పరిష్కారం ఏదీ? | - | Sakshi
Sakshi News home page

పరిష్కారం ఏదీ?

Mar 22 2026 1:53 AM | Updated on Mar 22 2026 1:53 AM

కుప్పంలో అక్రమాలు అరికట్టాలి

రూ.కోట్లలో పేరుకుపోయిన బిల్లులు

హాజరు కాని జిల్లా అధికారులు

సమస్యలు చెప్పుకొని లాభమేమిటీ?

వడివడిగా జెడ్పీ స్థాయి సంఘాల

సమావేశం

అధికారుల గైర్హాజరుపై జెడ్పీ చైర్మన్‌ ఆగ్రహం

ప్రశ్నలతోనే సరి..

చిత్తూరు కార్పొరేషన్‌: సభ్యులంటే మండల స్థాయిలోనూ అధికారులకు లోకువే, జిల్లా స్థాయిలో అధికారులు కనీసం సమావేశానికి హాజరు కాకుండా మరింత చులకనగా చూస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. సంబఽంధిత అధికారుల వివరణ కోరుతూ నోటీసుల ఇవ్వాలని జెడ్పీ చైర్మన్‌ శ్రీనివాసులు, సీఈఓ రవికుమార్‌నాయుడును ఆదేశించా రు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్‌చైర్మన్‌ ధనంజయరెడ్డి, సీ్త్ర శిశు సంక్షేమ కమిటీ చైర్మన్‌ భారతి, డిప్యూటీ సీఈఓ వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు.

నీటి సమస్య రానివ్వద్దు

పెద్దపంజాణిలో 2 హెల్త్‌సెంటర్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని వాటిని చెల్లించాలని జెడ్పీ చైర్మన్‌ శ్రీనివాసులు తెలిపారు. వేసవిలో నీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సకాలంలో వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్లు ఇవ్వాలన్నారు. ప్రమాదకర లైన్లను మార్పు చేయాలన్నారు. కుప్పం నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు జరిగినా బిల్లులు విడుదల కావడం లేదన్నారు. ఎర్రవారిపాళ్యం ఆస్పత్రిలో రూమ్‌ నిర్మించాలని అధికారులను ఆదేశించారు. తంబలపల్లె, ములకలచెరువుల నందు నూతన పీహెచ్‌సీ భవనాలు నిర్మించాలన్నారు.

అక్రమాలు అరికట్టాలని..

కుప్పంలో జరుగుతున్న అక్రమాలను అరికట్టాలని జెడ్పీటీసీ సభ్యుడు శరవణ వాపోయారు. రేషన్‌ దుకాణంను డీలర్లు సూపర్‌ మార్కెట్‌గా మార్చారని, వేల రూపాయల సరుకులు కొంటే గానీ పేదలకు బియ్యం ఇవ్వడం లేదని సమస్యను తెలిపారు. ఆ సరుకులు కొనాలనే నిబంధన ఏమన్నా ఉందా అని ప్రశ్నించారు. టన్నుల కొద్దీ బియ్యంను అక్రమంగా విక్రయిస్తున్నరని విమర్శించారు. జిల్లా అధికారులు తనిఖీ చేయకపోవడంతో అక్రమాలు పెరుగుతున్నాయన్నారు. ఎంఈఓ అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారని ఆ స్థానంలో మరొకరిని నియమించాలన్నారు. ఏరియా ఆస్పత్రిలో సిబ్బంది లేమితో రోగులు అవస్థలు పడుతున్నారన్నారు. గుడుపల్లె మండలంలోని రెడ్డిపాళెంలో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్‌ లైన్‌ మార్చాలన్నారు. దొంగతనం అయిన ట్రాన్స్‌ఫార్మర్ల స్థానంలో కొత్తవి ఇవ్వడం లేదన్నారు. వ్యవసాయ సర్వీసులు తమ డివిజన్‌ పరిధిలో వందల సంఖ్యలో పెండింగ్‌లో ఉన్నాయన్నారు. కుప్పం పాలిటెక్నిక్‌ కళాశాల సమీపంలో ఆర్‌అండ్‌బీ రోడ్డు గుంతలు పడి అధ్వాన్నంగా ఉందన్నారు.

పేరుకుపోయిన రూ.కోట్ల బకాయి బిల్లులు

ఎన్‌ఆర్‌జీఎస్‌ పథకం కింద చేసిన పనుల బకాయిలు రూ.కోట్లు పేరుకుపోయాయని వడమాలపేట, ఎర్రవారిపాళ్యం జెడ్పీటీసీ సభ్యులు మురళీధర్‌రెడ్డి, కరుణాకర్‌రెడ్డి ప్రశ్నించారు. గత పాలనలో జరిగిన పనులకు సైతం బిల్లులు క్లోజ్‌ చేశారని, కానీ డబ్బులు చెల్లించలేదన్నారు. పంచాయతీ పరంగా కొత్త పనుల మంజూరు కావడం లేదన్నారు. గతంలో జరిగిన పనులకు మ్యాచింగ్‌ గ్రాంట్స్‌ ఎందుకు ఇవ్వడం లేదన్నారు. మండల గ్రాంట్స్‌ నందు గ్రావెల్‌ తీసుకోవడానికి అనుమతి ఇస్తున్నారని అలాగే జెడ్పీ గ్రాంట్స్‌ పరంగా ఇవ్వాలని నారాయణవనం జెడ్పీటీసీ సభ్యుడు సుమన్‌ డిమాండ్‌ చేశారు. మండల స్థాయిలో ఎంపీడీఓలు సభ్యులకు గౌరవం ఇవ్వడం లేదన్నారు. నక్కలచెరువు పనులు అసంపూర్తిగా ఉన్నాయని, పనుల పూర్తికి నిధులు ఇవ్వడం లేదన్నారు. సచివాలయం, ఆర్‌బీకే, హెల్త్‌ క్లినిక్‌లు అసంపూర్తిగా ఉన్నాయని వాటి బిల్లులు ఇవ్వకపోవడంతో పనులు ఆగిపోయాయని రామసముద్రం జెడ్పీటీసీ సభ్యుడు రామచంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శివాలయానికి వెళ్లేదారిలో రూ.2 కోట్లతో గత పాలనలో రోడ్డు పనులు మంజూరు అయ్యాయన్నారు. రూ.70 లక్షల పనులు జరిగాయని, మిగిలినవి మధ్యలోనే ఆపివేశారన్నారు. చేసిన పనుల నందు 20 శాతం తక్కువ బిల్లులు ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ వేస్తున్నారని వడమాలపేట జెడ్పీటీసీ సభ్యుడు ఆరోపించారు. ఆయనను మార్చాలని పుత్తూరు మండల సమావేశంలో తీర్మానం చేశారని గుర్తు చేశారు. ఏఈని తక్షణం మార్పు చేయాలని డిమాండ్‌ చేశారు. ఎఫ్‌డీఆర్‌ పెండింగ్‌ బిల్లులు ఇవ్వాలన్నారు. సదుం మండలంలో కాలువలు నిర్మించకుండా రోడ్డు వేస్తున్నారని జెడ్పీటీసీ సభ్యుడు సోమశేఖర్‌రెడ్డి తెలిపారు. చౌడేపల్లె–సోమల–సదుం ఆర్‌అండ్‌బీ రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని చౌడేపల్లె జెడ్పీటీసీ సభ్యుడు దామోదారరాజు ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement