జిల్లాలో 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్న మూల్యాంకన విధుల కు కేటాయించిన సిబ్బంది తప్పక హాజ రు కావాలి. విధులకు కేటాయించిన లెక్చరర్లను ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్ రిలీవ్ చేసి మూల్యాంకన విధులకు పంపాలి. మూల్యాంకన కేంద్రంలోకి సెల్ ఫోన్లను అనుమతించడం జరగదు. మూల్యాంకన కేంద్రంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి స్ట్రీమింగ్ చేయించాం. పేపర్ల దిద్దుబాటులో అలసత్వం ప్రదర్శించి తప్పులు చేస్తే మూల్యం చెల్లించుకోక తప్పదు.
– రఘుపతి, డీఐఈవో,
ఇంటర్ స్పాట్ క్యాంప్ ఆఫీసర్


