పారిశ్రామిక భద్రతపై రాజీ పడొద్దు | - | Sakshi
Sakshi News home page

పారిశ్రామిక భద్రతపై రాజీ పడొద్దు

Apr 1 2026 8:48 AM | Updated on Apr 1 2026 8:48 AM

ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణమా? వరుసకు కొడుకే హంతకుడా? మొగిలి ఘాట్‌లో శవాన్ని గుర్తించిన పోలీసులు

పలువురికి ఇంక్రిమెంట్‌లు కట్‌

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లాలో పారిశ్రామిక భద్రత పై రాజీ ఉండకూడదని కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌గాంధీ సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో పలు శాఖలతో వరుస సమావేశాలు నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని రసాయన పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు. నిబంధనల ఉల్లంఘనపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. జిల్లాలో 111 కి.మీ ఐఓసీఎల్‌, 107 కి.మీ హెచ్‌పీసీఎల్‌ పైప్‌లైన్లు ఉన్నందున, రసాయనాల రవాణా విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లా కోసం త్వరలోనే ఒక నిపుణ సంస్థ తో ఆఫ్‌ సైట్‌ అత్యవసర ప్రణాళికను రూపొందించనున్నట్లు వెల్లడించారు. అనంతరం జిల్లా పరిశ్రమలు, ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశంలో కలెక్టర్‌ మాడారు. ఒక కుటుంబం ఒక వ్యాపారవేత్త లక్ష్యంగా యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆదేశించారు. పరిశ్రమల స్థాపనకు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 30 వరకు అందిన 781 దరఖాస్తులలో 753 దరఖాస్తులను నిర్ణీత కాలపరిమితి లోపు పరిష్కరించినట్లు తెలిపారు. సమావేశాల్లో జిల్లా ఫ్యాక్టరీ చీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ రామకృష్ణారెడ్డి, పరిశ్రమల శాఖ జీఎం సూరిబాబు, డీఎస్‌పీ మహబుబ్‌బాషా, కుప్పం ఆర్‌డీవో విజయలక్ష్మి పాల్గొన్నారు.

మహిళ దారుణహత్య

లక్ష్యానికి చేరువగా

పన్ను వసూళ్లు

చిత్తూరు కార్పొరేషన్‌: గ్రామ పంచాయతీల్లో లక్ష్యానికి చేరువగా పన్ను వసూళ్లు చేశారు. జిల్లాలో 621 గ్రామ పంచాయతీలున్నాయి. వాటిలో 2025–26 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.27.04 కోట్లు వసూలు లక్ష్యంగా నిర్దేశించారు. మార్చి 31న చివరి రోజు మంగళవారం సాయంత్రం వరకు 95.33 శాతం అంటే రూ.25.77 కోట్లు వసూలు చేశారు. పన్నుల రూపంలో రూ.20.09 కోట్ల లక్ష్యానికి గాను రూ.19.30 కోట్లు (96.09 శాతం) వసూలు చేయగా, పన్నేతర వసూళ్లలో రూ.6.95 కోట్ల లక్ష్యానికి గాను రూ.6.57 కోట్లు (94.57 శాతం) వృద్ధి సాధించారు.

