కస్టమర్లకు షాక్‌ : పెట్రోలు రూ. 5 , డీజిల్‌ రూ. 3 పెంపు | Nayara hikes petrol by Rs 5 diesel by Rs 3 as up global oil prices | Sakshi
Sakshi News home page

కస్టమర్లకు షాక్‌ : పెట్రోలు రూ. 5 , డీజిల్‌ రూ. 3 పెంపు

Mar 26 2026 4:38 PM | Updated on Mar 26 2026 4:59 PM

Nayara hikes petrol by Rs 5 diesel by Rs 3 as up global oil prices

మధ్యప్రాచ్యంలో ఇరాన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా చమురు సంక్షోభం ఏర్పడింది. ముడిచమురు ధరలు భారీగా పెరిగాయి. అంతేకాదు పెట్రోలు, డీజిల్‌ సరఫరాలో  అంతరాయాలు వస్తాయనే ఆందోళనతో, వినియోగదారుల ప్యానిక్‌ కొనుగోళ్లతో దేశంలో పెట్రోలుబంకుల వద్ద రద్దీ ఏర్పడింది. మరోవైపు  దేశానికి సరిపడా ఇంధన నిల్వలున్నాయని, ఆందోళన అవసరం లేదని కేంద్రం పదే పదే స్పష్టతనిస్తోంది. ఈ నేపథ్యంలో అతిపెద్ద ఇంధన విక్రయ సంస్థ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం వినియోగదారులకు షాకిచ్చింది.

మనీ కంట్రోల్‌ నివేదిక ప్రకారం భారతదేశపు అతిపెద్ద ప్రైవేట్ ఇంధన విక్రయ సంస్థ నయారా ఎనర్జీ (Nayara Energy) పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది, పెట్రోల్‌పై లీటరుకు రూ.5 పెంచింది. అలాగే డీజిల్‌పై లీటరుకు రూ.3 పెంచేసింది. భారతదేశంలోని 1,02,075 పెట్రోల్ పంపులలో 6,967 పంపులను నిర్వహిస్తున్న నయారా ఎనర్జీ, పెరిగిన ముడిసరుకు ఖర్చులలో కొంత భాగాన్ని వినియోగ దారులపై మోపాలని నిర్ణయించింది.ఈ పెంపు నయారా బంకుల్లో మాత్రమే. నేటి నుండి పెరిగిన ధరలు అమలులోకి వస్తాయి.

మరోవైపు పెట్రోల్, డీజిల్ అనేవి నియంత్రణ లేని వస్తువులని, వాటి ధరలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు స్వతంత్రంగా నిర్ణయిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. నయారా వంటి ప్రైవేట్ సంస్థలకు అటువంటి రాయితీలు ఉండవు గనుక పెరిగిన ఖర్చుల భారాన్ని వినియోగదారులపై వేయక తప్పలేదని సంస్థ వర్గాలు తెలిపాయి.

కాగా ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల తర్వాత అంతర్జాతీయ చమురు ధరలు దాదాపు 50% పెరిగాయి. ఒక దశలో ముడిచమురు ధర బ్యారెల్‌కు 119 డాలర్లకు చేరుకుంది. దేశంలోని 90శాతం మార్కెట్‌ను నియంత్రించే ప్రభుత్వ రంగ సంస్థలు (IOC, BPCL, HPCL))ఇప్పటికీ సాధారణ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచలేదు.అయితే, గత వారం ఇవి కూడా ప్రీమియం పెట్రోల్ ధరను లీటరుకు  రూ.2, పారిశ్రామిక అవసరాల కోసం వాడే బల్క్ డీజిల్ ధరను లీటరుకు సుమారు  రూ.22 పెంచాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement