చిత్తూరు కార్పొరేషన్: పల్లెపాలనపై కూటమి ప్రభు త్వం మొదటి నుంచి విషం కక్కుతోంది. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల పట్ల చులకనగా వ్యవహరిస్తోంది. వారికి గౌరవం, వేతనం ఇవ్వకుండా ముప్పుతిప్పులు పెడుతోంది. సమావేశాలలో అధికారికంగా ప్రాధాన్యత ఇవ్వకుండా వేధిస్తోంది. గ్రామసభలలో కూటమి నేతలు చెప్పిన పనులనే మంజూరు చేస్తోంది. నామమాత్రానికే పదవులో ఉన్న వారిని మరింత అవమానపరుస్తూ చెక్ పవర్‌ను రద్దు చేసింది. ఏప్రిల్ 2వ తేదీతో వారి పదవీ కాలం ముగియనుంది. ఇటీవల చెక్ పవర్‌ను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయడం విమర్శలకు తావిస్తోంది.
గడువుకన్నా ముందే..!
సర్పంచుల పదవీ కాలం ముగుస్తున్నా ఇంతవరకు ఎన్నికలు జరపని ప్రభుత్వం.. వారి చేతుల్లో ఉన్న పవర్‌ను మాత్రం గడువు కన్నా ముందే లాగేసింది. పదవీ కాలం ముగిసే సమయంలో పాలక వర్గాలు, పంచాయతీ అధికారులు కలిసి వృథా ఖర్చులు చేస్తారనే వంకతో చెక్ పవర్‌కు ఆంక్షలు విధించింది. అలాగే పంచాయతీలకు ప్రత్యేకాధికారులను నియమించి, తమ కనుసన్నల్లోనే చంద్రబాబు సర్కార్ పాలన సాగించనుంది. ఇప్పుడున్న సర్పంచులలో 90 శాతం మందికి పైగా వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులు కావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
అడుగడుగునా అవమానం
జిల్లాలో మొత్తం 697 గ్రామ పంచాయతీలు ఉండగా.. జిల్లాల విభజన అనంతరం చిత్తూరు జిల్లా పరిధిలోకి 621 పంచాయతీలు వచ్చాయి. ఏప్రిల్ 2న పంచా యతీ పాలక వర్గాల పదవీ కాలం పూర్తి కానుంది. ఇటీవల విడుదలైన ఆర్థిక సంఘం నిధులకు సైతం నిబంధనలు పెట్టారు. కేంద్ర నిధులపై రాష్ట్ర ప్రభు త్వం ఆంక్షలు పెట్టడమేంటని పలువురు గళం విప్పా రు. దీన్ని సర్దిపుచ్చుకోవడానికి ఆంక్షలను ఎత్తివేశారు. పలు పల్లెల్లో సర్పంచులు సొంత డబ్బులు రూ.లక్షలు ఖర్చు పెట్టి వీధిదీపాలు, రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలు చేపట్టారు. తీరా ఇప్పుడు ఆ పనులకు డబ్బులు తీసుకునే వీలు లేకుండా ప్రభుత్వం అడ్డుకట్ట వేయ డంతో వారు మండిపడుతున్నారు. మార్చి నెలఖరు కావడంతో ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టి మరీ ఇంటి పన్నులు వసూలు చేయడంతో గ్రామ పంచాయతీలకు పుష్కలంగా నిధులు సమకూరుతున్నాయి. అయినప్పటికీ చేసిన ఖర్చులకు బిల్లులు పెట్టి డబ్బులు తీసుకునే వీలు లేకుండా ప్రభుత్వం అడ్డుకట్ట వేయడంపై సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీతాలు వంటి అత్యవసర చెల్లింపులు చేయాల్సి వస్తే డివిజనల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (డీడీఓ) ఆమోదించాలి. సర్పంచ్ సీఎఫ్‌ఎంఎస్ ద్వారా బిల్లులకు థంబ్ వేస్తే నేరుగా ట్రెజరీకి వెళ్లేది. కానీ ఇప్పుడు డీడీవో లాగిన్‌కు వెళుతుంది. ఆయన ఆ ఖర్చులను పరిశీలించి థంబ్ వేస్తేనే ట్రెజరీకి చేరుతుంది. ఇటీవల రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా పంచాయతీ అధికారులకు (డీపీవో) చెల్లింపులపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఎక్కడైనా కార్యదర్శులు, సర్పంచులతో కుమ్మకై ్క నిధులు తీసుకునే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించడం గమనార్హం. ఇంజినీరింగ్ అధికారులు ఎం.బుక్ నమోదు చేసిన తర్వాత కూడా అనుమానంతో బిల్లులు చెల్లింపులకు ఆంక్షలు విధించడం సరికాదని అభిప్రాయపడుతున్నారు.