రుయా సూపరింటెండెంట్‌గా డాక్టర్‌ మనోహర్‌

తిరుపతి తుడా: రుయా ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా డాక్టర్‌ బి మనోహర్‌ను నియమిస్తూ డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ రఘు నందన్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. రుయా సూపరింటెండెంట్‌గా పనిచేసిన డాక్టర్‌ రాధ ఉద్యోగ విరమణ చేశారు. ఎస్వీ మెడికల్‌ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ రవి ప్రభుతో పాటు ఉద్యోగ విరమణ చేసిన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాధ ఇతర వైద్య అధికారుల సమక్షంలో ఆయన బాధ్యతలు తీసుకున్నారు. ఈ క్రమంలో రాయలసీమ పరిధిలోని అన్ని మెడికల్‌ కళాశాలలో సీనియర్స్‌ జాబితాలో ముందు వరుసలో ఉన్న రుయా పీడియాట్రిక్‌ విభాగాధిపతి డాక్టర్‌ మనోహర్‌ను (ఎఫ్‌ఏసీ) సూపరింటెండెంట్‌గా నియమించారు. సుదీర్ఘకాలం పాటు రుయా చిన్నపిల్లల విభాగంలో ఆయన విస్తృత సేవలు అందించారు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ నుంచి విభాగాధిపతిగా 30 వసంతాలకు పైగా విశేష సేవలు అందించారు. చిన్నపిల్ల విభాగంలో అత్యున్నత వైద్య ప్రమాణాలు అందించే స్థాయికి తీసుకెళ్లడంలో ఆయన కృషి అమోఘం. ఈ క్రమంలో ఆయన సేవలను గుర్తించిన ప్రభుత్వం న్యాయబద్ధంగా ఆయనకు దక్కాల్సిన రుయా సూపరింటెండెంట్‌ పోస్టులో అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ఏడీ రమేష్‌, పలువురు వైద్య అధ్యాపకులు, వైద్య విద్యార్థులు ఆయన్ను అభినందించారు.

పలమనేరు: నియోజకవర్గంలోని పెద్దపంజాణి మండలం, పెద్దముద్దేపల్లికి చెందిన ఓ మహిళను దారుణంగా హత్య చేసిన ఘటన మంగళవారం పలమనేరు సమీపంలోని మొగిలి ఘాట్‌ కౌండిన్య అభయారణ్యంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పెద్దపంజాణి మండలం, చెలమంగళం పంచాయతీ, పెద్ద ముద్దేపల్లికి చెందిన చంద్రమ్మ(35)కు గతంలో వీకోట మండలం, నాగిరెడ్డిపల్లికి చెందిన వ్యక్తి తో పెళ్లయ్యింది. ఇద్దరు బిడ్డలు ఉన్నారు. భర్త తో విబేధాల కారణంగా ప్రస్తుతం పుట్టింటికొచ్చి పెద్దపంజాణిలో టైలరింగ్‌ పనిచేస్తూ జీవ నం సాగిస్తోంది. దీంతోపాటు కొంతమందికి ఫైనాన్స్‌ కూడా ఇస్తూ ఉండేది. తనకు వరసకు కుమారు డైన పెద్ద ముద్దేపల్లికి చెందిన ఆటో డ్రైవర్‌ సుబ్రమణ్యం(22)కు సైతం చీటీలతో పాటు రూ.40 వేలదాకా డబ్బులు ఇచ్చింది. అయితే అతను ఆమెకు డబ్బులివ్వకుండా విసిగించేవాడు. ఈ నేపథ్యంలో ఆమె గట్టిగా అడగడంతో నిడి గుంటలో తనకు డబ్బు రావాలని, అక్క డే ఇచ్చేస్తానంటూ ఆమెను తన బైక్‌పై ఎక్కించుకొని సోమవారం వెళ్లాడు. ఆపై ఆమె ఆచూకీ లేకుండాపోయింది.

పక్కా ప్లాన్‌ప్రకారమేనా?

డబ్బు కట్టలేక ఎలాగైనా ఆమెను అంతమొందించాలని సుబ్రమణ్యం ముందుగానే పక్కా స్కెచ్‌ వేసినట్టు సమాచారం. మరో ముగ్గురు స్నేహితులతో కలిసి పలమనేరు సమీపంలోని గాందీనగర్‌ అడవిలో చంద్రమ్మను హత్య చేసినట్టు తెలిసింది. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు గాంఽధీనగర్‌ అడవిలో చంద్రమ్మ మృతదేహాన్ని గుర్తించా రు. అయితే పూర్తి విషయాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. దీనిపై పలమనేరు డీఎస్పీ డేగల ప్రభాకర్‌ను వివరణ కోరగా మొగిలి అడవిలో మహిళ హత్యకు గురైంది వాస్తవమేనని, పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని చెప్పారు.

