Petroleum and Natural Gas Ministry
-
పెట్రోలు మస్త్ ఉంది, డోంట్ వర్రీ : కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ: ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ వార్ నేపథ్యంలో చమురుపై పెరుగుతున్న ఆందోళలు మరింత ఉధృతమవుతున్నాయి. దీంతోచమురు సరఫరాపై ఆందోళన వద్దని కేంద్రం మరోసారి స్ఫష్టం చేసింది. రాబోయే రెండు నెలల పాటు తగినంత సరఫరాను నిర్ధారించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని ప్రభుత్వం వెల్లడించింది.‘‘దేశంలో ముడి చమురు నిల్వలు సరిపడా ఉన్నాయి. రాబోయే రెండు నెలల పాటు తగినంత సరఫరాను నిర్ధారించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది," అని పెట్రోలియం మరియు సహజ వాయువుల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ బుధవారం పునరుద్ఘాటించారు. దేశంలోని అన్ని చమురు శుద్ధి కర్మాగారాలు (Refineries) పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయి,పెట్రోల్ బంకుల్లో ఎక్కడా ఇంధన కొరత లేదని ప్రభుత్వం పేర్కొంది. సామాన్యులపై భారం పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రిత్వ శాఖ భరోసా ఇచ్చింది.ఎల్పీజీ సరఫరా కూడా సాధారణంగానే ఉందనీ, దేశం దిగుమతులపై సుమారు 60 శాతం ఆధారపడి ఉందని సుజాత శర్మ అన్నారు. గృహ అవసరాలకు ఎల్పీజీ, అలాగే కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ) 100 శాతం సహజ వాయువు సరఫరాకు ఢోకా లేదని ఆమె హామీ ఇచ్చారు. అంతర్జాతీయంగా క్రూడ్ ధరల్లో పెరుగుదల ఉన్నప్పటికీ, దేశీయ వినియోగదారులకు పెట్రోల్, డీజిల్ ధరలలో ఎలాంటి పెరుగుదల లేదు, పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) నష్టాలను ఎదుర్కొంటున్నామని ఆమె తెలిపారు. దేశంలో పెట్రోల్, డీజిల్ తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేస్తూ, దేశీయ మార్కెట్లో ఏటీఎఫ్, డీజిల్ తగినంతగా లభించేలా చూసేందుకు భారత ప్రభుత్వం ఎగుమతి సుంకాన్ని కూడా విధించిందని ఆమె గుర్తుచేశారు. ఇదీ చదవండి: 30 వేల మందిపై వేటు : వణికిపోతున్న ఐటీ ఉద్యోగులుకాగా పశ్చిమ ఆసియా సంఘర్షణల నేపథ్యంలో ఎల్పిజి, ఇంధన కొరతపై ఆందోళన నెలకొంది. దీంతో భారతదేశం వద్ద పెట్రోల్, డీజిల్ నిల్వలు సరిపడా ఉన్నాయని పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఇప్పటికే పేర్కొంది. ప్రజలు భయాందోళనలతో కొనుగోళ్లు చేయవద్దని పెట్రోలియం మంత్రిత్వ శాఖ కోరింది.ఇదీ చదవండి: ఐసీఐసీఐలో భారీ స్కాం : 195 మంది కస్టమర్లు, రూ. 23 కోట్లు -
పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ సంక్షోభం, కేంద్రం కీలక ప్రకటన
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధంతో నెలకొన్న చమురు సంక్షోభంతో దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్, వంటగ్యాస సరఫరాపై తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఎక్కడా పెట్రోల్, డీజిల్ కొరత లేదని, ధరలలో కూడా ఎటువంటి పెరుగుదల లేదని స్పష్టం చేసింది. దేశంలో సరిపడా ఇంధన నిల్వలున్నాయనీ, వదంతులను నమ్మవద్దు అని బుధవారం (మార్చి 25, 2026) పెట్రోలియం మరియు సహజ వాయువుల మంత్రిత్వ శాఖ (MoPNG) సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ ప్రకటించారు. పెట్రోల్, డీజిల్ కొరత లేదు, ధరలు పెంచంఏటా సుమారు 26 కోట్ల టన్నుల ముడి చమురును శుద్ధి చేసే సామర్థ్యం మనకు ఉందనే విషయాన్ని దేశ ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నా అన్నారు. గత రెండు రోజులుగా, అనేక ప్రాంతాల్లోని రిటైల్ అవుట్లెట్లు మరియు పెట్రోల్ పంపుల బయట క్యూలు కనిపించాయి. భయాందోళనలతో కొనుగోళ్లు కూడా జరిగాయి. కానీ మన వద్ద తగినంత పెట్రోల్, డీజిల్ అందుబాటులో ఉన్నాయి. ఏ పెట్రోల్ పంపు వద్ద కూడా కొరత లేదు. పెట్రోల్ పంపులకు సరఫరా టెర్మినళ్లలో కూడా తగినంత పరిమాణంలో ఇంధన నిల్వలున్నాయి. అందువల్ల, వదంతులను నమ్మవద్దు , భయాందోళనలతో కొనుగోళ్లు మానుకోండి అని ఆమె చెప్పారు. పెట్రోల్, డీజిల్ ధరలలో ఎటువంటి పెరుగుదల ఉండదని కూడా ఆమె స్పష్టం చేశారు. LPG విషయానికి వస్తే, ఏ పంపిణీ కేంద్రం వద్ద కూడా ఎలాంటి కొరత లేదని ఆమె తెలిపారు. ఇప్పటివరకు 26 రాష్ట్రాలకు 22,000 టన్నుల వాణిజ్య ఎల్‌పిజిని కేటాయించారని, గత 25 రోజుల్లో 2.5 లక్షల కొత్త పిఎన్జి కనెక్షన్లు మంజూరు చేశారని ఆమె తెలిపారు. సుమారు 30,005 కిలోల సిలిండర్లు పంపిణీ చేశామని ఆమె చెప్పారు. ప్రత్యామ్నాయ ఇంధన కిరోసిన్‌ను అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం అదనపు కేటాయింపులు చేసిందన్నారు. సుమారు 16 రాష్ట్రాలు , కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించి కేటాయింపు ఉత్తర్వులు జారీ చేశామన్నారు. అలాగే నల్లబజారు, అక్రమ నిల్వలను అరికట్టడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయన్నారు. ఈ క్రమంలోనే మంగళవారం వివిధ రాష్ట్రాల్లో సుమారు 2700 దాడులు నిర్వహించి, సుమారు 2000 సిలిండర్లు స్వాధీనం చేసుకున్నట్టు సుజాత శర్మ వెల్లడించారు.ఇదీ చదవండి: కోట్లాదిమందికి గుడ్ న్యూస్ : భారీగా చమురు కొనుగోలు #WATCH | Delhi: Sujata Sharma, Joint Secretary (Marketing & Oil Refinery), Ministry of Petroleum & Natural Gas, says, "In the last 25 days, 2.5 lakh new connections (PNG) have been given. Additionally, approximately 2.20 lakh consumers have shifted from LPG to PNG. Additionally,… pic.twitter.com/o3pDx5KbMs— ANI (@ANI) March 25, 2026 -
దేశంలో చమురు నిల్వల పరిస్థితి ఏంటి? ఎల్పీజీ దొరుకుతుందా?
