శ్రీరామ నవమి : రామ నామాలతో నీతా అంబానీ చీర | Sri Ram Navami Nita Ambani special saree with devotion and heritage | Sakshi
Sakshi News home page

శ్రీరామ నవమి : రామ నామాలతో నీతా అంబానీ చీర

Mar 26 2026 7:35 PM | Updated on Mar 26 2026 7:55 PM

Sri Ram Navami Nita Ambani special saree with devotion and heritage

రిలయన్స్‌ ఫౌండేషన్‌  చైర్‌పర్సన్‌ నీతా అంబానీ  కళలు, సంస్కృతిపై  ప్రేమను  చాటుకోవడంలో తన ప్రత్యేకతను చాటుకున్నారు.  భక్తిని, వారసత్వాన్ని అందంగా ప్రతిబింబించే అందమైన చీరలో స్పెషల్‌గా మెరిసారు.  శ్రీరామ నవమి పవిత్ర సందర్భాన, భక్తిని,  భారతీయ వారసత్వాన్ని అద్భుతంగా చాటిచెప్పే ఒక చీర గురించి అంటూ నీతా లుక్‌కుసంబంధించిన ఫోటోలను ఎన్‌ఎంఏసీసీ ఇన్‌స్టాలో షేర్‌ చేసింది.

హస్తకళల ద్వారా ఒక సంస్కృతిని గౌరవించడం అనేది ఆ కళాకారుల శ్రమకు నిజమైన గుర్తింపు నివ్వడంలో నీతా అంబానీ ఎపుడూ ముందుంటారు.  ఇటీవల ఒడిశాలోని కేఐఐటీ (KIIT)లో నీతా గౌరవ డాక్టరేట్ అందుకున్నప్పుడు, ఆమె ఆ ప్రాంతపు కాలాతీత హస్తకళలను గౌరవించారు. ఈ ప్రత్యేక సందర్భం కోసం, ఆమె మట్టి రంగులలోని ఒక సుందరమైన ఇక్కత్‌  (Ikat) చీరను ఎంచుకున్నారు. స్వదేశ్ నేత కళాకారుడు హరిశంకర్ మెహర్ దీన్ని రూపొందించారు. ఈ ప్రత్యేకమైన చీరను రూపొందించడానికి ఆయనకు రెండేళ్లు పట్టింది. ఒడిశాలోని గొప్ప నేత వారసత్వానికి ప్రతిబింబమైన ఈ చీరను నీతాకు ఆయన  బహూకరించారు.

సహజమైన రంగులను ఉపయోగించి, సాంప్రదాయ బంధ (Bandha)పద్ధతిలో నేసిన ఈ చీర, భక్తిని,డిజైన్‌ మేళవింపుగా అందంగా రూపొందింది. దీని ప్రధాన భాగంలో రామ శిల స్ఫూర్తితో రూపొందించిన మొజాయిక్ ఉంది. దానిపై సార్వజనీన విశ్వాసానికి  ప్రతీకగా "రామ్" అనే పదం అనేక భాషలలో లిఖించారు. కొంగుపై ఒడియా లిపిలో పవిత్ర మంత్రాలు, సాంప్రదాయ ఇక్కత్‌ నమూనాలలో నేయడం విశేషం.

ఇదీ చదవండి: ఐపీఎల్‌ టికెట్ల రచ్చ : ప్రతీ ఎమ్మెల్యేకు 5 టికెట్లు!
 

నీతా చీర ప్రత్యేకతలు
సహజ సిద్ధమైన రంగులలతో  సాంప్రదాయ 'బంధ' (Bandha) ప్రక్రియలో ఈ చీరను నేశారు. పవిత్రమైన పల్లు, రామనామాలు ఈ చీర ప్రత్యేకతలు.

చీర మధ్య భాగంలో (Body) 'రామ శిల' స్ఫూర్తితో కూడిన డిజైన్ ఉంది. ఇందులో "రామ్" అనే పదం వివిధ భాషలలో లిఖించబడి, విశ్వవ్యాప్తమైన భక్తిని చాటిచెబుతోంది. చీర పల్లూ భాగంలో పవిత్రమైన మంత్రాలను ఒడియా లిపిలో, క్లాసిక్ ఇక్కత్ నమూనాలతో కలిపి అత్యంత నైపుణ్యంతో నేశారు.

ఇదీ చదవండి: కస్టమర్లకు షాక్‌ : పెట్రోలు రూ. 5 , డీజిల్‌ రూ. 3 పెంపు

కేవలం ఇదొక వస్త్రంగానే కాకుండా, ఈ చీర సంప్రదాయం, ఆధ్యాత్మికత మరియు కథాకౌశలానికి ప్రతీకగా నిలుస్తుంది. మన వస్త్రాలు మన సంస్కృతిని, భక్తిని , కాలాతీత జ్ఞానాన్ని ఎలా మోసుకెళ్తాయో చెప్పడానికి ఇది ఒక చక్కని నిదర్శనం.

ఇదీ చదవండి: క్లాస్‌రూంలోనే ప్రొఫెసర్‌ లవ్‌ ప్రపోజ్‌..కట్‌ చేస్తే, వీడియో వైరల్‌

Advertisement
 
Advertisement
Advertisement