తిరుపతి రూరల్‌ : తిరుపతి సర్కిల్‌లో అనధికారికంగా పనుల నిర్వహించడంతో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ జి. సాయిశంకర్‌, అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ జి. విశ్వనాథానికి రెండు ఇంక్రిమెంట్లు కట్‌ చేశారు. అనధికారికంగా విద్యుత్‌ లైన్ల మార్పు చేయడంతో ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ కె. శ్రీనివాసమూర్తి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ సి.చిన్నప్ప, అసిస్టెంట్‌ ఇంజినీర్‌ ఎస్‌. హేమచంద్రుడు, లైన్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎం.శరత్‌ బాబు, లైన్‌మన్‌ ఎస్‌ఆర్‌ గోపాల్‌కు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. అలాగే తిరుపతి సర్కిల్‌లో విధులు నిర్వహిస్తూ అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడంతో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ సి. విజయ వెంకటేష్‌, లైన్‌మన్‌ బి. శేఖర్‌, అసిస్టెంట్‌ లైన్‌మన్‌ కె.సురేష్‌, జూనియర్‌ లైన్‌మన్‌ గ్రేడ్‌– 2 టీ. భాగ్యరాజ్‌ను వివరణ కోరుతూ షోకాజ్‌ నోటీసు జారీ చేశారు. కర్నూలు సర్కిల్‌లో హెచ్‌టీ సర్వీసుకు సంబంధించి రీడింగును నమోదు చేయడంలో అవకతవకలకు పాల్పడిన సీనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ జె. చిన్నరాఘవులుకు 6 నెలలపాటు పదోన్నతి నిలుపుదల, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ వి.వి.మోహన్‌ కుమార్‌కు ఒక ఇంక్రిమెంటు కట్‌ చేశారు. అలాగే మరో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ ఏ. రాజమోహనరెడ్డికి రెండు ఇంక్రిమెంట్లు ఆపివేశారు. జూనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ కె. సుబ్రమణ్యం శెట్టికి రెండు ఇంక్రిమెంట్లు నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అలాగే వినియోగదారుని సర్వీసు పేరు మార్పు అంశంలో నిర్లక్ష్యం వహించినందుకు అసిస్టెంట్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ జి. బాలచౌడయ్య, కడప సర్కిల్లో అనధికారికంగా విద్యుత్‌ లైన్ల మార్పు చేసిన డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ ఎం.కుళ్ళాయప్ప, అసిస్టెంట్‌ ఇంజినీర్‌ టి. శివకుమార్‌, లైన్‌ ఇన్‌స్పెక్టర్‌ అయ్యవారయ్య, లైన్‌మన్‌ నాగసుబ్బారెడ్డికి షోకాజ్‌ నోటీసులిచ్చారు. శ్రీసత్యసాయి సర్కిల్‌లో విధులు నిర్వహిస్తూ అనధికారికంగా విద్యుత్‌ లైన్ల మార్పు చేసిన అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ జి.విశ్వనాథానికి ఒక ఇంక్రిమెంటు కట్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే వ్యవసాయ విద్యుత్‌ సర్వీసులు మంజూరులో నిబంధనలను పాటించనందుకు అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ ఎస్‌. విశ్వనాథంను వివరణ కోరుతూ ఉత్తర్వులు జారీ చేశారు.

జూనియర్‌ ఇంజినీర్‌,

ఏఎల్‌ఎంపై వేటు

అనంతపురం సర్కిల్‌లో వ్యవసాయ విద్యుత్‌ సర్వీసును మంజూరు చేయడంలో అవకతవకలకు పాల్పడిన అంశంపై ఇన్‌చార్జి అసిస్టెంట్‌ ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తున్న జూనియర్‌ ఇంజినీర్‌ బి. బాలచంద్రను సస్పెండ్‌ చేశారు. అలాగే డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ ఎం. శ్రీనివాసులు నాయుడికి షోకాజ్‌ నోటీసును జారీ చేశారు. చిత్తూరు సర్కిల్లో అనధికారికంగా లైన్ల మార్పు, ట్రానన్స్‌ ఫార్మర్‌ ఏర్పాటు అంశంలో అసిస్టెంట్‌ లైన్‌మన్‌ ఎస్‌. రమేష్‌ బాబును సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

చంద్రమ్మ(ఫైల్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement