నేడు వైఎస్సార్‌సీపీ బూత్‌కమిటీ రాష్ట్ర స్థాయి సమావేశం | - | Sakshi
Sakshi News home page

నేడు వైఎస్సార్‌సీపీ బూత్‌కమిటీ రాష్ట్ర స్థాయి సమావేశం

Mar 20 2026 8:06 AM | Updated on Mar 20 2026 8:06 AM

తిరుపతి మంగళం : పద్మావతిపురంలోని పార్టీ జిల్లా కార్యాలయం వద్ద శుక్రవా రం ఉదయం 10 గంటలకు వైఎస్సార్‌సీపీ బూత్‌ కమిటీ రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు ఆ కమి టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షుడు నాగూరి యోగాంజనేయరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా వైఎస్సార్‌సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షులు భూమన కరుణాకరరెడ్డి, బూత్‌కమిటీ రాష్ట్ర అధ్యక్షులు సుధాకర్‌రెడ్డి పాల్గొంటారని తెలిపారు.

ఆటో, కారు ఢీ

– నలుగురికి తీవ్ర గాయాలు

చంద్రగిరి: ఆటో, కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడిన ఘటన గురువారం చంద్రగిరి జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. చంద్రగిరి జాతీయ రహదారి పెట్రోల్‌ బంకు వద్ద ఎదురెదురగా ఆటో, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటో ప్రయాణిస్తున్న ముగ్గురు, కారులోని ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108 ద్వారా రుయాస్పత్రికి తరలించారు. ఈ మేరకు చంద్రగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

విధులకు వెళుతూ..

ఏర్పేడు: ఏర్పేడు–వెంకటగిరి మార్గంలో నాగంపల్లి సమీపంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. ఏర్పేడు ఎస్‌ఐ రవిప్రకాష్‌ కథనం మేరకు.. ఏర్పేడు మండలం ఆమందూరు బీసీ కాలనీకి చెందిన గురుస్వామి, ప్రమీల దంపతుల కుమారుడు చెంచు గురుచంద్ర(28) రాక్‌మెన్‌ కంపెనీలో జూనియర్‌ ఇంజినీరుగా పని చేస్తున్నాడు. బుధవారం రాత్రి పాగాలి సమీపంలోని రాక్‌మెన్‌ కంపెనీకి వెళ్లేందుకు బైక్‌పై ఇంటి నుంచి బయలుదేరాడు. నాగంపల్లి సమీపంలోని ఓ ఆస్పత్రి ఎదురుగా ముందు వెళుతున్న కట్టెల లోడ్‌ ట్రాక్టర్‌ నిర్లక్ష్యంగా నడుపుతూ సడన్‌ బ్రేక్‌ వేయడంతో బైక్‌ అదుపు తప్పి వెనుక నుంచి ట్రాక్టర్‌ను ఢీకొంది. దీంతో బైక్‌ నడుపుతున్న చెంచు గురుచంద్ర తీవ్ర గాయాలతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అతన్ని 108లో శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement