వేడుకోలు! | - | Sakshi
Sakshi News home page

వేడుకోలు!

Mar 31 2026 8:32 AM | Updated on Mar 31 2026 8:32 AM

పలు ప్రాంతాల నుంచి విచ్చేసిన అర్జీదారులు

అర్జీలు స్వీకరించిన కలెక్టర్‌, జేసీ

చిత్తూరు కలెక్టరేట్‌ : శ్రీఅయ్యా న్యాయం చేయండిశ్రీ అంటూ అర్జీదారులు ఉన్నతాధికారులను వేడుకున్నారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమాన్ని నిర్వహించా రు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి విచ్చేసిన ప్రజలు అర్జీలు అందజేశారు. కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌గాంధీ, జాయింట్‌ కలెక్టర్‌ ఆదర్శ్‌ రాజేంద్రన్‌, ఇతర అధికారులు ప్రజ ల నుంచి అర్జీలు స్వీకరించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజలు అందజేసే అర్జీలను బాధ్యతాయుతంగా పరిష్కరించాలన్నారు.

కోర్టు ధికారం

కోర్టు ధిక్కారానికి పాల్పడి భూ కబ్జాకు పాల్పడుతున్నారని యాదమరి మండలం, దాసరపల్లెకు చెందిన బాధితురాలు ఎస్తర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె తమ కుటుంబ సభ్యులతో కలిసి కలెక్టరేట్‌లో నిరసన చేపట్టారు. ఆమె మాట్లాడుతూ తమ భూమిని రాజన్‌ అనే వ్యక్తి తన భూమిగా దొంగ పేపర్లతో పట్టా పొందాడన్నారు. వాస్తవానికి అతను కొనుగోలు చేసిన భూమి కేవలం 10కి 15 అడుగులు మాత్రమేనన్నారు. అయితే తమ 6 సెంట్ల భూమి ని చూపించి 2.1/4 సెంట్లుగా పట్టా పొందాడన్నారు. తమకు న్యాయం చేయాలని గత ఏడాది ఏప్రిల్‌లో తహసీల్దార్‌ను కోరా మన్నారు. ఆ సమయంలో ఇది ప్రభుత్వం ఇచ్చిన పట్టా, దీనిని రిజిస్ట్రేషన్‌ చేయకూడదని చెప్పారన్నారు. అయినప్పటికీ గత ఏడాది మే 9వ తేదీన శ్యామల, కుమార్‌ అనే వ్యక్తులు ఆ భూమిని రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారన్నారు. తమ భూమిని సక్రమంగా సర్వే చేసి ఇవ్వాలని అడిగితే, మండల సర్వేయర్‌ తులసిధర్‌, వీఆర్వో సురేష్‌ సర్వే చేయకుండా కేసు నమోదు చేశారన్నారు. ప్లాట్లు 1, 2, 3 సర్వే చేయమని కోరినా సర్వే చేయలేదన్నారు. తమ సమస్యకు మొత్తం కారణం వీఆర్‌వో షర్మిల అని చెప్పారు. తమకు న్యాయం చేయాలని కోరారు.

కలెక్టరేట్‌లో ప్రజాసమస్యల పరిష్కార వేదిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement