తిరుపతి క్రైం: నగరంలోని గరుడ వారధిపై గురువారం రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్న ఘటనలో 10 మంది గాయపడ్డారు. ఈస్ట్ సీఐ శ్రీనివాసులు కథనం మేరకు.. తిరుమల నుంచి తిరుపతికి వచ్చిన ఆర్టీసీ బస్సు శ్రీనివాసం సమీపంలోని ఫ్లైఓవర్‌పై ప్రయాణికులను దింపుతుండగా వెనకనుంచి వచ్చి మరో ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో పది మందికి స్వల్ప గాయాలయ్యా యి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. ప్రమాద ఘటనపై ఈస్ట్ సీఐ శ్రీనివాసులు విచారణ చేపట్టారు. ప్రమాదానికి కారకుడైన ఆర్టీసీ డ్రైవర్ వెంకటయ్యను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.