పశ్చిమ ఆసియాలో (Iran Israel War) నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ చమురు నిల్వల పరిస్థితి ఏంటి? మన దగ్గరున్న నిల్వలు ఎన్ని రోజులు వస్తాయి. దేశీయంగా ఎల్పీజీ సరఫరాపై కూడా ఒత్తిడి పెరుగుతుందా? దీనిపై పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఇంధన భద్రతపై ముందస్తు చర్యలు తీసుకుందా? ఈ వివరాలను ఈ కథనం తెలుసుకుందాం.గల్ఫ్ ఉద్రిక్తతల మధ్య భారతదేశంలో 50 రోజులకు సరిపడా ముడి చమురు నిల్వ ఉంది. అవసరం వచ్చినప్పుడు వైవిధ్య భరితంగా కొనసాగిస్తామని భారతదేశం జాగ్రత్తగా ఆశావాదంతో కొనసాగుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మరోవైపు రాబోయే 10-15 రోజుల్లో ఇరాన్ , అమెరికా-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఆగకపోతే చమురు ధర బ్యారెల్‌కు 82 డాలర్ల వరకు పెరుగుతుందని అంచనాపశ్చిమాసియాలో అభివృద్ధి చెందుతున్న పరిస్థితిని భారతదేశం నిరంతరం పర్యవేక్షిస్తోందని పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుత పరిస్థితిని అంచనా వేయడానికి, ముడి చమురు సరఫరా, ప్రత్యామ్నాయ ప్రాంతాలతో సహా ఆకస్మిక ప్రణాళికలను రూపొందించడానికి గత 48 గంటల్లో భారత కంపెనీలతో బహుళ సమావేశమైందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలోనే ఇంధన అవసరాల కొరతపై ఆందోళనలను తోసిపుచ్చాయి. భారత్ తన శక్తి వ్యూహంలో భాగంగా లభ్యత (Availability), అందుబాటు ధర (Affordability), స్థిరత్వం (Sustainability) అనే మూడు సూత్రాలకు కట్టుబడి ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.చమురు ధరల అంచనాయుద్ధం గనుక మరో 10-15 రోజులు కొనసాగితే, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఫిబ్రవరి 27న 72 డాలర్లు గా ఉన్న బ్రెంట్ క్రూడ్ ధర, మార్చి 3 నాటికి 82 డాలర్లు కు చేరుకుంది. పరిస్థితి ఇలాగే ఉంటే ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉంది.భారత్ వద్ద సరిపడా నిల్వలుప్రస్తుత యుద్ధ వాతావరణం దృష్ట్యా భారత్ అప్రమత్తమైంది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం ఇండియాలో ప్రస్తుతం 50 రోజులకు సరిపడా ముడి చమురు మరియు ఇతర పెట్రోలియం ఉత్పత్తుల నిల్వలు ఉన్నాయి. హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) ద్వారానే భారత్‌కు దాదాపు 40 శాతం ముడి చమురు దిగుమతులు జరుగుతాయి. ఒకవేళ ఈ మార్గం మూతపడితే ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణను కూడా చేస్తోంది.హార్ముజ్ జలసంధి దెబ్బ- ప్రత్యామ్నాయాలు హార్ముజ్ జలసంధి కాకుండా ఇతర ఎంపికలు ఉన్నాయి. వీటిలో కేప్ ఆఫ్ గుడ్ హోప్ కూడా ఉంది, పెరిగిన ఉద్రిక్తతల మధ్య దేశం చమురు మరియు గ్యాస్ కోసం ప్రత్యామ్నాయ సరఫరాలను పరిశీలిస్తోంది. ఫిబ్రవరిలో రోజుకు 1.04 మిలియన్ బ్యారెళ్లను తాకిన దిగుమతులతో దేశం రష్యన్ చమురును కొనుగోలు చేస్తూనే ఉంది. పశ్చిమాసియా గ్రేడ్లకు ప్రాప్యత తగ్గితే భారత శుద్ధి కర్మాగారాలు రష్యా చమురు సరఫరాల వైపు తిరిగి మొగ్గు చూపుతాయని విశ్లేషకులు తెలిపారు.ఇదీ చదవండి: విజయ్ దేవరకొండ నయా ట్రెండ్ : డైమండ్ ఎమరాల్డ్ నెక్లెస్ స్పెషల్ ఎట్రాక్షన్కేప్ ఆఫ్ గుడ్ హోప్ (Cape of Good Hope): ఈ ప్రత్యామ్నాయ మార్గం ద్వారా చమురు తెప్పించుకునే అవకాశం ఉంది. అయితే దీనివల్ల బీమా మరియు రవాణా ఖర్చులు పెరుగుతాయి. పశ్చిమ ఆసియా నుండి సరఫరా తగ్గితే, భారత్ తిరిగి రష్యా నుండి దిగుమతులను పెంచే అవకాశం ఉంది. ఫిబ్రవరిలో రష్యా నుండి రోజుకు 1.04 మిలియన్ బారెళ్ల చమురును భారత్ దిగుమతి చేసుకుంది.LPG నిల్వలుదేశంలో 25-30 రోజులకు సరిపడా LPG స్టాక్ ఉంది. కాబట్టి ప్రజలు ఆందోళనతో ముందస్తుగా సిలిండర్లను కొనుగోలు చేయాల్సిన (Panic Buying) అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. మన దేశ అవసరాల్లో 80-85శాతం గల్ఫ్ దేశాల నుండే వస్తాయి. ప్రస్తుతం యూఏఈ, నార్వే, అమెరికా,సౌదీఅరేబియా నుండి దిగుమతులను భారత్ పెంచుతోంది. అలాగే భారత్ తన అవసరాల కోసం 40శాతం పైగా ఖతార్ (Qatar) పైనే ఆధారపడుతుంది. ఇరాన్ డ్రోన్ దాడి కారణంగా ఖతార్‌లోని ఎగుమతి కేంద్రం తాత్కాలికంగా మూతపడింది. ఇది గనుక త్వరగా పునరుద్ధరించబడకపోతే ప్రత్యామ్నాయ చర్యలు చేపడతామని ప్రభుత్వం తెలిపింది.ఇదీ చదవండి: సీమంతం వేడుకలో భార్యకు సర్ప్రైజ్, వైరల్ వీడియో -
చమురు షేర్ల విలువ సరికాదు
ముంబై: ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ దిగ్గజాల(ఓఎంసీలు) షేర్ల విలువలపై కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురి తాజాగా అసంతృప్తిని వ్యక్తం చేశారు. మార్కెట్లో వీటికి ఇన్వెస్టర్ల నుంచి లభిస్తున్న విలువపట్ల ప్రభుత్వం నిరాశకు లోనైనట్లు పేర్కొన్నారు. ఇండియన్ ఆయిల్(ఐవోసీ), హిందుస్తాన్ పెట్రోలియం(హెచ్‌పీసీఎల్), భారత్ పెట్రోలియం కార్పొరేషన్(బీపీసీఎల్) ఉమ్మడిగా గత ఆరేళ్లలో రూ. 2.5 లక్షల కోట్ల నికర లాభం ఆర్జించినట్లు తెలియజేశారు. అయితే ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్స్ స్విగ్గీ, జొమాటో సంయుక్తంగా రూ. 24,000 కోట్ల నష్టాలు ప్రకటించినట్లు ప్రస్తావించారు. అయితే మూడు ఓఎంసీల విలువతో ఈ రెండు కంపెనీల విలువ అటూఇటుగా సమానంగా ఉన్నట్లు వ్యాఖ్యానించారు. గతేడాది మూడు ఓఎంసీలు ఉమ్మడిగా ఆర్జించిన లాభాలు దేశీ కార్పొరేట్ లాభాల్లో 3.3 శాతం వాటాకు సమానమని పేర్కొన్నారు. అయితే వీటి విలువ 1 శాతానికంటే తక్కువేనని వెల్లడించారు. వెరసి చమురు మార్కెటింగ్ పీఎస్‌యూ షేర్లకు తగిన విలువ లభించడంలేదని అభిప్రాయపడ్డారు. వాటా విక్రయ యోచన ఇంధన విక్రయ దిగ్గజాలలో ప్రభుత్వం కొంతమేర వాటా విక్రయించేందుకు చూస్తున్నట్లు పురి తెలియజేశారు. అయితే వీటిలో పూర్తి వాటాను అమ్మివేసే యోచనలేదని స్పష్టం చేశారు. కంపెనీల సామర్థ్యాన్ని మెరుగుపరిచే దిశలో స్వల్ప వాటాను విక్రయించనున్నట్లు తెలియజేశారు. అయితే బీపీసీఎల్ ఈ జాబితాలో లేనట్లు స్పష్టం చేశారు. -
కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్లపై అందించిన సబ్సీడీ ఎంతో తెలుసా..?
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం 2011-12 నుంచి ఇప్పటివరకు సుమారు రూ .7.03 లక్షల కోట్ల గ్యాస్ సబ్సిడీలను చెల్లించిందని పెట్రోలియం, సహజ వాయువు సహాయ మంత్రి, రామేశ్వర్ తేలి లోక్‌సభలో పేర్కొన్నారు. దేశంలో పెరుగుతున్న ఇంధన ధరలపై స్పందిస్తూ.. దేశంలోని పెట్రోలియం ఉత్పత్తుల ధరలు అంతర్జాతీయ మార్కెట్ ముడిచమురుల ధరలపై ముడిపడి ఉన్నాయని పేర్కొన్నారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఎల్పీజీ సబ్సిడీ కోసం కేటాయింపులను మూడింట రెండు వంతులు తగ్గించిన విషయాన్ని వెల్లడించారు. 2022 ఆర్థిక సంవత్సరానికిగాను ఆర్థిక మంత్రిత్వ శాఖ సుమారు రూ. 12,995 కోట్లకు తగ్గించిన నేపథ్యంలో సబ్సిడీయేతర వంట గ్యాస్ ధర పెరిగిందని పేర్కొన్నారు. ఎల్పిజి అండ్ నేచురల్ గ్యాస్ సబ్సిడీ కోసం 2021-22 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ అంచనాలు రూ. 12,995 కోట్లని ప్రకటనలో పేర్కొన్నారు. భారత్‌లో 2021 జనవరి 1 నాటికి 28.74 కోట్ట మంది ఎల్పీజీ వినియోగదారులు ఉన్నారని తెలిపారు. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం కింద నిరుపేద కుటుంబాలకు ఉచిత వంటగ్యాస్ కనెక్షన్లను అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎల్పీజీ కవరేజీని 61.5శాతం నుంచి 99.5 శాతానికి పెరిగిందని వెల్లడించారు. -
పెట్రోలు,డీజిల్‌పై పన్నువసూళ్ల రికార్డు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో నింగిని తాకుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వ ఎక్సైజ్ పన్ను వసూళ్లు రికార్డు స్థాయిలో పుంజుకున్నాయి. అంతర్జాతీయ చమురు ధరల నేపథ్యంలో పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర ప్రభుత్వ పన్ను వసూళ్లు 88 శాతం పెరిగి రూ .3.35 ట్రిలియన్లకు చేరుకున్నాయని పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి రామేశ్వర్ లోక్‌సభలో అడిగిన ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. వాస్తవానికి ఇది ఇంకా పెరగాల్సి ఉందని అయితే కరోనా మహమ్మారి, లాక్డౌన్ ఆంక్షల సంక్షోభం కారణంగా విక్రయాలు లేక రాబడి క్షీణించిందన్నారు. అయితే కరోనా మహమ్మారి డిమాండ్ భారీగా పడి పోయినప్పటికీ 2020-21లో (ఏప్రిల్ 2020 నుంచి మార్చి 2021 వరకు) పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర ప్రభుత్వ పన్ను వసూళ్లు 88 శాతం పెరిగి రూ .3.35 ట్రిలియన్లకు చేరుకున్నాయని మంత్రి ప్రకటించారు. గత ఏడాది రూ .1.78 ట్రిలియన్ల నుంచి ఈ మేరకు పెరిగిందని మంత్రి చెప్పారు. కరోనా వైరస్,లాక్డౌన్, రవాణా ఆంక్షలు ఇంధన అమ్మకాలను దెబ్బతీసాయనీ చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్-జూన్నెలల్లో ఎక్సైజ్ వసూళ్లు మొత్తం రూ.11.1 ట్రిలియన్లని ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి సోమవారం లోక్‌సభలో వెల్లడించారు. ఇందులోపెట్రోల్, డీజిల్ మాత్రమే కాకుండా ఏటీఎఫ్, నేచురల్ గ్యాస్ ఎక్సైజ్ సుంకం కలిసి ఉందన్నారు. 2020-2021లో మొత్తం ఎక్సైజ్ ఆదాయం రూ .3.89 ట్రిలియన్లు. కాగా 2018-19లో పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ వసూళ్లు రూ.2.13 ట్రిలియన్లుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం (2020-21) మొదటి 10 నెలల్లో పెట్రోల్, డీజిల్ వసూళ్లు రూ .2.94 లక్షల కోట్లగా ఉంది. పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని రూ .19.8 నుంచి రూ .32.9 కు, డీజిల్‌పై రూ.15.83 నుంచినుంచి రూ. 31.8 మేరక రికార్డు స్థాయికి పెంచిన సంగతి తెలిసిందే. -
వారికి షాకే : ఇక షాపింగ్ మాల్స్‌లో పెట్రోల్
సాక్షి, న్యూఢిల్లీ : పెట్రోల్ బంకుల యాజమాన్యాలకు షాకిచ్చేలా కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ఒక సంచలన నిర్ణయం తీసుకోనుంది. షాపింగ్ మాల్స్ లేదా సూపర్ మార్కెట్లలో రీటైల్‌గా పెట్రోల్, డీజిల్‌లను అందుబాటులో ఉంచాలని కేంద్రం ఆలోచిస్తున్నట్టుగా సమాచారం. సంబంధిత అనుమతులను త్వరలోనే మంజూరు చేయనుంది. ఈ మేరకు పెట్రోలియం మంత్రిత్వ శాఖ తొందరలోనే క్యాబినెట్ నోట్‌ను తీసుకురానుంది. ప్రస్తుత నిబంధనలను సడలించేందుకు కసరత్తు చేస్తోందని బిజినెస్ స్టాండర్డ్ నివేదించింది. ఆర్థికవేత్త కిరిట్ పరిఖ్ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల కమిటీ ఇంధన రీటైలింగ్ విధానానికి సంబంధించి భారతదేశంలో సడలింపు నిబంధనలను ప్రతిపాదించింది. అతి సులభంగా, తగ్గింపు ధరల్లో ఇంధనాన్ని వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించింది. మాజీ పెట్రోలియం కార్యదర్శి జిసి చతుర్వేది, మాజీ ఇండియన్ ఆయిల్ (ఐఓసి) చైర్మన్ ఎంఏ పఠాన్, పెట్రోలియం మంత్రిత్వ శాఖ మార్కెటింగ్ ఇన్‌ఛార్జి జాయింట్ సెక్రటరీ అశుతోష్ జిందాల్ ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. మే 30న రెండవ సారి అధికార పగ్గాలు చేపట్టిన మోదీ సర్కార్ 100 రోజుల్లేనే ఈ విధానాన్ని అమల్లోకి తేవాలని భావించిందట. దీని ప్రకారం సెప్టెంబర్‌మొదటి వారంలో దీనికి సంబంధించిన విధి విధానాలు తుది రూపు దాల్చనున్నాయి. తద్వారా సంస్థల ఇంధన వినియోగాన్ని తగ్గించాలని ఇది సూచించే అవకాశం ఉంది. అలాగే ప్రభుత్వం దేశీయ మార్కెట్లో ప్రాథమిక మౌలిక సదుపాయాల పెట్టుబడి పరిమితిని రూ.2 వేల కోట్లనుంచి తగ్గించనుంది. లేదా 3 మిలియన్ టన్నుల (30 లక్షల టన్నులు) లేదా దీనికి సమానమైన మొత్తానికి బ్యాంక్ గ్యారెంటీలను అందించనుందని రిపోర్టులో తెలిపింది. అదే జరిగితే పెట్రో బంకులకు గట్టి దెబ్బ తప్పదనే చెప్పాలి. బంకుల్లో జరిగే మోసాలకూ అడ్డుకట్టపడే అవకాశం ఉంది. సూపర్ మార్కెట్ల ద్వారా రిటైల్ ఇంధన విక్రయాలను అనుమతించే విధానం యునైటెడ్ కింగ్డమ్ (యుకె)లో విజయవంతంగా అమల్లో ఉంది. ఇదిలా ఉండగా, గత ఏడాది మార్చి 16న పూణేలో పెట్రోల్ హోండెలివరీ సదుపాయాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ప్రస్తుతం ఇండియన్ ఆయిల్ కార్ప్ (ఐఓసి), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీవో) హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పిసిఎల్) లాంటి ప్రభుత్వ ఇంధన రిటైలర్లు పూణే, ఢిల్లీ, జౌన్పూర్, చెన్నై, బెంగళూరు, అలీగఢ్, దుదైపూర్, రేవారి, నవీ ముంబైలో పెట్రోలు హోం డెలివరీ ఇస్తున్న సంగతి తెలిసిందే. -
దేశీ గ్యాస్ ధర రెట్టింపు...
న్యూఢిల్లీ: దేశీయంగా ఉత్పత్తి చేసే సహజ వాయువు ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి రెట్టింపు కానుంది. ఈ మేరకు కొత్త గ్యాస్ ధరల విధానాన్ని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ శుక్రవారం నోటిఫై చేసింది. దీంతో ప్రస్తుతం ఒక్కో యూనిట్‌కు 4.2 డాలర్లుగా ఉన్న గ్యాస్ ధర 8.2-8.4 డాలర్లకు ఎగబాకనుంది. కోల్బెడ్ మీథేన్(సీబీఎం), షేల్ గ్యాస్ సహా ఇతరత్రా అన్నిరకాల సంప్రదాయ గ్యాస్‌లకు కూడా ఏప్రిల్ 1 నుంచి ‘దేశీ సహజవాయు ధరల మార్గదర్శకాలు-2014’ వర్తిస్తాయని చమురు శాఖ పేర్కొంది. అంతర్జాతీయ ప్రామాణిక గ్యాస్ రేట్లు, దేశంలోకి దిగుమతయ్యే ద్రవీకృత సహజవాయువు(ఎల్ఎన్జీ)ల సగటు ధరల ఆధారంగా దేశీ గ్యాస్ రేటును నిర్ణయించనున్నట్లు తెలిపింది. 2019 మార్చి 31 వరకూ ఐదేళ్లపాటు ఈ కొత్త విధానం అమలు కానుంది. ప్రతి మూడు నెలలకూ గ్యాస్ ధరల్లో మార్పులు ఉంటాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి ప్రైవేటు కంపెనీలతో పాటు ఓఎన్జీసీ తదితర ప్రభుత్వ రంగ కంపెనీలకూ ఈ కొత్త ధరల విధానం వర్తిస్తుంది. కాగా, రిలయన్స్ కేజీ-డీ6 బ్లాక్‌లోని డీ1, డీ3 క్షేత్రాల్లో గ్యాస్‌కు కొత్త ధర అమలవ్వాలంటే బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాలన్న షరతును కేంద్రం విధించడం తెలిసిందే. రిలయన్స్ కావాలనే గ్యాస్‌ను వెలికితీయకుండా ధర పెరిగాక ఉత్పత్తి పెంచాలనుకుంటోందన్న ఆరోపణల నేపథ్యంలో ఈ షరతు పెట్టారు.


