తిరుపతి కల్చరల్: టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, సంక్షేమ విభాగం ఆధ్వర్యంలో మహతి కళాక్షేత్రంలో గురువారం ఉగాది ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ పంచాంగ పరిష్కర్త, ఆగమ సలహా మండలి అధ్యక్షుడు వేదాంతం విష్ణు భట్టాచార్యులు పంచాంగ శ్రవణం చేస్తూ తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలను తెలుకోవడమే పంచాంగమని తెలిపారు. అనంతరం పంచాంగ కర్తను శ్రీవారి ప్రసాదం, నూతన వస్త్రాలతో ఘనంగా సత్కరించి అభినందించారు. తర్వాత ఉదయం 11 నుంచి 12.30 గంటల వరకు ఎస్వీయూ విశ్రాంత ఆశాచర్యుడు ఆచార్య దామోదర్ నాయుడు కవి సమ్మేళనం నిర్వహించారు. దీనికి ముందు ఎస్వీ సంగీత కళాశాల అధ్యాపకులు , విద్యార్థులు చక్కని మంగళధ్వని, ప్రార్థన వినిపించారు. తర్వాత ఎస్వీ ఉన్నత వేదాధ్యమన సంస్థ ఆధ్వర్యంలో వేది పండితులు వేద స్వస్తి నిర్వహించారు. ఈ సందర్భంగా అందరికీ ఉగాది పచ్చడి, ప్రసాదం పంపణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో డీపీపీ కార్యదర్శి రఘునాథ్, సంక్షేమం విభాగం డిప్యూటీ ఈఓ ఆనందరాజు తదితరులు పాల్గొన్నారు.


