విధించే ప్రణాళికలు లేవని , ప్రధాని మోదీ ఇటీవల చేసిన వ్యాఖ్యలను చాలామంది తప్పుగా అన్వయించుకున్నారని అధికారులు స్పష్టం చేశారు. 

ఇదీ చదవండి: శ్రీరామ నవమి : రామ నామాలతో నీతా అంబానీ చీర

పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు , వాటి వలన సంభవించే ఆర్థిక పరిణామాల నేపథ్యంలో, ప్రధాని ఇటీవల పార్లమెంటు ప్రసంగాలలో 'సన్నద్ధత' గురించి ప్రస్తావించడంతో ఈ గందరగోళానికి దారి తీసింది. 

ఇదీ చదవండి: క్లాస్‌రూంలోనే ప్రొఫెసర్‌ లవ్‌ ప్రపోజ్‌..కట్‌ చేస్తే, వీడియో వైరల్‌
ఐపీఎల్‌ టికెట్ల రచ్చ : ప్రతీ ఎమ్మెల్యేకు 5 టికెట్లు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement