ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధంతో నెలకొన్న చమురు సంక్షోభంతో దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్, వంటగ్యాస సరఫరాపై తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఎక్కడా పెట్రోల్, డీజిల్ కొరత లేదని, ధరలలో కూడా ఎటువంటి పెరుగుదల లేదని స్పష్టం చేసింది. దేశంలో సరిపడా ఇంధన నిల్వలున్నాయనీ, వదంతులను నమ్మవద్దు అని బుధవారం (మార్చి 25, 2026) పెట్రోలియం మరియు సహజ వాయువుల మంత్రిత్వ శాఖ (MoPNG) సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ ప్రకటించారు.
పెట్రోల్, డీజిల్ కొరత లేదు, ధరలు పెంచం
ఏటా సుమారు 26 కోట్ల టన్నుల ముడి చమురును శుద్ధి చేసే సామర్థ్యం మనకు ఉందనే విషయాన్ని దేశ ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నా అన్నారు. గత రెండు రోజులుగా, అనేక ప్రాంతాల్లోని రిటైల్ అవుట్‌లెట్లు మరియు పెట్రోల్ పంపుల బయట క్యూలు కనిపించాయి. భయాందోళనలతో కొనుగోళ్లు కూడా జరిగాయి. కానీ మన వద్ద తగినంత పెట్రోల్, డీజిల్ అందుబాటులో ఉన్నాయి. ఏ పెట్రోల్ పంపు వద్ద కూడా కొరత లేదు. పెట్రోల్ పంపులకు సరఫరా టెర్మినళ్లలో కూడా తగినంత పరిమాణంలో ఇంధన నిల్వలున్నాయి. అందువల్ల, వదంతులను నమ్మవద్దు , భయాందోళనలతో కొనుగోళ్లు మానుకోండి అని ఆమె చెప్పారు. పెట్రోల్, డీజిల్ ధరలలో ఎటువంటి పెరుగుదల ఉండదని కూడా ఆమె స్పష్టం చేశారు. LPG విషయానికి వస్తే, ఏ పంపిణీ కేంద్రం వద్ద కూడా ఎలాంటి కొరత లేదని ఆమె తెలిపారు. ఇప్పటివరకు 26 రాష్ట్రాలకు 22,000 టన్నుల వాణిజ్య ఎల్‌పిజిని కేటాయించారని, గత 25 రోజుల్లో 2.5 లక్షల కొత్త పిఎన్‌జి కనెక్షన్లు మంజూరు చేశారని ఆమె తెలిపారు. సుమారు 30,005 కిలోల సిలిండర్లు పంపిణీ చేశామని ఆమె చెప్పారు.
ప్రత్యామ్నాయ ఇంధన కిరోసిన్‌ను అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం అదనపు కేటాయింపులు చేసిందన్నారు. సుమారు 16 రాష్ట్రాలు , కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించి కేటాయింపు ఉత్తర్వులు జారీ చేశామన్నారు. అలాగే నల్లబజారు, అక్రమ నిల్వలను అరికట్టడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయన్నారు. ఈ క్రమంలోనే మంగళవారం వివిధ రాష్ట్రాల్లో సుమారు 2700 దాడులు నిర్వహించి, సుమారు 2000 సిలిండర్లు స్వాధీనం చేసుకున్నట్టు సుజాత శర్మ వెల్లడించారు.
ఇదీ చదవండి: కోట్లాదిమందికి గుడ్ న్యూస్ : భారీగా చమురు కొనుగోలు
#WATCH | Delhi: Sujata Sharma, Joint Secretary (Marketing & Oil Refinery), Ministry of Petroleum & Natural Gas, says, "In the last 25 days, 2.5 lakh new connections (PNG) have been given. Additionally, approximately 2.20 lakh consumers have shifted from LPG to PNG. Additionally,… pic.twitter.com/o3pDx5KbMs
— ANI (@ANI) March 25, 2026


