చిత్తూరు కార్పొరేషన్: చిత్తూరు జిల్లా ట్రాన్స్‌కో ఎస్‌ఈగా కార్పొరేట్ కార్యాలయంలో పీఅండ్‌ఎం విభాగం ఈఈ అమర్‌బాబు నియమితులయ్యారు. గత ఎస్‌ఈ ఇస్మాయిల్‌అహ్మద్ మంగళవారం పదవీ విరమణ పొందారు. ఆయన స్థానంలో అమర్‌బాబును నియమిస్తూ సీఎండీ శివశంకర్ ఉత్తర్వులు జారీచేశారు. కాగా డీపీఈ ఈఈ హరి పదోన్నతి పై కార్పొరేట్ కార్యాలయ ఎనర్జీ ఆడిట్ జీఎంగా నియమితులయ్యారు. ఎస్‌ఈ పోస్టు పోటీ పై సోమవారం ‘ఎస్‌ఈ సీటుపై ఇద్దరి కన్ను’ అనే శీర్షికన సాక్షిలో కథనం వచ్చింది. తిరుపతి, చిత్తూరు ఈఈలు పోటీ పడుతున్నరనే విషయం పై వెల్లడించింది. అందులో ప్రస్తావించినట్టుగానే తిరుపతిలో ఈఈ క్యాడర్‌లో ఉన్న అమర్‌బాబు పదోన్నతిపై ఎస్‌ఈగా చిత్తూరు వచ్చారు. బుధవారం ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు.


