అడవికి నిప్పు.. మానవాళికి ముప్పు | - | Sakshi
Sakshi News home page

అడవికి నిప్పు.. మానవాళికి ముప్పు

Mar 27 2026 8:51 AM | Updated on Mar 27 2026 8:51 AM

ఐరాల: అడవికి నిప్పు పెడితే మానవాళి మనుగడకే ముప్పు వాటిల్లుతుందని డీఆర్‌ఓ రాకేష్‌కుమార్‌ తెలిపారు. గురువారం మండల కేంద్రంలోని వీఎస్‌.అగ్రహారంలో కళాజాత బృందంతో అడవికి నిప్పు పెట్టడం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అడవికి వెళ్లే పశువులు, గొర్రెల కాపరులు, అటవీ ఉత్పత్తులు సేకరించే గిరిజనులు అడవికి నిప్పు పెట్టడం వల్ల క్రమేణా అటవీ విస్తీర్ణం తగ్గిపోతుందన్నారు. దీనివల్ల ఏటా వర్షపాతం కూడా తగ్గిపోతుందని తెలిపారు. అడవులకు నిప్పుపెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అడవిలో ప్రమాదాలు తగ్గాలంటే ప్రజలే స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో ఎఫ్‌బీఓలు పద్మ, లావణ్య, గణేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement