కోట్లాది మందికి గుడ్‌ న్యూస్‌ : భారీగా చమురు కొనుగోలు | Good News: India buys 60 million barrels of Russian oil for April | Sakshi
Sakshi News home page

కోట్లాది మందికి గుడ్‌ న్యూస్‌ : భారీగా చమురు కొనుగోలు

Mar 25 2026 4:59 PM | Updated on Mar 25 2026 5:51 PM

Good News: India buys 60 million barrels of Russian oil for April

మధ్యప్రాచ్య (Middle East) యుద్దంతో నెలకొన్న చమురు సరఫరా సంక్షోభం పెట్రోల్‌, డీజిల్‌పై  ఆందోళనల నేపథ్యంలో భారతీయులకు  భారీ ఊరటనిచ్చే అంశమిది. భారత రిఫైనరీలు వచ్చే నెల డెలివరీ కోసం సుమారు 60 మిలియన్ బ్యారెళ్ల రష్యా చమురును కొనుగోలు చేశాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. తద్వారా చమురు కొనుగోలులో అమెరికా ఇచ్చిన  వెసులు బాటు భారత్‌ సమర్ధవంతంగా వినియోగించుకున్నట్టు అవుతోంది.

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలతో సౌదీ అరేబియా, ఇరాక్ నుండి రావాల్సిన చమురు నిలిచి పోవడంతో, భారత్ తన ఇంధన అవసరాల కోసం మళ్ళీ రష్యా వైపు మొగ్గు చూపింది. మనీ కంట్రోల్‌ కథనం ప్రకారం రష్యా నుంచి చమురు దిగుమతుల విషయంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో భారతీయ రిఫైనరీలు మే నెల డెలివరీ కోసం దాదాపు 6 కోట్ల (60 Million) బ్యారెళ్ల రష్యన్ చమురును కొనుగోలు చేశాయి. ఫిబ్రవరి నెలతో పోలిస్తే ఈ కొనుగోళ్లు రెట్టింపు కంటే ఎక్కువగా ఉన్నాయి. చమురు ధరలు బ్రెంట్ క్రూడ్ కంటే బ్యారెల్‌కు 5 డాలర్ల నుండి 15 డాలర్ల ప్రీమియం ధరలకు బుక్ అయ్యాయి. డేటా ఇంటెలిజెన్స్ సంస్థ క్లెప్లర్ ప్రకారం, ఈ పరిమాణం ఈ నెల కొనుగోళ్లకు సమానంగా ఉన్నప్పటికీ, ఫిబ్రవరి నెల కొనుగోళ్ల కంటే రెట్టింపు కంటే ఎక్కువ.

(ట్రంప్‌ యూటర్న్‌ : 20 నిమిషాల్లో రూ. 840 కోట్లు)

గత డిసెంబర్ నుండి రష్యా చమురుకు దూరంగా ఉన్న మంగళూరు రిఫైనరీ (MRPL), హిందుస్థాన్ మిట్టల్ ఎనర్జీ వంటి సంస్థలు ఇప్పుడు మళ్ళీ రష్యా నుంచి చమురును కొనుగోలు చేయడం ప్రారంభించాయి. ప్రధానంగా హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) మూతపడటంతో ఏర్పడిన చమురు కొరతను అధిగమించేందుకు, మార్చి 12 లోపు సముద్రంలో లోడ్ అయిన రష్యన్ చమురును కొనుగోలు చేసేందుకు అమెరికా అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే.

2022 ప్రారంభంలో ఉక్రెయిన్‌పై దాడి జరిగిన తర్వాత,  భారత్‌కు తక్కువ ధరకు లభించే రష్యన్ ముడి చమురుకు ఇది ఒక ప్రధాన కొనుగోలుదారుగా మారింది. అయితే, అమెరికా ఒత్తిడితో గత ఏడాది చివరి నుంచి భారత్ కొనుగోళ్లను తీవ్రంగా తగ్గించుకుంది. దానికి బదులుగా సౌదీ అరేబియా, ఇరాక్‌ల నుంచి బ్యారెళ్ల వైపు మళ్లింది. యుద్ధం ప్రారంభమైన తర్వాత, అందులో అధిక భాగం పర్షియన్ గల్ఫ్‌లోనే చిక్కుకుపోయింది. అమెరికా మినహాంపుతోపాటు, కేవలం రష్యా పైనే ఆధార పడకుండా, భారత్ తన చమురు వనరులను పెంచుకుంటోంది. అక్టోబర్ 2020 తర్వాత అత్యధికంగా వెనిజులా నుండి కూడా ఏప్రిల్ నెలలో 80 లక్షల బ్యారెళ్ల చమురును దిగుమతి చేసుకోనుంది.

ఇదీ చదవండి: కోటక్‌ మహీంద్రాలో భారీ కుంభకోణం కలకలం

రష్యాకు భారీ లాభాలు
భారత్‌ , ఇతర దేశాలనుంచి  వస్తున్న భారీ డిమాండ్, అంతర్జాతీయ మార్కెట్‌లో పెరిగిన ధరల వల్ల రష్యా భారీ లాభాలను ఆర్జిస్తోంది. మార్చి 2022 తర్వాత రష్యా చమురు ఎగుమతుల ద్వారా అత్యధిక ఆదాయం పొందుతున్న సమయం ఇదేనని నివేదికలు చెబుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement