బెంగళూరు శివార్లలోని ఒక మెడికల్ కాలేజీలో జరిగిన ఘటన దిగ్భ్రాంతి రేపుతోంది. మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ లవ్ ప్రపోజల్ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. నెలమంగళ సమీపంలోని టి. బేగూరులో ఉన్న శ్రీ సిద్ధార్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
అసలేం జరిగింది?
క్లాస్ జరుగుతుండగా మొహమ్మద్ అనే ప్రొఫెసర్ ఉన్నట్టుండి మైక్ పట్టుకుని విద్యార్థులందరి ముందు ఒక విద్యార్థినికి తన ప్రేమ గురించి వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారు. ఆమె తనకు లవ్ ప్రపోజ్ చేసిందనీ, దీంతో తాను కూడా ఆమెను ప్రేమిస్తున్నానని ఆయన క్లాసులో అందరి ముందు ప్రకటించారు. అందరికీ చాక్లెట్లు పంచాడు. దీన్ని సదరు విద్యార్థిని వ్యతిరేకించడంతో వాగ్వాదం జరిగింది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల ప్రకారం, నువ్వు నాకు ప్రపోజ్ చేశావు కదా? ఐ లవ్ యూ అని చెప్పావు కదా అని ప్రొఫెసర్ అడిగాడు. ‘నేను ఎప్పుడు ప్రపోజ్ చేశాను? ఆధారాలు చూపించండి’ అంటూ ఆమె గట్టిగా వ్యతిరేకించింది.
సీసీటీవీ ఫుటేజీ ఉంది, కావాలంటే చూసుకోండి అని ప్రొఫెసర్ కొంచెం గట్టిగా వాదించాడు. దీంతో మరింత ఆగ్రహం వ్యక్తంచేసిన ఆమె ‘ప్రిన్సిపాల్ దగ్గర తేల్చుకుందాం పద, క్లాస్ అంతా వస్తారు’ అనడంతో రేపు మాట్లాడుకుందాం అంటూ అక్కడినుంచి జారుకోవడానికి ప్రయత్నించాడు సదరు ప్రొఫెసర్ .
అడ్డుకున్న విద్యార్థులు
ప్రొఫెసర్ ప్రవర్తనతో ఆగ్రహానికి గురైన తోటి విద్యార్థులు ప్రొఫెసర్‌ను నిలదీశారు. ఇతర విద్యార్థులు కూడా ఆమెకు తోడుగా నిలిచారు. ఈ క్రమంలో గొడవ పెరిగి, ప్రొఫెసర్‌ను ఆమె చెప్పుతో కొట్టింది. దీంతో క్యాంపస్‌లో గందరగోళం నెలకొంది.
Movie type proposal in #Bengaluru!
A professor proposes to a student in the classroom of a medical college at T Begur in Nelamangala. The girl takes objection.
A few moments later: The girl & fellow students thrash the professor. @timesofindia pic.twitter.com/ohsFTxUj5J— Oxomiya Jiyori 🇮🇳 (@SouleFacts) March 26, 2026
ఇదీ చదవండి: హోర్మూజ్ తరువాత : ట్రంప్‌కు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్
ఇది పోలీసుల దాకా చేరింది. నెలమంగళ రూరల్ పోలీసులు కాలేజీని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ఘటనకు సంబంధించిన వీడియోలను పోలీసులు పరిశీలిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఇరువర్గాల నుండి ఎలాంటి అధికారిక ఫిర్యాదు అందలేదు.అటు ఈ ఘటనపై కాలేజీ యాజమాన్యం ఇంకా ఎలాంటి క్రమశిక్షణ చర్యలు ప్రకటించలేదు. మెడికల్ కాలేజీలో ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ప్రొఫెసర్ ఇలా ప్రవర్తించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇదీ చదవండి: కస్టమర్లకు షాక్ : పెట్రోలు రూ. 5 , డీజిల్ రూ. 3 పెంపు


