జగన్‌తోనే ప్రజల జీవితాల్లో ఆనందం | - | Sakshi
Sakshi News home page

జగన్‌తోనే ప్రజల జీవితాల్లో ఆనందం

Mar 20 2026 8:06 AM | Updated on Mar 20 2026 8:06 AM

● పుత్తూరు క్యాంపు కార్యాలయంలో ● పాల్గొన్న మాజీ ఉప ముఖ్యమంత్రి

ఉగాది వేడుకలు

నారాయణస్వామి

వెదురుకుప్పం: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే అన్ని వర్గాల ప్రజల జీవితాల్లో ఆనందం వెల్లివిరిస్తుందని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. పరాభవనామ సంవత్సరం ఉగాదిని పురస్కరించుకుని గురువారం పుత్తూరు లోని క్యాంపు కార్యాలయంలో వేడుకలు జరుపుకున్నారు. ఇందులో భాగంగా మండలంలోని పచ్చికాపల్లం పంచాయతీకి చెందిన యువత పెద్ద ఎత్తున మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయ ణస్వామి ఆయన సతీమణి పరంజ్యోతిని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా దుశ్శాలువతో ఘనంగా సత్కరించారు. కేక్‌ కట్‌ చేసి తినిపించారు. అనంతరం ఆయ న మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ఏ వర్గం సంతోషంగా లేదన్నారు. గత వైఎస్సార్‌సీపీ హయాంలో ప్రతి నెలా ఏదో ఒక సంక్షేమ పథకం ద్వారా పేదలకు నేరుగా డబ్బులు అందేవని గుర్తు చేశారు. అప్పటి సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి నిర్ణయంతో పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడడమే కాకుండా ఆర్థికంగా కుటుంబాలు నిలదొక్కుకున్నట్లు స్పష్టం చేశారు. అయితే నవరత్నాలను మించి పేదలకు ఇస్తామన్న కూటమి ప్రభుత్వం రెండేళ్లు కావస్తున్నా సంక్షేమ పథకాల అమలు పట్ల ఏ మా త్రం చిత్తశుద్ధిలేకుండా పోయిందన్నారు. ఉన్నదిపోయి కొత్తవి ఏదీ రాకపోవడంతో అన్ని వర్గాల ప్రజలు నిరాశ నిస్ఫృహల మధ్య జీవితాలను గడపాల్సివస్తోందని తెలిపారు. పేద ల భాగోగులను పక్కన పెట్టి కూటమి ప్రభుత్వం అబద్ధాలు, అసత్యాలు, అరాచకాలతో పాలన సాగిస్తున్నట్లు మండిపడ్డారు. కేవలం ప్రచారార్బాటాలు తప్ప బడుగు, బలహీనవర్గాలకు ఒరి దింది ఏమీ లేదన్నారు. పేదల మోములో చిరునవ్వు రావాలంటే అది ఒక్క జగనన్నతోనే సాధ్య మని చెప్పారు. నాయకులు, కార్యకర్తల మధ్య ఎలాంటి తారతమ్యాలు ఉన్నా పక్కన పెట్టి పేద ల భవిష్యత్తు గురించి ఆలోచించాలన్నారు. గడిచిన ఐదేళ్లలో ప్రతి పేదవాడి ఇంట్లో పండుగ రోజేనని చెప్పారు. ఆర్థిక అసమానతలను తొలగించడం కోసమే జగన్‌ పాలనలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ కార్యదర్శి బోడిరెడ్డినరేష్‌రెడ్డి, ఎస్సీ సెల్‌ కార్యదర్శి మురళి, యువత నాగరాజరెడ్డి, భాస్కర్‌రెడ్డి, మనోజ్‌కుమార్‌రెడ్డి, విజయభాస్కర్‌, వెంకటముని, నాగరాజు, ఉదయ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement