మిరుమిట్లు గొలుపుతూ ధగధగలాడే స్వర్ణ రథంలో తేజోమూర్తి అయిన శేషాచలవాసుడు కొలువుదీరారు.. తిరువీధుల్లో విహరించారు.. భక్తులకు అభయమిచ్చారు. స్వర్ణరథోత్సవం దర్శించడం వల్ల లక్ష్మీదేవి కరుణతో సిరి సంపదలు, భోగభాగ్యాలు, భూదేవి కరుణతో సమస్త ధాన్యాలు, శ్రీవారి కరుణతో సర్వశుభాలు, సుఖాలు చేకూరుతాయని భక్తుల నమ్మకం. అందుకే మంగళవారం శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాల్లో భాగంగా జరిగిన శ్రీవారి స్వర్ణరథోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి, కలియుగవైకుంఠవాసుడిని దర్శించుకున్నారు. – తిరుమల
స్వర్ణరథంపై విహరిస్తున్న మలయప్పస్వామి
సమాధులు పెకళించి..
దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందంగా.. అధికారం ఉన్నప్పుడే చేతినిండా సంపాధించాలని కూటమి నేతలు తహతహలాడుతున్నారు. నిబంధనలు తుంగలో తొక్కి అడ్డదిడ్డంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ భూములు.. పోరంబోకు జాగాల్లో పాగా వేస్తున్నారు. అది చాలదన్నట్టు చెరువులనూ చెరబడుతున్నారు. సమాధులను సైతం పెకళించి అందినకాడికి మట్టిని లోడేస్తున్నారు. ఇలాంటిదే ఇప్పుడు పలమనేరు మండలంలో సాగుతోంది. పలమనేరు మున్సిపాలిటీ పరిధిలోని గంటావూరు చెరువును నిలువునా తవ్వేస్తున్నారు. భారీగా మట్టిని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. పక్కనే ఉన్న ప్రభుత్వ భూమినీ కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారు. ఇంతజరుగుతున్నా సంబంధిత అధికారులుగానీ.. స్థానిక ఎమ్మెల్యే గానీ అటువైపు కన్నెత్తి చూడకపోవడంపై స్థానికులు
మండిపడుతున్నారు.
మట్టిని తరలించి!


