Oil and gas production
-
పెట్రోలు మస్త్ ఉంది, డోంట్ వర్రీ : కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ: ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ వార్ నేపథ్యంలో చమురుపై పెరుగుతున్న ఆందోళలు మరింత ఉధృతమవుతున్నాయి. దీంతోచమురు సరఫరాపై ఆందోళన వద్దని కేంద్రం మరోసారి స్ఫష్టం చేసింది. రాబోయే రెండు నెలల పాటు తగినంత సరఫరాను నిర్ధారించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని ప్రభుత్వం వెల్లడించింది.‘‘దేశంలో ముడి చమురు నిల్వలు సరిపడా ఉన్నాయి. రాబోయే రెండు నెలల పాటు తగినంత సరఫరాను నిర్ధారించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది," అని పెట్రోలియం మరియు సహజ వాయువుల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ బుధవారం పునరుద్ఘాటించారు. దేశంలోని అన్ని చమురు శుద్ధి కర్మాగారాలు (Refineries) పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయి,పెట్రోల్ బంకుల్లో ఎక్కడా ఇంధన కొరత లేదని ప్రభుత్వం పేర్కొంది. సామాన్యులపై భారం పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రిత్వ శాఖ భరోసా ఇచ్చింది.ఎల్పీజీ సరఫరా కూడా సాధారణంగానే ఉందనీ, దేశం దిగుమతులపై సుమారు 60 శాతం ఆధారపడి ఉందని సుజాత శర్మ అన్నారు. గృహ అవసరాలకు ఎల్పీజీ, అలాగే కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ) 100 శాతం సహజ వాయువు సరఫరాకు ఢోకా లేదని ఆమె హామీ ఇచ్చారు. అంతర్జాతీయంగా క్రూడ్ ధరల్లో పెరుగుదల ఉన్నప్పటికీ, దేశీయ వినియోగదారులకు పెట్రోల్, డీజిల్ ధరలలో ఎలాంటి పెరుగుదల లేదు, పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) నష్టాలను ఎదుర్కొంటున్నామని ఆమె తెలిపారు. దేశంలో పెట్రోల్, డీజిల్ తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేస్తూ, దేశీయ మార్కెట్లో ఏటీఎఫ్, డీజిల్ తగినంతగా లభించేలా చూసేందుకు భారత ప్రభుత్వం ఎగుమతి సుంకాన్ని కూడా విధించిందని ఆమె గుర్తుచేశారు. ఇదీ చదవండి: 30 వేల మందిపై వేటు : వణికిపోతున్న ఐటీ ఉద్యోగులుకాగా పశ్చిమ ఆసియా సంఘర్షణల నేపథ్యంలో ఎల్పిజి, ఇంధన కొరతపై ఆందోళన నెలకొంది. దీంతో భారతదేశం వద్ద పెట్రోల్, డీజిల్ నిల్వలు సరిపడా ఉన్నాయని పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఇప్పటికే పేర్కొంది. ప్రజలు భయాందోళనలతో కొనుగోళ్లు చేయవద్దని పెట్రోలియం మంత్రిత్వ శాఖ కోరింది.ఇదీ చదవండి: ఐసీఐసీఐలో భారీ స్కాం : 195 మంది కస్టమర్లు, రూ. 23 కోట్లు -
ఎగ్జాన్‌మొబిల్‌తో ఓఎన్జీసీ జత
న్యూఢిల్లీ: గ్లోబల్ చమురు దిగ్గజం ఎగ్జాన్‌మొబిల్‌తో ప్రభుత్వ రంగ ఇంధన దిగ్గజం ఓఎన్జీసీ చేతులు కలిపింది. తద్వారా దేశ తూర్పు, పశ్చిమ తీర ప్రాంతాల సముద్రగర్భం నుంచి చమురు, గ్యాస్ వెలికితీత కార్యక్రమాలను చేపట్టనుంది. ఇందుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ఒక ప్రకటనలో ఓఎన్జీసీ పేర్కొంది. తూర్పు తీరప్రాంతంలో కృష్ణా గోదావరి, కావేరీ బేసిన్లపై దృష్టి సారించనున్నాయి. ఇదేవిధంగా పశ్చిమ తీరప్రాంతంలో కచ్–ముంబై వద్ద కార్యకలాపాలకు శ్రీకారం చుట్టనున్నట్లు ఓఎన్జీసీ వెల్లడించింది. అయితే భాగస్వామ్య ఒప్పందంపై వివరాలు తెలియచేయలేదు. కంపెనీకి గల బ్లాకులలో ఎగ్జాన్‌మొబిల్ వాటాలు తీసుకుంటుందా తదితర వివరాలు వెల్లడికాలేదు. ఎగ్జాన్‌మొబిల్‌తో జత కట్టడం వ్యూహాత్మకంగా మేలు చేస్తుందని, దేశ తూర్పు, పశ్చిమ తీరప్రాంతాలలో కంపెనీకి గల అనుభవం ఇందుకు సహకరిస్తుందని ఓఎన్జీసీ ఈ సందర్భంగా పేర్కొంది. దేశీయంగా చమురు అవసరాల కోసం 85 శాతంవరకూ దిగుమతులపై ఆధారపడుతున్న నేపథ్యంలో విదేశీ ఇంధన దిగ్గజాల నుంచి దేశీ సంస్థలు సాంకేతిక, ఆర్థికపరమైన మద్దతును ఆశిస్తున్నాయి. తద్వారా కొత్త వనరుల నుంచి దేశీయంగా ఇంధన ఉత్పత్తిని పెంచాలని ఆశిస్తున్నాయి. కాగా.. గత కొన్నేళ్ల చర్చల ప్రభావంతో 2019లో ఎగ్జాన్‌మొబిల్, ఓఎన్జీసీ మధ్య అవగాహనా ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా భవిష్యత్ వేలంలో రెండు కంపెనీలు సంయుక్త పరిశోధన, సంయుక్త బిడ్డింగ్ వంటివి చేపట్టేందుకు నిర్ణయించాయి. -
కేజీ బేసిన్లో కెయిర్న్ రూ.13 వేల కోట్ల పెట్టుబడులు
హైదరాబాద్: చమురు, సహజవాయువు ఉత్పత్తిలో ఉన్న కెయిర్న్ ఇండియా కృష్ణ-గోదావరి బేసిన్లో ఆయిల్, గ్యాస్ బ్లాక్ అభివృద్ధికి సుమారు రూ.13,000 కోట్లు వెచ్చించనుంది. కేజీ-ఓఎస్ఎన్-2009/3 బ్లాక్‌లో 64 బావుల్లో తవ్వకాలు చేపట్టేందుకై ప్రాజెక్టు ప్రణాళిక సిద్ధం చేసేందుకు కంపెనీ కేంద్ర ప్రభుత్వ అనుమతి కోరింది. ఈ బ్లాక్ ప్రకాశం, గుంటూరు తీరం వెలుపల బంగాళాఖాతంలో నిక్షిప్తమై ఉంది. తీరం వెలుపల క్షేత్రం ఉన్నందున ప్రజాభిప్రాయ సేకరణ అవసరం లేదని పర్యావరణ శాఖకు చెందిన ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ తన నివేదికలో వెల్లడించింది. కేజీ-ఓఎస్ఎన్-2009/3 బ్లాక్‌ను కెయిర్న్ ఇండియా 2010లో దక్కించుకుంది.


