పెట్రోలు మస్త్‌ ఉంది, డోంట్‌ వర్రీ : కేంద్రం | Crude sufficient no instances of fuel shortage reported at retail outlets Govt | Sakshi
Sakshi News home page

పెట్రోలు మస్త్‌ ఉంది, డోంట్‌ వర్రీ : కేంద్రం

Apr 1 2026 4:33 PM | Updated on Apr 1 2026 5:30 PM

Crude sufficient no instances of fuel shortage reported at retail outlets Govt

సాక్షి, న్యూఢిల్లీ: ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్‌ వార్‌ నేపథ్యంలో చమురుపై పెరుగుతున్న ఆందోళలు మరింత ఉధృతమవుతున్నాయి.  దీంతోచమురు సరఫరాపై ఆందోళన వద్దని కేంద్రం మరోసారి స్ఫష్టం చేసింది. రాబోయే రెండు నెలల పాటు తగినంత సరఫరాను నిర్ధారించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని ప్రభుత్వం వెల్లడించింది.

‘‘దేశంలో ముడి చమురు నిల్వలు సరిపడా ఉన్నాయి. రాబోయే రెండు నెలల పాటు తగినంత సరఫరాను నిర్ధారించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది," అని పెట్రోలియం మరియు సహజ వాయువుల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ బుధవారం పునరుద్ఘాటించారు.  దేశంలోని అన్ని చమురు శుద్ధి కర్మాగారాలు (Refineries) పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయి,పెట్రోల్ బంకుల్లో ఎక్కడా ఇంధన కొరత లేదని ప్రభుత్వం పేర్కొంది. సామాన్యులపై భారం పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రిత్వ శాఖ భరోసా ఇచ్చింది.

ఎల్పీజీ సరఫరా కూడా సాధారణంగానే ఉందనీ, దేశం దిగుమతులపై సుమారు 60 శాతం ఆధారపడి ఉందని సుజాత శర్మ అన్నారు. గృహ అవసరాలకు ఎల్‌పీజీ, అలాగే కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్‌జీ)  100 శాతం సహజ వాయువు సరఫరాకు  ఢోకా లేదని ఆమె హామీ ఇచ్చారు. అంతర్జాతీయంగా క్రూడ్‌ ధరల్లో పెరుగుదల ఉన్నప్పటికీ, దేశీయ వినియోగదారులకు పెట్రోల్, డీజిల్ ధరలలో ఎలాంటి పెరుగుదల లేదు, పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) నష్టాలను ఎదుర్కొంటున్నామని ఆమె తెలిపారు. దేశంలో పెట్రోల్, డీజిల్ తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేస్తూ, దేశీయ మార్కెట్లో ఏటీఎఫ్, డీజిల్ తగినంతగా లభించేలా చూసేందుకు భారత ప్రభుత్వం ఎగుమతి సుంకాన్ని కూడా విధించిందని ఆమె గుర్తుచేశారు.

Breaking News : పెట్రోల్ ధరలు పెరగలేదు
 

ఇదీ చదవండి: 30 వేల మందిపై వేటు : వణికిపోతున్న ఐటీ ఉద్యోగులు

కాగా పశ్చిమ ఆసియా సంఘర్షణల నేపథ్యంలో ఎల్‌పిజి, ఇంధన కొరతపై ఆందోళన నెలకొంది. దీంతో భారతదేశం వద్ద పెట్రోల్, డీజిల్ నిల్వలు సరిపడా ఉన్నాయని పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఇప్పటికే పేర్కొంది. ప్రజలు భయాందోళనలతో కొనుగోళ్లు చేయవద్దని పెట్రోలియం మంత్రిత్వ శాఖ కోరింది.

ఇదీ చదవండి: ఐసీఐసీఐలో భారీ స్కాం : 195 మంది కస్టమర్లు, రూ. 23 కోట్లు

Advertisement
 
Advertisement
Advertisement