తొమ్మిది పదుల వయసులో స్కూల్‌కి..! ఏకంగా 98% మార్కులు .. | 96 year old grandmother went back to school, scored 98 Percent | Sakshi
Sakshi News home page

తొమ్మిది పదుల వయసులో స్కూల్‌కి..! ఏకంగా 98% మార్కులు ..

Apr 1 2026 12:32 PM | Updated on Apr 1 2026 12:41 PM

96 year old grandmother went back to school, scored 98 Percent

తొమ్మిది పదుల వయసులో చదవాలనుకోవడమే ఓ గొప్ప. అలాంటిది ఏకంగా పాఠశాలకు వెళ్లి చదవుకోవడమే గాక, పరీక్షల్లో రికార్డు స్థాయి మార్కులతో అందర్నీ ఆశ్చర్యపరిచింది. నడు వండిపోయి, కనికనిపించని కళ్లతో చదవాలనే ఆమె ఆసక్తి అందర్నీ అమితంగా ఆకర్షించింది. ఆకాంక్షలు నెరవేర్చుకోవడానికి వయసు ఎన్నటికి అడ్డంకి కాదని ఈ బామ్మ తన విజయంతో నిరూపించింది.  

ఆ బామ్మే కేరళకు చెందిన కార్త్యాయని అమ్మ. కేరళలోని అలప్పుజ జిల్లాలోని చెప్పాడ్ గ్రామంలో 1922లో జన్మించారు. తన తరంలోని చాలామంది అమ్మాయిలులాగే చదువు అనేది ఆమెకు అంత ప్రాధాన్యం లేనిదిగా ఉంది. ఆమెకు ఆ సమయంలో కనీసం ప్రాథమిక విద్యను చదువుకునే అవకాశం కూడా లేదు. పేదరికం, కుటుంబ బాధ్యతలు, ఆమెను చిన్న వయసులోనే బడికి దూరం చేశాయి. తరగతి గదులకు బదులుగా ఆమె బాల్యం పనితో నిండిపోయింది. 

చివరికి ఆమెకు పెళ్లై, ఆరుగురు పిల్లలను పెంచింది. ఏళ్ల తరబడి ఇంటి పనిమనిషిగా వీధి ఊడ్చే పనిచేస్తూ శారీరక శ్రమోత కూడిన పనులతో కుటుంబాన్ని పోషించుకునేది. ఆమెకు చదవడం, రాయడం ఇతరులకు తెలిసిన నైపుణ్యాలుగా మిగిలిపోయాయి. దశాబ్దాలుగా ఆమె జీవితం అలానే గడిచిపోయింది. అయితే ఆమె కథ అక్కడితో ఆగిపోలేదు. తొంభై ఏళ్ల వయసులో అనూహ్యమైన మలుపు తీసుకుంది. 

మళ్లీ చదువుపైకి ధ్యాస..
ఆమెను చదువుపైకి ఆసక్తి కలిగించే క్షణం ఆమె కూతురు కారణంగానే వచ్చింది. ఆమె కూతురు 60 ఏళ్ల వయసులో అక్షరాస్యత తరగతిలో చేరి పరీక్షలో విజయవంతంగా ఉత్తీర్ణత సాధించినప్పుడు ఈ బామ్మలో గొప్ప చైతన్యం వచ్చింది. నా కూతురే చేయగలిగినప్పుడు తను ఎందుకు చేయకూడదు అనుకుంది. అంతే అనుకున్నదే తడువుగా 96 ఏళ్ల వయసులో కార్తాయని అమ్మ కేరళ రాష్ట్ర అక్షరాస్యత మిషన్ అథారిటీ ఆధ్వర్యంలో నడుస్తున్న కేరళ అక్షరలక్ష్యం అక్షరాస్యత కార్యక్రమంలో చేరారు. 

పాఠశాల విద్యను కోల్పోయిన పెద్దలకు చదవడం, రాయడం ప్రాథమిక గణితం నేర్పించడానికి ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఇక్కడ కార్త్యాయని అమ్మ చదువుకి అండగా మనవళ్లు, మునిమనవళ్లు నిలిచారు. వారు అక్షరాలు, పదాలు, అంకెలు నేర్చుకోవడంలో సహాయపడ్డారు. 

కొన్నిసార్లు ఇంట్లోనే మరికొన్ని సార్లు సాయంత్రం పూట మసక వెలుతురులో పాఠాలు జరిగేవి. నెమ్మదిగా ఆమెకు అక్షరమాల అర్థమవ్వడం మొదలైంది. ఆ తర్వాత బామ్మ 2018లో కేరళ వ్యాప్తంగా 40,000 మందికి పైగా అభ్యర్థులతో కలిసి అక్షరాస్యత పరీక్ష రాశారు. వారిలో ఆమెనే అత్యంత వయసు పైబడిన అభ్యర్థి. ఆ పరీక్ష మొత్తం రీడింగ్‌, రైటింగ్‌, గణితం ఇలా మూడిటిపై జరిగింది. ఎందో ఆసక్తిగా ఎదురుచూసిన ఫలితాలు వెలువడ్డాయి. ఆ తొంభై ఏళ్ల వృద్ధురాలు ఆ పరీక్షలో నూటికి 98 మార్కులు సాధించి మొత్తంలో కార్యక్రమంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారిలో ఒకరిగా నిలిచింది. 

ఆమె రీడింగ్‌, గణితం రెండింటిలోనూ పూర్తి స్కోరు సాధించగా, రీడింగ్‌ దాదాపు వంద శాతం మార్కులు సాధించింది. ఆ బామ్మ విజయం స్థానికంగానే కాకుండా రాష్ట్రవ్యాపత​ంగా గణనీయమైన దృష్టిని ఆకర్షించింది. మీడియా ఆ బామ్మను గొప్ప అక్షరాస్యత ఉద్యమానికి గౌరవనీయమైన "ఆదర్శప్రాయమైన అమ్మమ్మ"గా కీర్తించాయి. అంతేగాదు అధికారులు ఆమె విజయాలను ప్రశంసా పత్రాలతో సత్కరించడానికి ముందుకు రావడం విశేషం. 96 ఏళ్ల ఈ బామ్మ కథ వేలాదిమందికి, యువతకు స్ఫూర్తిగా నిలిచింది. 

ఆమె విజయానికి ఎంత గుర్తింపు లభించిందంటే..2019లో విద్యను ప్రోత్సహించే అంతర్జాతీయ సంస్థ అయిన కామన్వెల్త్‌ ఆఫ్‌ లెర్నింగ్‌కు గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా ఎంపకయ్యేలా చేసింది. ఇక ఈ బామ్మ 2023 అక్టోబర్‌లో 101 ఏళ్ల వయసులో మరణించారు. ఆమెకు చదువుకోవాలన్న కోరిక ఉన్న దశాబ్దాలు సాధ్యం కాలేదు. దొరకిన అవకాశాన్ని ఈ వయసులోనా అనే సంశయానికి తావివ్వకుండా వినియోగించుకోవడం విశేషం. అలాగే అందర్నీ ఆశ్చర్యపరిచేలా రాణించి..మరణాంతరం కూడా ఆమె విజయం గుర్తుండిపోయేలా ప్రేరణగా నిలిచింది కార్త్యాయని.    

(చదవండి: పిల్లలను అలా పెంచాలి..! న్యూరో సెంటిస్ట్‌ పేరెంటింగ్‌ టిప్స్‌)

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement