జిల్లాకు 31 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు | - | Sakshi
Sakshi News home page

జిల్లాకు 31 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు

Mar 20 2026 8:06 AM | Updated on Mar 20 2026 8:06 AM

చిత్తూరు రూరల్‌ (కాణిపా కం): జిల్లాకు 31 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలను కేటాయించినట్లు జిల్లా వ్యవసాయశాఖ అధికారి మురళి తెలిపా రు. గత నెల సాక్షి దినపత్రికలో విత్తు..రాయితీ చిత్తు పేరుతో వార్త ప్రచురితమైంది. దీనిపై ప్రభుత్వం స్పందించింది. జిల్లాకు 31 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలను కేటాయించింది. మేనెలో విత్తనాల పంపిణీ చేసేలా ప్రణాళికలు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

ఇప్తార్‌ విందులో జెడ్పీ చైర్మన్‌

వి.కోట: సమాజంలో శాంతి, ఐక్యత కోసం మూస్లింలు చేస్తున్న కృషి అభినందనియమని జెడ్పీ చైర్మన్‌ శ్రీనివాసులు అన్నారు. గురు వారం పట్టణంలోని జామీయ మసీద్‌లో నిర్వహించిన ఇప్తార్‌ విందులో ఆయన పాల్గొన్నా రు. అనంతరం జెడ్పీ చైర్మన్‌ మాట్లాడుతూ రంజాన్‌ పవిత్ర మాసం శాంతి, సహనం, సౌభ్రాతృత్వానికి ప్రతీక అని కొనియడారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌దే.గౌస్‌, ముస్లింలు షామీర్‌ జప్రూల్లా, అరిప్‌, ఖాదర్‌, జెడ్పీ చైర్మన్‌ తనయులు అమరేంద్ర, నరేంద్ర, శ్రీనివాసులు పాల్గొన్నారు.

లేగదూడపై చిరుత దాడి!

వి.కోట: లేగదూడపై చిరుత దాడిచేసిన ఘటన మండలంలోని ఆరిమాకులపల్లి గ్రామంలో గురువారం ఉదయం వెలుగు చూసింది. స్థానికుల వివరాలు..మండలంలోని ఎస్‌ బండపల్లి పంచాయతీ ఆరిమాకులపల్లి గ్రామానికి చెందిన గురువిరెడ్డి అనే రైతు గురువారం ఉద యం తమ బావి వద్ద లేగ దూడను కట్టేసి వచ్చాడు. సాయంత్రం బావి దగ్గరకు వెళ్లగా దూడను చిరుత దాడి చేసి చంపేసి తినేసి ఆన వాళ్లు గుర్తించాడు. పొలంలో చిరుత కాలిగుర్తులు గమనించారు. అధికారులు దీనిపై విచారించి.. చిరుత..? లేక హైనాన అనే విష యం తేల్చాలని ఆయన కోరారు.

టీటీడీపై వివాదాస్పద వ్యాఖ్యలు.. యువకుడి అరెస్ట్‌

తిరుమల : టీటీడీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఓ వ్యక్తిని తిరుమల పోలీసులు అరెస్ట్‌ చేశారు. తిరుపతికి చెందిన యోగేష్‌ అనే వ్యక్తి టీటీడీలో అక్రమాలు జరుగుతున్నాయని, దర్శన టికెట్లను బ్లాక్‌లో విక్రయిస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేసినట్లు సమాచారం. ఈ వ్యాఖ్యలు భక్తుల మనోభావాలను దెబ్బతీయడంతో పాటు టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నాయంటూ విజిలెన్స్‌ విభాగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు తిరుమల వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో గురువారం యోగేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వ్యక్తిగత పాపులారిటీ కోసం యోగేష్‌ ఇటువంటి వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోందని, టీటీడీపై తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే తిరుమలకు రానీయకుండా కూడా చర్యలు తీసుకుంటామని సీఐ శ్రీరాముడు హెచ్చరించారు.

టీటీడీ ట్రస్టులకు

రూ.37.55 లక్షల విరాళాలు

తిరుమల : టీటీడీకి చెందిన పలు ట్రస్టులకు గురువారం పలువురు దాతలు రూ.37.55 లక్షలు విరాళం అందజేశారు. హైదరాబాద్‌కు చెందిన సుజన్‌ జ్యువెలరీ అధినేత రవికుమార్‌ రూ.20 లక్షల విరాళం ఇచ్చారు. గురువారం టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడిని కలిసి, శ్రీవారి అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు, శ్రీవారి ప్రాణదాన ట్రస్టుకు రూ.10 లక్షలు చొప్పున విరాళాల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా దాతను టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు అభినందించారు. అలాగే హైదరాబాద్‌కు చెందిన మధుశేషు అనే భక్తుడు టీటీడీ శ్రీవేంకటేశ్వర గో సంరక్షణ ట్రస్టుకు గురువారం రూ.12.55 లక్షలు విరాళంగా అందించారు. హైదరాబాద్‌కు చెందిన మరో దాత ఆలపాటి సత్యదేవ్‌ టీటీడీ బర్డ్‌ ట్రస్టుకు రూ.5 లక్షలు విరాళంగా అందజేశారు. దాతల తరఫున టీటీడీ బోర్డు సభ్యుడు నన్నపనేని సదాశివరావు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ ఈఓ ముద్దాడ రవిచంద్రకు విరాళం డీడీలను అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement